సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సమయం సమీపిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థులందరూ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక, నేడు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరుగనుంది. మరోవైపు తెలంగాణ ఎన్నికలపై డెమోక్రసీ టైమ్స్ నెట్‌వర్క్ సర్వే సంస్థ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తెలంగాణలో 22 స్థానాలు కీలకం కానున్నట్టు సర్వేలో పేర్కొంది.
సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం..
బీఆర్‌ఎస్-45
కాంగ్రెస్-42
బీజేపీ-4,
ఎంఐఎం-6 స్థానాల్లో గెలుస్తుంది.
అలాగే, తెలంగాణలోని 22 అసెంబ్లీ స్థానాల్లో మాత్రం హోరాహోరీ పోటీ తప్పదని పేర్కొంది. ఆ 22 స్థానాల్లో ఎక్కువ స్థానాలు ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో, సర్వే ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో హంగ్ ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment