Sai Kumar Comments on 'BalaKrishna Speech About Narendra Modi' - Sakshi
Sakshi News home page

బాలయ్యకు సాయికుమార్‌ ఝలక్‌

Apr 24 2018 10:49 AM | Updated on Sep 5 2018 1:55 PM

Balakrishna Comments On PM Modi Not Correct, Says Sai Kumar - Sakshi

నందమూరి బాలకృష్ణ, సాయికుమార్‌ (జతచేసిన చిత్రం)

సాక్షి, అనంతపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని సినీ నటుడు, ‘డైలాగ్‌ కింగ్‌’ సాయికుమార్‌ అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. చంద్రబాబు ధర్మదీక్ష సందర్భంగా ప్రధాని మోదీపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన ఈవిధంగా స్పందించారు. మంగళవారం సాయికుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం ప్రధాని మోదీ కాళ్లు పట్టుకొని న్యాయం చేయమని అడుగుతానని చెప్పారు.

కర్ణాటక శాసనసభా ఎన్నికల్లో చిక్బళ్లాపూర్ జిల్లా బాగేపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సాయికుమార్‌ పోటీ చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారానికి హీరో బాలకృష్ణను పిలవడం లేదని ఆయన తెలిపారు. కాగా,  2008 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి సాయికుమార్‌ ఓటమిపాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement