largest party
-
పాక్ ఫలితాలు: ఈసీ అధికారిక ప్రకటన
-
పాక్ ఫలితాలు: ఈసీ అధికారిక ప్రకటన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఫలితాలను శుక్రవారం ఉదయం పాక్ ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 272 సీట్లకుగానూ జరిగిన ఎన్నికల్లో ఇప్పటిదాకా వెలువడ్డ ఫలితాలు 251. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ 110 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్ పార్టీ 63, బిలావల్ భుట్టో(బెనజీర్ భుట్టో తనయుడు) పార్టీ పీపీపీ 39, ఇతరులు 50 స్థానాలను కైవసం దక్కించుకున్నారు. మరో 20 స్థానాల ఫలితాల్లో కౌంటింగ్ ఇంకా కొనసా...గుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 137. ఇతరుల సాయంతో పీటీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రధాని బరిలో ఇమ్రాన్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ.. అధికారికంగా మాత్రం పీటీఐ వర్గాలు స్పందించలేదు. బుధవారం సాయంత్రం నుంచి కౌటింగ్ కొనసాగుతూనే ఉండగా.. సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం జరిగిందని ఈసీ స్పష్టత ఇచ్చింది. అయితే ఇమ్రాన్ ఖాన్ అనుచరులు అవకతవకలకు పాల్పడ్డాడని, భారీ ఎత్తున్న రిగ్గింగ్ జరిగిందని మిగతా పార్టీలు విమర్శిస్తుండగా.. ఎన్నికల సంఘం మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 స్థానాలుండగా.. 272 స్థానాలకు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు. మహిళలకు కేటాయించిన 60 సీట్లు, మైనారిటీలకు కేటాయించిన మరో 10 సీట్లకు పరోక్ష పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు. ఇదిలా ఉంటే భారీ విక్టరీపై గురువారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన ఇమ్రాన్ ఖాన్.. సైన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత్‌తో దౌత్య సంబంధాలు, అమెరికా జోక్యంసహా పలు అంశాలపై స్పందించారు కూడా. 14 మంది రెడీ... 14 మంది స్వతంత్ర్యులు తాము పీటీఐ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇవ్వటంతో రాయబారాలు నడుస్తున్నాయి. పీటీఐ కీలక నేతలు జహంగీర్ తరీన్, చౌదరి సర్వర్లు సంప్రదింపులు నడుపుతున్నారు. రేపు సాయంత్రంలోపు ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇమ్రాన్‌పై ముషార్రఫ్ ప్రశంసలు.. ఇదిలా ఉంటే పాక్ మాజీ నియంతాధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ఇమ్రాన్ ఖాన్‌పై ప్రశంసలు గుప్పించారు. మతవ్యతిరేక కూటములకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని, ఇమ్రాన్ ఖాన్ సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలడన్న నమ్మకం ఉందని ముషార్రఫ్ కొనియాడారు. మరోవైపు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతోపాటు పలువురు ప్రముఖులు ఇమ్రాన్ ఖాన్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. -
మాదే పెద్ద పార్టీ.. మమల్ని ఆహ్వానించాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్.. బీజేపీ అవసరాల మేరకు అనుగుణంగా పని చేయటం సరికాదంటూ పలు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న రూల్ రాజ్యాంగంలోనే ఉందని బీజేపీ చెబుతుండగా.. ఆ పాయింటే ఇప్పుడు బీజేపీని ఇరకాటంలో పడేసేలా కనిపిస్తోంది. అనూహ్యంగా గోవా, బిహార్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీలు తమవేనంటూ కాంగ్రెస్, ఆర్జేడీ లు తమకు అవకాశం ఇవ్వాలని వాదిస్తున్నాయి. గోవాలో కీలక పరిణామం... పానాజీ: గోవా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ‘అతిపెద్ద పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి’ అన్న లాజిక్ లేవనెత్తుతూ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైపోయింది. మొత్తం 16 మంది ఎమ్మెల్యేలతో రేపు(శుక్రవారం) రాజ్‌భవన్‌లో పేరేడ్‌కు సిద్ధమైపోయింది. హైకమాండ్ సూచనల మేరకు గురువారం మధ్యాహ్నం గోవా కాంగ్రెస్ లెజిస్లేటివ్ భేటీ జరిగింది. అనంతరం సీఎల్పీ చంద్రకాంత్ కవ్లేకర్ మీడియాతో మాట్లాడారు. ‘రేపు గవర్నర్ మృదులా సిన్హాను కలిసి ఎమ్మెల్యేల సంతకంతోపాటు కూడిన లేఖను సమర్పించబోతున్నాం. అవసరమైతే ఎమ్మెల్యేలతో పేరేడ్ కూడా నిర్వహిస్తాం. రూల్ ప్రకారం అతిపెద్ద పార్టీ మాదే. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వ రద్దు చేసి, మాకు అవకాశం ఇవ్వాలని కోరతాం. కర్ణాటక పరిణామాలను చూశాక గోవా గవర్నర్ గతంలో చేసిన పొరపాటును సరిదిద్దుకుంటారని భావిస్తున్నాం’ అని చంద్రకాంత్ వెల్లడించారు. (గోవాలో ఏం జరిగిందో తెలుసా?) మొత్తం 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి గతేడాది ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 21 మాత్రం రాలేదు. దీంతో 14 సీట్లు వచ్చిన బీజేపీ.. గోవా ఫార్వర్డ్ పార్టీ-ఎంజీపీ-స్వతంత్ర్య అభ్యర్థుల(మొత్తం 9సీట్లు) సాయంతో కూటమిగా గోవాలో మారి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఆర్జేడీ కూడా... పట్నా: ఆర్జేడీ నేత, బిహార్ మాజీ మంత్రి తేజస్వి యాదవ్ బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించినట్లు బీజేపీ చెబుతోంది. ఆ లెక్కన్న బిహార్‌లో ఆర్జేడీనే అతిపెద్ద ప్రభుత్వం. మరి నితీశ్ కుమార్ సర్కార్‌ను రద్దు చేసి మమల్ని బిహార్ గవర్నర్ ఆహ్వానిస్తారా?’ అని తేజస్వి సెటైరిక్‌గా ఓ ట్వీట్ చేశారు. ఇక కర్ణాటక రాజకీయాలకు నిరసనగా ఆర్జేడీ గురువారం ఒక్కరోజు నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ‘దేశం మొత్తం బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. విభజన రాజకీయాలు, గవర్నర్లను తమ గుప్పిట్లో పెట్టుకుని అధికారం చెలాయిస్తోంది. శుక్రవారం ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా కలిసి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరతాం. ఎందుకంటే మాదే పెద్ద పార్టీ కాబట్టి’ అని తేజస్వి మీడియాకు తెలిపారు. I will meet Honourable Governor of Bihar along with MLAs as we are single largest party of Bihar. — Tejashwi Yadav (@yadavtejashwi) 17 May 2018 2015లో ఆర్జేడీ-జేడీయూ కూటమి మహాఘట్భందన్ పేరిట ఎన్నికల్లో పాల్గొని 151 సీట్లు గెలుచుకున్నాయి. ఆర్జేడీకి 80 సీట్లు వచ్చి అతిపెద్దగా పార్టీగా ఆవిర్భవించగా.. జేడీయూ 71 సీట్లతో సరిపెట్టుకుంది. అయితే కొంత కాలం తర్వాత జేడీయూ మహాఘట్భందన్ నుంచి బయటకు వచ్చి బీజేపీ(53 సీట్లు)తో దోస్తీ కట్టింది. -
అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్!
కర్ణాటకలో మరోసారి హంగ్ అసెంబ్లీ తప్పదని హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పరిశోధక సంస్థ పీపుల్స్ పల్స్ చెబుతోంది. అత్యధికసీట్లను కాంగ్రెస్ సొంతం చేసుకోనున్నప్పటికీ సంపూర్ణ మెజారిటీ ఆ పార్టీకి రాదనీ, రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో జేడీఎస్ ఉంటాయని తమ సర్వేలో తేలినట్లు పీపుల్స్ పల్స్ పేర్కొంది. ప్రభుత్వం ఎవరిదో నిర్ణయించే సామర్థ్యం జేడీఎస్‌కు ఉంటుందంది. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు ‘కోలార్ వాణి’ అనే పత్రికతో కలసి కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రీ పోల్ సర్వే నిర్వహించామని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. ‘కాంగ్రెస్‌కు 93 నుంచి 103 మధ్య, బీజేపీకి 83–93 మధ్య, జేడీఎస్‌కు 33 నుంచి 43 మధ్య సీట్లు వస్తాయి. ఇతర చిన్నాచితకా పార్టీలు నాలుగు సీట్ల వరకు గెలవొచ్చు. కాంగ్రెస్‌కు 39.6 శాతం, బీజేపీకి 34.2%, జేడీఎస్‌కు 21.6% ఇతర పార్టీలకు మొత్తంగా 4.6 శాతం ఓట్లు రావొచ్చు. కోస్తా కర్ణాటక మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీ కన్నా కాంగ్రెస్సే ముందంజలో ఉంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం సిద్దరామయ్యపై పెద్ద వ్యతిరేకతేమీ లేదు. ప్రధాని మోదీ ప్రభావం కోస్తా ప్రాంతానికి, బాంబే కర్ణాటకలోని ఒక్క బెళగావి జిల్లాకే పరిమితం. సిద్దరామయ్య మళ్లీ సీఎం కావాలని 37%మంది కోరుకుంటున్నారు. 24% మంది యడ్యూరప్పను, 19% మంది కుమారస్వామిని తర్వాతి సీఎంగా చూడాలనుకుంటున్నారు’ అని పీపుల్స్ పల్స్ పేర్కొంది. -
ప్రపంచ పెద్ద పార్టీనా.. ఓట్లేవి.. అంతా మోసం
పనాజీ: ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించడంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. బీజేపీ ఎప్పుడూ నెంబర్ గేమ్ ఆడుతుందని, వాటితో మోసం చేస్తుందని ఆరోపించింది. గోవా కాంగ్రెస్ కార్యదర్శి దుర్గా దాస్ కామత్ ఈ విషయంపై గోవాలో ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ చెప్పే సభ్యత్వ సంఖ్యకు అది పొందే ఓట్లకు సంబంధం లేకుండా ఉంటుందని అందులో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో గోవాలో ఓ జిల్లా పంచాయతీ ఎన్నికల సమయంలో ఆ పార్టీలో మొత్తం నాలుగు లక్షలమంది సభ్యత్వం నమోదు చేసుకున్నారని చెప్పిందని, కానీ మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 1,50,674 మాత్రమేనని అన్నారు. అంటే వారు చెప్పిన ప్రకారం మిగితా వాళ్లంతా సొంతపార్టీకే ఓటెయకుండా వెనక్కి వెళ్లిపోయారా.. లేక సభ్యత్వం రద్దు చేసుకున్నారా అని ప్రశ్నించారు. ఒక్క చిన్న రాష్ట్రమైన గోవాలో సభ్యత్వాల విషయంలోనే ఆ పార్టీ ఇంత మోసం చేసి ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా సభ్యత్వ సంఖ్యపై మోసం చేసిందని అన్నారు. దీనికి వెంటనే స్పందించిన గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ఓట్లు తక్కువగానే వచ్చినా తమ పార్టీ సభ్యులు అలాగే ఉన్నారని చెప్పారు. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ప్రాంతాలు కవర్ కాలేదని అందుకే మిగితా ఓట్లు పడలేదని చెప్పారు. -
మహారాష్ట్రలో కమల వికాసం
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుబి మోగించింది. ఆ రాష్ట్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా మెజార్టీకి కాస్త దూరంలో ఆగిపోతోంది. బీజేపీకి మొన్నటి వరకు భాగస్వామిగా ఉన్న శివసేన రెండో స్థానంలో నిలిచింది. వూహించినట్టే అధికార కాంగ్రెస్, ఎన్సీపీలు చతికిలపడ్డాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలుండగా, బీజేపీ 119 సీట్లు సొంతం చేసుకోగా, మరో 3 చోట్ల ముందంజలో ఉంది. శివసేన 61 సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్ 41, ఎన్సీపీ 39 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. ఎంఎన్ఎస్ కేవలం ఓ ఎమ్మెల్యే సీటు గెలుచుకుంది. ఇతరులు 18 సీట్లు నెగ్గారు. ఫలితాలు పూర్తిగా వెల్లడికావాల్సివుంది. -
ఢిల్లీలో బీజేపీ ఆఫీసు వద్ద సంబరాలు
-
ఢిల్లీ అసెంబ్లీ బిజెపిదే