Jaya Shankar
-
వెరైటీ ప్రమోషన్స్.. రిలీజ్‌కి ముందే అనసూయ సినిమా చూడొచ్చు!
విభిన్నం గా సినిమా తీయడమే కాదు.. అంత కంటే విభిన్నం గా సినిమాని ప్రమోట్ చేస్తేనే ఈ రోజుల్లో ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించగలరు.ఇప్పుడు అరి మూవీ(Ari) టీం కూడా ఇలానే డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. రిలీజ్‌కి ముందే సినిమాను చూపిస్తాం అని ఒక పోస్ట్ రిలీజ్ చేసింది. పేపర్ బాయ్ ఫేం జయ శంకర్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌లో సాయికుమార్, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవా కీలక పాత్రల్లో నటించారు. గతేడాదిలోనే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇప్పటికే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలు ఈ మూవీని వీక్షించి ప్రశంసలు కురిపించారు.అరిషడ్వర్గాల మీద తీసిన ఈ చిత్రం ఇప్పటి తరానికి చాలా ముఖ్యమని, సినిమా అద్భుతంగా ఉందని స్పెషల్ షోని చూసిన వారంతా పొగిడేస్తున్నారు. ఇక అరి మూవీని ప్రస్తుతం వీక్షించేందుకు కొంత మందికి అవకాశాన్ని కల్పిస్తోంది చిత్రయూనిట్.మైథలాజికల్ థ్రిల్లర్ జానర్లను ఇష్ట పడే ఆడియెన్స్‌కు ఈ చిత్రం మరింతగా నచ్చేలా ఉంటుంది. సినీ లవర్స్ అంతా కూడా ముందుగానే అరి మూవీని చూసే అవకాశాన్ని చిత్రయూనిట్ కల్పిస్తోంది. ఇలా విడుదలకు ముందే సినిమాను చూపించే ధైర్యాన్ని ఎవ్వరూ చేయరు. కానీ అరి మీదున్న నమ్మకం దర్శకుడు జయశంకర్ ఇలా ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. విడుదలకు ముందే సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించాలనుకునే వారు వివరాల్ని తెలియజేయండి అంటూ వాట్సప్ నంబర్‌ను కూడా డైరెక్టర్ జోడించారు. పర్ బాయ్ తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ జయశంకర్ అరి మూవీతో త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాడు. జయ శంకర్ మూడో ప్రాజెక్ట్ కూడా కన్ఫామ్ అయింది. ఇంటెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్గా నటిచంనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు. View this post on Instagram A post shared by Jayashankarr (@jayashankarr_) -
'చిన్నారి కిట్టయ్య' సాంగ్ బాగుంది.. ‘అరి’ హిట్ కావాలి: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
అనస్యూ భరద్వాజ్, సూర్య పురిమెట్ల, వినోద్ వర్మ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అరి’. 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ ఫేం జయశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘చిన్నారి కిట్టయ్య’అనే పాటను బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అరి’ సినిమాలో 'చిన్నారి కిట్టయ్య' పాట మంగ్లీ వెర్షన్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. ‘అరి’ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. -
కాలజ్ఞాని స్ఫూర్తితో బీసీ ఉద్యమం..
డాక్టర్ కొత్తపల్లి జయశంకర్‌ను తలుచుకుంటేనే 1969లో తుపాకీ తూటాలకు బలై నేలకొరిగిన వంద లాది తొలి తెలంగాణ రాష్ట్ర సాధన సమరయోధులు గుర్తు కొస్తారు. ఓరుగల్లు బిడ్డగా, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్తగా, ప్రొఫెసర్‌గా, ‘సీఫెల్’ రిజిస్ట్రార్‌గా, కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఆయన జ్ఞానరంగాన్ని తీర్చిదిద్దారు. తెలంగాణ రాష్ట్ర సాధన తొలి మలి దశల ఉద్యమాల వెంట నడుచుకుంటూ ఉద్యమాన్ని సక్రమ పట్టాలపైకెక్కించి నడిపించిన జయశంకర్‌ను తెలంగాణ మట్టి ఎప్పటికీ మరిచిపోదు.తెలంగాణ అంతా నిరాశా నిస్పృహల్లోకి పోయినప్పుడు తమ ఒంటికి నిప్పంటించుకుని ‘జై తెలంగాణ’ నినాదాన్ని మిన్నంటేలా చేసిన శ్రీకాంతాచారి, యాదయ్య, కానిస్టేబుల్ కిష్టయ్యలు, ఆత్మబలి దానాలు చేసుకున్న వందలాది మంది ఆత్మగౌరవ యోధుల త్యాగాలు, తెగిపడ్డ తల్లి పేగుల ఆర్తనాదాలు ఇంకా చెవుల్లో మారు మ్రోగుతూనే ఉన్నాయి. తెలంగాణ మేధావుల సంఘమంటే, ‘మేధావులన్న పదమెందుకు? విద్యా వంతులంటే సరిపోతుం’దన్న విద్యావంతుడు జయశంకర్ సార్.రెండు తెలుగు రాష్ట్రాలేర్పడితే అగ్రవర్ణ పెత్తనాల రాజ కీయాలు క్రమంగా కనుమరుగవుతాయని జయశంకర్ చెప్పిన కాలజ్ఞానం బహుజన రాజ్యాలకు ముగ్గులు పోస్తుంది. తెలుగు భాషపై చర్చ ఎగుస్తున్న ఉద్యమకాలంలో ‘నలుగురు ఖైదీలు జైలు నుంచి పరార్’ అన్న దినపత్రికల బ్యానర్లలోని ఉర్దూ తెలుగు కలగలిసిన తెలంగాణ భాషపై జయశంకర్ పదే పదే చెప్పిన మాటలు జ్ఞప్తికొస్తున్నాయి. 14 ఏళ్ళ సుదీర్ఘ తెలంగాణ రాష్ట్ర సాధన మహోద్యమంలో ప్రజాసంఘాలు చేసిన పోరాటాన్నీ, రాజకీయ ప్రక్రియ ద్వారా జరిగే ఉద్యమ ప్రస్థా నాన్నీ సమన్వయం చేసుకుంటూ జయశంకర్ నిలిచి కది లారు. రాష్ట్రసాధన ఉద్యమం పిడికిలెత్తుతున్న సందర్భంలో మల్లెపల్లి రాజయ్య వర్ధంతి సభలో జయశంకర్ ప్రసంగాల్ని అక్షరాలుగా పేర్చి మల్లెపల్లి లక్ష్మయ్య అందించిన ‘తెలంగాణలో ఏం జరుగుతుంది’ అన్న పుస్తకం ఉద్యమానికి రూట్ మ్యాప్‌గా నిలిచింది.జయశంకరుణ్ణి తలుచుకుంటుంటే మిలియన్ మార్చ్, సాగరహారం, సడక్ బంద్, జాతీయ రహదారులపై వంటా వార్పుల దగ్గర నుంచి దేశచరిత్రలోనే మరువలేని 42 రోజుల సకల జనుల సమ్మె గుర్తుకొస్తాయి. ఢిల్లీ కార్ల యాత్రలు, దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడ గట్టుకోవటాలు, కార్మిక, కర్షక, విద్యార్థి మేధావుల ఆందోళనలు, ప్రజాసంఘాల పోరాటాలు, ఊరూరు జేఏసీగా మారడాలు, ఉద్యమ నృత్యం చేసిన ధూంధాంలు తెలంగాణ స్మృతిపథంలో చెదిరి పోని జ్ఞాపకాలుగా నిలిచాయి. రాజకీయ పార్టీలన్నీ కలవవని ప్రచారాలు జరుగు తున్న సమయంలో ‘ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు’ స్వరాష్ట్రం కోసం అందరూ ఒక్కతాటిపైకి వస్తారన్న జయశంకర్ సూత్రీకరణ ఆచ రణ రూపమైంది.క్యాన్సర్‌ను జయిస్తూ ఉద్యమ జీవితపు ఎగుడుదిగుళ్ళను జయశంకర్ చెబుతుంటే రాసుకుంటూ పోయిన వెంకట్ గౌడ్ అందించిన ‘వొడవని ముచ్చట’నే కదా తెలంగాణ ముచ్చట. జయశంకర్ సార్‌ను ఇపుడు ఎవరు ఎట్లయినా విభజించుకుని మాట్లాడుకోవచ్చును. కానీ ఆయన తెలంగాణ ఉమ్మడి సంపద. తెలంగాణ స్వరాష్ట్రాన్ని చూడకుండానే సెలవంటూ వెళ్ళిపోయారు. కానీ ఆయన అందించిన స్ఫూర్తికి గుర్తుగా విశ్వవిద్యాలయానికి పేరుపెట్టుకోవటం తెలంగాణకు గర్వకారణంగా నిలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలేర్పడితే రెండు చోట్ల బడుగులు నాయకత్వ దశకు వస్తారని జయశంకర్ చెప్పారు.అది జరగా లంటే తెలంగాణలో అరవై శాతంగా వున్న బీసీలకు పల్లెనుంచి పార్లమెంటు దాకా చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలి. కులగణన జరిగితేనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల డిమాండ్ నెరవేరేందుకు దారి ఏర్పడుతుంది. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు తోడుగా బీసీ రిజర్వేషన్లు కూడా వస్తేనే రాజకీయ న్యాయం జరుగుతుంది.– జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త తెలంగాణ తొలి బీసీ కమిషన్ సభ్యులు -
‘అరి’కి ముందే మరో చిత్రం
కొంతమంది దర్శకులు తక్కువ సినిమాలే చెసినా.. ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో జయశంకర్ ఒకరు. పేపర్ బాయ్ సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జయశంకర్.. తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు. సున్నితమైన ఎమోషన్స్‌ని ఆ చిత్రంలో ఎంతో అద్భుతంగా చూపించాడు. ఆ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘అరి’ అనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో సూర్య పురిమెట్ల ఓ ప్రధాన పాత్ర పోషించాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అయితే ఈ మూవీ విడుదలకు ముందే.. సూర్య పురిమెట్ల మరో ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి జయశంకర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. సుందర్ పాలుట్ల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ పోస్టర్ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్‌తో కాసేపు ముచ్చటించి.. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో అనిల్ కుమార్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ , నిర్మాత తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, పవన్ వంటి తదితరులు పాల్గొన్నారు. అరి మూవీ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న సూర్య పురిమెట్ల రెండో మూవీ పోస్టర్ ని రిలీజ్ చేసిన cinematography minister కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు , సుందర్ పాలుట్ల డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు , పేపర్ బాయ్ మూవీ తో సూపర్ హిట్ కొట్టిన జయశంకర్ సమర్పణ లో ఈ మూవీ తెరకెక్కుతుంది... pic.twitter.com/OiR51KtiGB— ARI (MY NAME IS NOBODY) (@ArvyCinemas) May 21, 2024 -
జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
సున్నితమైన ఎమోషన్స్‌ను ఎంతో అద్భుతంగా పేపర్ బాయ్ సినిమాలో చూపించి మెప్పించాడు దర్శకుడు జయ శంకర్. ఇక రెండో ప్రయత్నంగా 'అరి' అంటూ అరిషడ్వర్గాల మీద చిత్రాన్ని తీశాడు. ఇప్పటికే ఈ మూవీ అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేసింది. పలువురు సెలెబ్రిటీలు సినిమాను చూసి మెచ్చుకున్నారు కూడా. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ క్రమంలో దర్శకుడు జయ శంకర్ కొత్త సినిమా మీద రూమర్లు వస్తున్నాయి. ఆల్రెడీ ఈయన ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టినట్టుగా, ఆ కథకు నయనతార ఓకే చెప్పినట్టుగా ఆ మధ్య రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద కొత్త రూమర్ వినిపిస్తోంది. జయశంకర్ అనుకుంటున్న ఈ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌కు సౌత్, నార్త్‌లో మంచి క్రేజ్ ఉన్న నటిని తీసుకున్నారని సమాచారం. శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో జయ శంకర్ తన లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ను చేస్తున్నాడని తెలుస్తోంది. పాన్ ఇండియాగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ మీద అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక జయశంకర్ తీసిన అరి చిత్రం ఈ ఎన్నికల హడావిడి అయిపోయిన తరువాత థియేటర్లోకి రానుంది. జూన్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
‘అరి’ రీమేక్‌పై స్టార్ హీరోల గురి?
తెలుగు దర్శకులు సినిమా కథల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తెలిసిన కథలే అయినా..వాటికి కొత్త నేపథ్యాన్ని మేళవించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మన పురాణాలు, ఇతిహాసాల కథల్ని వాడుకొని నేటి తరానికి నచ్చేలా సినిమాలు తెరకెక్కించి హిట్ కొడుతున్నారు. అలాంటి చిత్రాలకు టాలీవుడ్లోనే కాదు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. అందుకు నిదర్శనం కార్తికేయ, హనుమాన్, కాంతారా, ఓ మై గాడ్ సినిమాలే. ఇవన్నీ చిన్న సినిమాలే అయినా.. బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించాయి. అలాంటి కాన్సెప్ట్‌తో తాజాగా మరో చిత్రం రాబోతుంది. అదే ‘అరి’. పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో ఈ సినిమా విడుదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదల కాకముందే దీని రీమేక్‌పై పలువురు స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ‘అరి’పై శివకార్తికేయన్ గురి విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శివకార్తికేయన్. ఆయన ఇటీవల అయలాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్లో సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రం త్వరలోనే తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ హీరో కన్ను ఇప్పుడు అరిపై పడింది. అయలాన్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌కి వచ్చిన శివకార్తికేయన్‌కి దర్శకుడు జయశంకర్ ‘అరి’ ట్రైలర్ చూపించాడు. అది శివకార్తికేయన్‌కు విపరీతంగా నచ్చడంతో.. సినిమా మొత్తం చూశాడట. అందులోని కృష్ణుడు పాత్ర అతన్ని బాగా ఆకట్టుకుందట. ఈ సినిమాను తమిళ్లో రీమేక్ చేస్తే.. కృష్ణుడు పాత్రలో తాను నటిస్తానని జయశంకర్‌కి చెప్పాడట. అరి తెలుగులో రిలీజై.. హిట్ అయితే మాత్రం అది కచ్చితంగా తమిళ్లో రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హిందీ రీమేక్‌లో అభిషేక్? ఒక హీరో మాస్ క్యారెక్టర్ చేయడానికి ఎంత ఇష్టపడతాడో అలాగే కృష్ణుడి పాత్రను చేయడానికి అంతే ఆసక్తి చూపుతాడు. ఇక నార్త్‌లో అయితే కృష్ణతత్వం కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన కార్తికేయ 2 సౌత్‌లో కంటే నార్త్‌లో బాగా ఆడింది. ‘అరి’ కూడా అలాంటి చిత్రమే కావడంతో.. హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ రీమేక్‌లో నటించడానికి అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపుతున్నాడట. ఇప్పటికే దర్శకుడితో మాట్లాడినట్లు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే అభిషేక్‌ని కృష్ణుడిగా చూడొచ్చు. ‘అరి’పై ప్రముఖుల ప్రశంసలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రీలీజ్‌కు రేడీగా ఉంది అరి సినిమా. ఇప్పటికే ఈ చిత్రాన్ని పలువురు ప్రముఖులకు చూపించారు మేకర్స్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌తో పాటు చినజీయర్ స్వామి సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌పై ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్( ఇస్కాన్) బెంగళూరు ప్రెసిడెంట్ మధు పండిత్ దాస ప్రశంసలు కురిపించారు. శ్రీకృష్ణుడి జీవిత వైవిధ్యం గురించి ఈ సినిమాలో ప్రస్తావించడంపై అభినందనలు తెలిపారు. -
ఆకట్టుకుంటున్న ‘అరి’ ఫస్ట్ లుక్
‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అరి’. 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక.ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘అరి’ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంగా బాల రాముని దివ్యాశిస్సులతో ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించిన సూర్య పురిమెట్ల క్యారెక్టర్ ను సోమవారం ఇంట్రడ్యూస్ చేశారు. సూర్య పురిమెట్ల క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ‘అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. ‘అరి’ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఈ సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. -
అక్కడే చనిపోతామనుకున్నాం.. భారత్ చేరిన సూడాన్ బాధితులు
ఢిల్లీ: సుడాన్(sudan)లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. సూడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కావేరి’ వేగంగా కొనసాగుతోంది. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సూడాన్ నుంచి బయలుదేరిన మొదటి బ్యాచ్.. స్వదేశం చేరుకున్నారు. ఈ సందర్బంగా అక్కడ నెలకొన్న పరిస్థితులను వివరించారు. కాగా, మొదటి బ్యాచ్‌లో సూడాన్ నుంచి 360 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. మొత్తంగా జెడ్డాకు చేరుకున్న 534 మందిలో 360 మంది వాణిజ్య విమానంలో బుధవారం రాత్రి ఢిల్లీకి వచ్చేశారు. ఆపరేషన్ కావేరీ సాయంతో సూడాన్ నుంచి మొదటి బ్యాచ్ న్యూఢిల్లీకి చేరుకుంది అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు. జైశంకర్ తన సౌదీ అరేబియా కౌంటర్‌తో మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత తరలింపు ప్రక్రియ ప్రారంభించారు. మరోవైపు.. బుధవారం ఉదయం సుడాన్ నుంచి మూడో బ్యాచ్ కూడా బయల్దేరింది. ఈ విషయాన్ని విదేశీవ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సుడాన్ నుంచి మూడో బ్యాచ్‌లో 135 మంది భారతీయులతో రెండో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ C-130J విమానం సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నట్లు తెలిపారు. కాగా, సూడాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన భారతీయులను స్వరాష్ట్రాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయుల్లో చాలా మంది గాయపడ్డారు. అనంతరం, ఢిల్లీలో వారు సూడాన్‌లో ప్రస్తుత పరిస్థితిని వివరించారు. సూడాన్‌లో నివాసాలపై బాంబు వేయడంతో భయానక పరిస్థితులను చూశాడు. స్వదేశానికి తిరిగి వస్తామని అనుకోలేదు. అక్కడే చనిపోతామనే భయంతో క్షణక్షణం కాలం గడిపాము. కట్టుబట్టలతో సూడాన్ నుంచి బయలుదేరాము. బాంబు దాడుల కారణంగా ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశాము. కొందరు వ్యక్తులు మమ్మల్ని గన్‌తో బెదిరించి మావద్ద ఉన్న డబ్బులు లాక్కున్నారు. First flight carrying Indian nationals who were evacuated from Sudan landed in Delhi yesterday. #OperationKaveri brought 360 Indian Nationals to the homeland as first flight reaches New Delhi.@MEAIndia @EoI_Khartoum pic.twitter.com/xXp4ZJW40K — DD India (@DDIndialive) April 27, 2023 ఇది కూడా చదవండి: సూడాన్‌లో చిక్కుకున్న తెలుగువారు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
‘అరి’ ట్రైలర్‌పై వెంకయ్య నాయుడు ప్రశంసలు
పేపర్ బాయ్ ఫేం జయశంకర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం అరి. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ట్యాగ్‌లైన్. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేక సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ‘అరి’ సినిమా ప్రచార చిత్రాన్ని వీక్షించడం ఆనందదాయకం. ఆరు రకాల అంతఃశత్రువులను ప్రతి మనిషి జయించాలన్న సందేశంతో చక్కని కథ,కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు జయశంకర్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ సహా చిత్ర బృందాన్ని అభినందిస్తూ, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. "అరి" సినిమా ప్రచార చిత్రాన్ని వీక్షించడం ఆనందదాయకం. ఆరు రకాల అంతఃశత్రువులను ప్రతి మనిషి జయించాలన్న సందేశంతో చక్కని కథ,కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శ్రీ జయశంకర్, నిర్మాత శ్రీ అభిషేక్ అగర్వాల్ సహా చిత్ర బృందాన్ని అభినందిస్తూ,సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను pic.twitter.com/HLeeE5scoF — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) March 29, 2023 -
‘అరి’ ట్రైలర్ చూడగానే పులకింత వచ్చేసింది: నిర్మాత అశ్వనీదత్
‘అరి సినిమా ట్రైలర్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ చూడగానే టెక్నీషియన్ అంతా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు అనిపిస్తోంది. ఈ సమ్మర్ లో వస్తోన్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అన్నారు. పేపర్‌బాయ్ ఫేం జయశంకర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం అరి. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. నిర్మాత అశ్వనీదత్‌ని కూడా ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెస్కే ప్రసాద్ గారి ద్వారా నిర్మాత శేషుగారు నిర్మించిన అరి చిత్ర ట్రైలర్ ను చూశాను. చూడగానే నాకు ఎంతో పులకింత వచ్చేసింది. పర్టిక్యులర్ గా చెప్పాలంటే శ్రీ కృష్ణుడు ఎక్కడ కనిపించినా.. మా వైజయంతీ మూవీస్ లాగా అది ఎప్పుడూ శుభ సూచకం. గ్యారెంటీ హిట్ అవుతుందనే నమ్మకంతో టీమ్ అందరికీ అడ్వాన్స్ గా కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నాను’ అన్నారు. -
Ari: మంగ్లీ పాటకు విదేశీ యువతులు స్టెప్పులు.. వీడియో
‘పేపర్ బాయ్ ’చిత్రంతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా ‘అరి’.. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉపశీర్షిక. ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించిన సినిమా ఇది. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, సుమన్, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘చిన్నారి కిట్టయ్య’పాటకు ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రముఖ గాయని మంగ్లీ ఆలపించిన ఈ పాటకు విదేశీ యువతులు సైతం ఫిదా అయ్యారు. ఈ పాటకు తమదైన శైలీలో స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. శ్రీకృష్ణుడి గొప్పదనం గురించి తెలియజేస్తూ సాగే ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా అనూప్ రూబెన్స్ స్వరపరిచాడు. -
Ari: మంగ్లీ ఆలపించిన ‘చిన్నారి కిట్టయ్య’ పాట విన్నారా?
పేపర్ బాయ్` ఫేమ్ జయశంకర్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రం ‘అరి’. మై నేమ్ ఈజ్ నోబడీ అనేది ట్యాగ్ లైన్. ప్రముఖ వ్యాపారవేత్తలు శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి సంయుక్తంగా, ఆర్వి రెడ్డి, సమర్పణ లో `అరి` సినిమా ని నిర్మిస్తున్నారు. అనసూయ భరద్వాజ్, సాయికుమార్, వైవాహర్ష, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట విడుదలైంది. కృష్ణుడు గొప్పదనం గురించి తెలియజేసే ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. ప్రముఖ గాయని మంగ్లీ అద్భుతంగా ఆలపించింది. అనూప్ రూబెన్స్ మైమరిపించే సంగీతం అందించారు. ఇక అరి విషయానికొస్తే.. జయశంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో జెలసీ పాత్రలో అనసూయ, ప్రైడ్‌గా సాయి కుమార్, ఆంగర్ క్యారెక్టర్లో శ్రీకాంత్ అయ్యంగార్, లస్ట్‌గా వైవా హర్ష, గ్రీడీ పాత్రలో శుభలేఖ సుధాకర్, అటాచ్ మెంట్ క్యారెక్టర్లో సురభి ప్రభావతి నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి విడుదలకు రెడీ అయిన ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. థియేటర్స్‌లో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయడానికి రూ.10 కోట్లతో డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ కావడంతో ‘అరి’ ని కచ్చితంగా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించడానికి సిద్దమైందట. అయితే చిత్రబృందం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. థియేటర్స్‌లో విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
అనసూయ ‘అరి’పై నెట్‌ఫ్లిక్స్ గురి..రూ.10 కోట్లతో డీల్!
‘పేపర్ బాయ్` ఫేమ్ జయశంకర్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రం ‘అరి’. మై నేమ్ ఈజ్ నోబడీ అనేది ట్యాగ్ లైన్. ప్రముఖ వ్యాపారవేత్తలు శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి సంయుక్తంగా, ఆర్వి రెడ్డి, సమర్పణ లో `అరి` సినిమా ని నిర్మిస్తున్నారు. మనిషి ఎలా బతకకూడదు అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఈ చిత్రంలో జెలసీ పాత్రలో అనసూయ, ప్రైడ్‌గా సాయి కుమార్, ఆంగర్ క్యారెక్టర్లో శ్రీకాంత్ అయ్యంగార్, లస్ట్‌గా వైవా హర్ష, గ్రీడీ పాత్రలో శుభలేఖ సుధాకర్, అటాచ్ మెంట్ క్యారెక్టర్లో సురభి ప్రభావతి నటిస్తున్నారు. టైటిల్ లోగో లాంచ్ నుంచే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి విడుదలకు రెడీ అయిన ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. థియేటర్స్‌లో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయడానికి రూ.10 కోట్లతో డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ కావడంతో ‘అరి’ ని కచ్చితంగా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించడానికి సిద్దమైందట. అయితే చిత్రబృందం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. థియేటర్స్‌లో విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి ప్రస్తుతం ఓ ప్రముఖ పంపిణీ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే సమయంలో నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ రావడంతో నిర్మాతలు ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. మరి ‘అరి’ థియేటర్లో అలరిస్తుందా లేదా ఓటీటీలోకి వస్తుందా చూడాలి. -
అనసూయ ‘అరి’పై మైత్రీ మూవీ మేకర్స్ కన్ను!
ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’. శ్రీమంతుడు సినిమాతో మొదలైన మైత్రీ మూవీ మేకర్స్ ప్రయాణం.. మూడు హిట్లు, ఆరు సక్సెస్‌లతో టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా అవతరించింది. స్టార్ హీరోలతో పాటు అప్ కమింగ్ హీరోలతో ఇంట్రస్టింగ్ కంటెంట్ ప్రజెంట్ చేస్తుంది. టాలెంట్ ఎక్కడ ఉన్నా.. కొత్త కంటెంట్ ఎక్కడ దొరికినా.. మైత్రీ మేకర్స్ దానిని తెలుగు ప్రేక్షకులకు అందజేస్తుంది. తాజాగా మైత్రీ వాళ్ల కన్ను ‘అరి’చిత్రంపై పడిందట. `పేపర్ బాయ్`లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జయశంకర్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రమిది. ప్రముఖ వ్యాపారవేత్తలు శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి సంయుక్తంగా , ఆర్వి రెడ్డి, సమర్పణ లో `అరి` సినిమా ని నిర్మిస్తున్నారు. అనసూయ భరద్వాజ్, సాయికుమార్, వైవాహర్ష, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగో తాజాగా విడుదలైంది. (చదవండి: ‘గుడ్‌బై’ చెప్పడం ఇష్టం లేదు : రష్మిక) టైటిల్ లోగో ఈవెంట్‌కి మైత్రీ మైత్రీమూవీస్ రవిశంకర్ కూడా హాజరయ్యారు. లోగోతో పాటు కాస్సెప్ట్ కూడా బాగా నచ్చడంతో ‘అరి’రైట్స్ తీసుకునేందుకు మైత్రీ మూవీ మేకర్స్ చిత్ర యూనిట్‌తో చర్చలు జరుపుతున్నారట. నిర్మాతల్లో ఒకరైన శేషు మైత్రీ నవీన్‌కు మంచి స్నేహితుడు. దీంతో అరి రైట్స్ కచ్చితంగా మైత్రీ మూవీ మేకర్స్‌కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ చిత్ర దర్శకుడు జయశంకర్‌పై కూడా మైత్రీ మూవీస్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఆయనతో కూడా ఒక సినిమాను తెరకెక్కించాలని చూస్తోందట. మంచి స్క్రిప్ట్ తీసుకొని రమ్మని దర్శకుడికి చెప్పినట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ‘అరి’ తర్వాత జయశంకర్ నయనతారతో ఓ లేడి ఓరియెంటెడ్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. అన్ని కుదిరితే.. ఈ చిత్రం తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో జయశంకర్ కొత్త సినిమా తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. -
సరికొత్త కాన్సెఫ్ట్‌తో నయనతార కొత్త చిత్రం?
