Paper Boy
-
నాటి పేపర్ బాయ్.. నేడు అమెరికాలో సైంటిస్టు
కడప సెవెన్‌రోడ్స్(వైఎస్సార్ జిల్లా): కన్నవారు దూరమైన దుర్భర బాల్యం. ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిన దైన్యం. అవమానాలు, ఆటంకాలు, మరెన్నో ప్రతిబంధకాలు. కష్టాలన్నీ కట్టకట్టుకు వచ్చినా ఆయన పట్టుదల, పరిశ్రమ ముందు అవి తలవంచక తప్పలేదు. బాల్యంలోనే ఎన్నో సవాళ్లను చెరగని చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. ఒకప్పుడు వీధుల్లో పేపర్ బాయ్‌గా తిరిగిన ఓ యువకుడు అంచెలంచెలుగా ఎదిగి నేడు అమెరికాలో మంచి సైంటిస్టుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ‘‘సెంటర్ ఫర్ రీ జనరేటివ్ స్పోర్ట్స్ మెడిసిన్’’ డిప్యూటీ డైరెక్టర్‌గా మల్టీ డిసిప్లినరి రీసెర్చి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఎన్నో అద్భుత విజయాలు తన ఖాతాలో వేసుకుని నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న కడప నాగరాజుపేటకు చెందిన ఆయన పేరు డాక్టర్ రావూరి సుదీర్‌కుమార్. బాల్యం గడిచిందిలా! పసితనంలోనే తల్లిదండ్రులు దూరం కావడంతో అవ్వ చల్లా కమలమ్మ అక్కున చేర్చుకుంది. ఐదవ తరగతి వరకు నాగరాజుపేట గుండాచారి బడిలో చదువుకున్నారు. విశ్రాంత ఉపాధ్యాయురాలైన అవ్వ కమలమ్మకు చదువు విలువ ఏమిటో బాగా తెలుసు. చదువే నిజమైన ఆస్తి అంటూ మనవడికి తరచూ నూరిపోసేది. అవ్వ మాటలు ఆయనను ఎంతో ప్రభావితం చేశాయి. గుంతకల్లు, గుత్తిలో పిన్ని ఇంట హైస్కూల్ విద్యాభ్యాసం సాగింది. సైన్స్ పట్ల జిజ్ఞాస గుత్తి రైల్వే ఇంగ్లీషు మీడియం హైస్కూలులో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఆకుల నుంచి విద్యుత్ తయారవుతుందని ‘ఎలక్ట్రానిక్స్ ఫర్ యూ’ అనే పత్రికలో చదివాడు. అందుకు జిల్లేడు, బొంత జెముడు ఆకులు పనికి వస్తాయని సు«దీర్ కనుగొన్నారు. ఇలా ఆయన బయో లాజికల్ బ్యాటరీ తయారు చేశాడు. అప్పట్లో హైదరాబాదులో జరిగిన సైన్స్ ఫెయిర్‌లో రాష్ట్రపతి వెంకట్రామన్ నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. సిమ్లాలో జరిగిన ఇంటర్ స్టేట్ సైన్స్ ఫెయిర్‌కు ఈ ప్రయోగం ఎంపికైంది. ఇంటర్మీడియేట్ కడప సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో, 1994–97లో ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశాడు. తాను ఇంకొకరికి భారం కారాదని భావించి పేపర్ బాయ్‌గా, వీడియో కెమెరామెన్‌గా కొన్నాళ్లు పనిచేశారు. గ్రూప్-4, బ్యాంకు పరీక్షలు రాశారు. బీఈడీలో ఉచిత సీటు వచ్చింది. సైంటిస్టు కావాలన్న బలమైన ఆకాంక్ష వల్ల వాటిని వదులుకున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ వైరాలజీ ప్రవేశానికి కిశోర్ అనే స్నేహితుడు రూ. 400 సాయం చేసి దరఖాస్తు చేయించగా సీటు వచ్చింది. తిరుపతిలో ఉన్న మరో పిన్ని ఇంటిలో ఉంటూ చదువు కొనసాగించారు. తన ఖర్చులు తాను సంపాదించుకోవాలని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో పార్ట్ టైం అధ్యాకునిగా పనిచేశారు. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా తన జుట్టు తానే కట్ చేసుకోవడం నేర్చుకున్న ఆయన ఒక సెలూన్ కూడా ప్రారంభించాలని భావించారు. వెటర్నరీ వైరాలజీ పైన ఎమ్మెస్సీ ప్రాజెక్టు వర్క్‌ను తిరుపతిలో చేశారు. 1999లో ఎమ్మెస్సీ పూర్తయ్యాక అక్కడి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్‌లో ఐసీఏఆర్–ఐఏఆర్‌టీ ఫెలోషిప్ జాబ్ చేశారు. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకులో ఉన్న బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)లో మోనోక్లోనల్ యాంటీ బాడీస్‌పై పనిచేశారు. వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్లో డయాగ్నస్టిక్స్ చేశారు. ఈ సమయంలో రెడ్డీస్ ల్యాబ్‌లో ఉద్యోగం వచ్చింది. అయితే అదే సమయంలో ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో హెచ్ఐవీ–1పై పనిచేసే అవకాశం తలుపు తట్టగా, దాన్నే ఎంచుకున్నారు. దీంతో ఆయన జీవితం పెద్ద మలుపు తిరిగింది. హెచ్ఐవీ సోకిన వ్యక్తిలో రోగ నిరోధకశక్తి తగ్గిపోయి త్వరగా మరణానికి చేరువవుతాడు. అలాంటి వ్యక్తుల్లో వచ్చిన జన్యుపరమైన మార్పులను గుర్తించి దానికి తగ్గట్టు కాంబినేషన్ మందుల్లో ఎలాంటి మార్పులు చేయాలన్న అంశంపై పరిశోధన చేశారు. ఆయనకు 2006లో పీహెచ్‌డీతోపాటు పేటెంట్ హక్కులు లభించాయి. అమెరికాలో పరిశోధనలు సుదీర్ అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోగల పిట్స్బర్గ్ యూనివర్సిటీకి పోస్టు డాక్టోరల్ ఫెలోషిప్‌పై వెళ్లారు. మెంటార్‌గా కూడా పనిచేశారు. రీసెర్చి అసోసియేట్‌గా తొమ్మిదేళ్లు పిట్స్‌బర్గ్‌లో ఉన్నారు. నిర్వీర్యం చేసిన హెచ్ఐవీ వైరస్‌లోకి ఉపయోగకరమైన జన్యువులను పంపి తద్వారా వచ్చిన నిర్వీర్య వైరస్‌ను మూల కణాల ఉత్పత్తి, రొమ్ము క్యాన్సర్ నిరోధానికి ఉపయోగించడంపై పరిశోధన చేశారు. కొలరాడోలోని స్టెడ్మన్ ఫిలిప్పన్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (ఎస్‌పీఆర్‌ఐ)లో ‘వార్థక్య దశకు చెందిన కణాలను గుర్తించి నిర్మూలించడం ద్వారా మెరుగైన వృద్ధాప్య జీవితం’ అనే అంశంపై పరిశోధన చేశారు. అక్కడి ప్రసిద్ధ శాస్త్రవేత్తలతో కలిసి జీన్ థెరఫి, స్టెమ్‌సెల్ బయాలజీ, టిష్యూ ఇంజినీరింగ్ అంశాల్లో పనిచేశారు. అమెరికా ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, డిపార్టుమెంటు ఆఫ్ డిఫెన్స్, యూఎస్ ఒలంపిక్ అండ్ పారాలింపిక్ నేషనల్ మెడికల్ సెంటర్లో పరిశోధనలు చేశారు. గ్రాంట్ అవార్డ్స్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా ప్లాస్టిక్ సర్జరీ ఫౌండేషన్ గ్రాంటు, కో ఇన్వెస్టిగేటర్‌గా ఎన్ఐహెచ్, డీఓడీ ప్రభుత్వ గ్రాంటు, కో ప్రిన్సిపల్ సైంటిస్టుగా ప్రైవేటు ఇండస్ట్రీ ఫండింగ్ లభించాయి. ఎడిటోరియల్ బోర్డు మెంబర్, గెస్ట్ ఎడిటర్, సైంటిఫిక్ రివ్యూవర్‌గా పలు అంతర్జాతీయ రీసెర్చి జనరల్స్‌లో పనిచేశారు. పలు సైంటిఫిక్ సమ్మిట్స్‌కు చైర్ పర్సన్, కో చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. కొలరాడో స్టేట్ యూనివర్సిటీలో అఫిలియేట్ సైంటిస్టుగా నియమితులయ్యారు. కండరాల్లో మూల కణాలు కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జానీ హువర్డ్‌తో కలిసి ప్రస్తుతం సెంటర్ ఫర్ రీ జనరేటివ్ స్పోర్ట్స్ మెడిసిన్ (సీఆర్‌ఎస్‌ఎం)లో మల్టీ డిసిప్లినరీ రీసెర్చి ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. చదవండి: బీజేపీకి ‘కన్నం’ అందుకేనా?.. నెక్ట్స్ ఏంటి?.. జరిగేది అదేనా? ఆకాంక్షతోపాటు నిరంతర కృషి అవసరం ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి వెళ్లాలన్న ఆకాంక్ష ఒక్కటే ఉంటే సరిపోదు. అందుకు తగ్గట్టు నిరంతర కృషి ఉన్నప్పుడే లక్ష్యాన్ని అందుకోగలమని విద్యార్థులు గుర్తించాలి. నిరుత్సాహ పడకుండా అవకాశాలు వచ్చేంత వరకు ఓపిక అవసరం. ఒకప్పుడు ఏమీ లేని నేను ఇప్పుడు ఒక స్థాయి లో ఉన్నానంటే అది మా అవ్వ కమలమ్మ, మా ఇద్దరు పిన తల్లులతోపాటు స్నేహితులు కిశోర్, ప్రసాద్, రాజు, మేనమామ చల్లా రాజేంద్ర వరప్రసాద్ (సీఆర్వీ ప్రసాద్), టీచర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇచ్చిన సహకారమే కారణం. – -డాక్టర్ రావూరి సుధీర్‌కుమార్, నాగరాజుపేట, కడప -
అనసూయ కొత్త చిత్రం: శ్రీనివాస్‌రెడ్డి, చమ్మక్ చంద్రల ట్రాక్ హైలెట్!
‘పేపర్ బాయ్’ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కాన్సెఫ్ట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. సాయికుమార్, వైవా హర్ష, అక్ష పర్థసాని, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత శేషు మారంరెడ్డి మాట్లాడుతూ...జయశంకర్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని కొనియాడారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిందని, మిగిలిన భాగాన్ని ఏప్రిల్‌లోపు కంప్లీట్ చేస్తామని చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్రకు సంబంధించిన సీన్స్‌ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడని, థియేటర్స్‌లో ఆ సీన్స్ తప్పకుండా నవ్వులు పూయిస్తాయని చెప్పారు. జయశంకర్ వర్కింగ్ స్టెల్ చాలా బాగుందని, అందుకే ఆయనతో మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఇక దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ.. నిర్మాతల ప్రొత్సాహంతో సినిమాను అద్బుతంగా తెరకెక్కిస్తున్నామని చెప్పారు. తమ చిత్రానికి అనూప్ సంగీతం చాలా ప్లస్ అవుతుందన్నారు. టైటిల్‌తో పాటు విడుదల తేదిని కూడా త్వరలోనే వెల్లడిస్తామని జయశంకర్ చెప్పుకొచ్చారు. కాగా, ఈ చిత్రానికి ‘గ్రహమ్’అని టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. -
అనసూయ చిత్రానికి అనూప్ సంగీతం.. టైటిల్ ఇదేనా?
గతకొంత కాలంగా కెరీర్ పరంగా కాస్త వెనకబడ్డ అనూప్ రూబెన్స్..‘బంగార్రాజ’తో మళ్లీ పుంజుకున్నాడు. ఈ సినిమా విజయంలో సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా క్లిక్ అయింది. దీంతో అనూప్‌కి మళ్లీ వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలకు సంగీతం అందిస్తున్న అనూప్.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఎంటరయ్యాడు. యాంకర్ అనసూయ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఓ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ అందుకున్నాడు. పేపర్ బాయ్, విటమిన్-షి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్న యంగ్ డైరెక్టర్ జయశంకర్.. ఈ సారి మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఢిపరెంట్ కాన్సెప్ట్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గ్రహమ్’అని టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. తర్వలోనే టైటిల్‌ని అధికారికంగా వెల్లడించనున్నారు. తమ చిత్రానికి అనూప్ సంగీతం చాలా ప్లస్ అవుతుందని దర్శకుడు జయశంకర్ పేర్కొన్నారు. -
చదువుకుంటూ పనిచేస్తే తప్పేముంది : శ్రీప్రకాష్
-
కేటీఆర్ మెచ్చిన ‘పేపర్ బాయ్’ వెనుక ఆ తల్లి ఉద్దేశం తెలుసా?
సాక్షి, జగిత్యాల: చదివేది ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతే.. కానీ ప్రపంచాన్ని చదివేశాడు.. చేసేది పేపర్ బాయ్ పనే. అయినా చదువుకుంటూ పని చేస్తే తప్పేంటి? అని ప్రశ్నించి అందరినీ ఆకట్టుకున్నాడు. కష్టేఫలి అనే మాటను గుర్తు చేసేలా బుడ్డోడి మాటలకు తెలుగు రాష్ట్రాలు అబ్బురపడ్డాయి. చిన్నప్పటి నుంచే కష్టపడండి కచ్చితంగా సక్సెస్ అవుతారు అంటూ మెసేజ్ కూడా ఇచ్చిన ఆ చిన్నారి ఎవరో కాదు తెలంగాణ మంత్రి కేటీఆర్ మెచ్చిన బుడ్డోడు శ్రీ ప్రకాశ్ గౌడ్. చదవండి: రాజకీయాల్లో పనికి మాలిన స్టార్ పవన్‌కల్యాణ్ జగిత్యాల పట్టణానికి చెందిన శ్రీప్రకాశ్ చిన్నప్పటి నుంచి పేపర్ వేయిస్తే పొద్దున్నే లేవటం అలవాటుగా మారి ఉదయం నుంచే సమాజాన్ని గమనిస్తాడని తల్లి పేపర్ బాయ్‌గా చేర్పించింది. పెద్ద కొడుకులాగే చిన్న కొడుకును కూడా పేపర్ బాయ్ చేసింది ఆ తల్లి. డబ్బుల అవసరం వారికి లేదు కానీ చిన్నప్పటి నుంచే కష్టపడటం, ఆత్మవిశ్వాసం పెంపొందించడం కోసం ఇలా చేసినట్లు బుడ్డోడి తల్లి పేర్కొంది. ప్రపంచం తీరు అన్నీ అర్థం అయ్యేలా చేయాలనేది ఆ మాత్రమూర్తి సంకల్పం. ఇప్పుడు ఆమె అభిలాష నెరవేరింది. చదువుకుంటూ పని చేస్తే తప్పేంటి అనే డైలాగ్‌తో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు నెటిజన్స్‌ను ఫిదా చేసి సోషల్ మీడియాలో హీరో అయ్యాడు శ్రీప్రకాశ్. చదవండి: హైదరాబాద్‌లో భారీ వర్షాలు: డ్రైనేజీ గుంతలో వ్యక్తి గల్లంతు -
బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి కేటీఆర్ ఫిదా: ‘పేపర్ వేస్తే తప్పేంటి’
సాక్షి, హైదరాబాద్: బాల్యం ప్రతి మనిషి జీవితంలో అందమైన జ్ఞాపకం. ఎంత వయసు వచ్చినా.. జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా.. బాల్య స్మృతులు తలుచుకోగానే మనసులో తెలియని ఆనందం. అవును మరి రేపటి గురించి దిగులు లేదు.. నేడు ఎలా గడుస్తుందో అన్న బెంగ లేదు. అమ్మనాన్నల ప్రేమ.. స్నేహితులతో ఆటలు.. బడిలో గెంతులు. బాల్యం అనగానే వినిపించే మాటలు. అయితే ఇది ఒకవైపు మాత్రమే. మరోవైపు.. పలకబలపం పట్టాల్సిన చిన్నారులు పనిలో తలమునకలవుతున్నారు. చిన్న తనంలోనే వారి మీద పెద్ద బాధ్యత. వెరసి మనచుట్టూ ఎందరో బాల కార్మికులు. కోవిడ్‌తో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇంట్లోని ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితులు ఉన్నాయి కొన్ని చోట్ల. ఈ క్రమంలో కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని.. చదువుకుంటునే పని చేస్తున్న చిన్నారులెందరో ఉన్నారు. (చదవండి: కంటోన్మెంట్ విలీనంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ ) తాజాగా ఈ కోవకు చెందిన వీడియోని ఒకదాన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది తెగవైరలవుతోంది. ఈ బుడ్డోడి ఆత్మవిశ్వాసానికి కేటీఆర్ సైతం ఫిదా అయ్యాడు. చిన్నారి భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నారు. ‘‘ఈ చిన్నారి ఆత్మవిశ్వాసం, ఆలోచనల్లో స్పష్టత, హావభావాలు నాకు చాలా నచ్చాయి’’ అనే క్యాప్షన్‌తో వీడియోని షేర్ చేశారు కేటీఆర్. ఈ వీడియోలోని సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న జై ప్రకాశ్ ఉదయం పూట పేపర్ బాయ్‌గా పని చేసుకుంటున్నాడు. ఇది గమనించి ఆ దారిలో వెళ్తున్న ఓ వ్యక్తి.. జై ప్రకాశ్‌ని పలకరించాడు. ఏం చేస్తున్నావ్.. ఎక్కడ చదువుతున్నావ్ అని ప్రశ్నించాడు. అనంతరం సదరు వ్యక్తి ఈ ఏజ్‌లో నువ్వు పేపర్ వేస్తున్నావ్ ఎందుకు అని ప్రశ్నించగా.. అప్పుడు జై ప్రకాశ్ ‘ఏం.. పేపర్ వేయొద్దా’ అని తిరిగి ప్రశ్నిస్తాడు. (చదవండి: కేటీఆర్‌పై ఆ విమర్శలు చేయొద్దు.. రేవంత్‌కు సిటీ సివిల్ కోర్టు ఆదేశం ) అప్పుడు ఆ వ్యక్తి చిన్నారి జై ప్రకాశ్‌ని ప్రశంసించి.. ‘చదువుకునే ఏజ్‌లో పని చేస్తున్నావ్ కదా’ అంటే.. అందుకు జై.. ‘చదువకుంటున్నా.. పని చేస్తున్నా.. దానిలో తప్పేం ఉంది’ అని తిరిగి ప్రశ్నిస్తాడు. ఈ ఏజ్‌లో నువ్వు ఇలా కష్టపడటం చాలా నచ్చింది అని సదరు వ్యక్తి అనగా.. ‘కష్టపడితే ఏం అయితది.. భవిష్యత్తులో నాకు మేలు చేస్తుంది’ అని సమాధానం ఇస్తాడు జై. ఇక వీడియో మొత్తంలో బుడ్డోడి ఎక్స్ప్రెషన్స్, కాన్ఫిడెన్స్ వేరే లెవల్. Loved this video from Jagtial Town This young lad a Govt school student called Jai Prakash; loved his confidence, composure and clarity of thought & expression 👏👏 He says what’s wrong in working while studying & goes on to say it’ll keep him in good stead in future pic.twitter.com/Ug4wYIGn8a — KTR (@KTRTRS) September 23, 2021 ఈ వీడియో చూసిన నెటిజనులు చిన్నారి జైని ప్రశంసిస్తున్నారు. పిల్లలు, పెద్దలు నిన్ను చూసి నేర్చుకోవాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోని 5 వేల మందికి పైగా లైక్ చేయగా.. 900 మందికి పైగా రీట్వీట్ చేశారు. ఒక్కరోజులో చిన్నారి జై ప్రకాశ్ స్టార్ అయ్యాడు. చదవండి: శభాష్ పోలీస్.. నిండు ప్రాణాన్ని నిలిపిన కానిస్టేబుల్ -
రోడ్డు ప్రమాదంలో పేపర్ బాయ్ దుర్మరణం
నల్లకుంట: బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ పేపర్ బాయ్(మైనర్) మృతి చెందిన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సవార్ వెంకట్ రావు, భార్య సంగీత, కుమారుడు అభినవ్(14)తో కలిసి బాగ్‌అంబర్‌పేట మల్లిఖార్జుననగర్‌లో ఉంటున్నాడు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అభినవ్ గత కొన్ని నెలలుగా అదే ప్రాంతానికి చెందిన సతీష్ అనే న్యూస్ పేపర్ ఏజెంట్ వద్ద పేపర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున పేపర్ వేసేందుకు వెళ్లిన అతడిని సతీష్ ఓయూ ఎన్సీసీ చౌరస్తాలో పేపర్లు ఇచ్చిరావాలని చెప్పాడు. దీంతో అతను తన సైకిల్ అక్కడే పెట్టి ఏజెంట్‌కు చెందిన బైక్ తీసుకుని పెట్రోల్ ట్యాంక్‌పై బండిల్ పెట్టుకుని బయలు దేరాడు. శివం రోడ్డులోని సత్య సూపర్ మార్కెట్ సమీపంలో పేపర్ బండిల్ హ్యాండిల్‌కు తగలడంతో బైక్ అదుపుతప్పి ఫుట్ పాత్పైకి దూసుకెళ్లింది. అభినవ్ ఫుట్‌పాత్ పడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మరో పేపర్ బాయ్ శ్రీనివాస్ అభినవ్ తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. నల్లకుంట పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి వెంకట్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్‌ను పనిలో పెట్టుకోవడమే కాకుండా అతడికి వాహనం ఇచ్చినందుకు పేపర్ ఏజెంట్ సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. మహారాష్ట్ర నుంచి నగరానికి వలస వచ్చిన వెంకట్ రావు, సంగీత దంపతులకు అభినవ్ ఒక్కడే కుమారుడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సంగీత సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆయాగా పనిచేస్తూ కుమారుడిని డీడీ కాలనీలోని కార్పొరేట్ పాఠశాలలో చదివిస్తోంది. తల్లి కష్టాన్ని చూసిన అభినవ్ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేందుకుగాను 8 నెలలుగా పేపర్ బాయ్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి తనకు పాయసం తినాలని ఉందని చెప్పడంతో సంగీత కుమారునికి పాయసం చేసి పెట్టింది. మంగళవారం ఉదయం తల్లి నిద్రలేపగా ఈ రోజు పేపర్ వేసేందుకు వెళ్లనని చెప్పిన అభినవ్ కొద్ది సేపటికే లేచి పేపర్ వేసేందుకు వెళ్లిపోయాడు. రెండు గంటలు గడువకముందే కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలియడంతో ఆమె బోరున విలపించింది. ఎమ్మెల్యే పరామర్శ స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ బాలుని మృతదేహం వద్ద నివాళులర్పించి, మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.. వారి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే అతని అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందజేశా రు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఆర్ధిక సహా యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. స్థానిక కార్పొరేటర్ డి.పద్మావతి రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
డబ్బు సంపాదించాలని రాలేదు
‘‘కోట్ల రూపాయలు డబ్బు సంపాదించాలని ప్రొడక్షన్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు అవకాశం ఇచ్చింది. కొత్తవారిని ప్రోత్సహించాలనుకుంటున్నా. నాకు ఓపిక ఉన్నంత వరకు ఇది కొనసాగుతుంది’’ అని డైరెక్టర్ సంపత్‌నంది అన్నారు. సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంపత్‌నంది, వెంకట్, రాములు, నరసింహులు నిర్మించారు. గీతా ఆర్ట్స్ సంస్థ ఆగస్టు 31న ఈ సినిమా విడుదల చేసింది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో సంపత్‌నంది మాట్లాడుతూ–‘‘మా సినిమాలో స్టార్ట్ డైరెక్టర్, స్టార్ హీరో లేరు. కానీ, మంచి డీసెంట్ టాక్ వచ్చింది. మా సినిమా చూసిన వారు మంచి ప్రయత్నం చేశామని ఫోన్ చేసి మెచ్చుకోవడంతో చాలా హ్యాపీ ఫీలయ్యాను. ఒక్క హైదరాబాద్‌లోనే ఏడు థియేటర్స్ పెంచాం. ఇందుకు కారణమైన అల్లు అరవింద్‌గారికి థ్యాంక్స్. ఈ సినిమా సక్సెస్‌లో సుధాకర్, మురళిల పాత్రలు ముఖ్యమైనవి. వెంకట్, రాములు, నరసింహులు ఉన్నారు కాబట్టే ఇంత దూరం రాగలిగాం. మా సినిమా ఆదరించిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో అందరం కొత్తవాళ్లమైనా మనసు పెట్టి చేశాం. సంపత్‌నందిగారు బాగా సపోర్ట్ చేశారు’’ అన్నారు సంతోష్ శోభన్. ‘‘పేపర్ బాయ్’ని సూపర్‌హిట్ బాయ్‌గా చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు రియా సుమన్. ‘‘సంపత్‌గారు మాకు స్ట్రాంగ్ పిల్లర్‌లా నిలబడ్డారు. ఈ జర్నీలో నేర్చుకున్న కొత్త విషయాలు భవిష్యత్‌లో ఉపయోగపడతాయి’’ అన్నారు జయశంకర్. నటి అన్నపూర్ణమ్మ, సంగీత దర్శకుడు భీమ్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళి పాల్గొన్నారు. -
‘పేపర్ బాయ్’ మూవీ రివ్యూ
టైటిల్ : పేపర్ బాయ్ జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : సంతోష్ శోభన్, రియా సుమన్ , తాన్య హోపే సంగీతం : భీమ్స్ సిసిరొలియో రచన : సంపత్ నంది దర్శకత్వం : జయశంకర్ నిర్మాత : సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహా మాస్ మసాలా చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సంపత్ నంది నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తను నేను ఫేం సంతోష్ శోభన్ హీరోగా సంపత్ నంది నిర్మాణంలో జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ పేపర్ బాయ్. ఈ సినిమా ట్రైలర్‌పై మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ప్రశంసలు కురిపించటంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఆ అంచనాలను పేపర్ బాయ్ అందుకున్నాడా..? సంతోష్ శోభన్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడా..? సంపత్ నంది నిర్మాతగా విజయం సాధించాడా..? కథ ; రవి (సంతోష్ శోభన్) బీటెక్ చదివినా కుటుంబ పరిస్థితుల కారణంగా పేపర్ బాయ్‌గా పనిచేస్తుంటాడు. తన లాంటి ఆలోచనలే ఉన్న ధరణి (రియా సుమన్) అనే పెద్దింటి అమ్మాయిని ఇష్టపడతాడు. రవి మంచి తనం విలువలు గురించి తెలుసుకున్న ధరణి కూడా రవిని ఇష్టపడుతుంది. కూతురి ప్రేమకు గౌరవమిచ్చిన ధరణి తల్లిదండ్రులు తమ అంతస్తును పక్కన పెట్టి ఆటో డ్రైవర్ కొడుకు, పేపర్ బాయ్ అయిన రవితో పెళ్లికి ఓకె చెప్తారు. కానీ అనుకోని పరిస్థితుల్లో రవి, ధరణి దూరమవుతారు. వారి విడిపోవడానికి కారణాలేంటి..? వీరి ప్రేమకథకు ముంబైలో ఉండే మేఘ (తాన్యా హోపే)కు సంబంధం ఏంటి..? రవి, ధరణిల ప్రేమకథ ఎలా ముగిసింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; రెండో సినిమానే ఎంతో బరువైన పాత్రను ఎంచుకున్న సంతోష్ శోభన్ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. లవర్ బాయ్‌గా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టించాడు. బాధ్యత గల కుర్రాడి పాత్రలో కనిపించిన సంతోష్ ఫుల్ మార్క్స్ సాధించాడు. హీరోయిన్ రియా సుమన్ హుందాగా కనిపించారు. నటన పరంగానూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌లో రియా చూపించిన ఎమోషన్స్ సూపర్బ్. తాన్య హోపే తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇతర పాత్రలో విద్యుల్లేఖ రామన్, మహేష్, బిత్తిరి సత్తి, అభిషేక్ కాసేపు నవ్వించే ప్రయత్నం చేశారు. విశ్లేషణ ; పేదింటి అబ్బాయి.. పెద్దింటి అమ్మాయిని ప్రేమించటం అనే కాన్సెప్ట్ తెలుగు సినిమాకు హిట్ ఫార్ములా. ఇప్పటికే ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే అదే కథను కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు జయశంకర్. సంపత్ నంది రచన సినిమాకు హెల్ప్ అయ్యింది. కవితాత్మకంగా సాగే సంభాషణలు ఆకట్టుకుంటాయి. భీమ్స్ సంగీతం, సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సరిగ్గా కుదిరాయి. అయితే సినిమాను ఇంట్రస్టింగ్ పాయింట్‌తో మొదలు పెట్టిన దర్శకుడు ఆ టెంపోను కంటిన్యూ చేయటంలో కాస్త తడబడ్డాడు. నెమ్మదిగా సాగే కథనం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. అదే సమయంలో కథతో సంబంధం లేని కామెడీ సీన్స్ కథనంలో స్పీడ్ బ్రేకర్లలా మారాయి. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫి సినిమాకు కలర్ ఫుల్ లుక్ తీసుకువచ్చింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; సంతోష్ శోభన్, రియా సుమన్ నటన నేపథ్య సంగీతం మాటలు మైనస్ పాయింట్స్ ; నెమ్మదిగా సాగే కథనం కథకు అడ్డుపడే కామెడీ సీన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ట్రైలర్, సినిమా చూసి బాగుందన్నా
‘‘బన్ని ఓ సారి ‘పేపర్ బాయ్’ ట్రైలర్ పంపి చూడమన్నాడు. చూసి చాలా బాగుందన్నా. తర్వాత మెహర్ రమేశ్ వచ్చి ఈ సినిమా చూడమంటే చూసి, చాలా బాగుంది అన్నాను. మీరు ఈ సినిమాని రిలీజ్ చేస్తారా? అన్నాడు మెహర్ రమేశ్. ఇండస్ట్రీనే నమ్ముకున్న సంపత్‌నందిలాంటి వ్యక్తి ఓ కథ రాసుకుని మరో డైరెక్టర్‌కి అవకాశం ఇచ్చి, మంచి సినిమా చేసినప్పుడు మా సంస్థ ద్వారా విడుదలైతే ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందనే విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సంతోష్ శోభన్, రియా సుమన్, తన్య హోప్ హీరోహీరోయిన్లుగా జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఫంక్షన్లో డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘పేపర్ బాయ్’ హక్కులను అల్లు అరవింద్‌గారు తీసుకున్నారని చెప్పగానే సినిమా చాలా పెద్ద హిట్ అని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అరవింద్‌గారి జడ్జ్‌మెంట్‌పై నాకు అపారమైన నమ్మకం ఉంది. ఇప్పుడు ఇది పెద్ద సినిమా’’ అన్నారు. ‘‘చిన్న సినిమా నిర్మాతలకు ఉండే కష్టాలేంటో నాకు తెలుసు.‘ పేపర్ బాయ్’ లాంటి చిన్న సినిమాకు గీతా ఆర్ట్స్ వంటి పెద్ద ప్లాట్‌ఫామ్ దొరికింది. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. ‘‘అరవింద్‌గారు రిలీజ్ చేస్తున్నారనగానే ఇదొక మంచి సినిమా అనే గుర్తింపు వచ్చింది. ఆయనకు మా సినిమా గురించి చెప్పిన మెహర్ రమేశ్ అన్నకు జీవితాంతం రుణపడి ఉంటా’’ అన్నారు సంపత్ నంది. ‘‘ఈ సినిమా కోసం ఏడాదిగా కష్టపడుతున్నాం. గీతా ఆర్ట్స్‌వారు మా సినిమాను తీసుకోవడం వల్ల ఈ కష్టం మరచిపోయాం’’ అన్నారు జయశంకర్. దర్శకులు మెహర్ రమేశ్, కల్యాణ్ కృష్ణ, సంతోష్ శోభన్ తదితరులు పాల్గొన్నారు. -
‘పేపర్ బాయ్’ ప్రీ రిలీజ్ వేడుక
-
‘పేపర్ బాయ్’ చిత్రబృందానికి ప్రభాస్ శుభాకాంక్షలు
-
సంతోష్‌కు వర్షంలాంటి హిట్ రావాలి
ప్రభాస్ కెరీర్లో తొలి బ్లాక్‌బస్టర్ చిత్రం ‘వర్షం’. ఆ చిత్రదర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా నటించిన చిత్రం ‘పేపర్ బాయ్’. రాములు, నరసింహులు, వెంకట్‌తో కలసి దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని నిర్మించారు. జయశంకర్ దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్‌ని వీక్షించిన అనంతరం, చిత్రబృందానికి ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వర్షం’ చిత్రంతో నాకు హిట్ వచ్చినట్లే ‘పేపర్ బాయ్’ సంతోష్ శోభన్‌కు కూడా మంచి విజయం ఇవ్వాలి. ట్రైలర్ బాగుంది. విజువల్స్ చాలా బావున్నాయి. నేను నటించిన ‘బిల్లా’ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేసిన సౌందర్యరాజన్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేయటం ఆనందంగా ఉంది. గీతా ఆర్ట్స్ లాంటి మంచి సంస్థ ‘పేపర్‌బాయ్’ సినిమా హక్కులను సొంతం చేసుకోవటం మరో మంచి విషయం’’ అన్నారు . ఈ నెల 31న ఈ చిత్రం విడుదలవుతున్న విషయం తెలిసిందే. -
నా మొదటి సినిమానే పెద్ద డైరెక్టర్‌తో..
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): నా మొదటి సినిమానే సంపత్ నంది లాంటి పెద్ద డైరెక్టర్‌తో చేయటం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ డైరెక్టర్ శోభ తనయుడు, పేపర్ బోయ్ సినిమా హీరో సంతోష్శోభ అన్నారు. సినిమా ప్రొమోషన్లలో భాగంగా నగరానికి వచ్చిన ఆయన సాక్షితో మాట్లాడారు. అదృష్టంగా భావిస్తున్నా నన్ను నమ్మి పేపర్‌బాయ్ సినిమాలో సంపత్‌నంది అవకాశం ఇవ్వటం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది సినిమాలా కాకుండా రియల్ క్యారెక్టర్స్‌ను చూసిన అనుభూతి కలుగుతుంది. నేను డిగ్రీలో మాస్‌కమ్యూనికేషన్ చేశాను. మా నాన్న డైరెక్టర్ కావటం వల్ల మా చుట్టూ సినిమా వాతావరణమే ఉండేది. నా ఆలోచనలు ఎప్పుడూ సినిమా రంగం వైపు ఉండేవి. ఒక వేళ నేను హీరోను కాకపోయి ఉంటే సినిమాల్లోనే వేరే దాన్ని ఎందుకునేవాడ్ని తప్ప బయటికి మాత్రమే వెళ్లే అలోచనే లేదు. నాకు మెగాస్టార్ చిరంజీవి ఆదర్శం. ఆయన చేసిన కార్యెక్టర్లు అన్నీ నాకు చేయాలని ఉంది. హీరోయిన్ త్రిష అంటే ఇష్టం. ఆమెతో సినిమా చేయాలనేది నా కోరిక. పేపర్‌బాయ్ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంపత్ నంది టీం వర్క్స్, పవిత్ర క్రియేషన్స్, బీఎల్ఎన్ సినిమా పతాకంపై సంపత్ నంది, వెంకట్, నరసింహ ఈ సినిమా నిర్మించారు. సంతోష్ శోభన్, రియా సుమన్ హీరో హీరోయిన్లగా నటించారు. ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించగా.. సంగీతం బీమ్స్ సిసిరోలియా అందించారు. ఆదివారం చిత్రబృందం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో నిర్వహించింది. పేపర్‌బాయ్ టైటిల్ సాంగ్‌ని కాసర్ల శ్యామ్ అద్భుతంగా రాశారన్నారు. చంద్రబోస్‌కు తాను పెద్ద అభిమానిని, ఆయన ఈ సినిమాకు టైటిల్ సాంగ్ పాడారని తెలిపారు. సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ చిత్రం విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. చిత్రంలో మరో లవ్‌సాంగ్‌ను ఎంవీవీ రిలీజ్ చేశారు. సాగరతీరంలో ప్రీరిలీజ్ వేడుకలు పేపర్‌బాయ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి సాగర తీరంలో జరిగింది. చిత్ర సహా నిర్మాత, డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడారు. ప్రేమికులు తమ ప్రేమను ఎలా గెలిపించుకోవాలో ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు. హీరో సంతోష్ శోభ మాట్లాడుతూ పేపర్‌బాయ్ సినిమా వల్ల ఎంతో మంది ప్రేమికుల తల్లిదండ్రుల్లో మార్పు రావటం ఖాయమన్నారు. హీరోయిన్ రియా సుమన్ మాట్లాడుతూ వైజాగ్ చాలా అందంగా, ప్రశాంతంగా ఉందన్నారు. -
వైజాగ్‌లో వేడుక చేస్తే సినిమా హిట్టే
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): రచ్చ, బెంగాల్ టైగర్ వంటి సినిమాలతో సత్తాచాటారు సంపత్ నంది. దర్శకుడిగా తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్, మాస్ అంశాలను మేళవించి ప్రేక్షకులకు అందించడంలో ఈయన దిట్ట. తాను సహ నిర్మాతగా రూపొందించిన పేపర్‌బాయ్ చిత్రం ఈనెల 31న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రొమోషన్లో భాగంగా నగరానికి వచ్చిన ఆయన ఆదివారం సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. పేపర్‌బాయ్ ప్రేమలో పడితేఏమిటి అనేది కథ ప్రేమను గెలిపించుకోవటం కోసం పెద్దలతో గొడవులపెట్టుకోవటం.. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవటం లేదా ఆత్మహత్యలు చేసుకోవటం వంటివి ఈ రోజుల్లో చూస్తుంటాం. కానీ అలా కాకుండా పెద్దలను ఎలా ఒప్పించి ప్రేమను సాధించుకోవచ్చు అనేదే పేపర్ బోయ్ సినిమా. నేను బెంగాల్ టైగర్ సినిమా చేస్తున్నా సమయంలోనే నిర్మాత వెంకట్‌కు ఈ కథ చెప్పాను. కథ అంతా పూర్తిగా సిద్ధం చేయటానికి ఏడాది సమయం పట్టింది. ఆ తరువాత 2017లో షూటింగ్ మొదలిపెట్టాం. షూటింగ్ చాలా వరకు హైదరాబాద్‌లో చేశాం. కొన్ని సన్నివేషాలు కేరళ, గోవాల్లో జరిగాయి. పేపర్‌బాయ్ అంటే ఏదో చదువు రాని వాడు కాదు. బాధ్యతతో బీటెక్ చేసిన వ్యక్తి ఎంచుకున్న ఒక వృత్తి ఈ పేపర్‌బాయ్. ఒక ఇంటికి రోజు పేపర్ వేసే వ్యక్తి ఆ ఇంట్లో ఉన్న అమ్మాయితో ప్రేమలో పడితే తలెత్తే సమస్యలను పేపర్‌బాయ్‌లో చూస్తారు. ఇది విలువులతో కూడినసినిమా. తండ్రి కొడుకులు, తాతలు ఇలా అన్ని సంబంధాలు ఇందులో ఆకట్టుకుంటాయి. ప్రేమ కోసం ఒకరి కోసం ఒకరు చేసుకున్న త్యాగాలు ఈ చిత్రంలో స్పష్టంగా వివరించటం జరిగింది. సాధారణంగా ప్రేమ చిత్రాలు అంటే యూత్ మాత్రమే ఇష్టపడతారు. కానీ పేపర్‌బాయ్ సినిమా మాత్రం కుటుంబం మొత్తం వెళ్లి చూడదగ్గది. హీరో సంతోష్, హీరోయిన్ రియా సుమాన్ పాత్రలు మన చుట్టూ ఉన్న మనషులు వలే ఉంటాయి. సినిమా అయినా నిజజీవితంలా ఉంటుంది. యూ సర్టిఫికెట్ సినిమా తీస్తా అనుకోలేదు నేను ఇప్పటి వరకూ తీసిన ప్రతి సినిమా ఏ సర్టిఫికేట్ లేదా ఏ/యూ సర్టిఫికేట్వి. కాని మొదటి సారి యూ సర్టిఫికెట్‌ను సెన్సర్ బోర్డు ఈ సినిమాకు మంజూరు చేసింది. ఇలాంటి సినిమాలను నేను తీస్తానని అనుకోలేదు. సెన్సర్ బోర్డ్ సభ్యులు కూడా ఒక కట్ లేకుండా అనుమతి ఇచ్చారు. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బేనర్‌పై ఈ మధ్యకాలంలో కొనుగోలు చేసిన చిత్రం పేపర్‌బాయ్. మా సినిమా కథనచ్చి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ ఈ చిత్రానికి పనిచేయటానికి ముందుకు వచ్చారు. మెగాస్టార్‌తో సినిమా తీస్తా మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా తీయాలనేది నాకు జీవిత లక్ష్యం. ఎప్పటికైనా ఆయనతో కచ్చితంగా తీసితీరితా. ఆయన కోసం మంచి కథను సిద్ధం చేస్తున్నా. అది పూర్తి అయిన తరువాత ఆయనకు చెప్తాను. మరో పెద్ద హీరోతో కూడా సినిమా తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని కుదిరితే ఈ సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభవుతుంది. సినీ పరిశ్రమకు వైజాగ్ సెంట్మెంట్ పేపర్‌బాయ్ సినిమా ట్రైలర్ చూసి మహేష్ బాబు, ప్రభాస్ ట్వీటర్ ద్వారా మెచ్చుకున్నారు. వారి ట్వీట్స్‌తో మా సినిమాకు చాలా ప్రచారం లభించింది. వైజాగ్‌లో సినిమాకు సంబంధించిన ఏదో ఒక కార్యక్రమం చేస్తే హిట్ అవటం గ్యారంటీ. ఇది సినిమా పరిశ్రమ అంతా సెంట్‌మెంట్‌గా పెట్టుకుంది. అందుకే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల కార్యక్రమాలు ఇక్కడే నిర్వహిస్తున్నారు. రచ్చ సినిమా సమయంలో కూడా మేము వైజాగ్ వచ్చాం. అది పెద్ద హిట్ అయింది. -
ఫుల్ పాజిటివ్
సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంపత్ నంది కథను అందిస్తూ, రాములు, వెంకట్, నరసింహులతో కలిసి నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్‌ను గీతా ఆర్ట్స్ బ్యానర్ సొంతం చేసుకుంది. అల్లు అరవింద్, ‘బన్నీ’ వాసు, దర్శకుడు మెహర్ రమేశ్‌లకు ప్రత్యేకంగా షో వేసి చూపించారు చిత్రబృందం. ‘‘సినిమా నచ్చిన వెంటనే అల్లు అరవింద్‌గారు రిలీజ్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేట్‌కు సొంతం చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమాకు మంచి పాజిటివ్ వైబ్ ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: సౌందర్ రాజన్. -
మెగా ప్రొడ్యూసర్ చేతికి ‘పేపర్ బాయ్’
మాస్ డైరెక్టర్‌గా సక్సెస్ సాధించిన సంపత్ నంది చిన్న సినిమాలకు కథను అందిస్తూ, నిర్మిస్తూ సక్సెస్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఈ డైరెక్టర్ అందించిన కథ, కథనాలతో తెరకెక్కిన సినిమా ‘పేపర్ బాయ్’. ఈ సినిమా ట్రైలర్‌తో బాగానే పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ఆసక్తికరంగా మారింది. ఇలాంటి చిన్న సినిమాలు అందరి దృష్టిని ఆకర్షించడం మంచి పరిణామం. పైగా చిత్రయూనిట్ కూడా సినిమాకు వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గీత ఆర్ట్స్ చేతిలోకి వెళ్లింది. అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత చేతిలో సినిమా పడితే.. సినిమాకు ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చే అవకాశం ఉంది. ఇక సినిమా కంటెంట్ ప్రేక్షకులకు నచ్చితే మంచి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ చిత్రం ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వారం రోజులు ముందుగానే వస్తున్నాం
సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పేపర్ బాయ్’. తాన్యా హోప్ కీలక పాత్ర చేశారు. దర్శకుడు సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహులు నిర్మించారు. ఈ సినిమా టైటిల్ సాంగ్ ‘ఓయ్ ఓయ్...పేపర్ బాయ్’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. భీమ్స్ స్వరకర్త. ప్రముఖ సంగీత దర్శకుడు చంద్రబోస్ ఈ పాటను పాడటం విశేషం. ఈ సినిమాను ముందు అనుకున్నట్లుగా సెప్టెంబర్ 7న కాకుండా ఈ నెల 31న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపారు. సంపత్ నంది మాట్లాడుతూ – ‘‘టీజర్, ట్రైలర్లతో పాటు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు రోడ్ ట్రిప్ ప్లాన్ చేశాం. పేపర్ బాయ్స్ ఉన్నంత కాలం ఈ పాట ఉంటుంది. పాట పాడిన చంద్రబోస్‌గారికి, టీమ్ అందరి తరఫున థ్యాంక్స్’’ అన్నారు. ‘‘టెన్షన్ పడేంత టైమ్ కూడా లేదు. వారం రోజులు ముందే వస్తున్నాం. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు సంతోష్ శోభన్. చంద్రబోస్‌గారిని అనుసరిస్తున్న శిష్యుల్లో నేను, కాసర్ల శ్యామ్ కూడా ఉన్నాం. ఈ సినిమా టైటిల్ సాంగ్ పాడినందుకు చంద్రబోస్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు భీమ్స్. ‘‘నేను లిరిక్స్ అందించిన పాటకు చంద్రబోస్‌గారు గాత్రం అందించడం నా వరం. నా అదృష్టంగా భావిస్తున్నా. సంపత్ నంది మంచి డైలాగ్స్ రాశారు’’ అన్నారు కాసర్ల శ్యామ్. ఈ కార్యక్రమంలో నిర్మాత నరసింహులు, డైరెక్టర్ జయశంకర్, కెమెరామెన్ సౌందర రాజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్ట్ 31న రాబోతోన్న ‘పేపర్ బాయ్’
మాస్ డైరెక్టర్ సంపత్ నంది అందించిన కథతో రాబోతోన్న సినిమా పేపర్ బాయ్. తాజాగా విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. టీజర్‌తోనే ఆకట్టుకుంటోన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు వినూత్న పద్దతిలో ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. సంతోష్ శోభన్ హీరోగా, ప్రియాశ్రీ, తాన్యా హోప్ హీరోయిన్స్‌గా.. సంపత్‌నంది టీమ్ వర్క్స్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 31న విడుదల కానున్నట్టు ప్రకటించారు. అందరికీ ఈ సినిమా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నుండి రోడ్ ట్రిప్ ప్లాన్ చేశారు. సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఇంటింటికి తిరిగి పేపర్ వేసి అందర్నీ కలవబోతున్నారు. ఈ సినిమాకు జయశంకర్ దర్శకత్వం వహించారు. -
‘పేపర్ బాయ్’ టైటిల్ సాంగ్ లాంచ్
-
‘పేపర్ బాయ్’ ముందే వస్తాడా..?
శైలజా రెడ్డి అల్లుడు వాయిదా పడటంతో ఆ తరువాతి వారం రిలీజ్ అవుతున్న సినిమాల దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. సెప్టెంబర్ 7న భారీ పోటి ఉండటంతో ఒక్కడుగు ముందుకు వేసి ఆగస్టు 31న థియేటర్లలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కిన పేపర్ బాయ్ సినిమాను వారం రోజులు ముందుగానే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. మాస్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సంపత్ నంది నిర్మాతగానూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. తన బ్యానర్లో రెండో సినిమాగా పేపర్ బాయ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోల్కొండ హైస్కూల్ సినిమాలో బాలనటుడిగా పరిచయం అయి తరువాత తను నేను సినిమాతో హీరోగా మారిన సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. భీమ్స్ సంగీతమందిచిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. -
తొలి ప్రేమ గుర్తొస్తుంది
సంపత్ నంది టీమ్ వర్క్స్ , బిఎల్ఎన్ సినిమాస్, ప్రచిత్ర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా నటించిన ఈ చిత్రానికి జయశంకర్ దర్శకుడు. భీమ్స్ సిసిరేలియో సంగీతాన్ని అందించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. సెప్టెంబరు 7న సినిమా విడుదలవుతుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ చిత్రం ట్రైలర్‌ను చూసి యూనిట్‌ను అభినందించారు. పేపర్‌బాయ్‌గా పనిచేసే రవి, బాగా రిచ్ ఫ్యామిలీలోని అమ్మాయి ధరణిల ప్రేమకథే ఈ సినిమా. ఈ సందర్భంగా జరిగిన విలేఖరుల సమావేశంలో దర్శకుడు–చిత్రనిర్మాతల్లో ఒకరైన సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘మా చిత్రం టీజర్‌కు 36 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. మేం మంచి సినిమా తీశామని గట్టిగా నమ్ముతున్నాను. ‘పేపర్‌బాయ్’ మంచి ప్రేమకథ. ఈ సినిమాలో నాతో పాటు ఉన్న రాములు, వెంకట్, నరసింహాకు థ్యాంక్స్. వాళ్లు ఈ సినిమాకు వెన్నెముకలా నిలబడ్డారు’ అన్నారు. దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ – ‘‘సంపత్ నంది చెప్పిన కథ విన్న వెంటనే కనెక్ట్ అయిపోయాను. ఈ విషయంలో నన్ను నమ్మినందుకు సంపత్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘సంపత్ నంది గారితో పనిచేయటం నాకు చాలా ప్రత్యేకంతో పాటు మంచి అనుభవం కూడా. సినిమాను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు. హీరోయిన్ రియా సుమన్ మాట్లాడుతూ– ‘‘దరణి‘ పాత్రలో నటించాను నేను. ఈ పాత్ర కోసం నన్ను నమ్మినందుకు దర్శకుడు జయశంకర్‌కు థ్యాంక్స్. కెమెరామెన్ సౌందర్యరాజన్గారు మంచి విజువల్స్ అందించారు. ‘పేపర్‌బాయ్’ సినిమా అందరికీ తమ ఫస్ట్‌లవ్‌ను గుర్తు చేసే మంచి ప్రేమకథ’’ అన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ మాట్లాడుతూ – ‘‘ముందుగా నాకు సినీ జీవితాన్నిచ్చిన సంపత్ నందికి కృతజ్ఞతలు. ఈ సినిమాకు ఆత్మ ఆయనే. మీడియా పర్సన్ సురేశ్ ఉపాధ్యాయ్ ఈ చిత్రంలో మూడు పాటలు రాశారు. చిన్న సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
‘పరిచయమైంది పుస్తకాలు.. దగ్గరైంది అక్షరాలు’
‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా టాలెంట్ చూపించాడు సంపత్ నంది. రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాలతో మాస్ డైరెక్టర్‌గా నిరూపించుకున్నాడు. డైరెక్టర్‌గానే గాకుండా నిర్మాతగానూ సక్సెస్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు. గతంలో ఆది హీరోగా ‘గాలిపటం’ సినిమాను నిర్మించిన సంపత్ నంది...తాజాగా ‘పేపర్ బాయ్’ ను నిర్మిస్తున్నారు. సంతోష్ శోభన్ (‘వర్షం’ దర్శకుడు శోభన్ తనయుడు) హీరోగా నటించిన ‘పేపర్ బాయ్’ అందంగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. సంపత్ నంది అందించిన కథ తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్లో డైలాగ్‌లు ప్రేక్షకులకు నచ్చేలా ఉన్నాయి. ‘నాకు పరిచయమైంది పుస్తకాలు.. దగ్గరైంది అక్షరాలు’, ‘ప్రేమంటే ఆక్సిజన్‌లాంటిది అది కనిపించదు.. కానీ బతికిస్తుంది’ లాంటి డైలాగ్‌లు బాగున్నాయి. భీమ్స్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. సంపత్‌నంది టీమ్ వర్క్స్‌పై వస్తోన్న ఈ సినిమాకు జయ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. -
‘పేపర్ బాయ్’ ట్రైలర్
-
పడ్డాడండి ప్రేమలో మరి
‘గోల్కొండ హైస్కూల్’తో బాల నటుడిగా పరిచయమైన సంతోష్ శోభన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పేపర్ బాయ్’. జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రియా సుమన్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు. సంపత్ నంది టీమ్ వర్క్స్, బీఎల్ఎన్ సినిమా, ప్రచిత్ర క్రియేషన్స్ పతాకాలపై సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ నిర్మించిన ఈ సినిమాని సెప్టెంబర్ 7న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రమిది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రేమలో పడిన తర్వాత ఏం జరిగిందన్నదే చిత్రకథ. దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాకి చక్కని కథ అందించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్‌కు 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, అభిషేక్ మహర్షి, విద్యుల్లేఖా రామన్, జయప్రకాశ్ రెడ్డి, సన్నీ, మహేశ్ విట్టా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సౌందర రాజన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల.