తెలుగు దర్శకులు సినిమా కథల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తెలిసిన కథలే అయినా..వాటికి కొత్త నేపథ్యాన్ని మేళవించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మన పురాణాలు, ఇతిహాసాల కథల్ని వాడుకొని నేటి తరానికి నచ్చేలా సినిమాలు తెరకెక్కించి హిట్ కొడుతున్నారు. అలాంటి చిత్రాలకు టాలీవుడ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. అందుకు నిదర్శనం కార్తికేయ, హనుమాన్, కాంతారా, ఓ మై గాడ్ సినిమాలే. ఇవన్నీ చిన్న సినిమాలే అయినా.. బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించాయి. అలాంటి కాన్సెప్ట్‌తో తాజాగా మరో చిత్రం రాబోతుంది. అదే ‘అరి’. పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో ఈ సినిమా విడుదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదల కాకముందే దీని రీమేక్‌పై పలువురు స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
‘అరి’పై శివకార్తికేయన్ గురి
విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శివకార్తికేయన్. ఆయన ఇటీవల అయలాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్‌లో సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రం త్వరలోనే తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ హీరో కన్ను ఇప్పుడు అరిపై పడింది. అయలాన్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌కి వచ్చిన శివకార్తికేయన్‌కి దర్శకుడు జయశంకర్ ‘అరి’ ట్రైలర్ చూపించాడు. అది శివకార్తికేయన్‌కు విపరీతంగా నచ్చడంతో.. సినిమా మొత్తం చూశాడట. అందులోని కృష్ణుడు పాత్ర అతన్ని బాగా ఆకట్టుకుందట. ఈ సినిమాను తమిళ్‌లో రీమేక్ చేస్తే.. కృష్ణుడు పాత్రలో తాను నటిస్తానని జయశంకర్‌కి చెప్పాడట. అరి తెలుగులో రిలీజై.. హిట్ అయితే మాత్రం అది కచ్చితంగా తమిళ్‌లో రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
హిందీ రీమేక్‌లో అభిషేక్?
ఒక హీరో మాస్ క్యారెక్టర్ చేయడానికి ఎంత ఇష్టపడతాడో అలాగే కృష్ణుడి పాత్రను చేయడానికి అంతే ఆసక్తి చూపుతాడు. ఇక నార్త్‌లో అయితే కృష్ణతత్వం కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన కార్తికేయ 2 సౌత్‌లో కంటే నార్త్‌లో బాగా ఆడింది. ‘అరి’ కూడా అలాంటి చిత్రమే కావడంతో.. హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ రీమేక్‌లో నటించడానికి అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపుతున్నాడట. ఇప్పటికే దర్శకుడితో మాట్లాడినట్లు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే అభిషేక్‌ని కృష్ణుడిగా చూడొచ్చు.
‘అరి’పై ప్రముఖుల ప్రశంసలు
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రీలీజ్‌కు రేడీగా ఉంది అరి సినిమా. ఇప్పటికే ఈ చిత్రాన్ని పలువురు ప్రముఖులకు చూపించారు మేకర్స్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌తో పాటు చినజీయర్ స్వామి సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌పై ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్‌నెస్( ఇస్కాన్) బెంగళూరు ప్రెసిడెంట్ మధు పండిత్ దాస ప్రశంసలు కురిపించారు. శ్రీకృష్ణుడి జీవిత వైవిధ్యం గురించి ఈ సినిమాలో ప్రస్తావించడంపై అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment