Peoples Pulse
-
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, బీజేపీ బలాలేంటి.. బలహీనతలేంటి?
డిసెంబర్లో జరగనున్న ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ‘ఛత్తీస్‌గఢ్ మూడ్ సర్వే’లో వెల్లడయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ స్థానాలుండగా మెజార్టీకి కావాల్సినవి 46 స్థానాలు. అధికార పగ్గాలు చేపట్టడానికి కావాల్సిన మెజార్టీ మార్కును కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా పొందే అవకాశం ఉన్నట్టు పీపుల్స్‌పల్స్ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడయ్యింది. కాంగ్రెస్, బీజేపీ బలాలు, బలహీనతలు ఏంటో విశ్లేషిస్తే.. కాంగ్రెస్ 2018 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీతో పాటు ధాన్యం సేకరణ, మద్దతు ధరపై ఇచ్చిన హామీని భూపేశ్ బఘేల్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. రాష్ట్రంలో ప్రధాన పంట అయిన వరిని దేశంలోనే రికార్డు స్థాయిలో ప్రభుత్వం సేకరించడంతో రైతులు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. దీంతోపాటు అంగన్వాడీ, ఆశా వర్కర్లు, హోమ్‌గార్డులకు జీతభత్యాలు పెంచడంతో వారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. ఈ పరిణామాలు ప్రధానంగా గ్రామాలలో, విద్యావంతులలో పార్టీ పట్ల సానుకూలతను కలిగిస్తున్నాయి. వీధులలో సంచరించే ఆవుల కోసం ‘గోథాన్ యోజన’ పేరిట పథకాన్ని ప్రారంభించి గ్రామీణ యువతకు, మహిళలకు ఉపాధిని కలిగించడం పట్ల ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. అధికార కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఆ పార్టీకి నష్టం చేకూర్చవచ్చని పీపుల్స్‌పల్స్ సర్వేలో తేలింది. ముఖ్యమంత్రి భూపేశ్‌కు ఉప ముఖ్యమంత్రి టి.ఎస్.సింగ్‌డియో, పీసీసీ చీఫ్ మోహన్ మార్కం మధ్య విభేదాలున్నాయి. ముగ్గురు మూడు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పార్టీకి ఇబ్బందికరంగా మారింది. మైనింగ్ ఆరోపణలపై సీసీఎస్ అధికారి సౌమ్య చౌరాసియాను కేంద్ర ఈడీ అరెస్టు చేయడం రాష్ట్రంలో సంచలనం రేగింది. అయితే ఈ అవకతవకలలో ముఖ్యమంత్రి భూపేశ్ ప్రమేయం కంటే కొందరి మంత్రులు, అధికారుల హస్తం ఉందని ప్రజలు భావించడం వ్యక్తిగతంగా సీఎంకు సానుకూలాంశం. మౌలిక వసతుల కల్పనలో ప్రధానంగా దెబ్బతిన రహదారులతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీస్తోంది. బీజేపీ బలాలు, బలహీనతలు ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకున్న బీజేపీ భూపేశ్ ప్రభుత్వం వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. పేదలకు గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఇవ్వకపోవడంతో పథకం కింద ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని రాష్ట్ర బీజేపీ ‘మోర్ ఆవాజ్ మోర్ అధికార్’ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టి ప్రజలకు చేరువయినట్లు పీపుల్స్ పల్స్ తమ సర్వేలో గమనించింది. బస్తార్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో క్రిస్టియన్ మిషనరీలు డబ్బు ప్రలోభాలతో గిరిజనులలో మత మార్పిడిని ప్రోత్సాహిస్తున్నాయని బీజేపీ విమర్శిస్తోంది. ఈ పరిణామాలు బీజేపీని సమర్థించే గిరిజనలు, క్రిస్టియన్లుగా మారిన గిరిజనుల మధ్య ఘర్షణలకు దారితీశాయి. గత ఎన్నికల్లో మహిళలను ఆకర్షించడానికి కాంగ్రెస్ ఇచ్చిన మద్య నిషేధం హామీని ఆ పార్టీ అమలు చేయకపోవడం బీజేపీకి సానుకూలంగా మారుతోంది. చదవండి: సామాజిక వర్గాల ప్రభావం ఎంత?.. ఎవరు ఎటువైపు మొగ్గు? గతంలో పదిహేను సంవత్సరాలు పాలించిన బీజేపీ హిందూత్వ అజెండాతోపాటు జాతీయ అంశాలకు ఇచ్చిన ప్రాధాన్యతను ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రత్యేకతను గుర్తించడంలో ఇవ్వలేదని అసంతృప్తి ప్రజల్లో ఉండడం ఆ పార్టీకి నష్టం చేకూరనుందని పీపుల్స్‌పల్స్ సర్వేలో తేలింది. బీజేపీ జాతీయ అంశాలకు, హిందూత్వ అజెండాకు వ్యతిరేకంగా స్థానిక, ప్రాంతీయ అంశాలకు ప్రాధాన్యతిస్తూ ప్రజలకు చేరువవడంలో ముఖ్యమంత్రి భూపేశ్ సఫలీకృతులయ్యారు. పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్‌సింగ్ ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన వారు, ఈయన కాకుండా పార్టీలో ఇతర ప్రముఖ నేతలైన సరోజ్‌పాండే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు, మరోనేత బ్రిజ్మోహన్ అగర్వాల్ బనియా సామాజిక వర్గానికి చెందిన నేత. దీంతో రాష్ట్రంలో అధికంగా ఉండే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు పార్టీలో ప్రాధాన్యత లేదనే భావనను కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడం బీజేపీకి నష్టం చేకూర్చే అవకాశాలున్నాయి. గిరిజన తెగకు చెందిన సీనియర్ నేత నంద్‌కుమార్ సాయి 2023 ఏప్రిల్‌లో బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరడం బీజేపీకి నష్టం చేకూర్చవచ్చు. బీజేపీ 15 ఏండ్ల పాలనలో సబ్సీడీ బియ్యం మినహా ఇతర సంక్షేమ పథకాలకు పెద్ద ప్రాముఖ్యతివ్వలేదని, బీజేపీకి మూడుసార్లు అవకాశమిచ్చినట్లుగా కాంగ్రెస్‌కు కూడా మరోసారి అవకాశం ఇస్తామని ప్రజలు పీపుల్స్‌పల్స్ సర్వేలో తెలిపారు. -
ఛత్తీస్‌గఢ్‌లో సామాజిక వర్గాల ప్రభావం ఎంత?.. ఎవరు ఎటువైపు మొగ్గు?
డిసెంబర్లో జరగనున్న ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ‘ఛత్తీస్‌గఢ్ మూడ్ సర్వే’లో తేలింది. వివిధ సామాజిక వర్గాల ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై విశ్లేషిస్తే.. ఎస్టీ సామాజిక వర్గం ఆధిపత్యం ఛత్తీస్‌గఢ్ దక్షిణ ప్రాంతాన్ని బస్తార్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 12 స్థానాల్లో 11 ఎస్టీ రిజర్వ్డ్గా ఉన్నాయి. ఇది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం. బీజేపీకి పట్టున్న ఈ ప్రాంతంలో 2018లో 11 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో మరోస్థానం గెలిచి మొత్తం 12 స్థానాలను సాధించింది. ఎస్టీలతోపాటు గోండ్, మారియా`మురియా, భాత్ర హల్బీట్ సామాజిక వర్గాల ప్రభావం ఇక్కడుంది. ఇక్కడ ఓబీసీతో పాటు ఇతర సామాజిక వర్గాల ప్రభావం తక్కువ. సుక్మా జిల్లాలో సీపీఐ ప్రభావం కొంత ఉంది. బస్తర్‌లో మత మార్పిడి ఘటనలతో గత కొన్ని సంవత్సరాలుగా గిరిజనుల మధ్య మత కలహాలు జరిగాయి. ఈ కారణాలతో బీజేపీ 2018తో పోలిస్తే కొంత బలపడే అవకశాలున్నాయి. ఈ ప్రాంతంలో సర్వ్ ఆదివాసీ సమాజ్ ఓట్లను చీల్చినా సీట్లు గెలిచే అవకాశాలు లేవు. ఇక్కడ కాంగ్రెస్ కొంత నష్టపోయినా ప్రభుత్వ పథకాల ప్రభావంతో అధిక స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని పీపుల్స్‌పల్స్ సర్వేలో తేలింది. రాయ్‌పూర్, బిలాస్పూర్, జగదల్పూర్, అంబిక్‌పూర్, కోబ్రా, రాయిగఢ్ మొదలగు నగరాల్లో రాజపూత్, బ్రాహ్మిణ్, సింధీ, పంజాబీలు, మార్వాడీలు, బనియా సామాజిక వర్గాల ప్రభావం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఓడియా, బెంగాలీల ప్రభావం కూడా ఉంది. ఈ సామాజిక వర్గాలలో బీజేపీ పట్ల కొంత మొగ్గు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీల ఓటింగ్ బ్యాంక్ అధికం. ఓబీసీలో సాహు సామాజిక వర్గం అధికంగా ఉన్నారు. ఈ సామాజిక వర్గంలో బీజేపీ పట్ల కొంత మొగ్గు ఉంది. ఓబీసీలో రెండో పెద్ద సామాజికవర్గం కుర్మీలది. వీరు సెంట్రల్ రీజియన్‌లో అధికంగా ఉన్నారు. ముఖ్యమంత్రి భూపేష్ ఈ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వీరు కాంగ్రెస్ వైపు ఉన్నారు. చేనేతకు చెందిన పానికాస్ కాంగ్రెస్ వైపు ఉన్నారు. వ్యవసాయ రంగానికి చెందిన మారర్ సామాజిక వర్గం కాంగ్రెస్ పట్ల అనుకూలంగా ఉంది. సెంట్రల్ ప్రాంతంలో అధికంగా ఉండే కాలర్ సామాజిక వర్గం బీజేపీకి అనుకూలంగా ఉంది. దేవాంగన్ సామాజిక వర్గం బీజేపీ పట్ల మొగ్గు చూపుతుంది. మధ్య ఛత్తీస్‌గఢ్‌లో ప్రాభల్యం ఉన్న యాదవ్ సామాజిక వర్గం బీజేపీకి అనుకూలంగా ఉంది. చదవండి: ఆ సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది? ఎస్సీలు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్ మధ్య ప్రాంతంలో అధికంగా ఉన్నారు. ఎస్సీల్లో అధికంగా ఉన్న సాతనమీ, హరిజన, మహార్ సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఎస్టీల ప్రభావం ప్రధానంగా ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో ఉంది. ఎస్టీల్లో అధికంగా ఉండే గోండుల ఓటర్లు కాంగ్రెస్, బీజేపీ, సర్వ్ ఆదివాసీ పార్టీలకు అనుకూలంగా చీలిపోయారు. ఎస్టీలలో రెండో పెద్ద సామాజిక వర్గమైన కన్వార్ బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నారు. ఉత్తర ప్రాంతంలో ఉన్న ఖైర్వార్, ఓరాన్ సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. పహాడి కోబ్ర సామాజిక వర్గం బీజేపీ పట్ల సానుకూలంగా ఉంది. హల్బా సామాజిక వర్గం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. మరియా`మురియా, భాట్రా సామాజిక వర్గాలు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలి ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో రెండు శాతానికి పైగా ఉన్న ముస్లింలు, దాదాపు రెండు శాతం ఉన్న క్రిస్టియన్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో రెండోసారి కూడా కాంగ్రెస్సేనా?.. ఆ సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది?
డిసెంబర్లో జరగనున్న ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ‘ఛత్తీస్‌గఢ్ మూడ్ సర్వే’లో వెల్లడయ్యింది. జూన్ మాసంలో సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 53 నుండి 60, బీజేపీకి 20 నుండి 27 స్థానాలు, బీఎస్పీ, ఇండిపెండెంట్, ఇతర ప్రాంతీయ పార్టీలకు ఒక్కొక్క స్థానం వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ స్థానాలుండగా మెజార్టీకి కావాల్సినవి 46 స్థానాలు. అధికార పగ్గాలు చేపట్టడానికి కావాల్సిన మెజార్టీ మార్కును కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా పొందే అవకాశం ఉన్నట్టు పీపుల్స్‌పల్స్ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడయ్యింది. వెనుకంజలో ఏ పార్టీ? 2018 ఎన్నికల్లో 43.03 ఓట్లు పొందిన కాంగ్రెస్ 2.96 శాతం అధిక ఓట్లతో 46 శాతం ఓట్లు పొందనుందని సర్వేలో తేలింది. 2018 ఎన్నికల్లో 33 శాతం ఓట్లు పొందిన బీజేపీ 5 శాతం అధిక ఓట్లతో 38 శాతం ఓట్లు పొందనుందని సర్వేలో వెల్లడయ్యింది. 2018లో కాంగ్రెస్ కంటే బీజేపీకి 10 శాతం ఓట్లు తక్కువరాగా ఇప్పుడు రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 8 శాతం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 11 లోక్‌సభ స్థానాల్లో 10 స్థానాలు గెల్చుకున్న బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకంజలో ఉందని సర్వేలో తేలింది. చదవండి: పెన్‌డ్రైవ్ బయటికొస్తే సీఎం రాజీనామా: కుమారస్వామి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగడానికి కారణం ఇదేనా? కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగడానికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ పాలనపై ప్రజల్లో సానుకూలత ఉండడమే. బీజేపీ జాతీయత, హిందుత్వ అంశాలకు ప్రత్యామ్నాయంగా సీఎం భూపేష్ ఛత్తీస్‌గఢ్ ఆత్మ గౌరవం అంశంలో భాగంగా ‘ఛత్తీస్‌గఢ్ మాతారి’, ‘గదో నవా ఛత్తీస్‌గఢ్’ వంటి నినాదాలకు ప్రజలు ఆకర్షితులయ్యినట్లు పీపుల్‌పల్స్ సర్వేలో వెల్లడయ్యింది. ప్రభుత్వం స్థానిక పండుగలకు గుర్తింపు ఇచ్చి సెలవులు ప్రకటించడం, ఛత్తీస్‌గఢ్ ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడం, రాష్ట్ర గీతం ‘‘అర్ప`పైరి కి ధర్’’ ప్రవేశపెట్టడం వంటి సెంటిమెంట్ అంశాలు కాంగ్రెస్ విజయానికి తోడ్పడుతున్నాయి. ‘‘రామవంగమన్ పాత్’ పేరిట శ్రీరాముడు వనవాసం చేసిన రాష్ట్ర పరిధిలోని 75 స్థానాలను గుర్తించి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడం, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు ‘‘బెన్ ములాఖత్’’ పేరుతో గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువవడం వంటి కార్యక్రమాలు కాంగ్రెస్ విజయానికి తోడ్పడుతున్నాయి. ‘‘కహో దిల్ సే, కాంగ్రెస్ ఫిర్ సే’’, ‘భూపేష్ హై తో, భరోసా హై’’ వంటి నినాదాలు ప్రజలకు చేరువవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి ఏ పార్టీ కృషి చేస్తుందని ఓటర్లను పీపుల్స్ పల్స్ అడగగా కాంగ్రెస్ అని 48%, బీజేపీ అని 40%, జేసీసీ అని ఒక శాతం, బీఎస్పీ అని ఒక శాతం, ఎవరూ కారని 10% మంది అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు మరోసారి అవకాశమిస్తారా అని సర్వేలో ఓటర్లను అడగగా అవకాశం ఇస్తామని 47%, ఇవ్వమని 40%, ఏమీ చెప్పలేమని 13% మంది తెలిపారు. సీఎం పనితీరు ఎలా ఉంది? బీజేపీకి మూడు మార్లు అవకాశమిచ్చినట్టే కాంగ్రెస్‌కు కూడా మరోసారి అవకాశమిద్దామనే అభిప్రాయాన్ని ఓటర్లు వెల్లడిరచారు. ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉందని ఓటర్లను ప్రశ్నించగా బాగుందని 45%, పర్వాలేదని 15%, బాగోలేదని 30%, ఏమీ చెప్పలేమని 10% మంది అభిప్రాయపడ్డారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఓటర్లను సర్వేలో ప్రశ్నించగా 20% సంతృప్తిగా ఉన్నట్టు, 31% పాక్షింగా సంతృప్తిగా ఉన్నట్టు, 17% అసంతృప్తిగా ఉన్నట్టు, 21% పాక్షికంగా అసంతృప్తిగా ఉన్నట్టు, ఏమీ చెప్పలేమని 11% మంది అభిప్రాయపడ్డారు. ప్రాంతాలవారీగా రాజకీయ వాతావరణం ఛత్తీస్‌గఢ్ ఉత్తర, మధ్య, దక్షిణ ప్రాంతాలుగా ఉంది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ను సర్గుజ డివిజన్‌గా కూడా పిలుస్తారు. 23 స్థానాలున్న ఈ డివిజన్లో ఎస్టీ, ఓబీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి సింగ్‌డియో, రాష్ట్ర మంత్రి జైసింగ్ అగర్వాల్ ప్రభావంతో 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. సింగ్‌డియో కాబోయే ముఖ్యమంత్రి అనే ప్రచారం ఇక్కడ 2018లో కాంగ్రెస్ విజయానికి దోహదపడిరది. ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత ఆ పార్టీకి ఇక్కడ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల సింగ్‌డియోకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం కాంగ్రెస్‌కు కొంత సానుకూలం. 2018తో పోలిస్తే ఇక్కడ బీజేపీకి ప్రస్తుతం కొంత సానుకూలమైన వాతావరణం ఉందని పీపుల్స్‌పల్స్ సర్వేలో తేలింది. చదవండి: 'ఏ'కేద్దాం.. 'బీ' రెడీ! మధ్య ఛత్తీస్‌గఢ్ డివిజన్లో రాయ్‌పూర్, బిలాస్పూర్, దుర్గ్ వంటి ప్రధాన పట్టణ ప్రాంతాలున్నాయి. ఈ డివిజన్లో 55 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని ఎస్సీ రిజర్వ్ స్థానాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఎస్టీ, సింధి, రాజ్‌పుత్, పంజాబీ, బ్రాహ్మిణ్ సామాజిక ఓటర్ల ప్రభావం కూడా ఇక్కడ ఉంది. ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్, మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ సావో వంటి ప్రధాన నేతలు ఈ ప్రాంతానికి చేందిన వారే. ఈ ప్రాంతంపై పట్టున్న బీజేపీ 2018 ఎన్నికల్లో నష్టపోయింది. బీజేపీ బలపడ్డట్టు కనిపించినా.. కొన్ని సంవత్సరాల క్రితం కబీర్దామ్, బీమెత్ర జిల్లాల్లో మతకలహాల హింసతో ఇక్కడ ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ బీజేపీ బలపడ్డట్టు కనిపిస్తున్నా, సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఆ పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. వ్యవసాయ ప్రాధాన్యత గల ఈ ప్రాంతంలో ప్రభుత్వ పథకాలతో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉంది. ఈ డివిజన్లో గత ఎన్నికల్లో మంచి ఫలితాలు పొందిన జేసీసీ, బీఎస్పీ బలహీనపడడంతో కాంగ్రెస్, బీజేపీలకు ప్రయోజనం కలుగుతోంది. మొత్తంమీద ఈ ప్రాంతంలో బీజేపీ బలపడ్డట్టు కనిపించినా, కాంగ్రెస్ ఆధిప్యతం కొనసాగే అవకాశాలున్నాయని పీపుల్స్‌పల్స్ సర్వేలో తేలింది. -
కర్ణాటకలో కాంగ్రెస్‌దే విజయం..! పీపుల్స్ పల్స్ సర్వేలో కీలక విషయాలు
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యత సాధిస్తుందని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రంలో గత మూడున్నర దశాబ్దాల చరిత్రలో ఏ అధికార పార్టీ తిరిగి పగ్గాలు చేపట్టలేదు. చరిత్రను మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే, అధికారం చేపట్టి సంప్రదాయాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. కర్ణాటకలో పీపుల్స్‌పల్స్ చేపట్టిన ప్రీపోల్ సర్వేలో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత కనిపిస్తోంది. మహిళలు, పురుషులతో పాటు అన్ని వయస్సుల వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోగా.. ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం, సామాజిక అంశాలు, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇలా అన్ని రంగాలలో కాంగ్రెస్ ఇతర పార్టీల కంటే ముందుంది. కోస్తా కర్ణాటకను మినహాయించి అన్ని ప్రాంతాలలో హస్తం తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కంటే ముందంజలో ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 100 స్థానాలకు పైగ పొంది స్వల్ప మెజార్టీ సాధించే అవకాశాలున్నాయి. బీజేపీ 100 స్థానాలలోపే పరిమితం కావచ్చు. ఇదేసమయంలో జేడీ(ఎస్) తనకు పట్టున్న స్థానాల్లో ఆధిపత్యం కొనసాగిస్తూ 24 స్థానాలకుపైగా సాధించవచ్చు. సౌత్‌ఫస్ట్ న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్‌పల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ 105-117 స్థానాలు, బీజేపీ 81-93 స్థానాలు, జేడీ(ఎస్) 24-29, ఇతరులు 1-3 స్థానాలు పొందే అవకాశాలున్నాయి. 👉 2018లో 38.14 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ 41.4 శాతం పొందే అవకాశాలున్నాయి. 2018లో 36.35 ఓట్ల శాతం పొందిన అధికార బీజేపీ ఇప్పుడు స్వల్పంగా 0.3 శాతం కోల్పోయి 36 శాతం ఓట్లు సాధించవచ్చు. 2018లో కింగ్‌మేకర్ పాత్ర పోషించిన జేడీ(ఎస్) ఇప్పుడు 16 శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నాయి. ఇది 2018 కంటే 2.3 శాతం తక్కువ. 👉 ఏ సర్వేలోనైనా రెండు శాతం ప్లస్ లేదా మైనస్ వ్యత్యాసాలు ఉండే అవకాశాలుంటాయి. చివరి రెండు రోజుల ప్రచారాన్ని సర్వే పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి చివరి నిమిషంలో ప్రధాన పార్టీలకు లభించే అనుకూల, వ్యతిరేక అంశాలను అంచనా వేయలేము. 👉 ‘‘సౌత్ ఫస్ట్’’ న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ ఆర్.దిలీప్‌రెడ్డి నేతృత్వంలో 1 మే నుండి 5 మే వరకు ఈ సర్వే నిర్వహించారు. ‘ప్రాబబులిటీ ప్రొఫెషనల్ మెథడాలజీ’ (పీపీఎస్) పద్ధతి ద్వారా ఎంపిక చేసిన 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో మూడు పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో 20 శాంపిల్స్ తీసుకున్నారు. ప్రాంతం, కులం, వయస్సు, పురుషులు, స్త్రీలు, పేద`సంపన్నులు ఇలా తగు నిష్పత్తిలో ఉండేలా చూసుకుంటూ మొత్తం 3360 శాంపిల్స్ సేకరించడం జరిగింది. 👉 కర్ణాటకలో పీపుల్స్ పల్స్ సంస్థ మొదటి ప్రీ పోల్ సర్వేను 2022 డిసెంబర్ 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించగా, రెండో ప్రీ పోల్స్ సర్వేను 2023 మార్చి 25 నుండి 10 ఏప్రిల్ వరకు చేపట్టారు. చివరిదైన మూడవ ప్రీ పోల్ సర్వేను 2023 మే 1వ తేదీ నుండి 5 మే వరకు నిర్వహించారు. 👉 పీపుల్స్‌పల్స్ ప్రతినిధులు ప్రీపోల్ సర్వే కోసం 25 ఏప్రిల్ నుండి మే 5వ తేదీ వరకు రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రధాన పార్టీలపై ఓటర్ల నాడిని అంచనా వేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లను ముఖాముఖిగా కలుసుకోవడంతోపాటు అక్కడ వివిధ వర్గాలతో చర్చించి అక్కడ ఏ పార్టీకి అనుకూలంగా ఉందో తెలుసుకుంది. 👉 ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తున్నారని ఓటర్ల అభిప్రాయాన్ని కోరగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పక్షాన 42 శాతం మంది నిలిచారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైకి 24 శాతం, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి 17 శాతం, మాజీ సీఎం బి.యడియూరప్పకు 14 శాతం మంది, డి.కె.శివకుమార్‌కు 3 శాతం మంది ప్రాధాన్యతిచ్చారు. 👉 కర్ణాటక రాష్ట్రం అభివృద్ధికి ఏ పార్టీ మెరుగైనది అని ప్రశ్నిస్తే కాంగ్రెస్‌కు 46 శాతం, బీజేపీకి 34 శాతం, జేడీ(ఎస్)కు 14 శాతం ప్రాధాన్యతిచ్చారు. బీజేపీ ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తారా అని ప్రశ్నించగా 53 శాతం ఇవ్వమని, 41 శాతం ఇస్తామని చెప్పగా 6 శాతం మంది ఏమీ చెప్పలేమని తెలిపారు. కర్ణాటకలో పీపుల్స్‌పల్స్ ఏప్రిల్ నుండి నిర్వహిస్తున్న ప్రీపోల్ సర్వేలో రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 👉 టికెట్లను ప్రకటించాకా ప్రధాన మూడు పార్టీలలో అసంతృప్తి, తిరుగుబాటులు భారీగా ఉన్నాయి. 👉 పార్టీలు విడుదల చేసిన మ్యానిఫెస్టోలలో అనేక వివాదాస్పద అంశాలున్నాయి. 👉 ప్రధాన పార్టీల ప్రచారంలో అధినాయకత్వంతో ప్రధాన నేతలు పాల్గొన్న సందర్భాలలో అనేక వివాదాస్పద ప్రకటనలు, అంశాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటుచేసుకున్నాయి. 👉 ప్రధాన సామాజిక వర్గాల్లో ఓటింగ్ ప్రాధాన్యతలో మార్పులు : ప్రీ పోల్ సర్వే అంచనా ప్రకారం ప్రధాన పార్టీలన్నీ ఆయా సామాజిక వర్గాల్లో స్వల్ప మార్పులతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. బీజేపీ లింగాయత్‌లలో, ఎస్టీ నాయక్, ఎస్సీ లెఫ్ట్ వర్గాల్లో ఆధిపత్యం కొససాగిస్తుండగా, జేడీ(ఎస్) వొక్కలిగ సామాజిక వర్గంలో, కాంగ్రెస్ కురుబాలు, ఇతర ఓబీసీలు, ఎస్సీ రైట్, ముస్లిం వర్గాల్లో ఆధిపత్యం కొనసాగిస్తోంది. అయితే అభ్యర్థులు, స్థానిక అంశాల ఆధారంగా ఈ సామాజిక వర్గాల నిర్ణయాలలో స్వల్పమార్పులున్నాయి. ఎస్సీలోని బోవీ వర్గం ఇంతకాలం బీజేపీ వైపుండగా, ఇప్పుడు కాంగ్రెస్‌వైపు మళ్లారు. అలాగే, దక్షిణ కర్ణాటకలో ముస్లింలు జేడీ(ఎస్)ను కాదని కాంగ్రెస్ వైపు సానుకూలంగా ఉన్నారు. దిగువ తెలిపిన విధంగా కీలకమైన రాజకీయ అంశాలు పీపుల్స్‌పల్స్ సర్వే దృష్టికి వచ్చాయి : 👉 మతప్రాతిపదికన విభజన: బజరంగ్ దళ్‌పై నిషేధం అంశంపై బీజేపీ దృష్టి కేంద్రీకరించి మతప్రాతిపదికన విభజనకు ప్రయత్నించడంతోపాటు ఇటీవల విడుదలైన కేరళా స్టోరీ చిత్రంపై ప్రచారం చేస్తోంది. వీటిపై బీజేపీ నేతలు ప్రధానంగా దృష్టి పెట్టి పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా కోస్తా కర్ణాటక మినహా ఇతర చోట్ల ప్రభావం స్వల్పమే. అయితే ఇదేసమయంలో బజరంగ్‌దళ్‌పై నిషేధం అంశాన్ని బీజేపీ విజయవంతంగా ఓటర్ల వద్దకు చేర్చగలిగింది. 👉 ధరల పెరుగుదల అంశం : గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల అంశం ఓటర్లపై బాగానే ప్రభావం చూపుతోంది. 👉 నిరుద్యోగత : యువతలో నిరుద్యోగ అంశం ప్రాధాన్యతున్నా, వారు సామాజికంగా విడిపోయారు. లింగాయత్, మరాఠా, ఎస్టీ`నాయక్ యువత బీజేపీ పక్షాన ఉండగా, ముస్లింలు, ఎస్టీ(రైట్) యువత కాంగ్రెస్ పక్షాన, వొక్కలింగా యువత జేడీ(ఎస్)కు మద్దతుగా ఉండడం ఇక్కడ గమనార్హం. 👉 అవినీతి: కాంగ్రెస్ ఎన్నికల్లో అవినీతి అంశాన్ని పెద్దఎత్తున లేవనెత్తుతోంది. రాష్ట్రంలో ‘40% కమిషన్ సర్కార్’’ అంశాన్ని లేవనెత్తుతున్నా, ఓటర్లు అవినీతి అంశం ఆధారంగా ఎన్నికలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. 👉 వ్యవసాయ అంశాలు: పంటకు కనీస మద్దతు ధరపై, పంట నష్టం పరిహారంపై ప్రభుత్వ పనితీరుపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ తమకేమి చేయలేదనే అసంతృప్తితో వారు కాంగ్రస్, జేడీ(ఎస్)కు మద్దతుగా ఓటు వేయవచ్చు. 👉 కన్నడ గౌరవం: దక్షిణ కర్ణాటకలో కన్నడ గౌరవం ప్రభావం ఉండగా, ఉత్తర కర్ణాటకలో లేదు. అయితే ఓటింగ్‌పై ప్రభావం చూపకపోవచ్చు. 👉 పార్టీలలో తిరుగుబాటు: రాష్ట్ర ఎన్నికల్లో ఇది కీలకాంశం. పార్టీ అభ్యర్థులపై తిరుగుబాటుతో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు నష్టపోనున్నాయి. 👉 కాంగ్రెస్ హామీలు: ఎన్నికల్లో కాంగ్రెస్ హామీల ప్రభావం కనిపిస్తోంది. గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్న భాగ్య, యువ నిధి, మహిళలకు ఉచిత బస్సు సర్వీసు హామీల ప్రభావం పేదలు, మహిళలు, గ్రామీణ ప్రజలపై బాగానే ఉంది. వివిధ వర్గాలలో ఓటింగ్ ప్రాధాన్యతలో మార్పులు చేర్పులు: సామాజికంగా, మహిళలు, పురుషుల ఆధారంగా ఓటింగ్ ప్రాధాన్యతను ప్రీ పోల్ సర్వేలో గమనించాం. అనేక అంశాలపై వివిధ సామాజిక వర్గాలలో, పేదలలో, మహిళల్లో ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం వలే కర్ణాటక బీజేపీ సంక్షేమ పథకాలను ప్రకటించడంలో విఫలమైంది. ఈ అంశాలు బీజేపీకి నష్టం చేకూరుస్తున్నాయి. కుమారస్వామి ఎన్నికల ముందు చేపట్టిన చర్యలు ఆయనకు మేలు చేకూర్చవచ్చు. ఈ వర్గాలలో చాలా మంది కాంగ్రెస్‌పట్ల సానుకూలంగా ఉన్నారు. 👉పార్టీ ప్రాధాన్యతలో మార్పులు: దీనికి సంబంధించి సర్వేలో మూడు ప్రధాన మార్పులను గుర్తించాం. ► సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని అధికంగా భావిస్తున్నా, కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయ పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదేసమయంలో బీజేపీ మెజార్టీ సాధించవచ్చని అభిప్రాయపడుతున్న వారి సంఖ్య తగ్గుతోంది. ► కాంగ్రెస్‌కు ఓటు వేసే వారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు, బీజేపీ, జేడీ(ఎస్)కు ఓటు వేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. ► ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కేఆర్పిపి (జనార్థన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ) వంటి చిన్న పార్టీలతో ఇతర ఇండిపెండెంట్ల ప్రభావం తక్కువగా ఉంది. వారు 1 నుండి 3 సీట్లు మాత్రమే పొందే అవకాశాలున్నాయి. పై కారణాల వలన కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో మెజార్టీ పొందే అవకాశాలున్నాయి. మరోవైపు చాలా మంది హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందనే అభిప్రాయపడుతున్నారు. ► వివిధ పార్టీల ప్రచార ప్రభావం: కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితి ప్రకారం కాంగ్రెస్ ప్రచారంలో ముందంజలో ఉంది. రాష్ట్రంలో గాంధీ కుటుంబంతో సహా అగ్ర నేతలందరూ ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ అవినీతి, అభివృద్ధి లేకపోవడం, నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాలను కాంగ్రెస్ ప్రధానంగా ప్రచారం చేస్తోంది. మరోవైపు బీజేపీ ప్రచారంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది. ప్రజాకర్షణ ఉన్న ప్రధాన మంత్రి ఉత్సాహంగా రికార్డు స్థాయిలో ర్యాలీలలో పాల్గొన్నారు. ఇతర బీజేపీ అగ్రనేతలు అలిసిపోయినట్టు కనిపించారు. బీజేపీ ప్రచారంలో అనేక మార్పుచేర్పులు కనిపించాయి. ఆ పార్టీ మొదట జాతీయ అంశాలకు ప్రాధాన్యతివ్వగా, ప్రజల నుండి సానుకూలత కన్పించకపోవడంతో పిమ్మట స్థానిక అంశాలకు ప్రాధాన్యతిచ్చింది. తనపై దూషణలు చేస్తుందని ప్రధాన మంత్రి కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేశారు. చివరగా బీజేపీ మతప్రాతిపదిక ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చింది, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో బజరంగ్ దళ్‌పై నిషేధంపై భారీగా ప్రచారం చేసింది. ‘కేరళా స్టోరీ’ లవ్‌జిహాద్‌పై దృష్టి పెట్టింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలవలే ఇక్కడ కూడా జాతీయ అంశాల కంటే స్థానిక అంశాలే ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. జేడీ(ఎస్) దక్షిణ కర్ణాటకపైనే దృష్టి పెట్టి స్థానిక అంశాల ప్రచారానికే ప్రాధాన్యతిచ్చింది. ఈ వ్యూహం పార్టీకి ప్రయోజనం చేకూర్చే అవకాశాలున్నాయి. చదవండి: Karnataka Assembly elections 2023: తుమకూరులో రెబెల్స్ హోరు -
UP Exit Polls 2022: ఏం జరగబోతోంది.. యోగికి మళ్లీ పట్టం కడతారా?
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. బీజేపీ, మిత్రపక్షాలతో కలిసి 220 నుంచి 240 వరకు సీట్లు సాధిస్తుందని పోస్ట్ పోల్ సర్వే తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ దాని మిత్రపక్షాలకు కలిపి 140 నుంచి 160 స్థానాలు వస్తాయని పేర్కొంది. బహుజన సమాజ్‌వాదీ పార్టీ 12 నుంచి 18 సీట్లు గెలిచే అవకాశముంది. సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షం ఆర్ఎల్డీ 8 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా కట్టింది. కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 10 స్థానాలకు పరిమితం కానుంది. బీజేపీకి భారీగా తగ్గనున్న సీట్లు గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి బీజేపీ 90 సీట్లు కోల్పోయే అవకాశముందని సర్వేలో వెల్లడైంది. 2017 ఎన్నికల్లో బీజేపీ 312 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీని మరోసారి ప్రతిపక్షంలోనే కూర్చునే అవకాశముంది. అయితే గతంతో పోలిస్తే దాని బలం 300 శాతం వరకు పెరుగుతుందని అంచనా. యూపీ ఎన్నికల్లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు హోరాహోరీ తలపడినట్టు కనబడుతున్నా.. క్షేత్రస్థాయిలో చూసుకుంటే బీఎస్పీ కూడా బలమైన ఉనికిని కలిగి ఉంది. సీఎంగా మళ్లీ ఆయనే కావాలి.. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్య్నాధ్పై ఎక్కువ మంది యూపీ ప్రజలు మొగ్గు చూపారు. 38 శాతం మంది యోగి అనుకూలంగా ఉండగా, అఖిలేశ్ యాదవ్ కావాలని 33 శాతం మంది కోరుకున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని సీఎంగా చూడాలని 16 శాతం మంది కోరుకోగా, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి అనుకూలంగా 6 శాతం మంది ఉన్నారు. (క్లిక్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు) ఎన్నికల ప్రధానాంశాలు ఇవే ధరల పెరుగుదల, నిరుద్యోగం, కనీస మద్దతు ధర, లఖింపూర్ ఖేరీ ఘటన, కోవిడ్ వంటివి ఎన్నికల ప్రధానాంశాలుగా నిలిచాయి. చెరకు రైతులకు చక్కెర కర్మాగారాల బకాయిల అంశం కూడా ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముందని సర్వే వెల్లడించింది. పశువుల నుంచి పంటలను కాపాడే విషయాన్ని కూడా ఓటర్లు సీరియస్‌గానే తీసుకున్నట్టు తెలుస్తోంది. యోగి పాలనపై సంతృప్తి తాజా ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్‌ను గద్దె దించే మానసిక స్థితికి ఓటరుకు చేరుకోలేదని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ది పొందినవారు సానుకూలత వ్యక్తం కావడం, శాంతిభద్రత పరిరక్షణ, అవినీతి రహిత పాలన పట్ల యూపీ వాసులు సంతృప్తిగా ఉన్నట్టు కనబడుతోంది. మహిళా ఓటర్లు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపారని మరో అంచనా. అయితే బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండరన్న వాదనలు సీఎం యోగికి కంటగింపుగా మారాయి. ఎవరెవరికి ఎన్ని ఓట్లు బీజేపీ, మిత్రపక్షాలకు కలిపి 38 శాతం ఓట్లు.. సమాజ్‌వాదీ పార్టీ కూటమికి 35 శాతం, బీఎస్పీకి 16 శాతం, కాంగ్రెస్ 7 శాతం, ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. అంచనా వేసిన కంటే 5 శాతం అటుఇటు ఉండొచ్చని పీపుల్స్ పల్స్ తెలిపింది. ఆత్మసాక్షి ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం.. బీజేపీ 138 నుంచి 140, సమాజ్‌వాదీ పార్టీ 235 నుంచి 240, బీఎస్పీ 19 నుంచి 23, కాంగ్రెస్ 12 నుంచి 16, ఇతరులకు 1 నుంచి 2 సీట్లు వస్తాయి. -
పంజాబ్‌లో వచ్చేది ఆ పార్టీయేనా? ఆసక్తికర ఫలితాలు
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలోకి రానుందా? అంటే అవుననే అంటోంది పీపుల్స్ పల్స్ సర్వే. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని అంచనా వేసింది. హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ సంస్థ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది. దీని ఆధారంగా ఆమ్ ఆద్మీ పార్టీకి 59 నుంచి 66 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అధికార కాంగ్రెస్ 23 నుంచి 28 స్థానాలు గెలుచుకునే చాన్స్ ఉంది. శిరోమణి అకాలీదళ్‌కు 17 నుంచి 21 సీట్లు, బీజేపీకి 2 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇతరులు ఒకటి నుంచి నాలుగు స్థానాల్లో పాగా వేయనున్నారు. ‘ఆప్’కు అత్యధిక ఓట్లు ఓట్ల శాతాన్ని పరిగణన లోకి తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 40 శాతం ఓట్ షేర్ రానుంది. కాంగ్రెస్ పార్టీకి 30 శాతం, అకాలీదళ్‌కు 20 శాతం, బీజేపీకి 8 శాతం, ఇతరులకు 2 శాతం ఓట్లు రావొచ్చని సర్వే అంచనా వేసింది. 2017 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన 23 శాతం ఓట్ షేర్‌కు ఈసారి అదనంగా 17 శాతం కలుస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో 38.5 శాతం ఓట్లు రాగా, ఈసారి అందులో 8.5 శాతం తగ్గుతుందని తెలిపింది. తమ అంచనాలు ఐదు శాతానికి అటుఇటుగా ఉండొచ్చని పీపుల్స్ పల్స్ పేర్కొంది. సీఎంగా భగవంత్ మాన్! ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్ మాన్‌పైపు పంజాబ్ ప్రజలు మొగ్గు చూపారు. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ రెండో స్థానానికి పడిపోయారు. భగవంత్ మాన్.. ముఖ్యమంత్రి కావాలని 39 శాతం మంది, ఛన్నీ సీఎం కావాలని 30 శాతం మంది కోరుకున్నారు. సుఖ్బీర్ సింగ్ బాదల్‌వైపు 20 శాతం మంది మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూకు పంజాబీలు గట్టిషాక్ ఇచ్చారు. కేవలం 6 శాతం మంది మాత్రమే ఆయన సీఎం కావాలని ఆకాంక్షించారు. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను కోరుకునే వారి సంఖ్య 3 శాతం మాత్రమే. వీరెవరూ వద్దని 2 శాతం మంది అభిప్రాయపడ్డారు. అలా జరిగేలా లేదు! ధరల పెరుగుదల, నిరుద్యోగం, కనీస మద్దతు ధర, అక్రమ ఇసుక తవ్వకాలు, మద్యం మాఫియా, మాదకద్రవ్యాల ముప్పు, అవినీతి, పెరుగుతున్న రాష్ట్రం అప్పులు గురించి పంజాబ్ ప్రజలు ఎక్కువగా సర్వేలో ప్రస్తావించారు. ప్రభుత్వ వ్యతిరేకత.. ఆమ్ ఆద్మీ పార్టీకి సానుకూలంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. 'యాక్సిడెంటల్' ముఖ్యమంత్రిగా తెర మీదకు వచ్చిన చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ సంఖ్యాపరంగా బలమైన షెడ్యూల్డ్ కులాల (32 శాతం) ఓట్లను గణనీయంగా సంపాందించి పెడతారన్న అంచనాలు ఉన్నాయి. దళితులకు అండగా ఉంటే కాంగ్రెస్‌కు మెజారిటీ వచ్చే అవకాశముందని.. కానీ అలా జరిగేలా కనిపించడం లేదని సర్వే వెల్లడించింది. పంజాబ్‌లో అధికారి మార్పిడి జరగాలని ఆప్ చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లినట్టు తెలుస్తోంది. అలాగే ఢిల్లీ తరహాలో విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ ఇచ్చిన ‘ఢిల్లీ మోడల్’హామీ కూడా వర్కవుట్ అయినట్టుగానే కనబడుతోంది. రీజియన్ల వారీగా చూసుకుంటే... మాల్వా ప్రాంతంలో ఆప్ హవా ఉంది. దోబా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఆప్ గట్టి పోటీ ఇచ్చినట్టు సమాచారం. మజా ప్రాంతంలో అకాలీదళ్, ఆప్ హోరాహోరీ తలపడినట్టు కనబడుతోంది. సర్వే ఇలా.. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత 25 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించినట్టు పీపుల్స్ పల్స్ వెల్లడించింది. 53 శాతం మంది పురుషులు, 47 శాతం మహిళలను సర్వే చేసినట్టు తెలిపింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసుకుని వివిధ సామాజిక వర్గాల చెందిన 18 నుంచి 60 ఏళ్లు పైబడిన వారి అభిప్రాయాలు సేకరించారు. ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి? ఆమ్ ఆద్మీ పార్టీకి 76 నుంచి 90 సీట్లు వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 19 నుంచి 31.. అకాలీదళ్‌కు 7 నుంచి 11, బీజేపీకి ఒకటి నుంచి 4, ఇతరులకు 2 స్థానాలు దక్కే అవకాశముంది. న్యూస్-18 ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆప్‌కు 60, కాంగ్రెస్‌కు 27, అకాలీదళ్‌కు 25 సీట్లు వస్తాయని అంచనా. ఆత్మసాక్షి అంచనా ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 58 నుంచి 61, కాంగ్రెస్ పార్టీకి 34 నుంచి 38, అకాలీదళ్‌కు 18 నుంచి 21, బీజేపీకి 4 నుంచి 5 సీట్లు గెల్చుకునే అవకాశాలున్నాయి. -
మమతకు కష్టాలు తప్పవేమో, ‘పీపుల్స్ పల్స్’ ఇదే!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మార్పు తథ్యంగా కన్పిస్తోంది. రాష్ట్రంలోని మెజారిటీ ఓటర్లలో మమతా బెనర్జీ ప్రభుత్వం పట్ల నెలకొన్న వ్యతిరేకతే దీనికి కారణం. పశ్చిమ బెంగాల్లో ‘పీపుల్స్ పల్స్’ ప్రతినిధులు పర్యటించి రాష్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఓటర్ల మనోభావాలెలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతోపాటు వివిధ సామాజికవర్గాల, మతాల వారీగా అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించారు. ‘పీపుల్స్ పల్స్’ సంస్థ డైరెక్టర్, రీసెర్చర్ డాక్టర్ సజ్జన్ కుమార్ ఈ నివేదికలోని ముఖ్యాంశాలను వెల్లడించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత వల్ల ఈసారి బీజేపీకి లబ్ది చేకూరే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 160 స్థానాల్లో బీజేపీకి అనుకూలత కన్పిస్తోంది. రాష్ట్రంలోని 70 స్థానాల్లో మాత్రమే తృణమూల్ కాంగ్రెస్‌కు అనుకూలత కన్పిస్తోంది. 12 స్థానాల్లో లెఫ్ట్-కాంగ్రెస్ కూటమికి అనుకూలత ఉంది. దాదాపు 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ-టీఎంసీ మధ్య ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా పోటీ నెలకొంది. రాష్ట్రంలోని 5 స్థానాల్లో టీఎంసీ-లెఫ్ట్ కూటమి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మరో 7 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య 1 స్థానంలో మాత్రమే తీవ్రమైన పోటీ నెలకొంది. బెంగాల్‌లోని మెజారిటీ హిందూ ఓటర్లు బీజేపీవైపు పోలరైజ్ అవుతున్నారు. బెంగాల్లో అబ్బాస్ సిద్దిఖీ కారణంగా ముస్లిం ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్‌కు ఇది పెద్ద దెబ్బ. ఇక రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా పరిశీలిస్తే... నార్త్ బెంగాల్ లో బీజేపీ హవా కొనసాగే అవకాశం ఉంది. నార్త్ బెంగాల్ లోని డార్జిలింగ్, కాళింపోంగ్, జల్పాయిగురి, అలిపుర్దౌర్, కూచ్ బిహార్ జిల్లాల్లోని 28 అసెంబ్లీ స్థానాలుండగా, వీటిలో ఏకంగా 22 స్థానాల్లో బీజేపీకి అనుకూలత కన్పిస్తోంది. మరో 5 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ మధ్య, 1 స్థానంలో టీఎంసీ-లెఫ్ట్-బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. నార్త్ బెంగాల్ లో 75 శాతానికిపైగా హిందువులుండగా, 14 శాతం ముస్లింలు, 4 శాతం క్రిస్టియన్లు, బౌద్ద ఓటర్లున్నారు. సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే.. దాదాపు 35 శాతం మంది ఎస్సీ ఓటర్లున్నారు. వీరిలో అత్యధిక ఓటర్లు తృణమూల్ కాంగ్రెస్ పాలనపట్ల వ్యతిరేకతతో ఉన్నారు. నార్త్ బెంగాల్లో మొత్తం ఓటర్లలో 10 శాతానికిపైగా ఎస్టీ ఓటర్లున్నారు. వీరు సైతం అధికార పార్టీ నేతల పనితీరు, అవినీతిపట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఈ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఈసారి బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. మైనారిటీ ఓటర్ల ఆధికంగా ఉన్న నార్త్ దినాజ్ పూర్, సౌత్ దినాజ్ పూర్, మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాల్లో టీఎంసీకి అనుకూలత కన్పిస్తోంది. ఈ నాలుగు జిల్లాల్లోని మొత్తం ఓటర్లలో దాదాపు 50 శాతం మంది ముస్లిం సామాజికవర్గం వారే. ఈ జిల్లాల్లోని మొత్తం 49 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో 17 స్థానాల్లో టీఎంసీ, 10 స్థానాల్లో బీజేపీ, 11 స్థానాల్లో లెఫ్ట్ కూటమికి అనుకూలత లభిస్తోంది. మిగిలిన సీట్ల విషయానికొస్తే...4 సీట్లలో టీఎంసీ-బీజేపీ, మరో 4 సీట్లలో బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా తీవ్రమైన పోటీ నెలకొంది. అలాగే 2 స్థానాల్లో టీఎంసీ-లెఫ్ట్-బీజేపీ, మరో స్థానంలో బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. సెంట్రల్ బెంగాల్ ప్రాంతంలోని బిర్భుం, పశ్చిమ వర్దమాన్+పూర్వవర్ధమాన్, నాదియా జిల్లాల్లో 49 అసెంబ్లీ స్థానాలున్నాయి. సెంట్రల్ బెంగాల్ రీజియన్ పరిధిలో 29 శాతం మంది ఎస్సీలు, 5 శాతానికిపైగా ఎస్టీలు ఉన్నారు. మతాల వారీగా విశ్లేషిస్తే... సెంట్రల్ బెంగాల్ రీజియన్ పరిధిలో 71 శాతానికైగా హిందువులు, 28 శాతానికిపైగా ముస్లింలు, 1 శాతానికిపైగా బౌద్దులున్నారు. సెంట్రల్ బెంగాల్ పరిధిలోని 49 సీట్లకుగాను 30 స్థానాల్లో బీజేపీకి అనుకూలత కన్పిస్తోంది. టీఎంసీకి 11 స్థానాల్లో, లెఫ్ట్ కూటమికి 1 స్థానంలో అనుకూలత కన్పిస్తోంది. అలాగే 7 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ కూటమి మధ్య తీవ్రమైన పోటీ (టఫ్ ఫైట్) నెలకొంది. జంగల్-మహల్ ప్రాంతంలోని పురూలియా, బంకురా, ఝారాగ్రాం, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాల్లోని 42 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలో 83 శాతానికిపైగా హిందువులు, 8 శాతానికిపైగా ముస్లింలు, 1 శాతంలోపు బౌద్దులు ఉన్నారు. జంగల్-మహల్ ప్రాంతంలోని 42 అసెంబ్లీ స్థానాలకుగాను 33 సీట్లలో బీజేపీకి అనుకూలత కన్పిస్తోంది. అలాగే టీఎంసీకి 5 స్థానాల్లో మాత్రమే అనుకూలత కన్పిస్తోంది. మిగిలిన 4 సీట్లలో టీఎంసీ-బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. సౌత్ బెంగాల్ పరిధిలో 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలోని హుగ్లి, హౌరా, ఉత్తర 24 పరగణాలు, కోల్ కతా, దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్ జిల్లాలున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 16 శాతం మంది ఎస్సీలు, 1.5 శాతం మంది ఎస్టీలున్నారు. ఈ ప్రాంతంలోని 126 అసెంబ్లీ స్థానాలకుగాను 65 స్థానాల్లో బీజేపీకి అనుకూల గాలి వీస్తోంది. అలాగే 37 స్థానాల్లో టీఎంసీకి అనుకూలత కన్పిస్తోంది. మరో 19 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ, 1 స్థానంలో టీఎంసీ-లెఫ్ట్ కూటమి, 4 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఢిల్లీలో మళ్లీ ఆప్కే ఎందుకు పట్టం!?
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఆప్, అమిత్ షా నాయకత్వంలో బీజేపీ ప్రధానంగా పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఢిల్లీ ప్రజలు మళ్లీ ఆప్కే పట్టం కట్టారు. విద్యుత్, మంచినీటి సరఫరా, విద్యా, ఆరోగ్యం, ప్రజా రవాణా, ఢిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సదుపాయం తదితర తాము చేపట్టిన స్థానిక అభివృద్ధి కార్యక్రమాల ప్రాతిపదికన ఆప్ నేత కేజ్రివాల్, ఇతర నేతలు ఎన్నికల ప్రచారం చేయగా, సీఏఏ, ఎన్ఆర్సీ లాంటి వివాదాస్పద జాతీయ అంశాల ప్రాతిపదికన అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు ప్రచారం చేశారు. ‘మోదీ– షహీన్బాద్’లో ఎవరు కావాలంటూ అమిత్‌షా జనవరి 23వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఢిల్లీలో తీవ్రతరం చేశారు. ముఖ్యంగా ముస్లిం మహిళల నాయకత్వాన సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా గత డిసెంబర్ 15వ తేదీ నుంచి ఢిల్లీలోని షహీన్బాద్లో ఆందోళన కొనసాగింది. షహీన్బాద్ ఆందోళనకు ఆసరాగా తీసుకొని ఎన్నికల్లో ఢిల్లీ వాసులను ప్రభావితం చేసేందుకు బీజేపీ నాయకులు తెగ ప్రచారం చేశారు. ఈ ప్రచారం గత రెండు వారాల్లో తీవ్రస్థాయికి చేరుకోవడంతో బీజేపీ బలపడుతోందని, ఆప్ బలహీన పడుతోందని వార్తలు వచ్చినా ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆప్కే బంపర్ మెజార్టీ వస్తుందని తేల్చి చెప్పింది. ఢిల్లీవాసుల నాడి పట్టుకునేందుకు డాక్టర్ సజ్జన్ కుమార్, డాక్టర్ రాజన్ పాండే, డాక్టర్ బిజేంద్ర ఝా ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్‌లోని ప్రముఖ ఎన్నికల పరిశోధన సంస్థ ‘పీపుల్స్ పల్స్’ రంగంలోకి దిగింది. జనవరి 17 నుంచి జనవరి 29 వరకు నిర్వహించిన ఫీల్డ్ సర్వే కూడా ఆప్ విజయాన్నే సూచించాయి. అందుకు అయిదు కారణాలను కూడా ‘పీపుల్స్ పల్స్’ సూచించింది. మొదటి అంశం: గత రెండున్నర దశాబ్దాలుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను స్థానిక అంశాలే ప్రభావితం చేస్తున్నాయి. 1998లో ఉల్లిగడ్డ ధరలు పెరిగిన కారణంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పడిపోయింది. అప్పుడు షీలాదీక్షిత్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2013 వరకు, 15 ఏళ్లపాటు అధికారంలో కొనసాగింది. అందుకు కారణం పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేయడం, నగరంలో వంతెనలు, మెట్రో లాంటి మౌలిక సౌకర్యాలను మెరగుపర్చడం, కాలుష్యం నివారణకు సీఎన్జీ బస్సులను ప్రవేశపెట్టడం. ఆ తర్వాత అవినీతి నిర్మూలన, స్థానిక అభివృద్ధి అంశాల ప్రాతిపదికనే ఆప్ గెలుస్తూ వచ్చింది. అంటే ఈ సారి కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలే ప్రధానంగా ప్రభావం చేశాయని చెప్పడం మొదటి అంశం. ఇక రెండో అంశం: గడచిన ఒకటిన్నర దశాబ్దం కాలంగా లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక మున్సిపాలిటీ ఎన్నికలను భిన్నమైన ఓటింగ్ సరళి కనిపిస్తోంది. ఢిల్లీకి మున్సిపాలిటీలకు 2007లో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ, అప్పటి నుంచి స్థానిక ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీ పరిధిలోని ఏడుకు ఏడు లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకొంది. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మూడవ స్థానానికి పడిపోయింది. ఢిల్లీ ఓటరు నాడి ఒక్కో ఎన్నికలకు ఒక్కోరకంగా ఉన్నట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. అంటే లోక్‌సభ ఎన్నికలను జాతీయ అంశాలు, అసెంబ్లీ ఎన్నికలను ప్రాంతీయ, స్థానిక అంశాలు ప్రభావితం చేసినట్లు స్పష్టం అవుతుంది. మూడవ అంశం: ఢిల్లీ నైసర్గిక పరిస్థితులు, సామాజిక వెనకబాటుతనం, వలసలు అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. నగరంలో 76 శాతం జనాభా అనియత కాలనీల్లోనే. అంటే అనధికార కాలనీలు, మురికి వాడల్లో నివసిస్తున్నారు. వారిలో 50 శాతం మంది పేదలు, దిగువ మధ్య తరగతికి చెందిన వారే. వారికి నిత్య జీవితంలో విద్యుత్, మంచినీరు, విద్య, ఆరోగ్యం, ప్రభుత్వ రవాణా సదుపాయలపైనే ఆధారపడతారు. అందుకని వారంతా ఆ దృక్కోణం నుంచే ఎన్నికల్లో ఓటేస్తారు. (చదవండి: కేజ్రీవాల్‌ను తీవ్రవాది అన్న కేంద్రమంత్రి) నాలుగవ అంశం: గత రెండు దశాబ్దాలుగా ఢిల్లీలో బీజేపీకి పంజాబీలు, కోమట్లు, జాట్ల నుంచే మద్దతు. పూర్వాంచల్ నుంచి వలసవచ్చిన వారితోపాటు దిగువ మధ్య తరగతి, మురికివాడల ప్రజలు, ముస్లింల మద్దతుతో 2013 వరకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. ఓ సామాజిక విప్లవంతో అధికారంలోకి వచ్చిన ఆప్, ఈ వర్గాల ప్రజలను ఆకర్షించడంతోపాటు బీజేపీకి చెందిన నమ్మకమైన ఓటర్లను కూడా తనవైపు తిప్పుకోగలిగింది. ‘మోదీ దేశానికి కావాల్సిన నాయకుడు, కేజ్రివాల్ ఢిల్లీకి కావాల్సిన నాయకుడు’ అనే నమ్మే బీజేపీ వర్గం కేజ్రివాల్‌కు మద్దతిస్తోంది. (చదవండి: బీజేపీ ఇంత దిగజారిపోయిందా?) -
సర్వే : పురపోరులో కారు హవా..!
హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయ దుందుభి మోగిస్తుందని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వే కూడా ఇదే అంశం స్పష్టం చేసింది. జనవరి 17 నుంచి 19 వరకు 20 శాతం మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్ల పరిధిలో ప్రీ పోల్ సర్వేను చేపట్టినట్టు ఆ సంస్థ తెలిపింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో భారీ సంఖ్యలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని పేర్కొంది. పార్టీలు విజయం సాధించే స్థానాలు(ప్లస్ ఆర్ మైనస్ 3 శాతం) పార్టీ వార్డులు (మున్సిపాలిటీలు) డివిజన్లు(కార్పొరేషన్లు) టీఆర్ఎస్ 1950-2000 180-205 కాంగ్రెస్ 375-415 40-60 బీజేపీ 150-180 60-75 ఎంఐఎం 25-30 8-10 అలాగే కార్పొరేషన్లలో టీఆర్ఎస్కు 49.1 శాతం, కాంగ్రెస్‌కు 21 శాతం, బీజేపీకి 23.8 శాతం, ఎంఐఎంకు 3.3 శాతం ఓట్లు వస్తాయని ఆ సంస్థ అంచనా వేసింది. అలాగే 120 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్కు 52.3 శాతం, కాంగ్రెస్‌కు 23.3 శాతం, బీజేపీకి 16.1 శాతం, ఎంఐఎంకు 1.6 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. కార్పొరేషన్లలో, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ స్పష్టమైన అధిక్యం కనబరుస్తుందని వెల్లడించింది. టీఆర్ఎస్తో పొల్చితే బీజేపీ, కాంగ్రెస్‌లు చాలా తక్కువ స్థానాల్లో విజయం సాధిస్తాయని పేర్కొంది. అలాగే కార్పొరేషన్లలో కాంగ్రెస్ కన్న బీజేపీ ఎక్కువ డివిజన్లను, అలాగే మున్సిపాలిటీల్లో బీజేపీ కన్న కాంగ్రెస్ ఎక్కువ వార్డులను కైవసం చేసుకుంటుందని ఆ సంస్థ చెప్పింది. కార్పొరేషన్లలో ఓట్ల శాతం.. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం ఎన్నికలు జరగగా మొత్తం 70.26 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు పలు కారణాల వల్ల కరీంనగర్ కార్పొరేషన్‌కు మాత్రం శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. అలాగే కామారెడ్డి, భోదన్, మహబూబ్నగర్లలోని ఒక్కో కేంద్రంలో నేడు అధికారులు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఓట్ల శాతం.. -
రాహుల్ సినిమాలో ‘కథ’ లేదా..!
న్యూఢిల్లీ: ఓ సినిమా బాగా ఆడాలంటే పేరు మోసిన హీరో హీరోయిన్లు, కళ్లు చెదిరే గ్రాఫిక్కులు ఉంటేనే సరిపోదు.. ఆ సినిమాకు సంబంధించిన కథనం బాగుండాలి. కథను ప్రేక్షకులను ఆకట్టుకునేలా చెప్పగలగాలి. ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డీయే ప్రధాన పోటీదారు కాంగ్రెస్ పరిస్థితి కథనం లోపించిన సినిమాలాగానే ఉందని హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ రీసెర్చి ఫౌండేషన్ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. కాంగ్రెస్‌ను అతిపెద్ద పార్టీగా అవతరింపజేయడంలో రాహుల్ విఫలమయ్యారని, ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను సరిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయారని తేలింది. కాంగ్రెస్ ‘సినిమా’లో ‘కథనం’ లోపించింది. ప్రచారంలో మోదీ గురించి తప్ప ఇతరత్రా దేని గురించీ ఆ పార్టీ మాట్లాడలేదు. కానీ నిజం ఏమిటంటే మోదీ ఒక్కరే కీలక విషయం కాలేరు. ఎందుకంటే ఒక వ్యక్తి లక్ష్యంగా చేసే వ్యతిరేక ప్రచారం వల్ల పొందగలిగేదేమీ ఉండదు. అలాగని రాహుల్ మౌనంగా ఏమీ లేరు. నిన్నమొన్నటి బాలాకోట్ వైమానిక దాడుల వరకు ఆయన మోదీ ప్రభుత్వ లక్ష్యంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఒక ప్రత్యామ్నాయ అజెండాను ప్రజల ముందుంచడంలో ఆయన విఫలమయ్యారు. ‘సూటు బూట్ల ప్రభుత్వం’, ‘గబ్బర్‌సింగ్ ట్యాక్స్’, ‘చౌకీదార్ చోర్ హై’ వంటి చెణుకులు బాగానే పేలాయి. ప్రజల్లోకి కూడా బాగానే వెళ్లాయి. కానీ పదే పదే అవే వ్యాఖ్యలు చేస్తుండటంతో రానురానూ పాతబడిపోయిన దలేర్ మెహిందీ, బాబా సెహగల్ పాప్ సంగీతం లాగా విన్పించడం మొదలయ్యింది. మరోవైపు రఫేల్ కుంభకోణం క్షేత్రస్థాయిలోకి వెళ్లలేదని వెల్లడయ్యింది. భ్రమలు తొలగిపోయి మోదీపై ఆగ్రహంతో ఉన్న ఓటర్లే తమ వద్దకు రావాలన్నట్టుగా ఆ పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే సామాన్యుల్ని కష్టాల పాలుచేసిన నోట్ల రద్దు అంశాన్ని తెరపైకి తేవడంలో కూడా కాంగ్రెస్ విఫలమయ్యింది. అలాగే ఏపీ, తెలంగాణలతో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ గ్రామీణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని, రైతులకు కనీస మద్దతు ధర అనేదే ప్రధానాంశంగా ఉండటాన్ని పీపుల్స్ పల్స్ గమనించింది. ఈ అంశాలు కూడా అంతగా హైలైట్ కాలేదు. రూ.65 వేల కోట్ల రైతు రుణాల మాఫీకి సంబంధించి యూపీఏ–1 నిర్ణయాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యం నిరుద్యోగ సమస్యను కూడా కాంగ్రెస్ ఉపయోగించుకోలేక పోయింది. మాటకు కట్టుబడి ఉంటామనే హామీ ఇవ్వడం తప్ప అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తామో వివరించలేదు. ధరల పెరుగుదల అంశాన్నీ కాంగ్రెస్ పెద్దగా లేవనెత్తలేదు. మరోవైపు కాంగ్రెస్ ప్రచారంలోకి తెచ్చిన ‘న్యాయ్’ గురించి పార్టీ అభ్యర్థులు కానీ, కార్యకర్తలు కానీ ప్రస్తావించడం లేదు. చాలామందికి దాని గురించే తెలియదంటే అతిశయోక్తి కాదు. -
‘ముందస్తు సర్వేలు’ నిజమయ్యేనా?
సాక్షి, న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పనితీరులపై నిర్విహించిన ముందస్తు సర్వేల్లో మెజారిటీ రాష్ట్రాల ప్రజలు ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాల పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో కేంద్ర పాలన పట్ల కన్నా రాష్ట్ర ప్రభుత్వం పాలన పట్ల ఎక్కువ అసంతృప్తి వ్యక్తం కావడం గమనార్హం. సీఎస్డీఎస్ గత మార్చిలో విడుదల చేసిన ముందస్తు సర్వే నివేదిక ప్రకారం కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలు కేంద్రంలోని బీజేపీ పాలనకన్నా తమ రాష్ట్ర ప్రభుత్వాల పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తమిళనాడు, కేరళ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్రంలోని బీజేపీ పాలన పట్ల ఎక్కువ అసంతృప్తి వ్యక్తం అయింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కేంద్రంలోని బీజేపీ పాలన పట్ల ఎక్కువ సంతృప్తి వ్యక్తం అయింది. సీ ఓటర్ సర్వే అంశాలు ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నాయి. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకన్నా కేంద్రం పాలన పట్లనే ఎక్కువ మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకన్నా కేంద్ర ప్రభుత్వం పనితీరు పట్ల సంతృప్తి ఎక్కువ వ్యక్తం చేశారు. తెలంగాణలో కేంద్రం పాలనకన్నా రాష్ట్రం పాలన పట్ల ఎక్కువ మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడులో బీజేపీతో చేతులు కలిపి లోక్‌సభకు పోటీ చేస్తున్న అన్నా ఏఐడిఎంకే రాష్ట్ర పాలనపట్ల, అటు కేంద్రం పాలనపట్ల ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకేనేమో రాష్ట్ర పాలన పట్ల ఎక్కువ సంతృప్తి వ్యక్తం అయిన తెలంగాణలో పాలకపక్ష టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ప్రజల సంతృప్తి, అసంతృప్తిల ప్రకారమే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయా ? అన్న అంశాన్ని అధ్యయనం చేయాలి. లోక్‌సభకు ఇప్పటికే ఐదు విడతల పోలింగ్‌లు ముగియగా, మరో రెండు విడతల పోలింగ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రజలు ముందస్తుగా వ్యక్తం చేసిన అభిప్రాయలకే కట్టుబడి ఓటు వేస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి కేంద్రం కన్నా రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్లనే ప్రజలు సంతృప్తి అయినా అసంతృప్తయినా ఎక్కువ వ్యక్తం చేశారు. -
అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్!
కర్ణాటకలో మరోసారి హంగ్ అసెంబ్లీ తప్పదని హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పరిశోధక సంస్థ పీపుల్స్ పల్స్ చెబుతోంది. అత్యధికసీట్లను కాంగ్రెస్ సొంతం చేసుకోనున్నప్పటికీ సంపూర్ణ మెజారిటీ ఆ పార్టీకి రాదనీ, రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో జేడీఎస్ ఉంటాయని తమ సర్వేలో తేలినట్లు పీపుల్స్ పల్స్ పేర్కొంది. ప్రభుత్వం ఎవరిదో నిర్ణయించే సామర్థ్యం జేడీఎస్‌కు ఉంటుందంది. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు ‘కోలార్ వాణి’ అనే పత్రికతో కలసి కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రీ పోల్ సర్వే నిర్వహించామని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. ‘కాంగ్రెస్‌కు 93 నుంచి 103 మధ్య, బీజేపీకి 83–93 మధ్య, జేడీఎస్‌కు 33 నుంచి 43 మధ్య సీట్లు వస్తాయి. ఇతర చిన్నాచితకా పార్టీలు నాలుగు సీట్ల వరకు గెలవొచ్చు. కాంగ్రెస్‌కు 39.6 శాతం, బీజేపీకి 34.2%, జేడీఎస్‌కు 21.6% ఇతర పార్టీలకు మొత్తంగా 4.6 శాతం ఓట్లు రావొచ్చు. కోస్తా కర్ణాటక మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీ కన్నా కాంగ్రెస్సే ముందంజలో ఉంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం సిద్దరామయ్యపై పెద్ద వ్యతిరేకతేమీ లేదు. ప్రధాని మోదీ ప్రభావం కోస్తా ప్రాంతానికి, బాంబే కర్ణాటకలోని ఒక్క బెళగావి జిల్లాకే పరిమితం. సిద్దరామయ్య మళ్లీ సీఎం కావాలని 37%మంది కోరుకుంటున్నారు. 24% మంది యడ్యూరప్పను, 19% మంది కుమారస్వామిని తర్వాతి సీఎంగా చూడాలనుకుంటున్నారు’ అని పీపుల్స్ పల్స్ పేర్కొంది. -
కర్ణాటక : కాంగ్రెస్‌కు 93–103, బీజేపీకి 83–93
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీకి శనివారం జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ‘పీపుల్స్ పల్స్’ తాజాగా నిర్వహించిన ముందస్తు పోలింగ్ సర్వేలో కూడా తేలింది. రాష్ట్ర అసెంబ్లీలో పాలకపక్ష కాంగ్రెస్ పార్టీయే అత్యధిక సీట్లను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, ఆ తర్వాత స్థానాన్ని భారతీయ జనతా పార్టీ, తతీయ స్థానాన్ని జనతాదళ్ సెక్యులర్ పార్టీ దక్కించుకుంటుందని సర్వేలో వెల్లడైంది. రాజకీయ పరిశోధనా సంస్థ ‘పీపుల్స్ పల్స్’ సిబ్బంది, కన్నడ దిన పత్రిక ‘కోలర్‌వాణి’ సహకారంతో ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 9వ తేదీవరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిరిగి, అంటే దాదాపు 3,600 కిలోమీటర్లు ప్రయాణించి ఈ సర్వేను నిర్వహించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయలను సేకరించడం, గుణాత్మక ప్రశ్నావళి ద్వారా వారి నుంచి సరైన సమాధానాలు రాబట్టడం ద్వారా ఈ సర్వేను నిర్వహించింది. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పార్టీ ఓట్ల శాతం సీట్లు కాంగ్రెస్ 39.6% 93-103 బీజీపీ 34.2% 83-93 జేడీ(ఎస్) 21.6% 33-43 ఇతరులు 4.6% 2-4 సర్వే ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 93–103 వరకు, బీజేపీకి 83–93 వరకు, జేడీఎస్‌కు 33–43 వరకు, ఇతరులకు రెండు నుంచి నాలుగు సీట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి 39.6 శాతం, బీజేపీకి 34.2. జేడీఎస్‌కు 21.6 శాతం, ఇతరులకు 4.6 శాతం ఓట్లు వస్తాయి. ఏ సర్వేలోనైనా మూడు శాతం అటు ఇటు, ఇటు అటు అయ్యే అవకాశం ఉంటుందని తెల్సిందే. చివరి రెండు రోజుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం ప్రభావాన్ని, ఆఖరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకునే ఓటర్ల సంఖ్యను సర్వేలో పరిగణించలేదు. పాలక, ప్రతిపక్ష సభ్యుల్లో ఎవరు విజయం సాధించినా వారి మధ్య ఓట్ల వ్యత్యాసం పెద్ద ఎక్కువగా ఉండదు. 43 అసెంబ్లీ స్థానాల్లో పోటీ నువ్యా, నేనా అన్నట్లుగా ఉంది. వీటిలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ అభ్యర్థులు ఎవరైనా గెలవచ్చు. ఈ 43 స్థానాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయన్న అంశంపైనే ఏ పార్టీ రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంశం ఆధారపడి ఉంది. ప్రాంతాల వారిగా ప్రాంతం కాంగ్రెస్ బీజీపీ జేడీ(ఎస్) ఇతరులు దక్షిణ కర్ణాటక 38% 18% 35% 9% మధ్య కర్ణాటక 43% 38% 15% 4% హైదరాబాద్-కర్ణాటక 42% 33% 22% 3% ముంబై-కర్ణాటక 43% 43% 12% 2% కోస్టల్-కర్ణాటక 41% 42% 15% 2% బెంగుళూరు(రూరల్,అర్బన్) 33% 31% 28% 8% రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఏమాత్రం వ్యతిరేకత లేకపోవడం ఈ ఎన్నికల విశేషం. పైగా ఆయన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు ప్రశంసిస్తున్నారు. పార్టీలకు అతీతంగా స్థానిక ఎమ్మెల్యే పనితీరునుబట్టి కొంత వ్యతిరేకత ప్రజల్లో కనిపించింది. అన్ని రకాల ప్రమాణాల్లో అంటే, అభివద్ధి, ప్రజల సంక్షేమం, సీఎం అభ్యర్థిత్వం పరంగా, స్త్రీలు, పురుషులు, చిన్నా, పెద్ద కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల, ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య పట్ల వారు సంతప్తితో ఉన్నారు. కర్ణాటక కోస్తాలో తప్పించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకే ఆధిక్యత కనిపిస్తోంది. జనాకర్షక సంక్షేమ పథకాలపై అవినీతి మచ్చ లేకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశం. ఏ కులం/మతం ఎంత శాతం కులం/మతం కాంగ్రెస్ బీజేపీ జేడీఎస్ ఇతరులు ఎస్సీ 51.0% 22.0% 21.0% 6.0% ఎస్టీ 50.0% 27.0% 18.0% 5.0% ముస్లిం 69.0% 12.0% 15.0% 4.0% ఇతర ఓబీసీలు 42.0% 35.0% 18.0% 5.0% అగ్రవర్ణాలు 21.0% 51.0% 23.0% 5.0% లింగాయత్‌లు 15.0% 65.0% 12.0% 8.0% ఒక్కలింగాస్ 24.0% 20.0% 52.0% 4.0% ఇతరులు 39.0% 35.0% 15.0% 11.0% కాంగ్రెస్ పార్టీకి ఎలాగైనా మట్టి కరిపించాలన్న లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ ప్రజలపై అంతగా ప్రభావం చూపించలేక పోయిందనే చెప్పవచ్చు. నీతి నిజాయితీలు, ప్రజా సంక్షేమం, సుస్థిరత అంశాల్లో కాంగ్రెస్ కన్నా తాము మెరుగైన వారమని బీజేపీ నిరూపించుకోలేక పోయింది. హిందూత్వ ఎజెండాను ఒక్కదాన్నే నమ్ముకోవడం వల్ల కోస్తా ప్రాంతంలో అది ప్రభావం చూపించనుంది. మోదీ ఫ్యాక్టర్ కూడా ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. ముంబై–కర్ణాటక ప్రాంతం, ముఖ్యంగా బెల్గాం జిల్లా, కోస్తా ప్రాంతాల్లో ఆయన ప్రభావం ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కేజేపీ ఈసారి విలీనం అవడంతో లింగాయత్‌లను సమీకరించడంలో బీజేపీ విజయం సాధించింది. దళితులు , ఆదివాసీలు, ముస్లింలు, దిగువ ఇతర వెనకబడిన వర్గాల ప్రజల ఓట్లను సమీకరించడంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సంక్షేమ పథాకాలను అట్టడుగు వర్గాల వరకు తీసుకెళ్లడంలో పార్టీ విజయం సాధించడం, పార్టీ మధ్య ముఖ్యమంత్రి మధ్య మంచి సమన్వయం ఉండడం వల్ల ఇది సాధ్యమైంది. ద„ì ణ, మధ్య, హైదరాబాద్–కర్ణాటక ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన కాంగ్రెస్ మెరుగైన స్థానంలో ఉంది. ఈ ప్రాంతాల్లో దళితులు, ఆదివాసీలు, ముస్లింలు ఎక్కువగా ఉండడమే అందుకు కారణం. లింగాయత్‌లు, మరాఠాలు, జైనులు, బ్రాహ్మణులు, కొంకణ భండారీలు, భంట్లు లాంటి సామాజిక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదు. వీరంతా బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ‘అహిందా’ (ఒక్కలిగేతర ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు) దక్పథం ఫలించింది. అన్నభాగ్య లాంటి సంక్షేమ పథకాల ద్వారా వీరు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఇక జెడీఎస్ దక్షిణ కర్ణాటకలో, బెంగళూరులోని ఒక్కలిగాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో బలంగా కనిపించింది. కొన్ని ప్యాకెట్లలో ‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు’ అన్న విధంగా ఒక్కలిగాలు జేడీఎస్ నాయకుడు కుమారస్వామి తిరిగారు. ముస్లింలను, ఓబీసీలను, కొన్ని చోట్ల దళితులను ఆకర్షించడంలో కూడా ఆయన పార్టీ కొంత విజయం సాధించింది. దక్షిణ కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీలకన్నా ముందుంది. ముంబై–కర్ణాటక, కోస్తా కర్ణాటకలో పార్టీకి బొత్తిగా ఆదరణ లేదు. ఒక్కలిగాలు మినహా మిగతా అన్ని సామాజిక వర్గాల్లో ఎక్కువ మంది ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్యనే రుకుంటున్నారు. యెడ్యూరప్పను మాత్రం ఒక్కలిగాలు సమిష్టంగా కోరుకుంటున్నారు. సహజంగా రైతయిన యెడ్యూరప్ప అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం అందిస్తారని వారు భావిస్తున్నారు. పీపుల్స్ పల్స్–కోలరవాణి సర్వే నివేదికను పీపుల్స్ పల్స్ పీనియర్ ఎగ్జిక్యూటివ్, డాక్టర్ సజ్జన్ కుమార్ (జేఎన్‌యూ నుంచి సీపీఎస్‌లో పీహెచ్డీ) సంకలనం చేశారు. ఓట్ల శాతం–సీట్లు పార్టీ పేరు ఓట్ల శాతం సీట్ల సంఖ్య కాంగ్రెస్ 39.6 93–103 బీజేపీ 34.2 83–93 జేడీఎస్ 21.6 33–43 ఇతరులు 4.6 2–4