ఎకనామిక్ హిట్‌మ్యాన్ ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేస్తారు అనేది చాలా మందికి తెలియని రహస్యం. ఇప్పుడు అదే థీమ్‌తో‘పేపర్ బాయ్’ఫేమ్ జయశంకర్ ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. త్వరలో ఆయన నయనతారతో ఓ లేడి ఓరియెంటెడ్ మూవీని తెరకెక్కింబోతున్న విషయం తెలిసిందే. తొలుత ఈ చిత్రానికి కాజల్‌ని హీరోయిన్గా అనుకున్నారు. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో కాజల్ ప్లేస్‌లో నయనతారను తీసుకున్నారు. ఇప్పటికే దర్శకుడు నయన్‌కు స్టోరీ వినిపించాడట.ఆమెకు కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. (చదవండి: నయన్, విఘ్నేశ్‌ల పెళ్లి డేట్ ఫిక్స్..తిరుమలలో వివాహం!) ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ రూమర్ ఒకటి బయటకు వచ్చింది. తెలుగులో ఇంతవరకు ఎవరు టచ్ చేయని సరికొత్త పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడట జయశంకర్. ఎకనామిక్ హిట్‌మ్యాన్ అనే సరికొత్త కాన్సెప్ట్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడట. ఎకనామిక్ హిట్‌మ్యాన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఎలా కంట్రోల్ చేస్తారు? వారు ఓ దేశ ఆర్థిక వ్యవస్థని ఎలా నాశనం చేస్తారనే విషయాన్ని తెరపై చూపించబోతున్నాడట. రీవేంజ్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో నయనతార సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటులు కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. జయశంకర్ ప్రస్తుతం అనసూయతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది. ఢిఫరెంట్ కాన్సెఫ్ట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘అరి’అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. సాయి కుమార్, అక్షపర్దసాని, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. -
బహ్రెయిన్‌లో భారతీయ బాధితులను వెనక్కి తీసుకురండి
సాక్షి, అమరావతి : బహ్రెయిన్‌లో ఓ ప్రైవేట్ సంస్థ వేధింపులకు గురవుతున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం లేఖ రాశారు. ‘ఉపాధి కోసం వెళ్తే చిత్రహింసలు’ కథనానికి స్పందించి ఆయన ఈ మేరకు లేఖ రాశారు. యాజమాన్య దాష్టీకంతో చాలామంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నానని, స్వదేశానికి తిరిగి వచ్చేందుకు పలువురు సిద్ధంగా ఉన్నట్లు ఆ లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వీరిలో చాలామంది తెలుగువారు ఉన్నారని తెలిపారు. వీరిని వెనక్కి తీసుకురావడానికి అవసరమైన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ విషయంలో విదేశీ వ్యవహారాల శాఖకు ఎలాంటి సమాచారం కావాల్సి ఉన్నా ఏపీ రెసిడెంట్ కమిషనర్, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను సంప్రదించాలని వైఎస్ జగన్ ఆ లేఖలో సూచించారు. ముఖ్యమంత్రి లేఖతో బాధిత కుటుంబాల్లో ఆనందం వజ్రపుకొత్తూరు: శ్రీకాకుళం జిల్లాలో ఉన్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి లేఖ ఎంతో ధైర్యం కలిగించింది. వారిలో ఆనందం నెలకొంది. అయితే, బహ్రెయిన్ వెళ్లేందుకు వెల్డింగ్ ఇనిస్టిట్యూట్లకు రూ.లక్ష వరకు చెల్లించామని, ఆ సొమ్మును తమకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. తమ బిడ్డల కోసం తీసుకున్న చొరవపై వారు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
కేంద్ర మంత్రిని కలవనున్న జ్యోతి కుటుంబ సభ్యులు
సాక్షి, న్యూఢిల్లీ : చైనాలోని వుహాన్‌లో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతిని స్వదేశానికి పంపించేందుకు ఎంపీ బ్రహ్మనందరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయ శంకర్‌ను జ్యోతి కుటుంబ సభ్యులు కలవనున్నారు. మార్చి 14న జ్యోతి వివాహం ఉండటంతో త్వరగా తమ కుమార్తెను స్వస్థలానికి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. భారత్, చైనా మధ్య రాకపోకలు పూర్తిగా నిలిపి వేమడంతో అక్కడ ఉన్న తెలుగు అమ్మాయి జ్యోతి స్వదేశానికి రాలేని స్థితి నెలకొంది. వారం రోజుల క్రితం జ్యోతికి జ్వరం కారణంగా ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో అధికారులు ఇండియాకు తీసుకురాలేకపోయారు. (జ్యోతిని స్వదేశానికి తీసుకోస్తామని కేంద్ర మంత్రి హామీ) -
ప్రవాస భారతీయ దివస్
గల్ఫ్‌డెస్క్ : ప్రవాస భారతీయ దివస్ సందర్భంగా గురువారం ఎనిమిది దేశాల రాయబార కార్యాలయాలలో సమావేశమైన ప్రవాస భారతీయులు, అధికారులతో ఢిల్లీ నుంచి భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పలువురు ప్రవాస భారతీయులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. ఖతార్ లోని దోహా ఇండియన్ ఎంబసీ నుంచి అంబాసిడర్ పి.కుమరన్, ప్రవాసీ సంఘాల ప్రతినిధులు డాక్టర్ నయనా వాఘ్, డాక్టర్ ఆర్.సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
‘పేపర్ బాయ్’ టైటిల్ సాంగ్ లాంచ్
-
‘పేపర్ బాయ్’ ముందే వస్తాడా..?
శైలజా రెడ్డి అల్లుడు వాయిదా పడటంతో ఆ తరువాతి వారం రిలీజ్ అవుతున్న సినిమాల దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. సెప్టెంబర్ 7న భారీ పోటి ఉండటంతో ఒక్కడుగు ముందుకు వేసి ఆగస్టు 31న థియేటర్లలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కిన పేపర్ బాయ్ సినిమాను వారం రోజులు ముందుగానే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. మాస్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సంపత్ నంది నిర్మాతగానూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. తన బ్యానర్లో రెండో సినిమాగా పేపర్ బాయ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోల్కొండ హైస్కూల్ సినిమాలో బాలనటుడిగా పరిచయం అయి తరువాత తను నేను సినిమాతో హీరోగా మారిన సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. భీమ్స్ సంగీతమందిచిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. -
‘పేపర్ బాయ్’ వచ్చేస్తున్నాడు..!
సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లో రెండో ప్రయత్నంగా తెరకెక్కిన పేపర్ బాయ్ సినిమా టీజర్ విడుదలైంది. రామ్‌చరణ్, రవితేజ, గోపిచంద్ లాంటి హీరోలతో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లను తెరకెక్కించిన సంపత్ తన స్వీయ నిర్మాణంలో సినిమాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆది హీరోగా గాలిపటం సినిమాను నిర్మించిన సంపత్ నంది తాజాగా తన బ్యానర్లో రెండో సినిమాను సిద్ధం చేశాడు. తను నేను సినిమాతో పరిచయం అయిన సంతోష్ శోభన్ హీరోగా జయ శంకర్‌ను దర్శకుడి పరిచయం చేస్తూ పేపర్ బాయ్ సినిమాను తెరకెక్కించారు. సపంత్ నంది స్వయంగా కథా కథనాలు అందించిన ఈ సినిమాలో రియా సుమన్, తాన్యా హోపేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ ఆడియో, సినిమా రిలీజ్ డేట్లు త్వరలోనే వెల్లడించనున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. -
ఉద్యమ గురువును ఉపేక్షిస్తారా?
తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం 1969 తొలి దశ ఉద్యమం నుంచి మొన్నటి మలిదశ ఉద్యమం వరకు ప్రొఫెసర్ జయశంకర్‌కు సరి సమానంగా పోరాటం చేసిన సోషలిస్ట్ నాయకుడు, కోదండరాం, గద్దర్, కూర రాజన్న లాంటి ఎందరో ఉద్యమ నాయకులకే గురువు ప్రొ.కేశవరావు జాదవ్. ఆయన 85వ జన్మదినాన్ని (27.01.2018) తెలంగాణ సమాజం విస్మరించడం దారుణం. ఇప్పుడున్న ఉద్య మ పితామహుల్లో ఈయన ఒకరు. యావత్తు తెలంగాణ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై జాదవ్‌ని గౌరవించవలసిన బాధ్యత ఉన్నది. కానీ ప్రభుత్వం నుంచి ఈ సందర్భంగా ఒక చిన్న ప్రకటన కూడా రాకపోవడం బాధాకరం. ఉద్దేశపూర్వకంగా మరచిపోతే అది కుట్రపూరితమే. పొరపాటుగా ఆయన పుట్టినరోజును మరిచారంటే అజ్ఞానులే! మన పెద్దలను, ఉద్యమ దిగ్గజాలనే మరచిపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? 1969 తెలంగాణ ఉద్యమానికి ఆయన సజీవ సాక్ష్యం! మృదు భాషే కానీ అన్యాయాన్ని నిర్భయంగా నిలదీసే తత్వం ఆయనలో ఎల్ల ప్పుడూ కనిపించేది. సాదా సీదా జీవితం గడిపారు, ఇంకా గడుపుతున్నారు. సమైక్యవాదులను గౌరవిస్తూ, తెలంగాణ సాధనే జీవిత లక్ష్యంగా తమ జీవితాన్ని అంకితం చేసిన వారిని విస్మరించడం సబబేనా? – సయ్యద్ రఫీ, చిత్ర దర్శకుడు -
మదపుటేనుగు దాడిలో ఆడ ఏనుగు మృతి
మదపుటేనుగు దాడిలో ఆడఏనుగు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని నాగిరెడ్డిపల్లె, చిన్నశ్యామ గ్రామంలో మంగళవారం ఈ సంఘటన బయటపడింది. స్థానికుల కథనం మేరకు చిన్నశ్యామ వద్ద కోసువాముల బండ వద్దకు మంగళవారం ఉదయం పశువుల కాపరులు వెళ్ళారు. సమీపంలోని పొదల నుంచి దుర్వాసన వస్తుండడంతో గ్రావుస్తులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పదేళ్ళ వయస్సు ఉన్న ఆడ ఏనుగు మృతి చెందినట్లుగా నిర్ధారించుకున్నారు. పలవునేరు రేంజ్ పరిధిలో తిరుగాడుతున్న మదపుటేనుగుల దాడిలో గర్భధారణ వయుస్సుకు రాని ఆడఏనుగు తీవ్రంగా గాయుపడి మృతి చెందినట్లు డీఆర్వో జయశంకర్ తెలిపారు. తిరుపతి జూపార్క్ నుంచి వస్తున్న పశువైద్యాధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
సార్... జోహార్!
-
అరుదైన గౌరవం
* జయశంకర్‌కు పద్మవిభూషణ్, అంపశయ్య నవీన్‌కు, అంద్శైకి పద్మశ్రీ * కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం సిఫారసు హన్మకొండ కల్చరల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దేశంలోని అత్యున్నత అవార్డులకు జిల్లాకు చెందిన ప్రముఖుల పేర్లు అగ్రభాగంలో ఉన్నాయి. పద్మ విభూషణ్ అవార్డు కోసం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, పద్మశ్రీ అవార్డుల కోసం కథానవలా రచయిత డాక్టర్ అంపశయ్య నవీన్, తెలంగాణ వాగ్గేయకారుడు అంద్శై పేర్లను కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం సిఫారసు చేసింది. గతంలో జిల్లాకు చెందిన ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు పద్మవిభూషణ్, ధ్వన్యనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరేళ్లవేణుమాధవ్‌కు పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఆ తర్వాత చాలా విరామం ఏర్పడింది. గతంలో అవార్డులకు డాక్టర్ అంపశయ్యనవీన్, ఇంటాక్ జిల్లా కన్వీనర్ విశ్రాంత ఆచార్యులు పాండురంగారావు, చిందు కళాకారుడు గడ్డం శ్రీనివాస్ పేర్లు ప్రతిపాదనలో ఉన్నప్పటికీ.. వారికి రాలేదు. ఆచార్య జయశంకర్.. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 1934 లో జన్మించారు. బనారస్, ఆలీఘర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. కాకతీయ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా పనిచేశారు. జాతీయస్థాయిలో అనేక విశ్వవిద్యాలయాల్లో విద్యావేత్తగా గుర్తింపు పొందారు. ప్రత్యేకించి తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవంగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఆయన ప్రతి పాదనలు, ఎత్తుగడలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాతిపితగా పిలుచుకునే ఆచార్య జయశంకర్‌కు పద్మవిభూషణ్ ఇవ్వడం సమంజసమని తెలంగాణవాదులు, ఆయన అభిమానులు భావిస్తున్నారు. డాక్టర్ అంపశయ్య నవీన్.. కథానవలా రచయిత అంపశయ్యనవీన్ 1941లో జన్మిం చారు. ఆయన అసలుపేరు దొంగరి మల్లయ్య. తను రాసిన నవల పేరుతో అంపశయ్య నవీన్‌గా గుర్తింపు పొందారు. ఆయన 30కిపైగా నవలలు రాశారు. కాలరేఖ నవల సుదీర్ఘమైన తెలంగాణ పోరాట నేపథ్య పరిస్థితులను వివరించేదిగా 16 వందల పేజీలతో ప్రచురించబడింది. ఈ నవలా రచనకు గాను 2004లో ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. కేయూ ఆయనను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది. తెలంగాణలో మంచి సినిమాలు చూడాలనుకునే వారి కోసం ఆయన కరీంనగర్లో ఫిల్మ్ సొసైటీ ఏర్పాటు చేసి కొత్త ఉద్యమానికి నాంది పలికారు. గత నాలుగేళ్లుగా నవీన్ పేరిట ఆయన పుట్టినరోజున తెలుగు నవలా సాహిత్య అవార్డులను అందజేస్తున్నారు. నాలుగేళ్ల క్రితమే నవీన్ పేరు పద్మశ్రీ అవార్డులకోసం ప్రతిపాదించబడినప్పటికీ ఆయనకు రాలేదు. డాక్టర్ అంద్శై... తెలంగాణ జన జీవితంలో ప్రతిష్టాత్మకమైన రీతిలో గుర్తింపు పొందిన వాగ్గేయకారుడు డాక్టర్ అంద్శై. ఆయన అసలు పేరు అందె అయిలయ్య. జనగామ పరిధిలోని రేబర్తి గ్రామంలో 1961లో జన్మించారు. శృంగేరి మఠానికి చెందిన శంకర్‌మహారాజ్ బోధనలతో ప్రభావితుడై ప్రజాకవిగా, ప్రకృతి కవిగా మారారు. 2006లో గంగా సినిమాలో రాసిన పాటకు అంద్శై నంది అవార్డు అందుకున్నారు. 2009లో అంద్శై రాసిన ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ పాట ఎర్రసముద్రం సినిమాలో ఉపయోగించుకోవడమేకాకుండా... యూనివర్సిటీ స్థాయి డిగ్రీ రెండో సంవత్సరం పాఠ్యాంశంగా చేర్చబడింది. అంద్శై రాసిన ‘పల్లె నీకు వందనాలమ్మో .., గలగల గజ్జెల బండి ఘల్లూ నీది ఓరుగల్లు నీది.., కొమ్మచెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా.., ఎల్లిపొతున్నావా తల్లి.., చూడా చక్కని తల్లి చక్కానీ జాబిల్లి.., జనజాతరలో మనగీతం జనకేతనమై ఎగరాలి’.. పాటలు ఆయనలోని తాత్వికతకు, చైతన్యశీలతకు నిదర్శనంగా కన్పిస్తాయి. అంద్శై రాసిన జయజయహే తెలంగాణ రాష్ట్రగీతంగా ఎంపికైంది. కేయూసీ నుంచి ఆయన గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో అంద్శైకి పద్మశ్రీ రావల్సిందేనని కళాకారులు, కవులు అంటున్నారు. -
ప్రొ.జయశంకర్ విగ్రహావిష్కరణ
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్‌లోని నాన్ టీచింగ్ హోంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని టీఎన్జీఓస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. జయశంకర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లేష్‌తో పాటు ఉద్యోగ సంఘాల నేతలు పార్థసారథి, మల్లేష్, జ్ఞానేశ్వర్, అవినాష్, దీపక్‌కుమార్, మహమూద్, అక్బర్‌బేగ్, ఓం ప్రకాష్, ఖాజమోహినుద్దీన్, ఎల్లమయ్య, భూమారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్జీఓస్ స్టాఫ్ అసోసియేషన్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్ల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ఈద్ మీలాఫ్ ఉత్సవాలను నిర్వహించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ అమరుల కుటుంబాల కోసం ఓయూ ఉద్యోగులు సేకరించిన రూ.14.50 లక్షల చెక్‌ను టీఎన్జీఓస్ అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌కు వారు అందించారు. విద్యార్థుల ఆందోళన ఓయూలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రులు వస్తున్నారని తెలుసుకున్న విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు మంత్రులను అడ్డునేందుకు ర్యాలీగా బయలుదేరారు. ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకొని పది మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. వారిని లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరిస్థితిని తెలుసుకున్న మంత్రులు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. -
జూ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం
వరంగల్ పార్కుకు జయశంకర్ పేరు అటవీశాఖ మంత్రి జోగు రామన్న బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కుకు మరిన్ని వన్యప్రాణులను తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. జూలోని వివిధ ఎన్క్లోజర్లను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ వరంగల్ మినీ పార్కును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి దానికి తెలంగాణ సిద్ధాంతకర్త దివంగత ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడతామన్నారు. జూలోని ఉద్యోగులను వాచ్మెన్, లేబర్‌గా పిలివడాన్ని మార్చి అసిస్టెంట్ సార్జెంట్‌గా ఇతర పేర్లకు మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జూ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు. అనంతరం జూలోని జిరాఫీకి మంత్రి అరటి పండు, ఆపిల్‌ను తినిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర జూ పార్కుల డెరైక్టర్, అడిషనల్ పీసీసీఎఫ్ పి.మల్లికార్జున్ రావు, జూ క్యూరేటర్ బి.ఎన్.ఎన్.మూర్తి, జూ ఏసీఎఫ్ పి.శామ్యూల్, జూ వెటర్నరీ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ అబ్దుల్ హకీం, అసిస్టెంట్ క్యూరేటర్లు మోబీన్, రమేశ్, సరస్వతి, జూ పీఆర్వో హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఆ పోస్టులను తెలంగాణ ఉద్యోగులకు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ చేసిన నెహ్రూ జూలాజికల్ పార్కులోని 40 పోస్టులను ఉద్యోగులను వెంటనే తెలంగాణకు తీసుకొచ్చి జూలో కాంట్రాక్ట్, డెలీవైజ్గా పని చేస్తున్న ఉద్యోగులతో పర్మినెంట్ చేయాలని జూ యానిమల్ కీపర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. దేవేందర్, ఆయూబ్ కౌసర్ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. -
పెద్ద సార్ ఆశయాల కనుగుణంగా...తెలంగాణ
బంగారు తెలంగాణే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషిచేయాలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలంగాణ జాతిపితకుఘన నివాళి హన్మకొండ సిటీ : ‘పెద్ద సార్ చూపిన మార్గంలో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అందరం భాగస్వాములై కొత్త పల్లి జయశంకర్ ఆశించిన తెలంగాణను నిర్మిం చుకుందాం. బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగాలి.’ అని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ మూడో వర్ధంతిని పురస్కరించుకుని హన్మకొండ ఏకశిల పార్కులోని ఆయన విగ్రహానికి డిప్యూటీ సీఎంతోపాటు శాసన సభా స్పీకర్ సిరికొండ మధుసూద నాచారి, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, కలెక్టర్ జి.కిషన్ పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ ఊపిరి పోశారన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, తెలంగాణ దార్శనికుడని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు నిరంతరం ఉద్యమించారన్నారు. మలిదశ ఉద్యమం ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించడంలో.. హింసకు తావులేకుండా పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఆయన మార్గదర్శకంగా నిలిచారన్నారు. ఏకశిల పార్కును జయశంకర్ సార్ స్మృతి వనంగా తీర్చిదిద్దుతామన్నారు. కొత్తగా భూపాలపల్లి కేంద్రంగా ఏర్పాటు చేయనున్న జిల్లాకు జయశంకర్ పేరును పెడతామని పునరుద్ఘాటించారు. జయశంకర్ వర్ధంతిని ప్రభుత్వమే నిర్వహిస్తోందని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి తెలిపారు. ఈ రోజు ఆయన లేకపోవడం దురదృష్టకరమన్నారు. వారు కోరుకున్న తీరులో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని... ప్రజలు ఆశించిన తెలంగాణను నిర్మించుకుందామన్నారు. వరంగల్ నగరంలోని ప్రధాన కూడలిలో జయశంకర్ కాంస్య విగ్రహాన్ని ఆరు నెలల్లో ఏర్పాటు చేయనున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు. దీంతోపాటు అధ్యయన కేంద్రం, గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మర్రి యాదవరెడ్డి, లలితా యాదవ్, లింగంపల్లి కిషన్‌రావు, నాగేశ్వర్రావు, గుడిమల్ల రవికుమార్, కమరున్నీసా బేగం, వాసుదేవరెడ్డి, నయూమొద్దీన్, మరుపల్లి రవి పాల్గొన్నారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో... ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉద్యోగ జేఏసీ నాయకులు పరిటాల సుబ్బారావు, జగన్మోహన్రా వు, కోల రాజేష్‌కుమార్, రత్నవీరాచారి, హసన్, రత్నాకర్ రెడ్డి, ధరంసింగ్, శ్యాం సుందర్, రమేశ్, శ్రీనివాస్, షేక్‌హుస్సేన్, శ్యామల రమేశ్ పాల్గొన్నా రు. కాగా, జయశంకర్ విగ్రహానికి కవులు, రచయితలు అంపశయ్య నవీన్, పొట్లపల్లి శ్రీనివాస్, నాగిళ్ల రామశాస్త్రి, అశోక్‌తోపాటు పలువురు సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
జయశంకర్‌కు ఘననివాళి
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పట్టణంలో శనివారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ మూడో వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొని యాడారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో పట్టణంలోని సంఘ భవనంలో జయశంకర్ వర్ధంతి నిర్వహించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవీంద్ర మాట్లాడుతూ జయశంకర్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర మరువలేనిదని, తెలంగాణ జాతిపితగా ఆయన కీర్తి అందుకున్నారని పేర్కొన్నారు. సంఘం నాయకులు నరేందర్, విలాస్, యాదగిరి, మనోజ్, రాజు, భూపతి, సుజీత్, నారాయణ, రమేశ్ పాల్గొన్నారు. టీయూటీఎఫ్ ఆధ్వర్యంలో.. టీయూటీఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని సంఘ భవనంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లచ్చిరాం మాట్లాడుతూ రాష్ట్రంలో అందరూ సుఖసంతోషాలతో ఉన్నప్పుడే జయశంకర్‌కు నిజమైన నివాళి అర్పించినట్లు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు నారాయణరెడ్డి, కార్యదర్శి రాంరెడ్డి, వివిధ మండలాల నాయకులు రామకృష్ణ, వినోద్‌రెడ్డి, భీంరావు, కిషన్, నానాజీ, గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణ జాతిపిత జయశంకర్
మేడ్చల్: దివంగత ఉద్యమ కెరటం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపితలాంటివారని కోదండరాం అన్నారు. జిల్లా తూర్పు జేఏసీ ఆధ్వర్యంలో మేడ్చల్‌లో శనివారం జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి కోదండరాం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్రం ఏ ఒక్కరివల్లో రాలేదని ప్రజలంతా ఐక్యంగా చేసిన పోరాటాలతోనే సాధ్యమైందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన లేకపోవడం తెలంగాణ ప్రజలకు తీరని లోటన్నారు. జయశంకర్ చరిత్ర, తెలంగాణ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. కోదండరాం లాంటి వ్యక్తులు ప్రభుత్వ సలహాదారులుగా ఉండాలని కాంక్షిస్తున్నట్లు చెప్పారు. సభకు మేడ్చల్‌కు చెందిన వివిధ కళాశాలల, పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా జేఏసీ నాయకులు చల్మారెడ్డి, సంజీవరావు, మేడ్చల్ జేఏసీ నాయకులు రాంచంద్రారెడ్డి, హరికిషన్, మల్లారెడ్డి, పాండు, బాల్‌రాజ్, లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
రాష్ట్రాభివృద్ధికి విద్యార్థులే పునాదులు
నందిపేట రూరల్ : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి విద్యార్థులే పునాదులు కావాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆకాంక్షించారు. వ్యక్తిగతంగానే కాకుండా దేశ, భాషాభివృద్ధికి శిక్షణ వ్యవస్థ కీలకమని అన్నారు. సోమవారం మండలంలోని డొంకేశ్వర్ ప్రభుత్వ పాఠశాలలో ‘ప్రొఫెసర్ జయశంకర్ బడి పండుగ’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కూడా శిక్షణ వ్యవస్థ నుంచే ప్రారంభం కావాలని అన్నారు. 5 నుంచి 14 సంవత్సరాలలోపు బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పిం చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఎన్ని వసతులు కల్పించినా ఎక్కడో ఒకచోట విమర్శలు ఎదురవుతునే ఉన్నాయన్నారు. పాఠశాలల్లో అదనపు గదులు కట్టించినంత మాత్రాన సమస్యలు తీరిపోవని, పాఠశాలకు పూర్తిస్థాయిలో విద్యార్దులు వచ్చినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందన్నారు. మనం చేసే ప్రయత్నం మంచిదై సదుద్దేశంతో చేస్తేనే విజయం సాధిస్తామని, ప్రయోజనంలేని పనిచేయడం వ్యర్థమన్నారు. జిల్లా, రాష్ట్ర, దేశస్థాయిలో డొంకేశ్వర్ పాఠశాల విద్యార్థులు చదువులో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు. అందుకు తమ సహాయం పూర్తి స్థాయిలో అందిస్తామన్నారు. పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణానికి ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని తాను చెప్పడం లేదని, అందులో రెండు శాతం తక్కువయినా జ్ఞానాన్ని మాత్రం విద్యార్థులు సముపార్జించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మన పక్కనే ఉన్న సరస్వతి మాతా ఆశీస్సులతో జిల్లాలోని ప్రతి విద్యార్థి మంచిఫలితాలు సాధించాలని, అందుకు డొంకేశ్వర్ పాఠశాల విద్యార్థులే ఆదర్శం కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాదికారి శ్రీనివాసాచారి, స్థానిక సర్పంచ్ హరి దాస్, ఆర్వీఎం పీఓ కిషన్‌రావు, సీఎంఓ స్వర్ణలత, మండల విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఇన్చార్జి హెచ్ఎం అశోక్, ఎంపీడీఓ నాగవర్ధన్, విద్యాకమిటీ చైర్మన్ రాములు తదితరులు పాల్గొన్నారు. దీపికకు కలెక్టర్ అభినందన నందిపేట రూరల్ : ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 10/10 గ్రేడు సాధించిన మండలంలోని తల్వేద ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని పి. దీపికను కలెక్టర్ ప్రద్యుమ్న అభినందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని దీపిక, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులతో పోటీపడి ఈ ఘనత సాధించడం హర్షించదగిన విషయమన్నారు. చదువుకు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల అనే తేడా ఏమీ ఉండదని, ముందుగా చదువుకోవడానికి ప్రయత్నం, సాధించాలనే పట్టుదల ఉంటే ఫలితం మనముందే సాక్షాత్కరిస్తుందన్నారు. అందుకు దీపికే నిదర్శనమన్నారు. విద్యార్థులకు చదువుచెప్పడంతోనే ఉపాధ్యాయుల బాధ్యత తీరదని, నిజాయితీగా పనిచేసి చదువుకు సార్థకత చేకూరేలా విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దినపుడే తగు న్యాయం చేసినవారవుతారన్నారు. దీపికను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. -
దశ మారుస్తాం
60 టీఎంసీల సామర్థ్యం గల రెండు ప్రాజెక్టులు సాధిస్తాం నగరంలో అండర్డ్రెయినేజీ, రింగ్‌రోడ్డు నిర్మిస్తాం ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి జయశంకర్ పేరుపెడతాం : టీఆర్ఎస్ నేత కేసీఆర్ హామీ వరంగల్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ అభివృద్ధి చెందాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆకాంక్ష వ్యక్తం చేశారు. నలభైయేండ్ల క్రితం వరంగల్ ఎట్లుందో ఇప్పుడూ అట్లనే ఉంది.. ఇక్కడ బలమైన నాయకుడు రాలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. నగరశివారు మడికొండలో గురువారం రాత్రి జరిగిన ‘ఓరుగల్లు గర్జన’ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పూర్తి భరోసా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వస్తే జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. వరంగల్ జిల్లాలో గొలుసుకట్టు చెరువులతో వాటర్‌షెడ్‌ను కాకతీయులు గొప్పగా నిర్మించారని, 11శతాబ్దంలోనే ప్రపంచానికి వాటర్షెడ్లు నేర్పిన జిల్లాలో మంచినీళ్ళకు ఇబ్బంది పడుతున్నారని, ఈ కరువు పరిస్థితి మారాలన్నారు. హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. అజంజాహి మిల్లు వలసవాదుల పాలనలో నాశనమైదని, ఆ మిల్లు స్థానంలో తమిళనాడు తిరువూరు తరహాలో టెక్స్టైల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారు. కాజీపేట రైల్వే జంక్షన్, మామునూరు ఎయిర్‌పోర్టు ఉన్నందున టెక్స్టైల్ హబ్‌గా అభివృద్ధి చెంది వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉందన్నారు. జిల్లాలో పత్తి ఎక్కువ పండుతుందని, మూడు నాలుగు జిల్లాలకు కలిపి కాటన్ మార్కెట్ విస్తరించి ఇక్కడే కొనుగోలు చేసేవిధంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ‘పొన్నాల లక్ష్మయ్య పొంకనాలు మాట్లాడుతున్నాడు.. నగరానికి అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ ఎందుకు తేలేకపోయాడో చెప్పాలి’ అని నిలదీశాడు. కమీషన్లు వసూలు చేసుకునేందుకే టైమ్ సరిపోలేదా? అంటూ విమర్శించారు. దాస్యం వినయభాస్కర్, కొండా సురేఖలను గెలిపిస్తే మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఇక్కడ అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి తానే శంకుస్థాపన చేస్తానని, రింగ్‌రోడ్డును తానే పర్యవేక్షించి నిర్మాణం చేయిస్తామని చెప్పారు. వరంగల్ ప్రగతిబాట పట్టాలి..ఎవడు అడ్డమొస్తడో చూస్తానంటూ సవాల్ చేశారు. చంద్రబాబు హయంలో దేవాదులకు శంకుస్థాపన చేసిండ్రు... తర్వాత ఆరేండ్లు పొన్నాల లక్ష్మయ్య భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాజెక్టు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు నీ చేతుల తెలంగాణ పెడితే జిల్లాకు నీళ్లొస్తయా? అని నిలదీశారు. ‘పొన్నాల ఒక్కనాడైనా ఉద్యమంలో ఉన్నడా? యాకూబ్‌రెడ్డిని పశువులెక్క చితక్కొట్టించిండు. ఇంటిచుట్టూ ముళ్ళకంచెలు పెట్టుకున్నడు’ అని మండిపడ్డారు. ఉద్యమాన్ని చేసినట్లు జిల్లాలో నీళ్ళు తెచ్చి పారిస్తం.. పక్కనే గోదావరిలో కావాల్సినన్ని నీళ్ళున్నయి. 60 టీఎంసీల సామర్థ్యంతో రెండు ప్రాజెక్టులు కడుతమని హామీ ఇచ్చారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. జూరాల-పాకాల ప్రాజెక్టును జబర్దస్తీగా సాధించుకుంటామని, 400 కిలో మీటర్లు లిఫ్ట్లేకుండా నీళ్లు వస్తాయని, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలో చెరువులు, కుంటలు నీళ్లతో నింపొచ్చన్నారు. కేంద్రంతో కొట్లాడి ఖమ్మం, వరంగల్ సరిహద్దులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, రైల్వే వ్యాగన్ పరిశ్రమ, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని, కాజీపేటను డివిజన్‌గా తీర్చిదిద్దుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇక్కడ కాకతీయుల వారసత్వ సంపద ఉందని, రామప్ప, పాకాల, లక్నవరం ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా చేసి ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాగా పేరుపెడ్తామని ఆయన చెప్పారు. జయశంకర్ తనకు ఉద్యమగురువని, బతికున్నంత కాలం ఆయన తన గుండెల్లో ఉంటారని కేసీఆర్ అన్నారు. -
డీఎండీకే అభ్యర్థి మార్పు
సాక్షి, చెన్నై: కడలూరు అభ్యర్థిని మారుస్తూ డీఎండీకే అధినేత విజయకాంత్ నిర్ణయం తీసుకున్నారు. రామానుజంకు బదులుగా జయ శంకర్ పోటీ చేస్తారని గురువారం ప్రకటించారు. బీజేపీ కూటమితోకలసి లోక్‌సభ ఎన్నికలను డీఎండీకే ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి 14 సీట్లను కేటాయించారు. అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విజయకాంత్ తమ కూటమికి మద్దతుగా ప్రచార బాటలో పయనిస్తున్నారు. రాష్ట్రంలో సుడిగాలి పర్యటన సాగిస్తున్న విజయకాంత్ రెండు రోజుల క్రితం కడలూరులో ప్రచారం చేపట్టాల్సి ఉంది. అయితే, ఆయనకు ఊహించని రీతిలో షాక్ ఎదురు అయింది. ఇప్పటికే నామక్కల్‌లో తనకు సీటు వద్దు బాబోయ్ అంటూ మహేశ్వరన్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోని విజయకాంత్‌కు తాజాగా మరో సమస్య ఎదురైంది. కడలూరు అభ్యర్థి స్థానికుడే కాదన్నది తేలింది. దీంతో అక్కడ పర్యటనను వాయిదా వేసుకుని, పార్టీ నాయకులతో మంతనాలు, చర్చల అనంతరం కొత్త అభ్యర్థిని ప్రకటించే పనిలో పడ్డారు. షాక్: కడలూరు అభ్యర్థిగా రామానుజం పేరును విజయకాంత్ తొలుత ప్రకటించారు. రిటైర్డ్ ప్రొఫెసర్‌గా ఉన్న రామానుజం స్వగ్రామం దిట్టకుడి. పార్టీకి చెన్నై నుంచి ఆయన సేవలను అందిస్తూ వస్తున్నారు. ఆవడి సమీపంలో నివాసం ఉంటున్నారు. అయితే, ఆయన చెన్నైలోనే స్థిర పడ్డ దృష్ట్యా, కడలూరు గురించి తెలిసింది శూన్యం. అక్కడ పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంది లేదు. కడలూరు ప్రచారానికి ముందు రోజు తన దృష్టికి ఈ విషయం రావడంతో విజయకాంత్ విస్మయంలో పడ్డారు. హుటాహుటిన పార్టీ నాయకుల్ని చెన్నైకు పిలిపించి చర్చించారు. వారి నుంచి కూడా అదే సమాధానం రావడంతో ఇక అభ్యర్థిని మార్చాల్సిన సంకట పరిస్థితి విజయకాంత్‌కు ఏర్పడింది. ఇక, నియోజకవర్గంలో ప్రచారం చేపట్టొద్దంటూ రామానుజంను వెనక్కు పంపించేశారు. బరిలో జయ శంకర్: ఎట్టకేలకు కొత్త అభ్యర్థిగా సీఆర్ జయశంకర్‌ను గురువారం విజయకాంత్ ఎంపిక చేశారు. కడలూరు జిల్లా నైవేలికి చెందిన జయ శంకర్ ఫైనాన్సియర్, ఆ జిల్లా పరిధిలో 25కు పైగా ఫైనాన్స్ కార్యాలయ శాఖలు ఉండడంతోపాటు సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థినే విజయకాంత్ ఎంపిక చేశారు. జయ శంకర్ వద్ద 30 వేల మందికి పైగా పని చేస్తుండటంతో సరైన అభ్యర్థిని రంగంలోకి దించారన్న ప్రచారం మొదలైంది. ఇన్నాళ్లు అభ్యర్థులను మార్చే అలవాటు అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మాత్రమే ఉండేది. దీనిపై పలు మార్లు విజయకాంత్ విమర్శలు గుప్పించి ఉన్నారు. అయితే, తాజాగా అదే పరిస్థితి ఆయనకు రావడం గమనార్హం. -
వచ్చిన రాష్ట్రాన్ని కాపాడుకుందాం
=పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి =టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ వరంగల్ రూరల్, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ సాధించడంతోనే మన బాధ్యత తీరిపోలేదు.. రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములై కంటికి రెప్ప లా కాపాడుకుందామని టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. మామునూర్ ఫాత్ ఫైండర్ పాఠశాల ఆవరణ లో నిర్వహిస్తున్న పార్టీ హన్మకొండ మండల కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా శనివారం హాజరయ్యారు. ముందుగా తెలంగాణ సిద్ధాంతకర్త దివంగత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈటెల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి 13 ఏళ్లపాటు చేసిన ఉద్యమాలతో సిద్ధించిన రాష్ట్రం పూర్తిగా రూపుదిద్దుకునే వరకూ యువకులు, మేధావు లు, అన్ని వర్గాల వారు అప్రమత్తంగా ఉండాల ని కోరారు. ప్రజల జీవితాల్లో వికాసం, అభివృ ద్ధి జరిగినప్పుడే మన మీద విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణం తర్వాత రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే వనరులను సద్వినియోగం చేసుకుని బీడు భూములను సాగులోకి తెచ్చుకుని అభివృద్ధి పథంలో పయనించాలన్నారు. కే జీ నుంచి పీజీ వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ద్వారా ఉచి తంగా విద్య అందుకునేలా, పేదలకు పక్కా ఇళ్లు, పింఛన్ రూ.వెయ్యికి పెంచుకోవడానికి ప్ర ణాళికలు రూపొందించి అమలుచేసుకుందామ ని చెప్పారు. ఇందుకోసం తుదికంటా కృషి చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు మాయ మాటలను ఎవ్వరూ నమ్మరని, తెలంగాణ బిల్లును అడ్డుకుంటే మరోసారి అభాసు పాలవుతారని స్పష్టం చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ సాధన లో 60 ఎళ్ల ఉద్యమం ఒక ఎత్తయితే.. 13 ఎళ్ల టీఆర్ఎస్ పోరాటాలు, కేసీఆర్ దీక్ష మరో ఎత్తు అని అభివర్ణించారు. ప్రస్తుతం పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఎర్పడిందని, అంక్షలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నా రు. స్టెషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ రాష్ట్ర కోసం చిత్తశుద్ధితో పోరాడి న ఉద్యమ సారధులనే ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసమే పుట్టిన పార్టీ రాష్ట్ర అవిర్భావం తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని చెప్పారు. ఉద్యమంలో హన్మకొండ మండల ప్రజల పాత్ర కీలకమైనదని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ అమరుల త్యాగాల ఫలితంగానే రాష్ర్టం సిద్ధించిందన్నారు. అంతకు ముందు మహిళలు బతుకమ్మలు చెతపట్టుకుని సభాస్థలికి చేరుకున్నారు. నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్ధనపేట నియోజకవర్గ ఇన్చార్జ్ ఆరూరి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు మర్రి యాదవరెడ్డి, బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, లలితాయాదవ్, రాజయ్య యాద వ్, ఇనుముల నాగేశ్వర్రావు, పసునూరి దయాకర్, నయీమొద్దీన్, వనంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘బిల్లు’ ఆపే శక్తి ఎవరికీ లేదు కొడకండ్ల : వచ్చే శీతకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో అత్యధిక మెజార్టీతో ఆమోదం పొందుతుంది.. దానిని ఆపే శక్తి ఎవరికీ లేదని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక పద్మశాలి ఫంక్షన్ హాల్లో మండల పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన పార్టీ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భగా మా ట్లాడుతూ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎజెం డాలో తెలంగాణ అంశం ఉందని, 2009 టీఆర్ఎస్తో పొత్తు సందర్భంగా టీడీపీ అధినేత ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చారని చెప్పారు. గతంలో తెలంగాణకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించిన వీరు ఇప్పుడు శాసనసభలో తెలంగాణ బిల్లు ఎలాఆమోదించరో చూస్తామని అన్నారు. -
జయశంకర్ సార్ పేరుతో జిల్లా ఏర్పాటు చేస్తాం
ధూల్మిట్ట(మద్దూరు), న్యూస్‌లైన్ : తెలంగాణ ఏర్పాటైన తర్వాత కొత్తగా ఏర్పడే జిల్లాల్లో ఒక జిల్లాకు జయశంకర్ పేరు పెడుతామని, ఆయన పేరున ప్రతీ మండలానికో ఇంగ్లిషు మీడియం స్మారక పాఠశాలలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు బోధన చేయిస్తామని టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు అన్నారు. మద్దూరు మండలం ధూల్మిట్టలో ధూల్మిట్ట డెవలప్ మెంటు ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్ విగ్రహాన్ని ఆయన కోదండరాంతో కలిసి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఫోరం అధ్యక్షుడు శివ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ తమకు ఉద్యమాల ఓనమాలు నేర్పింది జయశంకర్ సార్ అని, తెలంగాణ.. సీమాంధ్రల దోపిడీకి గురైన విధానాన్ని గత 60 సంవత్సరాల లెక్కలను రాసి ఇంగ్లీష్‌లో సీడీని తీసి భారదేశం అంతటా ప్రచారం చేసిన వ్యక్తి జయశంకర్సారని అన్నారు. తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో.. వచ్చిన తెలంగాణను నిర్మించుకోవడం అంతే ముఖ్యమని, ఈ మాట జయశంకర్ సార్ తరచూ అనే వారని గుర్తు చేశారు.మేధావి నిశ్శబ్దంగా ఉంటే ఉగ్రవాదం కంటే ప్రమాదమైందని చాటిచెప్పిన మహానీయుడని కొనియూడారు. సీఎం కిరణ్ రూ. 5800 కోట్లను తన చిత్తూరు జిల్లాకు మంచినీటి కోసం తీసుకెళ్తున్నా తెలంగాణ మంత్రులు నోరుమెదపడం లేదని విమర్శించారు. సభలో కవి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ నిస్వార్థంగా తన జీవితాన్ని తెలంగాణ ప్రజలకు అర్పించిన మహా త్యాగశీలి జయశంకర్‌సారు అని అన్నారు. సారు ఆశీర్వాదంతోనే కే సీఆర్ ఉద్యమాన్ని ప్రారంభించారని అన్నారు. ప్రతీ విషయంలో కేసీఆర్‌కు జయశంకర్ అండగా ఉండి ఉద్యమానికి నిఘంటువుగా నిలిచాడన్నారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ముత్తిరెడ్డి యూదగిరిరెడ్డి మాట్లాడుతూ 60 సంవత్సరాలుగా తెలంగాణ కోసం పోరాడి.. తెలంగాణ ఏర్పాటు తరుణంలో జయశంకర్ సారు లేక పోవడం బాధాకరమన్నారు. ఆయన మన మధ్యలో లేకున్నా ఆయన ఆశయాలు మాత్రం సజీవంగా ఉన్నాయన్నారు. అనంతరం గిద్దె రాంనర్సయ్య కళాబృందం ఆధ్వర్యంలో ధూంధాం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ పాపిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు, రాష్ట్ర ఇంజనీర్ల జేఏసీ నాయకులు ముస్త్యాల బాలనర్సయ్య, మద్దూరు,నర్మెట్ట మండలాల పార్టీ అద్యక్షులు తాడెంశ్రీనివాస్, గద్దల నర్సింగరావు,బక్కనాగరాజు,బర్మరాజమల్లయ్య,జక్కిరెడ్డి సుదర్శన్‌రెడ్డి,గ్రామసర్పంచ్ పద్మ, ఉపసర్పంచ్ తుశాలపురం కనకయ్య వివిధ గ్రామాల కార్యకర్తలు, కళాకారులు, ప్రజలు పాల్గొన్నారు. -
నకిలీ తాళంతోనే సైకో పరార్
బెంగళూరు, న్యూస్‌లైన్ : ఉన్మాది జయ శంకర్ జైలు నుంచి తప్పించుకోవడానికి పకడ్బందీ ప్రణాళికను రచించాడు. జైలులో పని చేస్తున్న ఒకరిద్దరు సిబ్బంది కూడా అతనికి సహకరించినట్లు తెలిసింది. నకిలీ తాళం ద్వారా అతను గేటు తెరచుకుని పారిపోయాడని తాత్కాలికంగా నిర్ధారణ అయింది. దీని కోసం అతను సెల్లార్ 26 వద్ద పని చేస్తున్న వార్డర్ సహాయం కూడా తీసుకున్నాడు. రూ.వెయ్యి లంచం ఇవ్వడంతో ఆ వార్డరే నకిలీ తాళం చేయించి ఇచ్చాడని సమాచారం. ఆ వెయ్యి రూపాయలను కూడా శంకర్ కంతుల్లో చెల్లించాడని తెలిసింది. పైగా వార్డర్, జయ శంకర్ తరచూ మందు కొట్టేవారనే విషయం కూడా బయటపడింది. పారిపోవడానికి ముందు జయ శంకర్ నకిలీ తాళాన్ని పలు మార్లు పరీక్షించినట్లు సమాచారం. ఆగస్టు 31వ తేది అర్ధరాత్రి నుంచి భారీ వర్షం రావడంతో ఇదే అదను అని భావించాడు. జైలు సిబ్బంది నిద్రపోయే వరకు వేచి ఉన్నాడు. తరువాత తాళం తీసి సెల్లార్ నుంచి బయటకు వచ్చాడు. నకిలీ తాళాన్ని గార్డెన్లో విసిరి వేశాడు. అక్కడి నుంచి 15 అడుగుల గోడ మీదుగా సమీపంలోని 20 అడుగుల గోడ వద్దకు చేరుకున్నాడు. తరువాత 30 అడుగుల గోడ మీదకు దుప్పటిని తాడుగా ఉపయోగించి ఎక్కాడు. అక్కడి నుంచి గోడ మీద విద్యుత్ సరఫరా కావడానికి వేసిన ఇనుప రాడ్‌కు బెడ్‌షీట్ కట్టి జైలు ఆవల దిగడానికి ప్రయత్నించి కింద పడిపోయాడని సమాచారం. కాగా నకిలీ తాళం ఇచ్చిన వార్డర్ను త్వరలోనే అరెస్టు చేస్తామని జైళ్ల శాఖ ఏడీజీపీ గగన్‌దీప్ తెలిపారు. కాగా శుక్రవారం రాత్రి జయ శంకర్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ నెల 16 వరకు పోలీసు కస్టడీకి ఆదేశించారు. తప్పించుకునే ప్రయత్నంలో జయ శంకర్ వెన్నుపూస దెబ్బతింది. దీనికి తోడు జైలు నుంచి పారిపోయినప్పటి నుంచి ఐదు రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో అస్వస్థతకు గురయ్యాడు. అతను కోలుకున్న తర్వాత దర్యాప్తు ప్రారంభమవుతుందని పోలీసులు శనివారం తెలిపారు. -
సైకో జయ శంకర్ చిక్కాడు
ఐదు రోజుల పాటు పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టిన సైకో జయ శంకర్ ఎట్టకేలకు చిక్కాడు. ఎక్కడో కాదు పరప్పన అగ్రహార జైలు వెనుక వైపు, జైలు సిబ్బంది క్వార్టర్స్‌కు కిలోమీటరు దూరంలోని కూడ్లు చెరువు పక్కనే ఉన్న ఓ చిన్న గుడిసెలో ఉండగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బెంగళూరు, న్యూస్‌లైన్ : పలు కేసుల్లో సుదీర్ఘ కాలం జైలు శిక్ష అనుభవిస్తూ తప్పించుకున్న సైకో కిల్లర్, సీరియల్ రేపిస్ట్ జయ శంకర్ అలియాస్ శంకర్‌ను ఓ ఫోన్ కాల్ పట్టిచ్చింది. దీంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బెంగళూరు-హొసూరు రోడ్డులోని కూడ్లు గేట్ సమీపంలో చెరువు దగ్గర ఉన్న చిన్న గుడిసెలో అతనిని శుక్రవారం ఉదయం 10.45 గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేసి కట్టుదిట్టమైన భద్రత నడుమ రహస్య ప్రాంతానికి తరలించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ మాట్లాడుతూ... ‘తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన జయ శంకర్ మీద ఆ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో అనేక హత్యలు, లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు డ్రైవర్‌గా పని చేసే వాడు. ఈ నెల 1న పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నాడు. బెంగళూరు నగర, బెంగళూరు సీసీబీ, చిత్రదుర్గ, శిర, బిజాపురలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బందితో ఐదు ప్రత్యేకృబందాలు ఇతని కోసం గాలించాయి. ఇతని ఆచూకీ కోసం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో పది వేల పోస్టర్లను అతికించారు. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, మలయాళం భాషలలో 75 వేల కరపత్రాలు ముద్రించి పంచి పెట్టారు. ఎట్టకేలకు కూడ్లు గేట్ వద్ద పట్టుబడ్డాడు’ అని వివరించారు. జయ శంకర్‌ను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, నగదు బహుమానం ఇవ్వనున్నట్లు తెలిపారు. జైలు నుంచి అతను 30 అడుగుల గోడ దూకడానికి గ్లౌజ్‌లు, దుప్పటి ఉపయోగించాడని చెప్పారు. జయశంకర్ తప్పించుకోవడానికి ఎవరు సహకరించారని అడిగినప్పుడు, దర్యాప్తు జరుగుతోందన్నారు. ఇన్ఫార్మర్ పేరు చెప్పడానికి నిరాకరించారు. ఇన్ఫార్మర్కు తాము ఒక మొబైల్ ఇచ్చామని చెప్పారు. జయ శంకర్ నకిలీ తాళం ఉపయోగించి బయటకు వచ్చాడని, అదే రోజు జైలులోని గార్డెన్లో ఆ తాళం చిక్కిందని వివరించారు. దీనిపై కూడా దర్యాప్తు జరుగుతోందన్నారు. శంకర్ పోలీసు దుస్తులలో పారిపోలేదని, నైట్ డ్రెస్‌లో తప్పించుకున్నాడని తెలిపారు. అదే డ్రెస్‌తో శుక్రవారం పట్టుబడ్డారని అన్నారు. పోలీసులకు అభినందనలు.... మంత్రి జార్జ్ బెంగళూరు పోలీసులు సమర్థంగా పని చేశారని, అందువల్లే శంకర్ చిక్కాడని హోం మంత్రి జార్జ్ తెలిపారు. శంకర్ తప్పించుకోవడానికి జైలు సిబ్బంది సహకరించారని వెలుగు చూస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల రివార్డు అందిస్తామని తెలిపారు. రూ.100 ఇచ్చి నీరు, భోజనం కావాలన్నాడు: నరేంద్ర పరప్పన అగ్రహార జైలు వెనుక వైపు, జైలు సిబ్బంది క్వార్టర్స్‌కు కిలోమీటరు దూరంలో కూడ్లు చెరువు ఉంది. కూడ్లు గేట్ కూడా సమీపంలోనే ఉంది. చేపలు పట్టేవారు చెరువు పక్కన చిన్న గుడిసె వేసుకున్నారు. చేపలు తగ్గిపోవడంతో ఆరు నెలల నుంచి ఆ గుడిసెలో ఎవరూ ఉండడం లేదు. గుడిసెకు కనీసం తలుపులేదు. శుక్రవారం ఉదయం స్థానికంగా నివాసం ఉంటున్న నరేంద్ర, బాబు తదితరులు అటువైపు వెళ్లారు. ఆ సమయంలో గుడిసెలో ఉన్న శంకర్ తాగడానికి నీళ్లు కావాలని, ఎవరైనా సహాయం చేయాలని కేకలు వేశాడు. అక్కడికెళ్లి ఇక్కడెందుకున్నావని వారు ప్రశ్నించగా, తాను తమిళనాడుకు చెందిన డ్రైవర్‌నని, ప్రమాదం జరగడంతో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో తప్పించుకుని వచ్చానని చెప్పాడు. కాళ్లు, చేతులకు గాయాలుండడంతో వారూ నిజమనుకున్నారు. వారికి రూ.100 నోటు ఇచ్చి భోజనం తెచ్చివ్వాలని కోరాడు. అదే సమయంలో బనశంకరిలో ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేయాలనడంతో బాబు అతనికి మొబైల్ ఇచ్చాడు. తర్వాత బాబు భోజనం తీసుకురావడానికి వెళ్లాడు. ఐదే నిమిషాల్లో పోలీసులు వచ్చి గుడిసెలోకి చొరబడిఅతని కాళ్లు, చేతులు కట్టి వేశారని నరేంద్ర మీడియాకు చెప్పాడు. తరువాత అతను సైకో శంకర్ అని తమకు తెలిసిందన్నాడు. ఆరు జీపులలో పోలీసులు వచ్చి శంకర్‌ను తీసుకు వెళ్లారని నరేంద్ర వివరించాడు.