
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందంటూ తాజా సర్వే పేర్కొనడం.. రాజకీయంగా కలకలం రేపుతోంది. మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 127 సీట్లు దక్కించుకోనుందని సీ-ఫోర్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. 2013లోనూ కర్ణాటక ఎన్నికలపై ఈ సంస్థ నిర్వహించిన సర్వే.. ఫలితాలను సరిగ్గా అంచనా వేసింది. అప్పటి ఫలితాలు నిజమైన నేపథ్యంలో తాజా సర్వేపై రాజకీయ నాయకులు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వే కావడంతో ప్రత్యర్థి పార్టీలు ఇది ఫేక్ సర్వే అని కొట్టిపారేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ప్రీ-పోల్ సర్వే ఉత్త బోగస్ అని, మరికొన్ని నెలల్లో కాంగ్రెస్ పార్టీకి అసలు వాస్తవమేమిటో గట్టిగా తెలుస్తుందని బీజేపీ ఎద్దేవా చేసింది. జేడీఎస్ కూడా ఈ సర్వేను కొట్టిపారేసింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 75 సీట్లకు మించి రావని జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment