కర్ణాటక : కాంగ్రెస్‌కు 93–103, బీజేపీకి 83–93 | Karnataka Polls Congress Emerging Single Largest Party | Sakshi
Sakshi News home page

Published Sat, May 12 2018 5:12 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Karnataka Polls Congress Emerging Single Largest Party - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీకి శనివారం జరిగిన ఎన్నికల్లో  ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందని ‘పీపుల్స్‌ పల్స్‌’ తాజాగా నిర్వహించిన ముందస్తు పోలింగ్‌ సర్వేలో కూడా తేలింది. రాష్ట్ర అసెంబ్లీలో పాలకపక్ష కాంగ్రెస్‌ పార్టీయే అత్యధిక సీట్లను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, ఆ తర్వాత స్థానాన్ని భారతీయ జనతా పార్టీ, తతీయ స్థానాన్ని జనతాదళ్‌ సెక్యులర్‌ పార్టీ దక్కించుకుంటుందని సర్వేలో వెల్లడైంది. రాజకీయ పరిశోధనా సంస్థ ‘పీపుల్స్‌ పల్స్‌’ సిబ్బంది, కన్నడ దిన పత్రిక ‘కోలర్‌వాణి’ సహకారంతో ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి మే 9వ తేదీవరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిరిగి, అంటే దాదాపు 3,600 కిలోమీటర్లు ప్రయాణించి ఈ సర్వేను నిర్వహించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయలను సేకరించడం, గుణాత్మక ప్రశ్నావళి ద్వారా వారి నుంచి సరైన సమాధానాలు రాబట్టడం ద్వారా ఈ సర్వేను నిర్వహించింది.
 

 ఏ పార్టీకి ఎన్ని ఓట్లు
పార్టీ ఓట్ల శాతం సీట్లు
కాంగ్రెస్‌ 39.6% 93-103
బీజీపీ 34.2% 83-93
జేడీ(ఎస్‌) 21.6% 33-43
ఇతరులు 4.6% 2-4


సర్వే ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌ పార్టీకి 93–103 వరకు, బీజేపీకి 83–93 వరకు, జేడీఎస్‌కు 33–43 వరకు, ఇతరులకు రెండు నుంచి నాలుగు సీట్లు వస్తాయి. కాంగ్రెస్‌ పార్టీకి 39.6 శాతం, బీజేపీకి 34.2. జేడీఎస్‌కు 21.6 శాతం, ఇతరులకు 4.6 శాతం ఓట్లు వస్తాయి. ఏ సర్వేలోనైనా మూడు శాతం అటు ఇటు, ఇటు అటు అయ్యే అవకాశం ఉంటుందని తెల్సిందే. చివరి రెండు రోజుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం ప్రభావాన్ని, ఆఖరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకునే ఓటర్ల సంఖ్యను సర్వేలో పరిగణించలేదు. పాలక, ప్రతిపక్ష సభ్యుల్లో ఎవరు విజయం సాధించినా వారి మధ్య ఓట్ల వ్యత్యాసం పెద్ద ఎక్కువగా ఉండదు. 43 అసెంబ్లీ స్థానాల్లో పోటీ నువ్యా, నేనా అన్నట్లుగా ఉంది. వీటిలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌ అభ్యర్థులు ఎవరైనా గెలవచ్చు. ఈ 43 స్థానాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయన్న అంశంపైనే ఏ పార్టీ రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంశం ఆధారపడి ఉంది.
 

ప్రాంతాల వారిగా

ప్రాంతం కాంగ్రెస్‌ బీజీపీ జేడీ(ఎస్‌) ఇతరులు
దక్షిణ కర్ణాటక 38% 18% 35% 9%
మధ్య కర్ణాటక 43% 38% 15% 4%
హైదరాబాద్‌-కర్ణాటక 42% 33% 22% 3%
ముంబై-కర్ణాటక 43% 43% 12% 2%
కోస్టల్‌-కర్ణాటక 41% 42% 15% 2%
బెంగుళూరు(రూరల్‌,అర్బన్‌) 33% 31% 28% 8%


రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఏమాత్రం వ్యతిరేకత లేకపోవడం ఈ ఎన్నికల విశేషం. పైగా ఆయన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు ప్రశంసిస్తున్నారు. పార్టీలకు అతీతంగా స్థానిక ఎమ్మెల్యే పనితీరునుబట్టి కొంత వ్యతిరేకత ప్రజల్లో కనిపించింది. అన్ని రకాల ప్రమాణాల్లో అంటే, అభివద్ధి, ప్రజల సంక్షేమం, సీఎం అభ్యర్థిత్వం పరంగా, స్త్రీలు, పురుషులు, చిన్నా, పెద్ద కూడా కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పట్ల, ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య పట్ల వారు సంతప్తితో ఉన్నారు. కర్ణాటక కోస్తాలో తప్పించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పార్టీకే ఆధిక్యత కనిపిస్తోంది. జనాకర్షక సంక్షేమ పథకాలపై అవినీతి మచ్చ లేకపోవడం కూడా కాంగ్రెస్‌ పార్టీకి కలిసొచ్చే అంశం.

ఏ కులం​‍/మతం ఎంత శాతం

కులం/మతం కాంగ్రెస్‌ బీజేపీ

జేడీఎస్‌

ఇతరులు
ఎస్సీ 51.0% 22.0% 21.0% 6.0%
ఎస్టీ 50.0% 27.0% 18.0% 5.0%
ముస్లిం 69.0% 12.0% 15.0% 4.0%
ఇతర ఓబీసీలు 42.0% 35.0% 18.0% 5.0%
అగ్రవర్ణాలు 21.0% 51.0% 23.0% 5.0%
లింగాయత్‌లు 15.0% 65.0% 12.0% 8.0%
ఒక్కలింగాస్‌ 24.0% 20.0% 52.0% 4.0%
ఇతరులు 39.0% 35.0% 15.0% 11.0%


కాంగ్రెస్‌ పార్టీకి ఎలాగైనా మట్టి కరిపించాలన్న లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ ప్రజలపై అంతగా ప్రభావం చూపించలేక పోయిందనే చెప్పవచ్చు. నీతి నిజాయితీలు, ప్రజా సంక్షేమం, సుస్థిరత అంశాల్లో కాంగ్రెస్‌ కన్నా తాము మెరుగైన వారమని బీజేపీ నిరూపించుకోలేక పోయింది. హిందూత్వ ఎజెండాను ఒక్కదాన్నే నమ్ముకోవడం వల్ల కోస్తా ప్రాంతంలో అది ప్రభావం చూపించనుంది. మోదీ ఫ్యాక్టర్‌ కూడా ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. ముంబై–కర్ణాటక ప్రాంతం, ముఖ్యంగా బెల్గాం జిల్లా, కోస్తా ప్రాంతాల్లో ఆయన ప్రభావం ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కేజేపీ ఈసారి విలీనం అవడంతో లింగాయత్‌లను సమీకరించడంలో బీజేపీ విజయం సాధించింది.

 దళితులు , ఆదివాసీలు, ముస్లింలు, దిగువ ఇతర వెనకబడిన వర్గాల ప్రజల ఓట్లను సమీకరించడంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. సంక్షేమ పథాకాలను అట్టడుగు వర్గాల వరకు తీసుకెళ్లడంలో పార్టీ విజయం సాధించడం, పార్టీ మధ్య ముఖ్యమంత్రి మధ్య మంచి సమన్వయం ఉండడం వల్ల ఇది సాధ్యమైంది. ద„ì ణ, మధ్య, హైదరాబాద్‌–కర్ణాటక ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన కాంగ్రెస్‌ మెరుగైన స్థానంలో ఉంది. ఈ ప్రాంతాల్లో దళితులు, ఆదివాసీలు, ముస్లింలు ఎక్కువగా ఉండడమే అందుకు కారణం. లింగాయత్‌లు, మరాఠాలు, జైనులు, బ్రాహ్మణులు, కొంకణ భండారీలు, భంట్‌లు లాంటి సామాజిక వర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ లేదు. వీరంతా బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నమ్ముకున్న ‘అహిందా’ (ఒక్కలిగేతర ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు) దక్పథం ఫలించింది. అన్నభాగ్య లాంటి సంక్షేమ పథకాల ద్వారా వీరు కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరయ్యారు.

ఇక జెడీఎస్‌ దక్షిణ కర్ణాటకలో, బెంగళూరులోని ఒక్కలిగాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో బలంగా కనిపించింది. కొన్ని ప్యాకెట్లలో ‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు’ అన్న విధంగా ఒక్కలిగాలు జేడీఎస్‌ నాయకుడు కుమారస్వామి తిరిగారు. ముస్లింలను, ఓబీసీలను, కొన్ని చోట్ల దళితులను ఆకర్షించడంలో కూడా ఆయన పార్టీ కొంత విజయం సాధించింది. దక్షిణ కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీలకన్నా ముందుంది. ముంబై–కర్ణాటక, కోస్తా కర్ణాటకలో పార్టీకి బొత్తిగా ఆదరణ లేదు. ఒక్కలిగాలు మినహా మిగతా అన్ని సామాజిక వర్గాల్లో ఎక్కువ మంది ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్యనే రుకుంటున్నారు. యెడ్యూరప్పను మాత్రం ఒక్కలిగాలు సమిష్టంగా కోరుకుంటున్నారు. సహజంగా రైతయిన యెడ్యూరప్ప అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం అందిస్తారని వారు భావిస్తున్నారు. పీపుల్స్‌ పల్స్‌–కోలరవాణి సర్వే నివేదికను పీపుల్స్‌ పల్స్‌ పీనియర్‌ ఎగ్జిక్యూటివ్, డాక్టర్‌ సజ్జన్‌ కుమార్‌ (జేఎన్‌యూ నుంచి సీపీఎస్‌లో పీహెచ్‌డీ) సంకలనం చేశారు.
ఓట్ల శాతం–సీట్లు
పార్టీ పేరు          ఓట్ల శాతం         సీట్ల సంఖ్య
కాంగ్రెస్‌              39.6                93–103
బీజేపీ                 34.2                83–93
జేడీఎస్‌               21.6                33–43
ఇతరులు               4.6                  2–4

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement