'మళ్లీ ఎన్నికల బరిలోకి దిగుతా'
- తెలుగు, కన్నడ సినీ రంగంతో మంచి అనుబంధం
- 2018లో బాగేపల్లి నుంచి పోటీ చేస్తా
- 55వ జన్మదిన వేడుకల్లో డైలాగ్ కింగ్ సాయికుమార్
బెంగళూరు :కన్నడ,తెలుగు సినిమా ల్లో తనకంటు ఒక స్టార్ హోదాను సంపాదించుకున్న నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ బుధవారం 55వ వసంతంలోకి అడుగు పెట్టా రు. ఈ సందర్భంగా సాయిప్రకాశ్ దర్శకత్వంలో యదార్థగాథ ఆధారంగా రూపొందుతున్న కన్నడ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సాయికుమార్ అభిమానుల మధ్య జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.....40 సంవత్సరాలుగా తనకు తన కుటుంబానికి కన్నడ, తెలుగుసినిమా రంగాలతో మంచి అనుబంధం ఏర్పడిందని తెలిపారు.
సంచలన విజంయ సాధించిన పోలీస్ స్టోరీ చిత్రం తనకు దక్షిణ సినీరగంలో తిరుగు లేని ఖ్యాతీని తెచ్చిందని తెలిపారు. 1972లో రంగస్థల నడుటుగా ప్రవేశించిన తనకు 1973లో దేవుడు చేసిన పెళ్లి సినిమా నటుడుగా గుర్తింపు వచ్చిందని అన్నారు. దివంగత నందమూరి తారకరామరావు నటించిన సంసారం సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చేయడం మరిచిపోలేని అనుభూతి అని అన్నారు.
ఇప్పటి వరకు సుమారు వెయ్యి సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేశానన్నారు. గతంలో తాను బీజేపీ తరఫున కర్ణాటకలోని బాగేపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయానని, 2018లో జరిగే ఎన్నికల్లో మరోసారి బాగేపల్లి నుంచి బరిలో దిగనున్నట్లు సాయికుమార్ తెలిపారు.
ప్రస్తుతం కన్నడలో మడమక్కి, కిస్మత్ చిత్రల్లో నటిస్తున్నానని, 2018లో ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రజాసేవకే అంకితమవుతానని తెలిపారు. తెలుగులో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తనయుడు ఆదిని తెలుగులో అపూర్వవిజయం సాధించిన కార్తికేయ రీమేక్ చిత్రంతో కన్నడ సిని రంగానికి పరిచయం చేస్తున్నట్లు సాయికుమార్ తెలిపారు.