మహారాష్ట్రలో కమల వికాసం
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుబి మోగించింది. ఆ రాష్ట్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా మెజార్టీకి కాస్త దూరంలో ఆగిపోతోంది. బీజేపీకి మొన్నటి వరకు భాగస్వామిగా ఉన్న శివసేన రెండో స్థానంలో నిలిచింది. వూహించినట్టే అధికార కాంగ్రెస్, ఎన్సీపీలు చతికిలపడ్డాయి.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలుండగా, బీజేపీ 119 సీట్లు సొంతం చేసుకోగా, మరో 3 చోట్ల ముందంజలో ఉంది. శివసేన 61 సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్ 41, ఎన్సీపీ 39 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. ఎంఎన్ఎస్ కేవలం ఓ ఎమ్మెల్యే సీటు గెలుచుకుంది. ఇతరులు 18 సీట్లు నెగ్గారు. ఫలితాలు పూర్తిగా వెల్లడికావాల్సివుంది.