
పేపర్ బాయ్ ఫేం జయశంకర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం అరి. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ట్యాగ్‌లైన్. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేక సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్‌వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి టాక్‌ని సంపాదించుకుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారు.
‘అరి’ సినిమా ప్రచార చిత్రాన్ని వీక్షించడం ఆనందదాయకం. ఆరు రకాల అంతఃశత్రువులను ప్రతి మనిషి జయించాలన్న సందేశంతో చక్కని కథ,కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు జయశంకర్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ సహా చిత్ర బృందాన్ని అభినందిస్తూ, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.
"అరి" సినిమా ప్రచార చిత్రాన్ని వీక్షించడం ఆనందదాయకం. ఆరు రకాల అంతఃశత్రువులను ప్రతి మనిషి జయించాలన్న సందేశంతో చక్కని కథ,కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శ్రీ జయశంకర్, నిర్మాత శ్రీ అభిషేక్ అగర్వాల్ సహా చిత్ర బృందాన్ని అభినందిస్తూ,సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను pic.twitter.com/HLeeE5scoF
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) March 29, 2023
Comments
Please login to add a commentAdd a comment