pre poll survey
-
తెలంగాణ ఫలితాలపై మరో సర్వే.. 22 స్థానాలే కీలకం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సమయం సమీపిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థులందరూ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక, నేడు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరుగనుంది. మరోవైపు తెలంగాణ ఎన్నికలపై డెమోక్రసీ టైమ్స్ నెట్వర్క్ సర్వే సంస్థ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తెలంగాణలో 22 స్థానాలు కీలకం కానున్నట్టు సర్వేలో పేర్కొంది. సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. బీఆర్ఎస్-45 కాంగ్రెస్-42 బీజేపీ-4, ఎంఐఎం-6 స్థానాల్లో గెలుస్తుంది. అలాగే, తెలంగాణలోని 22 అసెంబ్లీ స్థానాల్లో మాత్రం హోరాహోరీ పోటీ తప్పదని పేర్కొంది. ఆ 22 స్థానాల్లో ఎక్కువ స్థానాలు ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో, సర్వే ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో హంగ్ ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. -
కర్ణాటకలో కాంగ్రెస్‌దే విజయం..! పీపుల్స్ పల్స్ సర్వేలో కీలక విషయాలు
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యత సాధిస్తుందని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రంలో గత మూడున్నర దశాబ్దాల చరిత్రలో ఏ అధికార పార్టీ తిరిగి పగ్గాలు చేపట్టలేదు. చరిత్రను మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే, అధికారం చేపట్టి సంప్రదాయాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. కర్ణాటకలో పీపుల్స్‌పల్స్ చేపట్టిన ప్రీపోల్ సర్వేలో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత కనిపిస్తోంది. మహిళలు, పురుషులతో పాటు అన్ని వయస్సుల వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోగా.. ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం, సామాజిక అంశాలు, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇలా అన్ని రంగాలలో కాంగ్రెస్ ఇతర పార్టీల కంటే ముందుంది. కోస్తా కర్ణాటకను మినహాయించి అన్ని ప్రాంతాలలో హస్తం తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కంటే ముందంజలో ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 100 స్థానాలకు పైగ పొంది స్వల్ప మెజార్టీ సాధించే అవకాశాలున్నాయి. బీజేపీ 100 స్థానాలలోపే పరిమితం కావచ్చు. ఇదేసమయంలో జేడీ(ఎస్) తనకు పట్టున్న స్థానాల్లో ఆధిపత్యం కొనసాగిస్తూ 24 స్థానాలకుపైగా సాధించవచ్చు. సౌత్‌ఫస్ట్ న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్‌పల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ 105-117 స్థానాలు, బీజేపీ 81-93 స్థానాలు, జేడీ(ఎస్) 24-29, ఇతరులు 1-3 స్థానాలు పొందే అవకాశాలున్నాయి. 👉 2018లో 38.14 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ 41.4 శాతం పొందే అవకాశాలున్నాయి. 2018లో 36.35 ఓట్ల శాతం పొందిన అధికార బీజేపీ ఇప్పుడు స్వల్పంగా 0.3 శాతం కోల్పోయి 36 శాతం ఓట్లు సాధించవచ్చు. 2018లో కింగ్‌మేకర్ పాత్ర పోషించిన జేడీ(ఎస్) ఇప్పుడు 16 శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నాయి. ఇది 2018 కంటే 2.3 శాతం తక్కువ. 👉 ఏ సర్వేలోనైనా రెండు శాతం ప్లస్ లేదా మైనస్ వ్యత్యాసాలు ఉండే అవకాశాలుంటాయి. చివరి రెండు రోజుల ప్రచారాన్ని సర్వే పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి చివరి నిమిషంలో ప్రధాన పార్టీలకు లభించే అనుకూల, వ్యతిరేక అంశాలను అంచనా వేయలేము. 👉 ‘‘సౌత్ ఫస్ట్’’ న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ ఆర్.దిలీప్‌రెడ్డి నేతృత్వంలో 1 మే నుండి 5 మే వరకు ఈ సర్వే నిర్వహించారు. ‘ప్రాబబులిటీ ప్రొఫెషనల్ మెథడాలజీ’ (పీపీఎస్) పద్ధతి ద్వారా ఎంపిక చేసిన 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో మూడు పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో 20 శాంపిల్స్ తీసుకున్నారు. ప్రాంతం, కులం, వయస్సు, పురుషులు, స్త్రీలు, పేద`సంపన్నులు ఇలా తగు నిష్పత్తిలో ఉండేలా చూసుకుంటూ మొత్తం 3360 శాంపిల్స్ సేకరించడం జరిగింది. 👉 కర్ణాటకలో పీపుల్స్ పల్స్ సంస్థ మొదటి ప్రీ పోల్ సర్వేను 2022 డిసెంబర్ 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించగా, రెండో ప్రీ పోల్స్ సర్వేను 2023 మార్చి 25 నుండి 10 ఏప్రిల్ వరకు చేపట్టారు. చివరిదైన మూడవ ప్రీ పోల్ సర్వేను 2023 మే 1వ తేదీ నుండి 5 మే వరకు నిర్వహించారు. 👉 పీపుల్స్‌పల్స్ ప్రతినిధులు ప్రీపోల్ సర్వే కోసం 25 ఏప్రిల్ నుండి మే 5వ తేదీ వరకు రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రధాన పార్టీలపై ఓటర్ల నాడిని అంచనా వేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లను ముఖాముఖిగా కలుసుకోవడంతోపాటు అక్కడ వివిధ వర్గాలతో చర్చించి అక్కడ ఏ పార్టీకి అనుకూలంగా ఉందో తెలుసుకుంది. 👉 ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తున్నారని ఓటర్ల అభిప్రాయాన్ని కోరగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పక్షాన 42 శాతం మంది నిలిచారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైకి 24 శాతం, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి 17 శాతం, మాజీ సీఎం బి.యడియూరప్పకు 14 శాతం మంది, డి.కె.శివకుమార్‌కు 3 శాతం మంది ప్రాధాన్యతిచ్చారు. 👉 కర్ణాటక రాష్ట్రం అభివృద్ధికి ఏ పార్టీ మెరుగైనది అని ప్రశ్నిస్తే కాంగ్రెస్‌కు 46 శాతం, బీజేపీకి 34 శాతం, జేడీ(ఎస్)కు 14 శాతం ప్రాధాన్యతిచ్చారు. బీజేపీ ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తారా అని ప్రశ్నించగా 53 శాతం ఇవ్వమని, 41 శాతం ఇస్తామని చెప్పగా 6 శాతం మంది ఏమీ చెప్పలేమని తెలిపారు. కర్ణాటకలో పీపుల్స్‌పల్స్ ఏప్రిల్ నుండి నిర్వహిస్తున్న ప్రీపోల్ సర్వేలో రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 👉 టికెట్లను ప్రకటించాకా ప్రధాన మూడు పార్టీలలో అసంతృప్తి, తిరుగుబాటులు భారీగా ఉన్నాయి. 👉 పార్టీలు విడుదల చేసిన మ్యానిఫెస్టోలలో అనేక వివాదాస్పద అంశాలున్నాయి. 👉 ప్రధాన పార్టీల ప్రచారంలో అధినాయకత్వంతో ప్రధాన నేతలు పాల్గొన్న సందర్భాలలో అనేక వివాదాస్పద ప్రకటనలు, అంశాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటుచేసుకున్నాయి. 👉 ప్రధాన సామాజిక వర్గాల్లో ఓటింగ్ ప్రాధాన్యతలో మార్పులు : ప్రీ పోల్ సర్వే అంచనా ప్రకారం ప్రధాన పార్టీలన్నీ ఆయా సామాజిక వర్గాల్లో స్వల్ప మార్పులతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. బీజేపీ లింగాయత్‌లలో, ఎస్టీ నాయక్, ఎస్సీ లెఫ్ట్ వర్గాల్లో ఆధిపత్యం కొససాగిస్తుండగా, జేడీ(ఎస్) వొక్కలిగ సామాజిక వర్గంలో, కాంగ్రెస్ కురుబాలు, ఇతర ఓబీసీలు, ఎస్సీ రైట్, ముస్లిం వర్గాల్లో ఆధిపత్యం కొనసాగిస్తోంది. అయితే అభ్యర్థులు, స్థానిక అంశాల ఆధారంగా ఈ సామాజిక వర్గాల నిర్ణయాలలో స్వల్పమార్పులున్నాయి. ఎస్సీలోని బోవీ వర్గం ఇంతకాలం బీజేపీ వైపుండగా, ఇప్పుడు కాంగ్రెస్‌వైపు మళ్లారు. అలాగే, దక్షిణ కర్ణాటకలో ముస్లింలు జేడీ(ఎస్)ను కాదని కాంగ్రెస్ వైపు సానుకూలంగా ఉన్నారు. దిగువ తెలిపిన విధంగా కీలకమైన రాజకీయ అంశాలు పీపుల్స్‌పల్స్ సర్వే దృష్టికి వచ్చాయి : 👉 మతప్రాతిపదికన విభజన: బజరంగ్ దళ్‌పై నిషేధం అంశంపై బీజేపీ దృష్టి కేంద్రీకరించి మతప్రాతిపదికన విభజనకు ప్రయత్నించడంతోపాటు ఇటీవల విడుదలైన కేరళా స్టోరీ చిత్రంపై ప్రచారం చేస్తోంది. వీటిపై బీజేపీ నేతలు ప్రధానంగా దృష్టి పెట్టి పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా కోస్తా కర్ణాటక మినహా ఇతర చోట్ల ప్రభావం స్వల్పమే. అయితే ఇదేసమయంలో బజరంగ్‌దళ్‌పై నిషేధం అంశాన్ని బీజేపీ విజయవంతంగా ఓటర్ల వద్దకు చేర్చగలిగింది. 👉 ధరల పెరుగుదల అంశం : గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల అంశం ఓటర్లపై బాగానే ప్రభావం చూపుతోంది. 👉 నిరుద్యోగత : యువతలో నిరుద్యోగ అంశం ప్రాధాన్యతున్నా, వారు సామాజికంగా విడిపోయారు. లింగాయత్, మరాఠా, ఎస్టీ`నాయక్ యువత బీజేపీ పక్షాన ఉండగా, ముస్లింలు, ఎస్టీ(రైట్) యువత కాంగ్రెస్ పక్షాన, వొక్కలింగా యువత జేడీ(ఎస్)కు మద్దతుగా ఉండడం ఇక్కడ గమనార్హం. 👉 అవినీతి: కాంగ్రెస్ ఎన్నికల్లో అవినీతి అంశాన్ని పెద్దఎత్తున లేవనెత్తుతోంది. రాష్ట్రంలో ‘40% కమిషన్ సర్కార్’’ అంశాన్ని లేవనెత్తుతున్నా, ఓటర్లు అవినీతి అంశం ఆధారంగా ఎన్నికలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. 👉 వ్యవసాయ అంశాలు: పంటకు కనీస మద్దతు ధరపై, పంట నష్టం పరిహారంపై ప్రభుత్వ పనితీరుపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ తమకేమి చేయలేదనే అసంతృప్తితో వారు కాంగ్రస్, జేడీ(ఎస్)కు మద్దతుగా ఓటు వేయవచ్చు. 👉 కన్నడ గౌరవం: దక్షిణ కర్ణాటకలో కన్నడ గౌరవం ప్రభావం ఉండగా, ఉత్తర కర్ణాటకలో లేదు. అయితే ఓటింగ్‌పై ప్రభావం చూపకపోవచ్చు. 👉 పార్టీలలో తిరుగుబాటు: రాష్ట్ర ఎన్నికల్లో ఇది కీలకాంశం. పార్టీ అభ్యర్థులపై తిరుగుబాటుతో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు నష్టపోనున్నాయి. 👉 కాంగ్రెస్ హామీలు: ఎన్నికల్లో కాంగ్రెస్ హామీల ప్రభావం కనిపిస్తోంది. గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్న భాగ్య, యువ నిధి, మహిళలకు ఉచిత బస్సు సర్వీసు హామీల ప్రభావం పేదలు, మహిళలు, గ్రామీణ ప్రజలపై బాగానే ఉంది. వివిధ వర్గాలలో ఓటింగ్ ప్రాధాన్యతలో మార్పులు చేర్పులు: సామాజికంగా, మహిళలు, పురుషుల ఆధారంగా ఓటింగ్ ప్రాధాన్యతను ప్రీ పోల్ సర్వేలో గమనించాం. అనేక అంశాలపై వివిధ సామాజిక వర్గాలలో, పేదలలో, మహిళల్లో ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం వలే కర్ణాటక బీజేపీ సంక్షేమ పథకాలను ప్రకటించడంలో విఫలమైంది. ఈ అంశాలు బీజేపీకి నష్టం చేకూరుస్తున్నాయి. కుమారస్వామి ఎన్నికల ముందు చేపట్టిన చర్యలు ఆయనకు మేలు చేకూర్చవచ్చు. ఈ వర్గాలలో చాలా మంది కాంగ్రెస్‌పట్ల సానుకూలంగా ఉన్నారు. 👉పార్టీ ప్రాధాన్యతలో మార్పులు: దీనికి సంబంధించి సర్వేలో మూడు ప్రధాన మార్పులను గుర్తించాం. ► సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని అధికంగా భావిస్తున్నా, కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయ పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదేసమయంలో బీజేపీ మెజార్టీ సాధించవచ్చని అభిప్రాయపడుతున్న వారి సంఖ్య తగ్గుతోంది. ► కాంగ్రెస్‌కు ఓటు వేసే వారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు, బీజేపీ, జేడీ(ఎస్)కు ఓటు వేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. ► ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కేఆర్పిపి (జనార్థన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ) వంటి చిన్న పార్టీలతో ఇతర ఇండిపెండెంట్ల ప్రభావం తక్కువగా ఉంది. వారు 1 నుండి 3 సీట్లు మాత్రమే పొందే అవకాశాలున్నాయి. పై కారణాల వలన కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో మెజార్టీ పొందే అవకాశాలున్నాయి. మరోవైపు చాలా మంది హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందనే అభిప్రాయపడుతున్నారు. ► వివిధ పార్టీల ప్రచార ప్రభావం: కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితి ప్రకారం కాంగ్రెస్ ప్రచారంలో ముందంజలో ఉంది. రాష్ట్రంలో గాంధీ కుటుంబంతో సహా అగ్ర నేతలందరూ ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ అవినీతి, అభివృద్ధి లేకపోవడం, నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాలను కాంగ్రెస్ ప్రధానంగా ప్రచారం చేస్తోంది. మరోవైపు బీజేపీ ప్రచారంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది. ప్రజాకర్షణ ఉన్న ప్రధాన మంత్రి ఉత్సాహంగా రికార్డు స్థాయిలో ర్యాలీలలో పాల్గొన్నారు. ఇతర బీజేపీ అగ్రనేతలు అలిసిపోయినట్టు కనిపించారు. బీజేపీ ప్రచారంలో అనేక మార్పుచేర్పులు కనిపించాయి. ఆ పార్టీ మొదట జాతీయ అంశాలకు ప్రాధాన్యతివ్వగా, ప్రజల నుండి సానుకూలత కన్పించకపోవడంతో పిమ్మట స్థానిక అంశాలకు ప్రాధాన్యతిచ్చింది. తనపై దూషణలు చేస్తుందని ప్రధాన మంత్రి కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేశారు. చివరగా బీజేపీ మతప్రాతిపదిక ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చింది, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో బజరంగ్ దళ్‌పై నిషేధంపై భారీగా ప్రచారం చేసింది. ‘కేరళా స్టోరీ’ లవ్‌జిహాద్‌పై దృష్టి పెట్టింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలవలే ఇక్కడ కూడా జాతీయ అంశాల కంటే స్థానిక అంశాలే ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. జేడీ(ఎస్) దక్షిణ కర్ణాటకపైనే దృష్టి పెట్టి స్థానిక అంశాల ప్రచారానికే ప్రాధాన్యతిచ్చింది. ఈ వ్యూహం పార్టీకి ప్రయోజనం చేకూర్చే అవకాశాలున్నాయి. చదవండి: Karnataka Assembly elections 2023: తుమకూరులో రెబెల్స్ హోరు -
మణిపూర్‌లో ఆ పార్టీదే గెలుపు.. ఎందుకంటే?
ఇంఫాల్: మణిపూర్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని రిపబ్లిక్ టీవీ- పీఎంఏఆర్‌క్యూ ప్రిపోల్ సర్వే అంచనా వేసింది. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ 31-37 సీట్లు (39.2 శాతం ఓట్లు) గెల్చుకునే అవకాశం ఉందని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి ఈసారి 13-19 సీట్లు (28.7 శాతం ఓట్లు) దక్కుతాయని తెలిపింది. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 3 నుంచి 9, నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ఒకటి నుంచి 5 స్థానాలను కైవసం చేసుకుంటాయని సర్వేలో వెల్లడైంది. ఎన్పీపీకి 14.2, ఎన్పీఎఫ్ 6.4, ఇతరులు 11.5 శాతం ఓట్లు దక్కించుకుంటారని అంచనా కట్టింది. 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపులు ప్రోత్సహించి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలు మాత్రమే నెగ్గిన బీజేపీ బలం ఈ ఐదేళ్ల కాలంలో 29కి పెరిగింది. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. (చదవండి: పశ్చిమ యూపీ బీజేపీకి కత్తిమీద సామే!) నిరుద్యోగమే అతిపెద్ద సమస్య మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వ పనితీరు బాగుందని 59 శాతం మంది, ఫర్వాలేదని 29 శాతం, బాలేదని 12 శాతం మంది సర్వేలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద సమస్య ఉపాధిలేమి అని ఎక్కుమంది(29 శాతం) తెలిపారు. తాగునీటి కొరత(24 శాతం), అస్తవ్యస్థ రహదారులు(17 శాతం), అవినీతి(5 శాతం) వంటి సమస్యలు కూడా ఉన్నాయని వాపోయారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు ఎన్ బైరాన్ సింగ్ పేరును ఎక్కువ మంది(36 శాతం) చెప్పారు. ఇబోబి సింగ్(17 శాతం), యుమ్నం జోయ్‌కుమార్ సింగ్(11 శాతం), గైఖేంగమ్(10 శాతం), బిశ్వజిత్(5 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. (చదవండి: ఆ రోజు వద్దు.. మరో రోజు పోలింగ్ పెట్టండి ప్లీజ్) మార్చి 10న ఎన్నికల ఫలితాలు మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరగనున్నాయి. ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 27, మార్చి 3న పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, తొలి విడత పోలింగ్ తేదీని మార్చాలని ఆల్ మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ (ఏఎంసీఓ) కోరుతోంది. (చదవండి: ఎన్నికల రాష్ట్రంలో వరుస గ్రెనేడ్ దాడులు.. కలకలం) -
సర్వే : పురపోరులో కారు హవా..!
హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయ దుందుభి మోగిస్తుందని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వే కూడా ఇదే అంశం స్పష్టం చేసింది. జనవరి 17 నుంచి 19 వరకు 20 శాతం మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్ల పరిధిలో ప్రీ పోల్ సర్వేను చేపట్టినట్టు ఆ సంస్థ తెలిపింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో భారీ సంఖ్యలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని పేర్కొంది. పార్టీలు విజయం సాధించే స్థానాలు(ప్లస్ ఆర్ మైనస్ 3 శాతం) పార్టీ వార్డులు (మున్సిపాలిటీలు) డివిజన్లు(కార్పొరేషన్లు) టీఆర్ఎస్ 1950-2000 180-205 కాంగ్రెస్ 375-415 40-60 బీజేపీ 150-180 60-75 ఎంఐఎం 25-30 8-10 అలాగే కార్పొరేషన్లలో టీఆర్ఎస్కు 49.1 శాతం, కాంగ్రెస్‌కు 21 శాతం, బీజేపీకి 23.8 శాతం, ఎంఐఎంకు 3.3 శాతం ఓట్లు వస్తాయని ఆ సంస్థ అంచనా వేసింది. అలాగే 120 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్కు 52.3 శాతం, కాంగ్రెస్‌కు 23.3 శాతం, బీజేపీకి 16.1 శాతం, ఎంఐఎంకు 1.6 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. కార్పొరేషన్లలో, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ స్పష్టమైన అధిక్యం కనబరుస్తుందని వెల్లడించింది. టీఆర్ఎస్తో పొల్చితే బీజేపీ, కాంగ్రెస్‌లు చాలా తక్కువ స్థానాల్లో విజయం సాధిస్తాయని పేర్కొంది. అలాగే కార్పొరేషన్లలో కాంగ్రెస్ కన్న బీజేపీ ఎక్కువ డివిజన్లను, అలాగే మున్సిపాలిటీల్లో బీజేపీ కన్న కాంగ్రెస్ ఎక్కువ వార్డులను కైవసం చేసుకుంటుందని ఆ సంస్థ చెప్పింది. కార్పొరేషన్లలో ఓట్ల శాతం.. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం ఎన్నికలు జరగగా మొత్తం 70.26 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు పలు కారణాల వల్ల కరీంనగర్ కార్పొరేషన్‌కు మాత్రం శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. అలాగే కామారెడ్డి, భోదన్, మహబూబ్నగర్లలోని ఒక్కో కేంద్రంలో నేడు అధికారులు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఓట్ల శాతం.. -
‘ముందస్తు సర్వేలు’ నిజమయ్యేనా?
సాక్షి, న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పనితీరులపై నిర్విహించిన ముందస్తు సర్వేల్లో మెజారిటీ రాష్ట్రాల ప్రజలు ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాల పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో కేంద్ర పాలన పట్ల కన్నా రాష్ట్ర ప్రభుత్వం పాలన పట్ల ఎక్కువ అసంతృప్తి వ్యక్తం కావడం గమనార్హం. సీఎస్డీఎస్ గత మార్చిలో విడుదల చేసిన ముందస్తు సర్వే నివేదిక ప్రకారం కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలు కేంద్రంలోని బీజేపీ పాలనకన్నా తమ రాష్ట్ర ప్రభుత్వాల పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తమిళనాడు, కేరళ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్రంలోని బీజేపీ పాలన పట్ల ఎక్కువ అసంతృప్తి వ్యక్తం అయింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కేంద్రంలోని బీజేపీ పాలన పట్ల ఎక్కువ సంతృప్తి వ్యక్తం అయింది. సీ ఓటర్ సర్వే అంశాలు ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నాయి. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకన్నా కేంద్రం పాలన పట్లనే ఎక్కువ మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకన్నా కేంద్ర ప్రభుత్వం పనితీరు పట్ల సంతృప్తి ఎక్కువ వ్యక్తం చేశారు. తెలంగాణలో కేంద్రం పాలనకన్నా రాష్ట్రం పాలన పట్ల ఎక్కువ మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడులో బీజేపీతో చేతులు కలిపి లోక్‌సభకు పోటీ చేస్తున్న అన్నా ఏఐడిఎంకే రాష్ట్ర పాలనపట్ల, అటు కేంద్రం పాలనపట్ల ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకేనేమో రాష్ట్ర పాలన పట్ల ఎక్కువ సంతృప్తి వ్యక్తం అయిన తెలంగాణలో పాలకపక్ష టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ప్రజల సంతృప్తి, అసంతృప్తిల ప్రకారమే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయా ? అన్న అంశాన్ని అధ్యయనం చేయాలి. లోక్‌సభకు ఇప్పటికే ఐదు విడతల పోలింగ్‌లు ముగియగా, మరో రెండు విడతల పోలింగ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రజలు ముందస్తుగా వ్యక్తం చేసిన అభిప్రాయలకే కట్టుబడి ఓటు వేస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి కేంద్రం కన్నా రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్లనే ప్రజలు సంతృప్తి అయినా అసంతృప్తయినా ఎక్కువ వ్యక్తం చేశారు. -
ప్రజాదరణలో మోదీ ముందంజ..
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూ పలు ప్రీపోల్ సర్వేలు వెల్లడవుతూ పొలిటికల్ హీట్‌ను మరింత పెంచేస్తున్నాయి. ఇక ప్రధానిగా నరేంద్ర మోదీని తిరిగి కోరుకుంటున్నామని ఇండియా టుడే పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (పీఎస్ఈ) సర్వేలో 52 శాతం మంది పేర్కొనగా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వైపు 33 శాతం మంది మొగ్గుచూపారు. కాగా ఎస్సీలు, మైనారిటీల్లో అత్యధిక శాతం మంది రాహుల్‌ను తదుపరి ప్రధానిగా చూడాలనుకుంటున్నామని వెల్లడించడం గమనార్హం. ఎస్సీ ఓటర్లలో 44 శాతం మంది రాహుల్‌ను భావి ప్రధానిగా ఎంచుకోగా, 41 శాతం మంది మోదీ వైపే మొగ్గుచూపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఎస్సీలో రాహుల్‌కు ఆదరణ పది శాతం పెరగ్గా, ప్రధాని మోదీకి ఎస్సీల్లో ఆదరణ ఆరు శాతం తగ్గిందని పీఎస్ఈ పోల్ వెల్లడించింది. ఇక ముస్లింల్లో 61 శాతం మంది రాహుల్ ప్రధాని కావాలని కోరుకుంటుండగా, 18 శాతం మంది ముస్లింలు తిరిగి మోదీనే ప్రధాని కావాలని అభిలషిస్తున్నామని చెప్పారు. కాగా ఏప్రిల్ 11 నుంచి మార్చి 19 వరకూ ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతుందని ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. మే 19న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. -
కేంద్రంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ..!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రంలో ఏపార్టీ అధికారం చేజిక్కించుకుంటుందని తెలుసుకునేందుకు పలు సర్వే సంస్థలు ఓటర్ల నాడిని పరీక్షిస్తున్నాయి. ఓ జాతీయ మీడియా సంస్థ చేపట్టిన సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ (ఎన్డీయే) అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని సర్వే తేల్చింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి సీట్లశాతం తక్కువగా ఉంటుందని సర్వే తెలిపింది. మొత్తం 545 లోక్‌సభ స్థానాలకు గాను అధికార బీజేపీ 264 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవరిస్తుందని సర్వేలో వెల్లడయింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌కు ఊరటకలిగించే విధంగా ఆపార్టీ 165 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఎన్డీయే, యూపీయేతర పార్టీలు 114 సీట్లు కైవసం చేసుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే ఏ పార్టీ అయినా 272స్థానాల బలం ఉండాలి. గత ఎన్నికల మాదిరిగానే యూపీ, బిహార్, హార్యానా, గుజారత్ రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగిస్తుందని, మహారాష్ట్రలో శివసేన, బీజేపీ కూటమి 30 స్థానాలను గెలుచుకుంటుదని తేలింది. ఛత్తీస్‌గఢ్, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతుందని సర్వే అభిప్రాయపడింది. -
నిజంగానే ‘పీపుల్స్ పల్స్’ పట్టేసింది..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇకపోతే ఎన్నికలు పూర్తికాగానే.. జాతీయ మీడియా నుంచి.. స్థానిక మీడియా దాకా ప్రతి ఒక్కరు ఫలితాలను అంచనా వేసే ప్రయత్నం చేశారు. జాతీయ సర్వేలతో పాటు ఇక్కడి సర్వే సంస్థలు కూడా తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పగా.. కేవలం లగడపాటి మాత్రం కూటమి గెలుపు ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పారు. ఆయన జోస్యం తప్పింది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పరిశోధన సంస్థ ‘పీపుల్స్ పల్స్’ నిజంగానే ప్రజల నాడిని పట్టే ప్రయత్నం చేసి 90 శాతం వరకూ కచ్చితమైన ఫలితాలను అందించినట్లు రీసర్చ్ అసోసియేట్ ఎస్ బాల నరసింహారెడ్డి తెలిపారు. పీపుల్స్ పల్స్ మాత్రమే దేశవ్యాప్తంగా గుణాత్మక, పరిమాణాత్మక సర్వే నిర్వహించిందన్నారు. గత తొమ్మిదేళ్లుగా దేశ వ్యాప్తంగా క్షేత్ర స్థాయి నుంచి స్టడీ చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల సందర్భంగా పీపుల్స్ పల్స్ జమ్ము-కశ్మీర్‌తో సహా ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర, దక్షిణ భారతదేశమంతటా మూడ్ సర్వేతో పాటు ప్రీ పోల్ సర్వేను కూడా నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రమంలో తాము అత్యంత కచ్చితమైన సమాచారాన్ని అందించినట్లు నరసింహారెడ్డి పేర్కొన్నారు. పీపుల్స్ పల్స్ కేవలం గెలుపు, ఓటముల్నే కాకుండా వాటి వెనక ఉన్న కారణాల గురించి కూడా విశ్లేషిస్తుందని తెలిపారు. ఈ ఏడాది జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్ పల్స్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో మూడ్ సర్వేతో పాటు ప్రీ పోల్ సర్వేని కూడా నిర్వహించినట్లు నరసింహా రెడ్డి తెలిపారు. అయితే రవాణా సౌకర్యాల కొరత దృష్ట్యా రాజస్తాన్‌లో మాత్రం ఎటువంటి సర్వే నిర్వహించలేకపోయామన్నారు. మూడ్ సర్వే నిర్వహించిన వారు వారాల తరబడి ఈ రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో సంచరించారన్నారు. పీపుల్స్ సర్వే వెల్లడించిన వివరాలు.. మధ్యప్రదేశ్‌లో హస్తం హవా... మధ్యప్రదేశ్‌లో మూడ్ సర్వే నిర్వహిస్తోన్నప్పుడు ప్రజలు ఈ సారి మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలిసిందన్నారు. ఇక ప్రీ పోల్ సర్వే ఫలితాలు కూడా అందుకు తగ్గట్లుగానే వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ దాదాపు 41. 6 శాతం ఓట్లతో దాదాపు 116 - 120 గెలుస్తుందని అంచాన పీపుల్స్ పల్స్ అంచనా వేసిందని తెలిపారు. దాని ప్రకారమే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ దాదాపు 40.9 శాతం ఓట్లతో 114 స్థానాల్లో గెలపొందింది. అయితే రైతుల్లో ఉన్న అసంతృప్తే బీజేపీ ఓటమికి ప్రధాన కారణంగా నరసింహా రెడ్డి పేర్కొన్నారు. అలానే బీఎస్పీ కేవలం 0 - 2 స్థానాల్లో గెలుపొందుతుందని చెప్పగా నిజంగానే ఈ ఎన్నికల్లో బీఎస్పీ కేవలం 2 స్థానాలకే పరిమితమయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లోనూ లెక్క తప్పలేదు... ఛత్తీస్‌గఢ్‌లో 41శాతం ఓట్లు గెల్చుకుని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ నివేదించింది. అలానే జేసీసీ, బీఎస్పీ రెండు కలిసి 11 శాతం ఓట్లను సాధిస్తాయని.. ఈ రెండు కూడా బీజేపీకి కీడు చేస్తాయని ప్రకటించింది. వాస్తవంగా కూడా అదే జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 43 శాతం ఓట్లు గెల్చుకుని అధికారంలోకి రాగా.. జేసీసీ, బీఎస్పీ కూటమి 10. 9 శాతం ఓట్లు సాధించింది. అయితే పీపుల్స్ పల్స్ చెప్పినట్లు జేసీసీ, బీఎస్పీ కూటమి బీజేపీకి బాగానే హాని చేశాయి. ఇక మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వచ్చాయి. తెలంగాణలో కారుకు నో బ్రేక్... ఇక తెలంగాణ విషయానికొస్తే.. ఇక్కడ 2018, అక్టోబర్ నాటికే మూడ్ సర్వేతో పాటు ప్రీ పోల్ సర్వే కూడా నిర్వహించినట్లు నరసింహా రెడ్డి తెలిపారు. ఈ రెండు సర్వేల్లో కూడా టీఆర్ఎస్సే మరోసారి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయన్నారు. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించేంత వ్యతిరేకత మాత్రం లేదని సర్వేలో తెలిసిందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాగు, తాగు నీటి పథకాలు ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని కలిగించాయన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏం చేయలేదని.. టీజేఎస్, వామపక్షాలు టీఆర్ఎస్ ముందు నిలవలేవని పీపుల్స్ పల్స్ పేర్కొంది. ఈ సర్వేకు అనుగుణంగానే ఫలితాలు కూడా అలానే వచ్చాయి. టీజేఎస్, లెఫ్ట్ పార్టీలు ఖాతా తెరవకపోగా.. బీజేపీ ఒక్క స్థానానికే పరిమితమయ్యింది. ఈ సర్వేలో తెలిసిన మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. రాష్ట్రంలో ఉన్న ముస్లింలు, బీసీలు కేసీఆర్‌కు పెద్ద ఓటు బ్యాంక్‌గా నిలవనున్నట్లు తెలిసింది. ముస్లింలకు నరేంద్ర మోదీ పట్ల ఆగ్రహం ఉన్నప్పటికి.. కేసీఆర్ మీద మాత్రం సానుకూల అభిప్రాయమున్నట్లు తెలిసిందన్నారు. మిజోరాంలో తప్పిన అంచనా... ఇక మిజోరాం విషయానికొస్తే కాంగ్రెస్, ఎమ్ఎన్ఎఫ్లు సమానంగా సీట్లు సాధించడంతో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ మాత్రం పీపుల్స్ సర్వే అంచనాలు తప్పాయి. ఎమ్ఎన్ఎఫ్ మెజారిటీ స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మిజోరాంలో కేవలం 100 ఓట్లు నాయకుల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఇక్కడ మాత్రం పీపుల్స్ సర్వే సరైన ఫలితాలు ఇవ్వలేకపోయిందని నరసింహా రెడ్డి అభిప్రాయ పడ్డారు. లోక్‌సభ ఎన్నికల సర్వే షూరూ.. చాలా కచ్చితమైన సమాచారాన్ని ఇస్తోన్న ‘పీపుల్స్ పల్స్’ ప్రస్తుతం రాబోయే 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను అంచనా వేసే పనిలో పడింది. ఇప్పటికే సంస్థ సభ్యులు ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తూ పని మొదలు పెట్టినట్లు నరసింహ రెడ్డి తెలిపారు. 2019, ఫిబ్రవరి రెండో వారం నుంచి మూడ్స్ సర్వేని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
హస్త విలాసమా? కమల వికాసమా?
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు మరికొద్దిగంటల్లో తెరపడనుంది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కన్నడ ఎన్నికల్లో ఓటరు ఎవరికి పట్టం గట్టారనేది తేలిపోనుంది. ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైనట్లు హంగ్ అసెంబ్లీ ఏర్పుడుతుందా? అయితే కింగ్‌మేకర్ అనుకుంటున్న జేడీఎస్ మొగ్గు ఎటువైపు ఉంటుంది? ఈ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ, కాంగ్రెస్‌లలో ఒకరు సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారా? అని కొంతకాలంగా రాజకీయరంగాన్ని తొలుస్తున్న ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40 కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలి రెండుమూడు గంటల్లోనే ఫలితాలపై కొంతమేర అంచనా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి స్పష్టత రానుంది. పూర్తి ఫలితాలు సాయంత్రం వరకు వెల్లడవుతాయని తెలుస్తోంది. అసలైన పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ఉండనుందనేది సుస్పష్టమే అయినా.. జేడీఎస్ గెలుచుకునే సీట్లు కీలకం కానున్నాయి. 222 అసెంబ్లీ సీట్లలో 112 సీట్లు వచ్చిన పార్టీదే అధికారం. దీంతో ఓటరు ఎవరికి ఈ మేజిక్ ఫిగర్‌ను కట్టబెట్టాడన్నదానిపై ఈ ఉత్కంఠ. సీఎం సిద్దరామయ్యేనా? కాంగ్రెస్‌పార్టీ సంపూర్ణ మెజారిటీ తెచ్చుకున్నట్లయితే.. 1985 తర్వాత వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నేతగా నిలుస్తారు. అయితే సిద్దరామయ్యనే సీఎంగా ఉంచుతారా? లేక 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దళితనేతకు సీఎం పదవిని కాంగ్రెస్ అధిష్టానం కట్టబెడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. పోలింగ్ తర్వాత సిద్దరామయ్య ‘దళితనేతపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాన’ంటూ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. అదే జరిగితే సిద్దరామయ్యకు లోక్‌సభ విపక్షనేత మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు జి. పరమేశ్వర ప్రత్యామ్నాయాలుగా కనబడుతున్నారు. బీజేపీకి నైతిక బలం ఒకవేళ బీజేపీ గెలిస్తే.. అది దక్షిణాదిలో కమలం పార్టీ విస్తరణకు ప్రధాన ద్వారంగా మారనుంది. దక్షిణ భారత రాష్ట్రాల్లో ప్రధాని మోదీ హవా వీచేందుకు మరింత అవకాశం కల్పిస్తుంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ కార్యకర్తల్లో నైతికస్థైర్యం పెంచేందుకు దోహదపడుతుంది. ఫలితంపై జేడీఎస్ కూడా ధీమాగా ఉంది. తమ పార్టీ అధినేత కుమారస్వామి కింగ్ మేకర్ కాదని.. కింగ్ అవుతారని పేర్కొంది. ఏదేమైనా మరోసారి దేవేగౌడ కన్నడ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుంది. అత్యంత ఖరీదైన ఎన్నికలుగా..! కర్ణాటక ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచాయి. పార్టీలు, అభ్యర్థులు పోటీలు పడి ఓటర్లపై కాసుల వర్షం కురిపించారని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) అనే సంస్థ వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి డబ్బు, మద్యం పంపిణీ విచ్చలవిడిగా జరిగిందని ఈ సంస్థ పేర్కొంది. అన్ని పార్టీలూ, వ్యక్తిగతంగా అభ్యర్థులు పెట్టిన ఖర్చు మొత్తంగా రూ. 9,500 కోట్ల నుంచి రూ. 10,500 కోట్లు ఉండొచ్చని సీఎంఎస్ అంచనావేసింది. ‘దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కర్ణాటక ఎన్నికల వ్యయం ఆధారంగా 2019 ఎన్నికల్లో రూ.50వేల నుంచి రూ.60వేల కోట్ల ఖర్చు ఉండొచ్చని అంచనావేస్తున్నారు. 2014లో పార్టీలు రూ.30వేల కోట్లు ఖర్చు చేశాయి’ అని సీఎంఎస్ ప్రతినిధి భాస్కర్ రావు తెలిపారు. ఏమేం జరగొచ్చు...? కర్ణాటకలో ఫలితాల ఆధారంగా అధికారం ఎవరికి దక్కొచ్చన్న అంశంపై వివిధ అంచనాలు చర్చకొస్తున్నాయి. వీటిని ఓసారి గమనిస్తే.. అంచనా–1: కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ వస్తే ► ఆ పార్టీకి గొప్ప విజయం అవుతుంది ► రాహుల్ నాయకత్వంపై పార్టీలో విశ్వాసం పెరుగుతుంది ► సిద్దరామయ్య ప్రభావం పెరుగుతుంది ► రాజస్తాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీ ఇవ్వగలుగుతుంది అంచనా–2: బీజేపీకి సంపూర్ణమెజారిటీ వస్తే ► మోదీ–షా జోడీకి తిరుగుండదు ► మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎన్నికలకు మరింత ఉత్సాహం ► దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు మరింత గడ్డుపరిస్థితి ► రాహుల్ గాంధీపై పార్టీలోనూ వ్యతిరేకత అంచనా–3: కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచినా మెజారిటీ రాని పక్షంలో.. ► సీఎంగా సిద్దరామయ్యను జేడీఎస్ తిరస్కరిస్తుంది ► దళిత సీఎం వేటలో కాంగ్రెస్ అధిష్టానం ► మల్లికార్జున ఖర్గే, పరమేశ్వరల్లో ఒకరికి అవకాశం ► జేడీఎస్ కీలక మంత్రిత్వ శాఖలు కోరే అవకాశం అంచనా–4: బీజేపీ అతిపెద్ద పార్టీగానిలిచి మెజారిటీ రానిపక్షంలో ► మోదీ–షా వ్యూహం పనిచేస్తుంది ► బీజేపీ – జేడీఎస్ కలుస్తాయి ► కుమారస్వామి ఉపముఖ్యమంత్రి అవుతారు ► కాంగ్రెస్ తన అవకాశాల్ని కోల్పోతుంది అంచనా–5: హోరాహోరీ ఉంటే.. ► బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది ► జేడీఎస్‌ను చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది ► రిసార్టు రాజకీయాలు కీలకంగా మారతాయి ► జేడీఎస్ కింగ్‌మేకర్‌గా మారుతుంది -
‘మెజారిటీ’ సర్కారే..!
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పునిస్తారనేది ఉత్కంఠగా మారింది. అన్ని పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం జరగటం.. ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ హంగ్ ఏర్పడుతుందని వెల్లడిస్తున్న నేపథ్యంలో ఫలితంపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే కర్ణాటక రాజకీయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు మాత్రం కర్ణాటకలో మెజారిటీ ప్రభుత్వమే ఏర్పడే అవకాశాలున్నాయని అంచనావేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లలో ఒకరికి మేజిక్ ఫిగర్ దక్కుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారైన విషయాన్ని వీరు గుర్తుచేస్తున్నారు. యూపీ ఫలితాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. కన్నడలో ప్రజానాడిపై విడుదలైన ఎనిమిది సర్వేల్లో.. ఆరు బీజేపీవైపు, రెండు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపాయి. కేవలం మూడు సర్వేలు మాత్రమే ఏకపార్టీ ప్రభుత్వమే ఏర్పడుతుందని పేర్కొన్నాయి. ఇందులో ఇండియాటుడే–యాక్సిస్ సంస్థ కాంగ్రెస్ 106 నుంచి 118 సీట్లతో సర్కారు ఏర్పాటుచేస్తుందని పేర్కొనగా.. రిపబ్లిక్–జన్‌కీ బాత్, టుడేస్ చాణక్య సంస్థలు బీజేపీకీ స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టాయి. యూపీలో గతితప్పిన అంచనాలు గతంలోనూ వివిధ రాష్ట్రాలపై పలు సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్ క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రతిబింబించటంలో విజయం సాధించలేకపోయాయి. ఉదాహరణకు, గతేడాది యూపీ ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ+కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే ఎస్పీ+కాంగ్రెస్ కూటమిదే అధికారమని కొన్ని సంస్థలు, బీజేపీ ప్రభుత్వ పగ్గాలు అందుకున్నా అత్తెసరు మెజారిటీయే ఉంటుందని మరికొన్ని సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడించాయి. అయితే ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి. బీజేపీ బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా ఓవైపు ప్రధాని మోదీ, అమిత్‌షాల వ్యూహాలు.. కాంగ్రెస్ తరపున సిద్దరామయ్య ఒంటరిగా ప్రతివ్యూహాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఏ పార్టీ మరొకరికి తీసిపోని విధంగా ప్రచారం చేసింది. మే 15 నాటి ఫలితాలతోనే ఎవరిపై ఎవరిది పైచేయనేది స్పష్టమవుతుంది. సిద్దరామయ్య విశ్వాసం కాంగ్రెస్ తరపున సీఎం సిద్దరామయ్యే కన్నడ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ఐదేళ్ల కాలంలో చేపట్టిన పలు పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన విశ్వాసంతో ఉన్నారు. ప్రభుత్వంపై ఉండాల్సినంత వ్యతిరేకత లేకపోవటం, సామాన్యులు, పేదలకోసం ఉద్దేశించిన పథకాలను సరిగ్గా అమలుచేయటమే తనకు మళ్లీ పట్టంగడతాయని ఆయన విశ్వసిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది కేవలం సిద్దరామయ్య వ్యక్తిగత చరిష్మా వల్ల మాత్రమేననేది సుస్పష్టం. కన్నడ గౌరవం, కన్నడ ప్రత్యేక జెండా వంటివి కర్ణాటక ఓటర్లను కాంగ్రెస్‌కు దూరం కాకుండా చేస్తాయని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఐదారు నెలలుగా తమ పార్టీకి 120కి పైగా సీట్లొస్తాయని విశ్వాసంగా చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవానికి ప్రభుత్వంపై అంతగా వ్యతిరేకత లేదు. అటు బీజేపీకి కూడా 2008లో అధికారంలోకి వచ్చిన నాటి పరిస్థితులు కూడా లేవు. క్షేత్రస్థాయి పనిలో బీజేపీ! కర్ణాటక ఎన్నికలకు కనీసం ఆర్నెల్ల ముందునుంచే బీజేపీ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లింది. బూత్ స్థాయిలో పనిచేసేలా కార్యకర్తలకు శిక్షణనివ్వటం మొదలుకుని ఓటింగ్ రోజు వారిని పోలింగ్ బూత్‌లకు తీసుకురావటం వరకు పకడ్బందీగా నిర్వహించింది. ఈ పనిని అమిత్‌షాయే ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూవచ్చారు. అభ్యర్థుల ఎంపిక, ఓటర్ల జాబితా విశ్లేషణ, ఎన్నికల ర్యాలీలు, యాత్రలు, ప్రజలను చేరుకునే కార్యక్రమాల్లో పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కర్ణాటక ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఇక్కడ తొలిసారి ఓటేస్తున్న వారి సంఖ్య గతంలో కంటె రెట్టింపు కాగా, మహిళాఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మోదీ తన ప్రచారంలో యువత, మహిళలను పదేపదే ప్రస్తావించటం వెనక వ్యూహం కూడా ఇదే. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అమిత్ షా సందేశమిస్తూ.. ‘ ఉదయం 10.30 కల్లా ఓటు వేసి.. మిగిలిన వారు ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రోత్సహించండి’ అని సూచించారు. లింగాయత్‌లు ఎటువైపు? ఈసారి కన్నడ ఫలితాలను నిర్ణయించే ప్రధాన అంశం లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా కల్పించటం. ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం తనకు అండగా నిలుస్తుందని సీఎం భావిస్తున్నారు. లింగాయత్‌ల జనాభా ఎక్కువగా ఉండే, సెంట్రల్ కర్ణాటక, బాంబే కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్‌పోల్స్, అంతకుముందు ఒపీనియన్ పోల్స్కూడా వెల్లడించాయి. దీన్ని బట్టి చూస్తే 10 శాతం లింగాయత్‌లు మినహా మిగిలిన వారంతా బీజేపీతోనే ఉండొచ్చని తెలుస్తోంది. ఓటింగ్ శాతం పెరగటం అధికార పార్టీపై వ్యతిరేకతకు సంకేతమని అనుకోవడానిక్కూడా వీల్లేదు. దళిత, ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ కర్ణాటక, వక్కలిక ఓట్లు మెజారిటీగా ఉన్న పాత మైసూరు ప్రాంతాలపైనే కాంగ్రెస్ నమ్మకం పెట్టుకుంది. హైదరాబాద్ కర్ణాటకలోనూ బీజేపీనుంచి తీవ్రమైన పోటీ తప్పదని తెలుస్తోంది. కోస్తా కర్ణాటకలోనూ బీజేపీయే మెజారిటీ స్థానాలు గెలుచుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. – సాక్షి నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్‌దే మళ్లీ అధికారం.. అంత సీన్ లేదు!
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందంటూ తాజా సర్వే పేర్కొనడం.. రాజకీయంగా కలకలం రేపుతోంది. మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 127 సీట్లు దక్కించుకోనుందని సీ-ఫోర్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. 2013లోనూ కర్ణాటక ఎన్నికలపై ఈ సంస్థ నిర్వహించిన సర్వే.. ఫలితాలను సరిగ్గా అంచనా వేసింది. అప్పటి ఫలితాలు నిజమైన నేపథ్యంలో తాజా సర్వేపై రాజకీయ నాయకులు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వే కావడంతో ప్రత్యర్థి పార్టీలు ఇది ఫేక్ సర్వే అని కొట్టిపారేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రీ-పోల్ సర్వే ఉత్త బోగస్ అని, మరికొన్ని నెలల్లో కాంగ్రెస్ పార్టీకి అసలు వాస్తవమేమిటో గట్టిగా తెలుస్తుందని బీజేపీ ఎద్దేవా చేసింది. జేడీఎస్ కూడా ఈ సర్వేను కొట్టిపారేసింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 75 సీట్లకు మించి రావని జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. -
ప్రీపోల్ సర్వే: హిమాచల్‌లో బీజేపీ పాగా
సాక్షి, సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విస్పష్ట ఆధిక్యంతో పాలనా పగ్గాలు చేపడుతుందని అక్టోబర్ 23 నుంచి 30 వరకూ నిర్వహించిన పీపుల్స్ పల్స్ సర్వేలో స్పష్టమైంది. ప్రేమ్‌కుమార్ ధుమాల్‌ను బీజేపీ తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం ఈ ప్రీ పోల్ సర్వే నిర్వహించారు. 68 మంది సభ్యులున్న హిమాచల్ అసెంబ్లీలో బీజేపీ 39-44 సీట్లు గెలుపొందుతుందని, కాంగ్రెస్ 19-24 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమవుతుందని సర్వేలో వెల్లడైంది. ఎగువ, దిగువ హిమాచల్ ప్రాంతాల్లోనూ బీజేపీ మంచి ఆధిక్యం కనబరుస్తుందని సర్వే స్పష్టం చేసింది. మరోవైపు సీపీఎం తొలిసారిగా హిమాచల్ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేతో అడుగుపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఇద్దరు నుంచి నలుగురు ఇండిపెండెంట్లు విజయం సాధించనున్నారని అంచనా వేసింది. ప్రభుత్వ వ్యతిరేకత లేకున్నా.. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వీరభద్రసింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్‌పై ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేకున్నా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై నెలకొన్న వ్యతిరేకత బీజేపీకి కలిసివస్తోంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనా వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు వెల్లడవడం గమనార్హం. సీఎంగా ఎవరిని ఎన్నుకోవాలని భావిస్తున్నారని సర్వే ప్రశ్నించగా బీజేపీ సీఎం అభ్యర్థి ధుమాల్ వైపు 34 శాతం మంది మొగ్గుచూపగా, వీరభద్రసింగ్‌ను 33 శాతం ఓటర్లు ఎంచుకున్నారు. వీరిద్దరి మధ్య తేడా కేవలం ఒక శాతమే. మరోవైపు సీఎంగా వీరభద్రసింగ్ పనితీరును 32 శాతం మంది ప్రశంసించగా, 41 శాతం మంది ఫరవాలేదని, కేవలం 26 శాతం మందే బాగాలేదని అభిప్రాయపడ్డారు. ఇక హిమాచల్ అభివృద్ధికి ఏ పార్టీ సరైనదని భావిస్తున్నారన్న ప్రశ్నకు బీజేపీ సరైనదని 41.4 శాతం మంది పేర్కొనగా, కాంగ్రెస్ వైపు 37.5 శాతం మంది మొగ్గుచూపారు. మూడు శాతం ఓట్లతో మారిన మూడ్ బీజేపీ, కాంగ్రెస్‌లకు పోలయ్యే ఓట్ల వ్యత్యాసం కేవలం మూడు శాతమేనని ఈ పోల్ అంచనా వేసింది. బీజేపీకి 46.9 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 43.5 శాతం, ఇతరులకు 9.6 శాతం ఓట్లు పోలవుతాయని పేర్కొంది. ఇరు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం మూడు శాతమే అయినా వీరభద్రసింగ్ సర్కార్‌ను కూలదోసి బీజేపీ నేతృత్వంలోని దుమాల్‌కు పట్టం కట్టేలా సీట్లలో భారీ తేడా వస్తుందని తెలిపింది. నిరుద్యోగమే ప్రధానాంశం హిమాచల్ ఎన్నికలు మోదీ వర్సెస్ రాహుల్‌గా మారలేదు. జాతీయ నేతల ప్రభావమూ లేదు. నిరుద్యోగం ఎన్నికల ప్రధానాంశంగా భావిస్తున్నామని 28.3 శాతం మంది అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదలే తమను కలవరపెడుతోందని 21.5 శాతం మంది చెప్పుకొచ్చారు. గిట్టుబాటు ధరలే ప్రధానాంశమని 16 శాతం, రాష్ట్ర అభివృద్ధే కీలకాంశమని 12 శాతం మంది ఓటర్లు పేర్కొన్నారు. అవినీతి ప్రధానాంశమని 8 శాతం మంది చెప్పగా నోట్ల రద్దు, జీఎస్టీ ఇబ్బందులను 5.8 శాతం మంది ప్రస్తావించారు. ఇక విద్య, వైద్యం, విద్యుత్ వంటి మౌలిక వసతులే ఎన్నికల అంశాలని ఏడు శాతం మంది చెప్పారు. -
ప్రీపోల్ సర్వే: గుజరాత్లో బీజేపీకి స్వల్ప ఆధిక్యం
సాక్షి, అహ్మదాబాద్: బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప ఆధిక్యం కనబరుస్తుందని పీపుల్స్ పల్స్ ప్రీ పోల్ సర్వే అంచనా వేసింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 5 వరకూ నిర్వహించిన ఈ సర్వేలో బీజేపీకి 44.8 శాతం ఓట్లు పోలవుతాయని, కాంగ్రెస్‌కు 43.2 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. ఇతరులకు 12 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేసింది. బీజేపీకి కాంగ్రెస్‌తో పోలిస్తే కేవలం 1.6 శాతం ఓట్లే అధికంగా వస్తాయని ఈ పోల్ భావిస్తోంది. ఓట్ల శాతం అతితక్కువగా ఉండటంతో ఆయా పార్టీలకు వచ్చే సీట్ల సంఖ్య అంచనాలను ఈ సర్వే ప్రకటించలేదు. పార్టీలకు సవాళ్లివే... గుజరాత్లో బీజేపీకి మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారా అని అడగ్గా 45.9 శాతం మంది సానుకూలంగా స్పందించగా, కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తామని 44.1 శాతం మంది సర్వేలో చెప్పారు. ఇక్కడా ఓట్ల తేడా కేవలం 1.7 శాతం కావడం గమనార్హం. కాంగ్రెస్‌కు సంస్థాగత నిర్మాణం పటిష్టంగా లేకపోవడం, బలమైన రాష్ట్ర నాయకత్వం కొరవడటం అవరోధాలుగా నిలిచాయి. రాహుల్ గాంధీపైనే ఆ పార్టీ అతిగా ఆధారపడటం కూడా లోపంగా పరిణమించింది. గ్రామీణ ప్రాంతాల మాదిరిగా పట్టణ ప్రాంతాలపై కాంగ్రెస్ దృష్టి సారించకపోవడం మైనస్‌గా మారిందని చెబుతున్నారు. ఇక 22 ఏళ్లుగా అధికారంలో ఉండటం బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేకత ఎదురయ్యేందుకు కారణం కాగా, పటేళ్ల ఉద్యమం, జీఎస్టీ, నోట్ల రద్దు, దళితులపై దాడులు ప్రతికూలంగా మారాయి. పత్తి, వేరుశనగకు మద్దతు ధర లేకపోవడం రైతుల్లో బీజేపీ పట్ల వ్యతిరేకతను పెంచింది. సీఎంపై వ్యతిరేకత గుజరాత్లో బీజేపీ స్వల్ప ఆధిక్యం కనబరిచే అవకాశాలున్నా సీఎం విజయ్ రూపానీ పనితీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు పోల్‌లో వెల్లడైంది. విజయ్ రూపానీ పనితీరు బాగాలేదని ఏకంగా 59.2 శాతం మంది అభిప్రాయపడగా, పరవాలేదని 22 శాతం మంది, బాగుందని కేవలం 18.6 శాతం మంది ఓటర్లు చెప్పారు. తదుపరి సీఎంగా ఎవరి వైపు మొగ్గుచూపుతారంటే 22.9 శాతం మంది విజయ్ రూపానీకి సానుకూలంగా ఓటేశారు. తర్వాత కాంగ్రెస్‌కు చెందిన భరత్ సింగ్ సోలంకి వైపు 18.6 శాతం మంది మొగ్గుచూపారు. మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్‌కు కేవలం 6.5 శాతం మందే అనుకూలంగా స్పందించారు. -
పుంజుకుంటున్న హస్తం
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల తొలిదశలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని పరిస్థితులు చెబుతున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీలు తమ వ్యూహాలను పకడ్బందీగా అమలుచేస్తున్నాయి. అయితే గుజరాత్లో కాంగ్రెస్ రోజురోజుకూ పుంజుకుంటోంది. యూపీ ఎన్నికల్లో విజయానికి బీజేపీ అనుసరించిన వ్యూహాన్నే గుజరాత్లో కాంగ్రెస్ అమల్లో పెట్టింది. సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములానే ఫాలో అవుతోంది. అయితే నాలుగు నెలల్లో కాంగ్రెస్ జోరు పెరిగేందుకు నాలుగు ముఖ్య కారణాలున్నాయి. మొదటిది, పార్టీపై ఉన్న హిందుత్వ వ్యతిరేక ముద్ర. దీన్ని తొలగించుకునేందుకు రాహుల్ గాంధీ దేవాలయాల సందర్శనకు ప్రాధాన్యమిస్తున్నారు. రెండోది, ఎన్నికల ప్రచారంలో బయటివారితో కాకుండా స్థానిక నేతలతోనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. మూడోది, సాంప్రదాయ పద్ధతిలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. నాలుగోది, రాహుల్, హార్దిక్ పటేల్‌ల విమర్శలకు ప్రధాని మోదీ నేరుగా స్పందించేలా చేయటం. ఇది బీజేపీని కాస్త ఇబ్బందిపెట్టే అంశమే. అందుకే తెరపైకి ‘హిందుత్వ’? గుజరాత్ ఎన్నికల్లో మోదీ, అమిత్ షాల జోడీకి విజయం నల్లేరుమీద నడకే అనే పరిస్థితులు మొదట్లో కనిపించాయి. కానీ ప్రచారం ముగింపునకు వస్తున్నకొద్దీ కాంగ్రెస్ జోరు పుంజుకుంటున్నట్లు స్పష్టమైంది. గుజరాత్లో గెలవటం మోదీ, అమిత్ షాలకు అత్యంత ప్రతిష్టాత్మకం. అందుకే కాంగ్రెస్ జోరు నేపథ్యంలో దేశానికి ‘గుజరాత్ మోడల్’ను పరిచయం చేసిన మోదీ ప్రచార వ్యూహాన్ని మార్చారు. అభివృద్ధి అంశాన్ని పక్కనపెట్టి ‘హిందుత్వ’ అస్త్రాన్ని అందుకున్నారు. 2012 ఎన్నికల్లో ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ నినాదంతో బీజేపీని విజయతీరాలకు చేర్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ‘గుజరాత్ మోడల్’ను చూపించే మోదీ ఢిల్లీ గద్దెనెక్కారు. అయితే.. ఇప్పుడు ప్రధాన మంత్రి హోదాలో సొంత రాష్ట్రంలో ‘అభివృద్ధి’కి బదులు ఔరంగజేబు, అయోధ్య అంశాలను ప్రచారంలో లేవనెత్తుతున్నారు. ‘హిందుత్వకు బీజేపీ వంటి అసలైన ప్రతినిధి ఉండగా.. రెండోదానితో పనేంట’ని ఇటీవలే జైట్లీ కూడా వ్యాఖ్యానించారు. అయితే హిందుత్వ చాంపియన్ బీజేపీయే అయినప్పటికీ నిరుద్యోగ సమస్య, రిజర్వేషన్లపై ఆందోళనలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయనేది వాస్తవం. -
బిహార్ బరిలో గెలిచేదెవరో?
బిహార్ వాసులు ఈసారి ఎటు మొగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్డీయేకు స్వల్ప అధిక్యం కట్టబెట్టేలా ఓటర్లు కనిపిస్తున్నారు. సర్వేలు చేసిన మీడియా సంస్థల్లో చాలావరకు ఇదే విషయం చెబుతున్నాయి. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే 122 స్థానాలు దక్కాలి. అయితే, ఇండియా టీవీ- సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఎన్డీయేకు 119, జేడీయూ నేతృత్వంలోని మహాకూటమికి 116 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. మరో 8 స్థానాలు మాత్రం ఇతరులకు దక్కుతాయన్నారు. అంటే, ఎన్డీయే కూడా అధికారానికి కొద్ది దూరంలో ఆగిపోతుందని అంచనా వేశారన్నమాట. ఇండియా టుడే- సిసెరో సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో, ఆ రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 125 స్థానాలను, జేడీ(యూ) నేతృత్వంలోని మహాకూటమి 106 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పారు. 2010లో ప్రస్తుత జేడీయూ కూటమికి 141 స్థానాలు రాగా, ప్రస్తుత బీజేపీ కూటమి 94తో సరిపెట్టుకుంది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న బిహార్ ఎన్నికల సమరంలో ఎవరు ఎక్కడుంటారనే విషయం అందరికీ ఆసక్తికరంగా మారింది. ప్రధాని నరేంద్రమోదీ ఏడాదిన్నర పాలనకు ఒకరకంగా ఇది ప్రోగ్రెస్ కార్డు అని కొందరు అంటుంటే, నితీష్ కుమార్ సారథ్యంలో బిహార్ రాష్ట్రం ఎంతవరకు ముందడుగు వేసిందో తెలిపే మార్కు అని మరికొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా టుడే- సిసెరో సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ప్రీపోల్ సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. బిహార్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఇప్పటికీ నితీష కుమారేనని అంటున్నారు. ఆయనకు గతంలో 29 శాతం ప్రజాదరణ ఉండగా ఇప్పుడది 38 శాతానికి పెరిగిందంటున్నారు. ఆయన తర్వాతి స్థానంలో మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ కుమార్ మోదీ నిలిచారు. ఆయనకు 22 శాతం ప్రజాదరణ ఉన్నట్లు తేలింది. లాలు ప్రజాదరణ మాత్రం 12 శాతం నుంచి 9 శాతానికి పడిపోయిందట. -
బీహార్ లో గెలుపు ఎవరిది?