రూ.86 లక్షల కోట్ల సామ్రాజ్యం.. వారసుడిని ప్రకటించిన వారెన్ బఫెట్
ప్రపంచ కుబేరులలో ఒకరు, దిగ్గజ ఇన్వెస్టర్.. బెర్క్‌షైర్ హాత్వే సహ వ్యవస్థాపకుడు 'వారన్ బఫెట్' (Warren Buffett) ఎట్టకేలకు తన వారసుడిని ప్రకటించారు. తన రెండో కుమారుడు 'హోవార్డ్ బఫెట్' (Howard Buffett)ను 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 86.55 లక్షల కోట్లు) వ్యాపార సామ్రాజ్యానికి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు.ది వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. దాదాపు తన మిగిలిన సంపదనంతా కొత్త ఛారిటబుల్ ట్రస్ట్‌కు మళ్లించనున్నట్లు వారన్ బఫెట్ వెల్లడించారు. అయితే తన ముగ్గురి పిల్లలైన 'సూసీ, హోవార్డ్, పీటర్'లకు తన సంపదలో తక్కువ భాగాన్ని మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించిన 140 బిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ స్టాక్లను ఈ ముగ్గురూ పర్యవేక్షిస్తారని ఆయన వెల్లడించారు.హోవార్డ్ బఫెట్‌ను వారసుడిగా ప్రకటించిన తరువాత, నా ముగ్గురు బిడ్డలకు నేను బలంగా విశ్వసిస్తాను అని వారన్ బఫెట్ చెప్పారు. అయితే హోవార్డ్ కూడా నా బిడ్డే కాబట్టి అతనికి వారసత్వ అవకాశం లభించిందని అన్నారు. 30 సంవత్సరాలకు పైగా బెర్క్‌షైర్ బోర్డులో డైరెక్టర్‌గా పనిచేసిన హోవీ.. ఇప్పుడు చైర్మన్ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.ఎవరీ హోవార్డ్ బఫెట్?➤హోవార్డ్ బఫెట్ పూర్తి పేరు 'హోవార్డ్ హౌవీ బఫెట్'. ఈయనను 'హౌవీ' అని కూడా పిలుస్తారు. చదువు పూర్తయిన తరువాత తండ్రి బాటలో అడుగులు వేసిన హోవార్డ్.. వారెన్ బఫెట్ సలహా మేరకు లాస్ ఏంజెల్స్‌కు వెళ్లి బెర్క్‌షైర్ హాత్వే యాజమాన్యంలోని సీస్ క్యాండీస్ అనే కంపెనీలో పని చేశాడు. ఆ సమయంలో వ్యాపారానికి సంబంధించిన అనేక కీలక విషయాలను నేర్చుకున్నారు.➤వారెన్ బఫెట్.. హౌవీ కోసం ఒక పొలాన్ని కొనుగోలు చేశారు. దానిని వాడుకున్నందుకు కూడా కొడుకు నుంచి అద్దె వసూలు చేశారు. ఆ తరువాత కాలంలో హౌవీ భూమిని దున్నకుండానే సాగు చేస్తూ.. కొత్త వ్యవసాయ విధానాలపై దృష్టిపెట్టారు.➤1989లో హౌవీ బఫెట్ కౌంటీ బోర్డ్ ఆఫ్ కమీషనర్లలో చేరారు. తరువాత నెబ్రాస్కా ఇథనాల్ బోర్డ్ సభ్యునిగా చేరి.. చివరికి ఛైర్మన్ అయ్యారు. 2017 నుంచి 2018 వరకు అతను ఇల్లినాయిస్లోని మాకాన్ కౌంటీకి షెరీఫ్గా పనిచేశారు.➤1993 నుంచి.. హోవీ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే, కోకా కోలా ఎంటర్ప్రైజెస్, లిండ్సే కార్పొరేషన్, స్లోన్ ఇంప్లిమెంట్, కొనాగ్రా ఫుడ్స్ & వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ జీఎస్ఐ గ్రూప్‌తో సహా పలు ప్రముఖ కంపెనీల బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేశారు.ఇదీ చదవండి: పాకిస్తాన్లో భారీగా బంగారు నిక్షేపాలు: ఏకంగా అన్ని టన్నులా..➤హోవీ బఫెట్ తండ్రి మాదిరిగానే.. దాతృత్వ కార్యక్రమాలపై దృష్టి సారించి స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. అంతే కాకుండా వన్య పరిరక్షణ, వన్యప్రాణులు సంబంధిత అంశాలపై ఎనిమిది పుస్తకాలను కూడా రచించారు. ఈయన డెవాన్ మోర్స్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు హోవార్డ్ వారెన్ బఫెట్ అనే కుమారుడు ఉన్నారు.