breaking news
Ari movie
-
రెండో వారంలోకి అడుగుపెట్టిన ‘అరి’.. థియేటర్ లో దర్శకుడు !
‘పేపర్‌బాయ్’ ఫేం జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘అరి’. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 10న ఈ చిత్రం ఏసియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజైన సంగతి తెలిసిందే. రెండు వారాలుగా థియేటర్స్‌లో రన్ అవుతూనే ఉంది. దీపావళి సందర్భంగా నాలుగు కొత్త చిత్రాలు (మిత్ర మండలి, డ్యూడ్, తెలుసు కదా, కె ర్యాంప్) బరిలోకి దిగాయి. అయినా కూడా అరి ఈ రెండో వారంలో కొనసాగుతోంది. పదో రోజు కూడా అరికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని దర్శకుడు జయ శంకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పదో రోజు సినిమాని వీక్షిస్తున్నట్టు జయ శంకర్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.అరి కంటెంట్ బేస్డ్ మూవీ కావడంతో రెండో వారం కూడా కొనసాగించాలని మేకర్లు ఫిక్స్ అయ్యారు. అసలు ఈ మూవీ కోసం ఆర్టిస్టులంతా కలిసి ముందుకు వచ్చి ప్రమోట్ చేస్తే నెక్ట్స్ లెవెల్లో ఉండేది. ఆడియెన్స్‌లోకి మరింత ఎక్కువగా వెళ్లే అవకాశం ఉండేది. మరి ఈ రెండో వారంలోనూ అరిని మేకర్లు ప్రమోట్ చేసి ఆడియెన్స్‌లోకి మరింతగా వెళ్తారా? లేదా? అన్నది చూడాలి. View this post on Instagram A post shared by Jayashankarr (@jayashankarr_) -
‘అరి’ కథతో పుస్తకం తీసుకొస్తున్నాం : దర్శకుడు జయశంకర్
వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అరి’. ‘పేపర్ బాయ్’ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ని సంపాదించుకుంది. అరి షడ్వర్గాలను కాన్సెప్ట్‌గా తీసుకుని, ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని ఈ పాయింట్‌ని ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు శంకర్.చివర్లో కృష్ణుడి ఎంట్రీ, అరి షడ్వర్గాల గురించి ఆయన ఇచ్చే సందేశం అందరినీ ఆకట్టుకుంది. మంచి సందేశాత్మకంగా చిత్రంగా అరిని మలిచారంటూ ఆడియెన్స్ దర్శకుడి మీద ప్రశంసల్ని కురిపించారు. ఇక మీడియా, సోషల్ మీడియా, క్రిటిక్స్ ఇలా అందరూ కూడా చివరి 20 నిమిషాల గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ అరిపై పాజిటివ్ కామెంట్లే కనిపిస్తున్నాయి. అలా డివైన్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ అరి చిత్రం ఆడియెన్స్ గుండెల్లోకి వెళ్లిపోయింది. అరి షడ్వర్గాలను ప్రధాన అంశంగా తీసుకుని, ఆరు పాత్రలతో దర్శకుడు సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది.తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్లో దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ - "అరి" సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, మంచి రివ్యూస్, రేటింగ్స్ ఇచ్చిన మీడియా వారికి థ్యాంక్స్. మూవీకి స్లోగా ఓపెనింగ్స్ వచ్చి పికప్ అవుతుందని ముందే అనుకున్నాం. అయితే రెండో రోజునే శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూ వల్ల మా సినిమా పోస్టర్స్ ను థియేటర్స్ దగ్గర చించివేయడం చూసి బాధగా అనిపించింది. ఎంతో కష్టపడి చేసిన సినిమాకు ఇలా జరుగుతుందేంటని ఇబ్బందిపడ్డాం. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. థర్డ్ డే నుంచి అరి సినిమా థియేటర్స్ లో ప్రేక్షకుల సందడి కనిపించింది. అరిషడ్వర్గాల గురించి ఎంతోమంది గొప్పవాళ్లు చెబుతూ వచ్చారు గానీ వాటికి పరిష్కారం చూపించలేదు. ఈ ఆలోచనతోనే అరి చిత్రాన్ని రూపొందించాను. నేను చూసిన సినిమాలు కొన్ని ఇలాంటి కాన్సెప్ట్ తో చిత్రాన్ని చేసేందుకు స్ఫూర్తినిచ్చాయి. ఈ సినిమా కథతో త్వరలోనే పుస్తకాన్ని తీసుకొస్తున్నాం. మా సినిమా ఇప్పుడే ఓటీటీలోకి రావడం లేదు. థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యాక ఓటీటీ డేట్ అనౌన్స్ చేస్తాం’అన్నారు. -
చికాగోలో అభిమానులతో కలిసి కేక్ కట్ చేసిన అరి మూవీ టీం
అరిషడ్వర్గాలు అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ అరి. అరిషడ్వర్గాలులోని మొదటి రెండు పదాలైన అరి అనే టైటిల్‌తో వచ్చిన ఈ సినిమాకు మై నేమ్ ఈజ్ నోబడీ అనేది క్యాప్షన్. ఈ మూవీ అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ని సంపాదించుకుంది. ఎవరూ టచ్ చేయని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో దర్శకుడు జయశంకర్ ఈ మూవీని తెరకెక్కించారు. అర్ వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి ఈ మూవీని నిర్మించారు. వినోద్ వర్మ, సూర్య, అనసూయ,సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఇటీవల వచ్చిన సినిమాల్లో అరి కాస్త ముందు వరుసలో ఉందని చెప్పుకోవచ్చు.ఇక ఈ మూవీ రిలీజ్ సందర్భంగా చికాగోలోని సినీ లాంజ్ లో మూవీ టీం సందడి చేసింది. మూవీ ప్రొడ్యూసర్ ఆర్ వీ రెడ్డి తో పాటు చికాగోలోని పలువురు ప్రముఖులు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం టీం మెంబర్స్ అంతా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ‘అరి’ సక్సెస్ సాధించడంతో పలువురు అభినందనలు తెలిపారు. దర్శకుడు ఏడేళ్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కిందని కొనియాడారు. మనిషిలోని అంతర్గత శత్రువులను ఎలా ఎదుర్కోవాలో చెప్పే ప్రయత్నంగా అరి మూవీని తెరకెక్కించారని వివరించారు. ఇంత గొప్ప సినిమాను తెరకెక్కించిన మూవీ టీమ్ ను పలువురు ప్రశంసించారు. అరికి మంచి ప్రశంసలు లభించడం, ఆదరణ దక్కుతుండటంతో మూవీ టీంలో కొత్త ఉత్తేజం వచ్చినట్టుగా కనిపిస్తోంది.(చదవండి: Karwa Chauth: భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..) -
‘అరి’పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశంసలు
జయశంకర్ తెరకెక్కించిన ‘అరి’ చిత్రం నిన్న(అక్టోబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ వారం వచ్చిన చిత్రాలన్నింట్లోనూ అరి కాస్త ముందు వరుసలో ఉందని చెప్పుకోవచ్చు. అరికి మంచి ప్రశంసలు లభించడం, ఆదరణ దక్కుతుండటంతో టీంలో కొత్త ఉత్తేజం వచ్చినట్టుగా కనిపిస్తోంది.ఇక ‘అరి’ సక్సెస్ సాధించడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం దర్శకుడు జయశంకర్‌ను అభినందించారు. ఏడేళ్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కిందని కొనియాడారు. అరి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఈ చిత్రంలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. అర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించారు. -
అనసూయ ‘అరి’ మూవీ రివ్యూ
టైటిల్: అరినటీనటులు : వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి తదితరులునిర్మాతలు : శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డిరచన –దర్శకత్వం : జయశంకర్సంగీతం: అనుప్ రూబెన్స్సినిమాటోగ్రఫీ : కృష్ణ ప్రసాద్, శివశంకర వరప్రసాద్ఎడిటర్ : జి. అవినాష్విడుదల తేది: అక్టోబర్ 10, 2025'పేపర్ బాయ్' ఫేమ్ జయశంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అరి’. ఇంతవరకు తెరపై చూపించని కాన్సెప్ట్‌తో వస్తున్నామని దర్శకుడు పదే పదే చెప్పడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఇదొక డిఫరెంట్ మూవీ అని తెలియజేసింది. ఏదో కొత్త పాయింట్ చూపించబోతున్నారనే విషయం ట్రైలర్‌తోనే తెలిసిపోయింది. దీంతో అరిపై ఓ మోస్తరు అంచనాలు అయితే పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘అరి’ అందుకుందా? జయశంకర్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..'ఇక్కడ మీ కోరికలు తీర్చబడును' అని సోషల్ మీడియా, పేపర్, ఫోర్బ్స్ వంటి మ్యాగజైన్లలో యాడ్ ఇస్తాడు ఓ వ్యక్తి(వినోద్ వర్మ). అది చూసి ఆరుగురు వ్యక్తులు ఆయన దగ్గరకు వస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో కోరిక. హోటల్లో టీ మాస్టర్‌గా పని చేసే అమూల్ కుమార్(వైవా హర్ష)కు సన్నీ లియోన్ అంటే మోజు. ఆమెతో ఒక్క రాత్రి అయినా గడపాలని అతని కోరిక.60 ఏళ్లకు పైబడిన గుంజన్‌కు ఆస్తి పిచ్చి. ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆస్తి అంతా తనకే దక్కాలనే ఆశసీఐ చైతన్య (శ్రీకాంత్ అయ్యంగార్) నిధి అన్వేషణలో ఉంటాడు. ఆ నిధి ఎక్కడ ఉందో తెలుసుకొని..మొత్తం తీసుకెళ్లాలనేది అతని కోరికఎయిర్ హోస్టర్ ఆత్రేయి(అనసూయ) తన సహోద్యోగి అవ్య అంటే అసూయ. తన కంటే అందంగా మారాలని.. ఆ అందం ఎప్పటికీ ఉండాలనేది ఆమె కోరికమరణించిన తన భర్తను తిరిగి బ్రతికించుకోవాలనేది లక్ష్మీ(సురభి ప్రభావతి) ఆశతన వారసులు ఎప్పటికీ ధనవంతులుగానే ఉండాలనేది వ్యాపారవేత్త విప్రనారాయణ పాశ్వాన్(సాయి కుమార్) కోరికఈ ఆరుగురు విడివిడిగా వచ్చి యాడ్ ఇచ్చిన వ్యక్తిని కలుస్తారు. లైబ్రరీలో ఉండే సదరు వ్యక్తి వీరందరికి ఒక్కో టాస్క్ ఇస్తాడు. అది పూర్తి చేస్తేనే మీ కోరికలు తీర్చుతా అని హామీ ఇస్తాడు. ఆయన ఇచ్చిన టాస్కులు ఎంటి? వాటిని ఈ ఆరుగురు పూర్తి చేశారా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు..ప్రస్తుతం వీటి చుట్టూనే మనిషి జీవితం తిరుగుతుంది. ఈ ఆరు బలహీనతలతో ఏదో ఒకటి ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అవి ఎలా ఉంటాయి? వాటిని తీర్చుకోవడం కోసం మనిషి ఎంతకు తెగిస్తాడు? అనేది ఈజీగా అర్థమయ్యేలా చూపించిన చిత్రం ‘అరి’. అరిషడ్వార్గాల గురించి పురాణాల్లో వింటాం. అయితే మనిషిలో అవి ఎలా ఉంటాయని అనేది ఆరు పాత్రల్లో ఆసక్తికరంగా చూపించడమే కాకుండా ‘మనిషి ఎలా ఆలోచించాలి, ఎలా జీవించాలి’ అనే సందేశాన్ని అందించాడు. డైరెక్టర్ రాసుకున్న కథకు వంక పెట్టడానికి ఏమి లేదు. డిఫరెంట్ స్టోరీనే..ఇంకా చెప్పాలంటే ఆయన అన్నట్లుగా ఇంతవరకు తెరపై చూపించని కాన్సెప్టే. కానీ ఎగ్జిక్యూషన్ పరంగా కాస్త తడబడ్డారు. శ్రీనివాస రెడ్డి, 'చమ్మక్' చంద్ర పాత్రలతో కామెడీగా కథను ప్రారంభించిన దర్శకుడు.. కీలకమైన ఆరు క్యారెక్టర్లను ఆసక్తికరంగా పరిచయం చేసి వెంటనే అసలు కథలోకి తీసుకెళ్లాడు. ఒక్కో పాత్ర నేపథ్యాన్ని వివరిస్తూ.. కథనంపై ఆసక్తిని పెంచేశాడు. పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఒక్కొక్కరి కోరికతో పాటు వారు పూర్తి చేయాల్సిన టాస్క్ తెలిసిన తర్వాత కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. వారు ఈ టాస్కులను పూర్తి చేస్తారా? అసలు వారికి అలాంటి టాస్కులు ఎందుకు ఇస్తున్నాడు? అనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే సీరియస్‌గా సాగుతున్న కథకి మధ్యలో వచ్చిన పాట, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్రల కామెడీ అడ్డంకిగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. సెకండాఫ్ కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. ఆరు పాత్రల్లో వచ్చే భావోద్వేగ మార్పు అందరికి అలోచింపజేస్తుంది. చివరి 30 నిమిషాలు ఈ సినిమాకు కీలకం. ఆరు పాత్రలకు ఉన్న సంబంధాన్ని ముడిపెడుతూ వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్‌లో మైథలాజికల్ టచ్ ఇవ్వడం సినిమాకు హైలెట్. దర్శకుడు తాను చెప్పదలుచుకున్న సందేశాన్ని క్లైమాక్స్‌లో గొప్పగా ఆవిష్కరించారు. ఎవరెలా చేశారంటే..అరిషడ్వర్గాలకి ప్రతీకగా ఈ చిత్రంలో ఆరు పాత్రలు ఉంటాయి. వ్యాపారవేత్త విప్రనారాయణ పాశ్వాన్ పాత్రకి సాయి కుమార్ న్యాయం చేశాడు. ఎయిర్ హోస్ట్ ఆత్రేయిగా అనసూయ ఉన్నంతలో చక్కగా నటించింది. కోపం ఎక్కువగా చూపించే సీఐ చైతన్య పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ ఒదిగిపోయాడు. అమూల్ కుమార్‌గా హర్ష కామెడీ సినిమాకు ప్లస్ అయింది .వినోద్ వర్మ పోషించిన పాత్ర ఈ సినిమాకు చాలా కీలకం. చివరిలో ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. లక్ష్మిగా సురభి ప్రభావతి, దొంగ పాత్రలో సూర్య, గుంజన్ పాత్రలో శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.అనూప్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలను ప్రాణం పోశాడు. పాటలు బాగున్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడి నేపథ్యంలో వచ్చే పాట తెరపై మరింత ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
సినిమా పరిశ్రమను కాపాడుకోవాలి : మంత్రి జి.వివేక్
‘‘సినిమా వ్యాపారం అంటేనే రిస్క్. ‘అరి’ చిత్రంతో అలాంటి రిస్క్ చేశారు నిర్మాతలు. వారికి ఈ సినిమా మంచి విజయం అందివ్వాలి. తగినన్ని ప్రోత్సాహకాలు ఇస్తూ, సినిమా పరిశ్రమను కాపాడుకోవడంతో పాటు అభివృద్ధి చెందేలా చూసుకోవాలి. అప్పుడే స్థానికంగా ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలు వస్తాయి’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి జి. వివేక్ తెలిపారు. వినోద్ వర్మ, అనసూయ, సాయికుమార్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘అరి’. జయశంకర్ దర్శకత్వం వహించారు. రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి. శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏషియన్–సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నేడు రిలీజ్ అవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘అరి’లాంటి మంచి చిత్రాలను ప్రోత్సహిస్తే ఈ కోవలో మరిన్ని సినిమాలు వస్తాయి’’ అని చెప్పారు. ‘‘మంచి సందేశం ఇచ్చేలా రూపొందిన ‘అరి’ విజయం సాధించాలి’’ అని ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఆకాంక్షించారు. ‘‘మంచి కథతో ఈ చిత్రాన్ని రూ΄÷ందించారు జయశంకర్’’ అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ‘‘అరిషడ్వర్గాల నేపథ్యంలో తీసిన ‘అరి’కి మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం’’ అని తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శ్రీనివాస్ రామిరెడ్డి తెలి΄ారు. ‘‘నా 50 ఏళ్ల నట జీవితంలో ‘అరి’ లాంటి చిత్రంలో నటించినందుకు గర్వపడుతున్నాను’’ అని నటుడు సాయికుమార్ చె΄్పారు. ఈ వేడుకలో దర్శకుడు జయశంకర్, త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి, తెలంగాణ స్టేట్ ΄్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి తదితరులు మాట్లాడారు. -
‘అరి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఉద్యోగం వదిలేశా..‘అరి’ కోసం హిమాలయాలకు వెళ్లా : డైరెక్టర్ జయశంకర్
‘నాకు చిన్నప్పటి నుంచి పురాణాలు, ఇతిహాసాలు అంటే ఆసక్తి. వాటి గురించి తెలుసుకుని, అవగాహన పెంచుకున్నాను. మన పురణాల్లో అరిషడ్వర్గాలను జయించాలి అని చెప్పారే తప్ప ఎక్కడా వాటిని ఎలా జయించాలో చెప్పలేదు. 2016లో ఈ స్టోరీ ఐడియా వచ్చింది. హిమాలయాలకు వెళ్లి కొందరు యోగులను కలిసి అరిషడ్వర్గాల గురించి సినిమా చేయాలనే ఆలోచనను తెలిపాను. వారు మంచి ప్రయత్నమని చెప్పి అనేక విషయాలు వెల్లడించారు. అరిషడ్వర్గాలను జయించేందుకు వారి ద్వారా మార్గాలు, సూచనలు తెలుసుకున్నాను. వాటి ఆధారంగానే ‘అరి’ చిత్రాన్ని రూపొందించాను’ అన్నారు దర్శకుడు జయ శంకర్. ‘పేపర్ బాయ్’లాంటి సూపర్ హిట్ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘అరి’. . వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు జయశంకర్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ సినిమాల మీద ప్యాషన్ తో మంచి ఉద్యోగం వదులుకుని ఇండస్ట్రీకి వచ్చాను. 2014లో టాలీవుడ్ లో అడుగుపెట్టి నాలుగేళ్లకు 2018లో పేపర్ బాయ్ మూవీతో దర్శకుడిని అయ్యాను. తక్కువ టైమ్ లోనే దర్శకుడివి అయ్యావు అన్నారు. నా మొదటి సినిమా తర్వాత పెద్ద సంస్థల నుంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే కోవిడ్, ఇతర పరిస్థితుల వల్ల ఆ ప్రాజెక్ట్స్ మొటీరియలైజ్ కాలేదు. అప్పుడు బయటకు వచ్చి 2021లో అరి మూవీకి వర్క్ చేయడం ప్రారంభించాను.→ ‘అరి’ లాంటి మూవీని స్టార్స్ కూడా చేయొచ్చు. అయితే పాత్రల కంటే వారి స్టార్ డమ్ రిఫ్లెక్ట్ అవుతుందని పాత్రలకు సరిపోయేలా సాయి కుమార్, అనసూయ, వైవా హర్ష ..ఇలాంటి వారిని తీసుకున్నాను. ఆరు ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటుల పర్ ఫార్మెన్స్ హైలైట్ గా నిలుస్తుంది. ఈ పాత్రలన్నీ మీకు బాగా గుర్తుండిపోతాయి. ఇలాంటి కథల్ని పూర్తిగా సందేశాత్మకంగా కాకుండా ఎంటర్ టైనింగ్ గా చెప్పాలి. ఆ ప్రయత్నంలో సఫలమయ్యాననే అనుకుంటున్నా. వైవా హర్ష కామెడీ బాగా నవ్విస్తుంది.→ నాకు ఉపేంద్ర గారి మూవీస్ బాగా ఇష్టం. ఆయన సినిమాలు కమర్షియల్ గా ఉంటూనే ఒక మెసేజ్ ఉంటుంది. ఉపేంద్ర మూవీ చూసినప్పుడు అలా ఒక సినిమా తెరకెక్కించాలనే ఆలోచన కలిగింది. ‘అరి’ కథ చెప్పినప్పుడు మా మూవీలో నటించిన ఆర్టిస్టులంతా హ్యాపీగా ఫీలయ్యారు. ఇలాంటి సబ్జెక్ట్ తో మూవీ రాలేదని అన్నారు.→ మా ‘అరి’ మూవీలో వీఎఫ్ఎక్స్ ఆకర్షణగా నిలుస్తాయి. మాకున్న బడ్జెట్ లో క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు చేశాం. అలాగే ఏఐ టెక్నాలజీని కూడా ఉపయోగించాం. సినిమాలో రెండు సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మనిషి కోరికలన్నీ ఒకదానితో మరొకటి ముడిపడే ఉంటాయి. మనం కోరుకున్నది దక్కినప్పుడు అహం ఏర్పడుతుంది, అదే పక్కవారికి దక్కితే అసూయ కలుగుతుంది.→ అరిషడ్వర్గాలు అనే సబ్జెక్ట్ సాధారణ ప్రేక్షకులకు కూడా సులువుగా అర్థమయ్యే విధంగా ‘అరి’ సినిమాను రూపొందించాను. ఈ కారణం వల్లే చిత్రీకరణ ఆలస్యమైంది. వీలైనంత సింపుల్ గా ఈ సబ్జెక్ట్ ను తెరకెక్కించాం. సెన్సార్ వాళ్లు సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. హార్ట్ టచింగ్ గా మూవీ రూపొందించారని ప్రశంసించారు. మా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నా. ఎందుకంటే మంచి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు.→ వెంకయ్య నాయుడు, మల్లాది, యండమూరి లాంటి వాళ్లు మా సినిమాను చూసి అభినందించారు. వెంకయ్య నాయుడు ‘అరి’ సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉంది అన్నారు. పురణాలు, ఇతిహాసాలు చదవని యువత ఈ సినిమా చూస్తే వాటిలోని సారం తెలుస్తుంది అన్నారు. ఆయన మాటల్ని గొప్ప ప్రశంసగా తీసుకున్నాం.→ ఈ మూవీ యూత్ ఆడియెన్స్ కు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు మా మూవీ ఏం జరుగుతుంది నెక్ట్స్ అనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. తమకు కావాల్సినది దక్కించుకునేందుకు కొందరు వ్యక్తులు ఏం చేశారు అనేది ఈ చిత్ర నేపథ్యం. ఈ మూవీని హిందీలో ఒక పెద్ద హీరో, కన్నడలో ఒక స్టార్ చూశారు. వారికి బాగా నచ్చింది. అన్నీ కుదిరితే వారితో ఆయా భాషల్లో ‘అరి’ రీమేక్ చేస్తా.→ మన దేశంలో పబ్బులకు వెళ్లేవాళ్లు ఎంతమంది ఉన్నారో, గుడికి వెళ్లేవారు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నారు. అలా స్పిరిచువల్ ఆలోచనలు ఉన్నవారు మా సినిమాను చూసినా చాలు అనుకుంటున్నాం.→ త్వరలోనే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో ఓ సినిమా చేయబోతున్నా. డిసెంబర్ నుంచి ఆ మూవీ షూటింగ్ కు వెళ్తున్నాం. -
'ఇక్కడ అందరి కోరికలు తీర్చబడును'.. అనసూయ లేటేస్ట్ మూవీ ట్రైలర్
అనసూయ ( Anasuya Bharadwaj), సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం అరి. మై నేమ్ ఈజ్ నోబడి అనే ఉపశీర్షిక. ఈ మూవీకి జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మనిషిలోని ఎమోషన్స్ ఆధారంగా ఈ సినిమాకు రూపొందించినట్లు తెలుస్తోంది. ఇచ్చట అందరి కోరికలు తీర్చబడును అనే క్యాప్షన్ ఈ మూవీపై ఆసక్తి పెంచుతోంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే కథ అంతా ఓ లైబ్రరీ చుట్టే తిరుగనుందని అనిపిస్తోంది. ట్రైలర్లో సన్నివేశాలు, డైలాగ్స్ అన్నీ కామం అనే పదం చుట్టే హైలెట్ కావడంతో ఆ కోణంలోనే కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, సురభి ప్రభావతి, వినోద్ వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘అరి’ కోసం ఏడేళ్లు.. కారణం ఇదేనట!
'పేపర్ బాయ్' తర్వాత దర్శకుడు జయశంకర్ నుంచి ఎలాంటి చిత్రం రాలేదు. వరుస అవకాశాలు వచ్చినా.. సరైన కాన్సెప్ట్‌తో ఎదురుచూసి మళ్లీ ఇప్పుడు ‘అరి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం కోసం జయశంకర్ ఏడేళ్ల కష్టపడ్డారు. ఇంత సమయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే.. ఇంతవరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌ని ఇందులో చూపించారట. కాన్సెప్ట్ కోసమే ఎక్కువ సమయం తీసుకున్నారట.'పేపర్ బాయ్' అందించిన గొప్ప విజయం తర్వాత, జయశంకర్ తదుపరి చిత్రం కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల మదిలో నిలిచిపోవాలని బలంగా కోరుకున్నారు. అందుకే, ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ మీద ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో రావాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రయత్నంలోనే, మనిషిలోని ఆరు అంతర్గత శత్రువులైన అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు.'అరి' అనే పదానికి 'శత్రువు' అనే అర్థంతో పాటు, అరిషడ్వర్గాల్లోని మొదటి రెండు అక్షరాలను తీసుకుని ఈ చిత్రానికి పేరు పెట్టారు. ఈ వినూత్నమైన కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు అందించేందుకు ఆయన విస్తృతమైన పరిశోధన చేశారట. మైథలాజికల్ టచ్ ఇచ్చేందుకు పురాణేతిహాసాలను, గ్రంథాలను అధ్యయనం చేశానని జయశంకర్ చెప్పారు. రమణ మహర్షి ఆశ్రమం సహా పలు ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లి గురూజీలను కలిసి, వారి కోసం వేచి చూసి ఎన్నో విలువైన విషయాలను సేకరించారట. కొంతకాలం ఆశ్రమంలో గడిపి, ఆధ్యాత్మిక కోణంలో ఈ అంశంపై లోతైన పరిశోధన చేశానని జయశంకర్ అన్నారు.విడుదలకు ముందే, 'అరి' చిత్రం పలు అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శితమై, ఏకంగా 25 అవార్డులను గెలుచుకుంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి ప్రముఖ రాజకీయ, సినీ, పీఠాధిపతులు ఈ చిత్రాన్ని వీక్షించి ప్రత్యేకంగా అభినందించారు. అక్టోబర్ 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. రిలీజ్ తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. -
అనసూయ 'అరి' మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం అరి. 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. "పేపర్ బాయ్" చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి.శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మిస్తున్నారు.అరి రిలీజ్ ఎప్పుడంటే?లింగ గుబపనేని కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. విజయదశమి సందర్భంగా ‘అరి’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఒక మంచి మెసేజ్‌తో ‘అరి’ సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది.చదవండి: కొత్త ప్రయాణం అంటూ ఫోటో షేర్ చేసిన సమంత -
టాలీవుడ్ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సినిమా!
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ త్వరలోనే తెలుగు తెరపై సందడి చేయనుందా? అంటే అవుననే అంటోంది టాలీవుడ్. రేస్, రైడ్, వెల్కమ్, హౌస్‌ఫుల్, ఫతే వంటి చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆలరించిన జాక్వెలిన్‌ని ‘పేపర్ బాయ్’ ఫేం జయశంకర్ టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నాడు. ఆయన దర్శకత్వం వహించే ఓ ఉమెన్ సెంట్రిక్ మూవీలో జాక్వెలిన్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం.జయశంకర్ ఆల్రెడీ జాక్వెలిన్‌కు యాక్షన్, సస్పెన్స్‌తో నిండిన ఒక ఇంటెన్స్ స్క్రిప్ట్‌ను వివరించారట. జాక్వెలిన్‌కు జయశంకర్ చెప్పిన పాత్ర, కథ చాలా నచ్చినట్టుగా తెలుస్తోంది. స్క్రిప్ట్ కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉన్నందున జాక్వెలిన్ కూడా పాత్రను పోషించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో జాక్వెలిన్ సైతం ఈ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇచ్చినట్టుగా సమాచారం.ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుందని, జాక్వెలిన్ ఇది వరకు ఎప్పుడూ చూడని పాత్రలో చూడబోతోన్నట్టుగా తెలుస్తోంది. స్క్రిప్ట్‌లో వీఎఫ్ఎక్స్కు సంబంధించిన వర్క్ కూడా చాలా ఉందని సమాచారం. ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా థ్రిల్లింగ్ వీఎఫ్ఎక్స్ అంశాలతో చిత్రం రూపొందనుందట. జాక్వెలిన్ పాన్ ఇండియా నటి కావడంతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ భాషల్లో నిర్మించనున్నారట. దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్టుగా సమాచారం. -
అనసూయ మైథలాజికల్ థ్రిల్లర్ ‘అరి’ వచ్చేస్తోంది
పేపర్ బాయ్’ఫేం జయశంకర్ తాజాగా తెరకెక్కించిన మైథలాజికల్ థ్రిల్లర్ ‘అరి’ ఎట్టకేలకు థియేటర్స్‌లోకి వచ్చేస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం గతేడాదిలోనే విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల పలు మార్లు విడుదల వాయిదా పడుతూ..ఇప్పుడు మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మేరకు మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ చిత్రంలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. అర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇటీవల విడుదలైన థీమ్ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది.ఇంత వరకు ఎవరు టచ్ చేయని అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు జయశంకర్. కృష్ణ తత్వాన్ని కొత్తగా చూపించామని, కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉందని అన్నారు. -
బీజేపీ సపోర్ట్.. అయినా నో రిలీజ్.. ‘అరి’కష్టాలు
సినిమా పరిశ్రమ అనేది ఒక వింతైన ప్రపంచం. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని సినిమాలు ఇలా షూటింగ్‌ని ప్రారంభించి..అలా థియేటర్స్‌లోకి వచ్చేస్తాయి. మరికొన్ని చిత్రాలు మాత్రం ఏళ్ల తరబడి ల్యాబ్‌కే పరిమితం అవుతుంటాయి. అయితే వీటిల్లో కొన్ని చిత్రాలు సరైన కంటెంట్ లేక ఆగిపోతే..మరికొన్ని మాత్రం డిఫరెంట్ కంటెంట్, ఎవరూ టచ్ చేయలేని, ట్రెండింగ్ పాయింట్ ఉన్నప్పటికీ విడుదలకు నోచుకోవు. ఈ కోవలోకి చెందిన చిత్రమే ‘అరి’ (Ari Movie). ‘పేపర్ బాయ్’తో సూపర్ హిట్ అందుకున్న జయశంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయి దాదాపు రెండేళ్లు కావోస్తోంది. వాస్తవానికి ఈ సినిమా కంటే ముందు గీతా ఆర్ట్స్‌లో జయశంకర్ ఓ సినిమా చేయాల్సింది. స్క్రిప్ట్‌తో పాటు ప్రీప్రొడక్షన్ పనులు కూడా షూరు అయ్యాయి. కానీ లాక్డౌన్ కారణంగా ఆ సినిమా ముందుకు వెళ్లలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని కొత్త నిర్మాతలతో కలిసి ‘అరి’ సినిమాను తెరకెక్కించాడు. ఇంతవరకు ఎవరు టచ్ చేయని అరిషడ్వర్గాలపై స్టోరీ రాసుకున్నాడు. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి అగ్ర తారాగణంతో సినిమాను రిచ్‌గా తెరకెక్కించాడు.గతేడాదిలోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. టీజర్, ట్రైలర్‌తో పాటు మంగ్లీ ఆలపించిన కృష్ణుడి సాంగ్‌ని కూడా రిలీజ్ చేశారు. ప్రచార చిత్రాలన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంతి కిషన్‌రెడ్డి సైతం ఈ సినిమాకు సపోర్ట్‌గా నిలిచారు.వెంకయ్య నాయుడు,‘ఇస్కాన్’ ప్రముఖులు, చిన్న జీయర్ స్వామితో పాటు పలు హిందు సంఘాలు ఈ సినిమా చూసి చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ఇదంతా ఏడాది క్రితం జరిగిన విషయం. అదే సమయంలో సినిమా రిలీజ్ చేసి ఉంటే.. సినిమాకు వచ్చిన బజ్ ఎంతో కొంత ఉపయోగపడేది. కారణం ఏంటో కానీ అప్పుడు సినిమా రిలీజ్ కాలేదు.ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌ని మళ్లీ స్టార్ట్ చేశారు. నిన్న ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో ఈ సినిమా థీమ్ సాంగ్‌ని రిలీజ్ చేయించారు. 'భగ భగ..' అంటూ సాగే ఈ పాటకు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సారి కూడా రిలీజ్ డేట్‌ని ప్రకటించలేదు మేకర్స్. ప్రచార చిత్రాలకు మంచి స్పందన రావడంతో పాటు బీజేపీ అగ్రనాయకుల సపోర్ట్ ఉన్నప్పటికీ సినిమా ఎందుకు విడుదల కావడంలేదో తెలియదు. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను త్వరగా రిలీజ్ చేసుకుంటేనే మంచిది. ఆలస్యం అయ్యేకొద్ది కంటెంట్ పాతదై రొటీన్ చిత్రంగా మారే అవకాశం ఉంటుంది. కొత్త నిర్మాతలకు ఈ విషయం తెలియాదా? లేదా తెలిసినా విడుదల విషయాన్ని లైట్ తీసుకుంటున్నారా? ఏదేమైనా ఆలస్యం అమృతం విషం. -
మారిపోయిన మనిషిని గుర్తు చేసేలా ‘అరి’ థీమ్ సాంగ్
‘పేపర్ బాయ్’ఫేం జయశంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక.వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు మేకర్స్.ఇప్పటికే ఈ చిత్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలకు చూపించగా..వారంతా చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ఈ తరం తప్పకుండా చూడాల్సిన సినిమా అని సూచించారు. ఇక తాజాగా ఈ చిత్రం థీమ్ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్.‘మషినేనా నువ్వు..ఏమై పోతున్నావ్.. మృగమల్లే జారీ..దిగజారిపోయావ్’ అంటూ సాగే ఈ పాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. షణ్ముఖ ప్రియ అద్భుతంగా ఆలపించింది. ఇక అనూప్ రూబెన్స్ తనదైన సంగీతంతో పాటను మరోస్థాయికి తీసుకెళ్లాడు. సినిమాలోని కీలక పాత్రలన్నింటిని పరిచయం చేస్తూ.. అసలు ఈ సినిమా కథేంటి? ఎం సందేశం ఇవ్వబోతుందనే విషయాలను తెలియజేలా థీమ్ సాంగ్ ఉంది. ఈ చిత్రంలో కృష్ణ తత్వాన్ని కొత్తగా చూపించామని చిత్రబృందం పేర్కొంది. -
వెరైటీ ప్రమోషన్స్.. రిలీజ్‌కి ముందే అనసూయ సినిమా చూడొచ్చు!
విభిన్నం గా సినిమా తీయడమే కాదు.. అంత కంటే విభిన్నం గా సినిమాని ప్రమోట్ చేస్తేనే ఈ రోజుల్లో ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించగలరు.ఇప్పుడు అరి మూవీ(Ari) టీం కూడా ఇలానే డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. రిలీజ్‌కి ముందే సినిమాను చూపిస్తాం అని ఒక పోస్ట్ రిలీజ్ చేసింది. పేపర్ బాయ్ ఫేం జయ శంకర్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌లో సాయికుమార్, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవా కీలక పాత్రల్లో నటించారు. గతేడాదిలోనే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇప్పటికే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలు ఈ మూవీని వీక్షించి ప్రశంసలు కురిపించారు.అరిషడ్వర్గాల మీద తీసిన ఈ చిత్రం ఇప్పటి తరానికి చాలా ముఖ్యమని, సినిమా అద్భుతంగా ఉందని స్పెషల్ షోని చూసిన వారంతా పొగిడేస్తున్నారు. ఇక అరి మూవీని ప్రస్తుతం వీక్షించేందుకు కొంత మందికి అవకాశాన్ని కల్పిస్తోంది చిత్రయూనిట్.మైథలాజికల్ థ్రిల్లర్ జానర్లను ఇష్ట పడే ఆడియెన్స్‌కు ఈ చిత్రం మరింతగా నచ్చేలా ఉంటుంది. సినీ లవర్స్ అంతా కూడా ముందుగానే అరి మూవీని చూసే అవకాశాన్ని చిత్రయూనిట్ కల్పిస్తోంది. ఇలా విడుదలకు ముందే సినిమాను చూపించే ధైర్యాన్ని ఎవ్వరూ చేయరు. కానీ అరి మీదున్న నమ్మకం దర్శకుడు జయశంకర్ ఇలా ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. విడుదలకు ముందే సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించాలనుకునే వారు వివరాల్ని తెలియజేయండి అంటూ వాట్సప్ నంబర్‌ను కూడా డైరెక్టర్ జోడించారు. పర్ బాయ్ తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ జయశంకర్ అరి మూవీతో త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాడు. జయ శంకర్ మూడో ప్రాజెక్ట్ కూడా కన్ఫామ్ అయింది. ఇంటెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్గా నటిచంనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు. View this post on Instagram A post shared by Jayashankarr (@jayashankarr_) -
'చిన్నారి కిట్టయ్య' సాంగ్ బాగుంది.. ‘అరి’ హిట్ కావాలి: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
అనస్యూ భరద్వాజ్, సూర్య పురిమెట్ల, వినోద్ వర్మ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అరి’. 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ ఫేం జయశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘చిన్నారి కిట్టయ్య’అనే పాటను బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అరి’ సినిమాలో 'చిన్నారి కిట్టయ్య' పాట మంగ్లీ వెర్షన్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. ‘అరి’ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. -
కాసుల వర్షం కురిపిస్తున్న ‘దేవుళ్లు’
ఒకప్పుడు మన పురాణాలు, ఇతీహాసాలపై టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి.అయితే రాను రాను వెండితెరపై మైథాలజీ కథలు తగ్గిపోతూ వచ్చాయి. యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, రొమాంటిక్ జానర్ సినిమాలే ఎక్కువగా సందడి చేశాయి. మధ్య మధ్యలో ఒకటి రెండు మైథాలజీ జానర్ సినిమాలు వచ్చినా..అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా.. మళ్లీ మన ప్రేక్షకులు ‘దేవుళ్ల’ కథలను ఆదరిస్తున్నారు. సోషియో పాంటసీ సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తున్నారు. పురాణాలు, ఇతిహాసాలు, దైవిక అంశాలతో కూడిన సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు నిదర్శనం ‘కల్కి 2898 ఏడీ’ సినిమానే. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ పాత్రలన్నింటిని వెండితెరపై చూపిస్తూ..ఓ కొత్త కథను చెప్పాడు. ఆ కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టించింది.అంతకు ముందు వచ్చిన ‘కార్తికేయ 2’ చిత్రాన్ని కూడా ‘దేవుడే’ హిట్ చేశాడు. ఆ సినిమాలో కృష్ణుడుకి సంబంధించిన సన్నివేశాలకు నార్త్‌తో పాటు సౌత్ ప్రేక్షకులు కూడా పడిపోయారు. సినిమా విజయంలో ఆ సీన్స్ కీలక పాత్ర పోషించాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మరో మైథాలజీ ఫిల్మ్ ‘హను-మాను’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా దాదాపు రూ. 350 కోట్ల వసూళ్లను రాబట్టింది.‘అరి’తో పాటు మరిన్ని చిత్రాలు..టాలీవుడ్లో మైథాలజీ చిత్రాలకు గిరాకీ పెరిగింది. దీంతో పలువురు దర్శకనిర్మాతలు ఆ జోనర్ చిత్రాలనే తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఆఖండ 2ను లైన్లో పెట్టాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ‘కల్కి’ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. అలాగే హను-మాన్‌కి సీక్వెల్‌గా ‘జై హను-మాన్’ రాబోతుంది. 2025లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. చిరంజీవి ‘విశ్వంభర’, నిఖిల్ ‘స్వయంభు’ కూడా సోషియో ఫాంటసీ చిత్రాలే.ఇక ఇదే జోనర్లో ‘పేపర్ బాయ్’ ఫేం జయశంకర్ ‘అరి’అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృష్ణుడిది ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఇంత వరకి ఎవరు టచ్ చేయని అరిషడ్వర్గాలనే కాన్సెప్ట్ మీద అరి మూవీని తెరకెక్కించాడు జయశంకర్. మనిషి అంతర్గత శత్రువులుగా భావించే అరిషడ్వర్గాలైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలని శ్రీకృష్ణుడు ఎలా నియంత్రించాడు? వాటితో ఆయనకున్న సంబంధం ఎలాంటిదనే విషయాల్ని వర్తమాన అంశాలతో ముడిపెడుతూ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమా క్లైమాక్స్‌లో కృష్ణుడికి సంబంధించిన సీన్స్..గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయట. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. అసలే ఇప్పుడు మైథాలజీ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ‘అరి’లో కృష్ణుడి సీన్స్ పేలితే..బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
అనసూయ సినిమాపై అభిషేక్ కన్ను.. ఎందుకో తెలుసా..?
-
టాలీవుడ్లో తొలిసారి అలాంటి కాన్సెప్ట్... బాక్సాఫీస్ షేక్ చేస్తారా!
సాయికుమార్, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం అరి. ఈ మూవీని పూర్తి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారు. పేపర్ బాయ్ ఫేం జయశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి ఆదరణ లభించింది.అయితే ఇటీవల టాలీవుడ్ మైథలాజికల్ చిత్రాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల రిలీజైన కల్కి 2898 ఏడీ సైతం అదే కాన్సెప్ట్‌తో వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కార్తికేయ-2, కాంతార, హనుమాన్, ఓ మై గాడ్, కల్కి సినిమాలు ఇదే తరహా కాన్సెప్ట్‌తో తెరెకెక్కించారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అత్యధి కలెక్షన్లు రాబట్టాయి. అరి కూడా ఈ బ్లాక్ బస్టర్ చిత్రాల సరసన నిలుస్తుందేమో వేచి చూడాల్సిందే.అరిషడ్వర్గాస్ కాన్సెప్ట్..అరి మూవీలో అరిషడ్వర్గాలు అనే కాన్సెప్ట్‌ను ప్రేక్షకులను పరిచయం చేయనున్నారు. మనిషి అంతర్గత శత్రువులుగా భావించే అరిషడ్వర్గాలైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలని శ్రీకృష్ణుడు ఎలా నియంత్రించాడు? వాటితో ఆయనకున్న సంబంధం ఎలాంటిదనే విషయాల్ని వర్తమాన అంశాలతో ముడిపెడుతూ సినిమాని తెరకెక్కించారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న తొలి చిత్రంగా అరి నిలవనుంది.అయితే బాలీవుడ్లో అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో ఈ మూవీ రీమేక్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి ఇప్పటికే దర్శకుడితో మాట్లాడినట్లు సమాచారం. -
‘అరి’కి ముందే మరో చిత్రం
కొంతమంది దర్శకులు తక్కువ సినిమాలే చెసినా.. ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో జయశంకర్ ఒకరు. పేపర్ బాయ్ సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జయశంకర్.. తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు. సున్నితమైన ఎమోషన్స్‌ని ఆ చిత్రంలో ఎంతో అద్భుతంగా చూపించాడు. ఆ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘అరి’ అనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో సూర్య పురిమెట్ల ఓ ప్రధాన పాత్ర పోషించాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అయితే ఈ మూవీ విడుదలకు ముందే.. సూర్య పురిమెట్ల మరో ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి జయశంకర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. సుందర్ పాలుట్ల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ పోస్టర్ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్‌తో కాసేపు ముచ్చటించి.. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో అనిల్ కుమార్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ , నిర్మాత తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, పవన్ వంటి తదితరులు పాల్గొన్నారు. అరి మూవీ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న సూర్య పురిమెట్ల రెండో మూవీ పోస్టర్ ని రిలీజ్ చేసిన cinematography minister కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు , సుందర్ పాలుట్ల డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు , పేపర్ బాయ్ మూవీ తో సూపర్ హిట్ కొట్టిన జయశంకర్ సమర్పణ లో ఈ మూవీ తెరకెక్కుతుంది... pic.twitter.com/OiR51KtiGB— ARI (MY NAME IS NOBODY) (@ArvyCinemas) May 21, 2024 -
Ari Movie: ఆసక్తి పెంచుతోన్న వినోద్ వర్మ ఫస్ట్ లుక్!
‘పేపర్ బాయ్’ఫేం జయశంకర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అరి’.'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించారు. ‘అరి’ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించిన వినోద్ వర్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను ఇవాళ విడుదల చేశారు. ఓ పెద్ద లైబ్రరీలో ఇంపార్టెంట్ విషయాలు నోట్ చేసుకుంటున్న వినోద్ వర్మ స్టిల్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ‘అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. ఈ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే ‘అరి’ సినిమాను గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా హిందీ రీమేక్ పై బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ‘అరి’ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు. -
‘అరి’ రీమేక్‌పై స్టార్ హీరోల గురి?
తెలుగు దర్శకులు సినిమా కథల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తెలిసిన కథలే అయినా..వాటికి కొత్త నేపథ్యాన్ని మేళవించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మన పురాణాలు, ఇతిహాసాల కథల్ని వాడుకొని నేటి తరానికి నచ్చేలా సినిమాలు తెరకెక్కించి హిట్ కొడుతున్నారు. అలాంటి చిత్రాలకు టాలీవుడ్లోనే కాదు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. అందుకు నిదర్శనం కార్తికేయ, హనుమాన్, కాంతారా, ఓ మై గాడ్ సినిమాలే. ఇవన్నీ చిన్న సినిమాలే అయినా.. బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించాయి. అలాంటి కాన్సెప్ట్‌తో తాజాగా మరో చిత్రం రాబోతుంది. అదే ‘అరి’. పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో ఈ సినిమా విడుదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదల కాకముందే దీని రీమేక్‌పై పలువురు స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ‘అరి’పై శివకార్తికేయన్ గురి విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శివకార్తికేయన్. ఆయన ఇటీవల అయలాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్లో సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రం త్వరలోనే తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ హీరో కన్ను ఇప్పుడు అరిపై పడింది. అయలాన్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌కి వచ్చిన శివకార్తికేయన్‌కి దర్శకుడు జయశంకర్ ‘అరి’ ట్రైలర్ చూపించాడు. అది శివకార్తికేయన్‌కు విపరీతంగా నచ్చడంతో.. సినిమా మొత్తం చూశాడట. అందులోని కృష్ణుడు పాత్ర అతన్ని బాగా ఆకట్టుకుందట. ఈ సినిమాను తమిళ్లో రీమేక్ చేస్తే.. కృష్ణుడు పాత్రలో తాను నటిస్తానని జయశంకర్‌కి చెప్పాడట. అరి తెలుగులో రిలీజై.. హిట్ అయితే మాత్రం అది కచ్చితంగా తమిళ్లో రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హిందీ రీమేక్‌లో అభిషేక్? ఒక హీరో మాస్ క్యారెక్టర్ చేయడానికి ఎంత ఇష్టపడతాడో అలాగే కృష్ణుడి పాత్రను చేయడానికి అంతే ఆసక్తి చూపుతాడు. ఇక నార్త్‌లో అయితే కృష్ణతత్వం కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన కార్తికేయ 2 సౌత్‌లో కంటే నార్త్‌లో బాగా ఆడింది. ‘అరి’ కూడా అలాంటి చిత్రమే కావడంతో.. హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ రీమేక్‌లో నటించడానికి అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపుతున్నాడట. ఇప్పటికే దర్శకుడితో మాట్లాడినట్లు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే అభిషేక్‌ని కృష్ణుడిగా చూడొచ్చు. ‘అరి’పై ప్రముఖుల ప్రశంసలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రీలీజ్‌కు రేడీగా ఉంది అరి సినిమా. ఇప్పటికే ఈ చిత్రాన్ని పలువురు ప్రముఖులకు చూపించారు మేకర్స్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌తో పాటు చినజీయర్ స్వామి సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌పై ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్( ఇస్కాన్) బెంగళూరు ప్రెసిడెంట్ మధు పండిత్ దాస ప్రశంసలు కురిపించారు. శ్రీకృష్ణుడి జీవిత వైవిధ్యం గురించి ఈ సినిమాలో ప్రస్తావించడంపై అభినందనలు తెలిపారు. -
ఆకట్టుకుంటున్న ‘అరి’ ఫస్ట్ లుక్
‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అరి’. 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక.ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘అరి’ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంగా బాల రాముని దివ్యాశిస్సులతో ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించిన సూర్య పురిమెట్ల క్యారెక్టర్ ను సోమవారం ఇంట్రడ్యూస్ చేశారు. సూర్య పురిమెట్ల క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ‘అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. ‘అరి’ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఈ సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. -
అనసూయ ‘అరి’కోసం వినూత్న ప్రచారం
పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్ తెరకెక్కించిన రెండో చిత్రం అరి. అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, సూర్య పురిమెట్ల, వినోద్ వర్మ, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో తిమ్మప్ప నాయుడు, శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం..ప్రస్తుత్తం పోస్ట్ ప్రొడక్షన్పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా..ఈ చిత్రం ప్రమోషన్స్‌ని వినూత్నంగా ప్లాన్ చేశారు మేకర్స్. కరీంనగర్లో ఉన్న స్థానిక సింగర్స్‌లో ఈ సినిమాలోని ‘చిన్నారి కిట్టయ్య’సాంగ్‌ని పాడిస్తూ ప్రచారం చేస్తున్నారు. సినిమాలో ఈ పాటను ప్రముఖ గాయని మంగ్లీ పాడారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. అనూబ్ రూబెన్స్ సంగీతం అందించారు. -
ఆ పాటని మంగ్లీ చేత పాడించడానికి కారణం...
-
‘అరి’కి ఇస్కాన్ ప్రశంసలు
`పేపర్ బాయ్`లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జయశంకర్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రం ‘అరి’. అనసూయ, ఆమని, సాయికుమార్, ‘శుభలేఖ’ సుధాకర్, వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. వైవిధ్యమైన కాన్సెప్ట్ తో అందరినీ ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. (చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం, స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, మంగ్లీ ఆలపించిన పాటతో పాటు ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌పై ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్( ఇస్కాన్) బెంగళూరు ప్రెసిడెంట్ మధు పండిత్ దాస ప్రశంసలు కురిపించారు. శ్రీకృష్ణుడి జీవిత వైవిధ్యం గురించి ఈ సినిమాలో ప్రస్తావించడంపై అభినందనలు తెలిపారు. గతంలోనూ ఈ మూవీ ట్రైలర్‌పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌తో పాటు చినజీయర్ స్వామి సైతం ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమాలో కృష్ణతత్వం తేలియజేసే ‘చిన్నారి కిట్టయ్య’పాటని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రెసిడెంట్ శ్రీ సత్య గౌరవ్ చంద్రదాస్ విడుదల చేశారు. మంగ్లీ ఆలపించిన ఆ పాటకు అద్భుతమైన స్పందన లభించింది. మొత్తంగా విడుదలకు ముందే ‘అరి’ చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. -
‘అరి’ ట్రైలర్‌పై వెంకయ్య నాయుడు ప్రశంసలు
పేపర్ బాయ్ ఫేం జయశంకర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం అరి. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ట్యాగ్‌లైన్. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేక సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ‘అరి’ సినిమా ప్రచార చిత్రాన్ని వీక్షించడం ఆనందదాయకం. ఆరు రకాల అంతఃశత్రువులను ప్రతి మనిషి జయించాలన్న సందేశంతో చక్కని కథ,కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు జయశంకర్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ సహా చిత్ర బృందాన్ని అభినందిస్తూ, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. "అరి" సినిమా ప్రచార చిత్రాన్ని వీక్షించడం ఆనందదాయకం. ఆరు రకాల అంతఃశత్రువులను ప్రతి మనిషి జయించాలన్న సందేశంతో చక్కని కథ,కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శ్రీ జయశంకర్, నిర్మాత శ్రీ అభిషేక్ అగర్వాల్ సహా చిత్ర బృందాన్ని అభినందిస్తూ,సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను pic.twitter.com/HLeeE5scoF — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) March 29, 2023 -
‘అరి’ ట్రైలర్ చూడగానే పులకింత వచ్చేసింది: నిర్మాత అశ్వనీదత్
‘అరి సినిమా ట్రైలర్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ చూడగానే టెక్నీషియన్ అంతా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు అనిపిస్తోంది. ఈ సమ్మర్ లో వస్తోన్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అన్నారు. పేపర్‌బాయ్ ఫేం జయశంకర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం అరి. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. నిర్మాత అశ్వనీదత్‌ని కూడా ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెస్కే ప్రసాద్ గారి ద్వారా నిర్మాత శేషుగారు నిర్మించిన అరి చిత్ర ట్రైలర్ ను చూశాను. చూడగానే నాకు ఎంతో పులకింత వచ్చేసింది. పర్టిక్యులర్ గా చెప్పాలంటే శ్రీ కృష్ణుడు ఎక్కడ కనిపించినా.. మా వైజయంతీ మూవీస్ లాగా అది ఎప్పుడూ శుభ సూచకం. గ్యారెంటీ హిట్ అవుతుందనే నమ్మకంతో టీమ్ అందరికీ అడ్వాన్స్ గా కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నాను’ అన్నారు. -
అరి ట్రైలర్: అనసూయ చేతిలో యాసిడ్ బాటిల్..
పేపర్‌బాయ్ ఫేమ్ జయశంకర్ తెరకెక్కించిన రెండో చిత్రం అరి. మై నేమ్ ఈజ్ నోబడీ అనేది ట్యాగ్‌లైన్. ఇందులో జెలసీ పాత్రలో అనసూయ, ప్రైడ్‌గా సాయి కుమార్, ఆంగర్ రోల్లో శ్రీకాంత్ అయ్యంగార్, లస్ట్‌గా వైవా హర్ష, గ్రీడీ పాత్రలో శుభలేఖ సుధాకర్, అటాచ్మెంట్ క్యారెక్టర్లో సురభి నటించారు. ఇటీవలే మంగ్లీ పాడిన చిన్నారి కిట్టయ్య పాటకు మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా అరి ట్రైలర్‌ను విడుదల చేశారు. మనిషి ఎలా బతకకూడదనే విషయాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. అరిషడ్వర్గాలు(కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) కోసం మనిషి ఎంత దిగజారిపోతాడనేది చూపించారు. -
Ari: మంగ్లీ పాటకు విదేశీ యువతులు స్టెప్పులు.. వీడియో
‘పేపర్ బాయ్ ’చిత్రంతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా ‘అరి’.. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉపశీర్షిక. ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించిన సినిమా ఇది. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, సుమన్, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘చిన్నారి కిట్టయ్య’పాటకు ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రముఖ గాయని మంగ్లీ ఆలపించిన ఈ పాటకు విదేశీ యువతులు సైతం ఫిదా అయ్యారు. ఈ పాటకు తమదైన శైలీలో స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. శ్రీకృష్ణుడి గొప్పదనం గురించి తెలియజేస్తూ సాగే ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా అనూప్ రూబెన్స్ స్వరపరిచాడు. -
Ari: మంగ్లీ ఆలపించిన ‘చిన్నారి కిట్టయ్య’ పాట విన్నారా?
పేపర్ బాయ్` ఫేమ్ జయశంకర్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రం ‘అరి’. మై నేమ్ ఈజ్ నోబడీ అనేది ట్యాగ్ లైన్. ప్రముఖ వ్యాపారవేత్తలు శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి సంయుక్తంగా, ఆర్వి రెడ్డి, సమర్పణ లో `అరి` సినిమా ని నిర్మిస్తున్నారు. అనసూయ భరద్వాజ్, సాయికుమార్, వైవాహర్ష, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట విడుదలైంది. కృష్ణుడు గొప్పదనం గురించి తెలియజేసే ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. ప్రముఖ గాయని మంగ్లీ అద్భుతంగా ఆలపించింది. అనూప్ రూబెన్స్ మైమరిపించే సంగీతం అందించారు. ఇక అరి విషయానికొస్తే.. జయశంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో జెలసీ పాత్రలో అనసూయ, ప్రైడ్‌గా సాయి కుమార్, ఆంగర్ క్యారెక్టర్లో శ్రీకాంత్ అయ్యంగార్, లస్ట్‌గా వైవా హర్ష, గ్రీడీ పాత్రలో శుభలేఖ సుధాకర్, అటాచ్ మెంట్ క్యారెక్టర్లో సురభి ప్రభావతి నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి విడుదలకు రెడీ అయిన ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. థియేటర్స్‌లో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయడానికి రూ.10 కోట్లతో డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ కావడంతో ‘అరి’ ని కచ్చితంగా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించడానికి సిద్దమైందట. అయితే చిత్రబృందం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. థియేటర్స్‌లో విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
అనసూయ ‘అరి’పై నెట్‌ఫ్లిక్స్ గురి..రూ.10 కోట్లతో డీల్!
‘పేపర్ బాయ్` ఫేమ్ జయశంకర్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రం ‘అరి’. మై నేమ్ ఈజ్ నోబడీ అనేది ట్యాగ్ లైన్. ప్రముఖ వ్యాపారవేత్తలు శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి సంయుక్తంగా, ఆర్వి రెడ్డి, సమర్పణ లో `అరి` సినిమా ని నిర్మిస్తున్నారు. మనిషి ఎలా బతకకూడదు అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఈ చిత్రంలో జెలసీ పాత్రలో అనసూయ, ప్రైడ్‌గా సాయి కుమార్, ఆంగర్ క్యారెక్టర్లో శ్రీకాంత్ అయ్యంగార్, లస్ట్‌గా వైవా హర్ష, గ్రీడీ పాత్రలో శుభలేఖ సుధాకర్, అటాచ్ మెంట్ క్యారెక్టర్లో సురభి ప్రభావతి నటిస్తున్నారు. టైటిల్ లోగో లాంచ్ నుంచే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి విడుదలకు రెడీ అయిన ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. థియేటర్స్‌లో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయడానికి రూ.10 కోట్లతో డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ కావడంతో ‘అరి’ ని కచ్చితంగా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించడానికి సిద్దమైందట. అయితే చిత్రబృందం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. థియేటర్స్‌లో విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి ప్రస్తుతం ఓ ప్రముఖ పంపిణీ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే సమయంలో నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ రావడంతో నిర్మాతలు ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. మరి ‘అరి’ థియేటర్లో అలరిస్తుందా లేదా ఓటీటీలోకి వస్తుందా చూడాలి.