అప్పులబాధ తట్టుకోలేక దామోదర్(50) అనే పేపర్ బాయ్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పులబాధ తట్టుకోలేక దామోదర్(50) అనే పేపర్ బాయ్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్లారెడ్డి పట్ణణంలోని గౌడ్స్‌గల్లీకి చెందిన దామోదర్ ఉదయం పేపర్లేసిన తర్వాత ఇంటికి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సుమారు రూ.3 లక్షల వరకు అప్పు అయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.