
శైలజా రెడ్డి అల్లుడు వాయిదా పడటంతో ఆ తరువాతి వారం రిలీజ్ అవుతున్న సినిమాల దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. సెప్టెంబర్ 7న భారీ పోటి ఉండటంతో ఒక్కడుగు ముందుకు వేసి ఆగస్టు 31న థియేటర్లలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కిన పేపర్ బాయ్ సినిమాను వారం రోజులు ముందుగానే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.
మాస్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సంపత్ నంది నిర్మాతగానూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. తన బ్యానర్‌లో రెండో సినిమాగా పేపర్ బాయ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోల్కొండ హైస్కూల్ సినిమాలో బాలనటుడిగా పరిచయం అయి తరువాత తను నేను సినిమాతో హీరోగా మారిన సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. భీమ్స్ సంగీతమందిచిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment