మై ఎర్లీ జాబ్
వారెన్ బఫెట్ ఆగస్ట్ 30, 1930న అమెరికాలో జన్మించాడు. ఆయన ఒక గొప్ప వ్యాపారస్థుడు, అంతకన్నా గొప్పదాత. 2008వ సంవత్సరంలో ప్రపంచంలోనే అధిక ఆదాయం కలిగిన వ్యక్తిగా ఫోర్బ్స్ పత్రిక గుర్తించిన ధనవంతుడు. బఫెట్ వస్త్రాలను తయారుచేసే బెర్క్‌షైర్ హాత్వే కంపెనీకి సీఈవో. ఆయన తన చిన్నతనం నుండే డబ్బు సంపాదించడంలో ఆసక్తి చూపుతూ తను సంపాదించింది వృథా చేయకుండా పోగేసేవారు.
బఫెట్ మొదటి ఉద్యోగం పేపర్ బాయ్. ఉదయాన్నే లేచి ఇంటింటికీ తిరిగి పేపర్ వేసేవారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ చూయింగ్ గమ్, కోకోకోలా, మేగజైన్స్ అమ్మేవారు. కొన్నాళ్లపాటు తన తాతగారి కొట్టులో పనిచేశారు కూడా. అలా మొదలైన ఆయన జీవిత ప్రస్థానం క్రమక్రమంగా ప్రపంచంలోనే మేటి వ్యాపారస్థులలో ఒకరిగా ఎదిగేవరకు కొనసాగింది. బఫెట్ ఎంత గొప్ప వ్యాపారస్థుడో అంతకంటే ఎక్కువ సహృదయులు. తన సంపాదనలో 90 శాతానికి పైగా దాతృత్వ కార్యక్రమాలకు దానం చేశారంటే ఆయన ఎంత గొప్పదాతో అర్థం చేసుకోవచ్చు.