‘పేపర్ బాయ్` ఫేమ్ జయశంకర్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రం ‘అరి’. మై నేమ్ ఈజ్ నోబడీ అనేది ట్యాగ్ లైన్. ప్రముఖ వ్యాపారవేత్తలు శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి సంయుక్తంగా, ఆర్వి రెడ్డి, సమర్పణ లో `అరి` సినిమా ని నిర్మిస్తున్నారు. మనిషి ఎలా బతకకూడదు అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఈ చిత్రంలో జెలసీ పాత్రలో అనసూయ, ప్రైడ్‌గా సాయి కుమార్, ఆంగర్ క్యారెక్టర్‌లో శ్రీకాంత్ అయ్యంగార్, లస్ట్‌గా వైవా హర్ష, గ్రీడీ పాత్రలో శుభలేఖ సుధాకర్, అటాచ్ మెంట్ క్యారెక్టర్‌లో సురభి ప్రభావతి నటిస్తున్నారు. టైటిల్ లోగో లాంచ్ నుంచే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి విడుదలకు రెడీ అయిన ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. థియేటర్స్‌లో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయడానికి రూ.10 కోట్లతో డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ కావడంతో ‘అరి’ ని కచ్చితంగా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించడానికి సిద్దమైందట. అయితే చిత్రబృందం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట.
థియేటర్స్‌లో విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి ప్రస్తుతం ఓ ప్రముఖ పంపిణీ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే సమయంలో నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ రావడంతో నిర్మాతలు ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. మరి ‘అరి’ థియేటర్‌లో అలరిస్తుందా లేదా ఓటీటీలోకి వస్తుందా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment