కర్ణాటకలో మరోసారి హంగ్ అసెంబ్లీ తప్పదని హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పరిశోధక సంస్థ పీపుల్స్ పల్స్ చెబుతోంది. అత్యధికసీట్లను కాంగ్రెస్ సొంతం చేసుకోనున్నప్పటికీ సంపూర్ణ మెజారిటీ ఆ పార్టీకి రాదనీ, రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో జేడీఎస్ ఉంటాయని తమ సర్వేలో తేలినట్లు పీపుల్స్ పల్స్ పేర్కొంది. ప్రభుత్వం ఎవరిదో నిర్ణయించే సామర్థ్యం జేడీఎస్‌కు ఉంటుందంది. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు ‘కోలార్ వాణి’ అనే పత్రికతో కలసి కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రీ పోల్ సర్వే నిర్వహించామని పీపుల్స్ పల్స్ వెల్లడించింది.
‘కాంగ్రెస్‌కు 93 నుంచి 103 మధ్య, బీజేపీకి 83–93 మధ్య, జేడీఎస్‌కు 33 నుంచి 43 మధ్య సీట్లు వస్తాయి. ఇతర చిన్నాచితకా పార్టీలు నాలుగు సీట్ల వరకు గెలవొచ్చు. కాంగ్రెస్‌కు 39.6 శాతం, బీజేపీకి 34.2%, జేడీఎస్‌కు 21.6% ఇతర పార్టీలకు మొత్తంగా 4.6 శాతం ఓట్లు రావొచ్చు. కోస్తా కర్ణాటక మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీ కన్నా కాంగ్రెస్సే ముందంజలో ఉంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం సిద్దరామయ్యపై పెద్ద వ్యతిరేకతేమీ లేదు. ప్రధాని మోదీ ప్రభావం కోస్తా ప్రాంతానికి, బాంబే కర్ణాటకలోని ఒక్క బెళగావి జిల్లాకే పరిమితం. సిద్దరామయ్య మళ్లీ సీఎం కావాలని 37%మంది కోరుకుంటున్నారు. 24% మంది యడ్యూరప్పను, 19% మంది కుమారస్వామిని తర్వాతి సీఎంగా చూడాలనుకుంటున్నారు’ అని పీపుల్స్ పల్స్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment