సాయికుమార్, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం అరి. ఈ మూవీని పూర్తి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారు. పేపర్ బాయ్ ఫేం జయశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి ఆదరణ లభించింది.
అయితే ఇటీవల టాలీవుడ్ మైథలాజికల్ చిత్రాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల రిలీజైన కల్కి 2898 ఏడీ సైతం అదే కాన్సెప్ట్‌తో వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కార్తికేయ-2, కాంతార, హనుమాన్, ఓ మై గాడ్, కల్కి సినిమాలు ఇదే తరహా కాన్సెప్ట్‌తో తెరెకెక్కించారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అత్యధి కలెక్షన్లు రాబట్టాయి. అరి కూడా ఈ బ్లాక్ బస్టర్ చిత్రాల సరసన నిలుస్తుందేమో వేచి చూడాల్సిందే.
అరిషడ్‌వర్గాస్ కాన్సెప్ట్..
అరి మూవీలో అరిషడ్వర్గాలు అనే కాన్సెప్ట్‌ను ప్రేక్షకులను పరిచయం చేయనున్నారు. మనిషి అంతర్గత శత్రువులుగా భావించే అరిషడ్వర్గాలైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలని శ్రీకృష్ణుడు ఎలా నియంత్రించాడు? వాటితో ఆయనకున్న సంబంధం ఎలాంటిదనే విషయాల్ని వర్తమాన అంశాలతో ముడిపెడుతూ సినిమాని తెరకెక్కించారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న తొలి చిత్రంగా అరి నిలవనుంది.
అయితే బాలీవుడ్‌లో అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో ఈ మూవీ రీమేక్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి ఇప్పటికే దర్శకుడితో మాట్లాడినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment