బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో జంప్ జిలానీల జోరు పెరిగింది. ప్రధాన పార్టీలు ప్రత్యర్థి శిబిరాల నుంచి నేతల వలసపై దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాలికయ్యా వెంకయ్య గుత్తేదార్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. బీజేపీలో చేరారు. మే 12 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది అధికార కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ కానుంది.
వెంకయ్య గుత్తేదార్ అఫ్జల్ పూర్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓసారి మంత్రి పదవి నిర్వహించారు. సీనియర్ నేత అయినప్పటికీ తనను సీఎం సిద్దరాయమ్య గుర్తించకపోవడం, మంత్రిమండలిలో తనను తీసుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై ఆయన గత కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారు. తాను కాంగ్రెస్‌ను వీడటానికి పార్టీ రాష్ట్ర నాయకత్వమే కారణమని ఆయన విమర్శించారు.
గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప సమక్షంలో వెంకయ్య గుత్తేదార్.. కాషాయ కండువా కప్పుకున్నారు. తాను పార్టీకి రాజీనామా చేసేముందు ఆయన సీఎంకు ఫోన్‌లో తన నిర్ణయాన్ని తెలిపారు. యడ్యూరప్ప నాయకత్వంలో పనిచేయాలనే తాను బీజేపీలో చేరినట్టు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment