
మ్యూజికల్ లవ్ స్టోరిగా 'పేపర్ బాయ్'
దర్శకుడిగా మంచి ఫాంలో ఉన్న సంపత్ నంది నిర్మాతగానూ ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు. రామ్ చరణ్ హీరోగా రచ్చ, రవితేజతో బెంగాల్ టైగర్ లాంటి సూపర్ హిట్స్ అందించిన ఈ మాస్ డైరెక్టర్, ప్రస్తుతం గోపిచంద్ హీరోగా గౌతమ్నంద సినిమా చేస్తున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తను నిర్మించబోయే సినిమా పనులు మొదలెట్టాడు సంపత్ నంది.
గాలిపటం సినిమాతో నిర్మాతగా మారిన సంపత్ నంది ఆ సినిమాతో ఆశించిన విజయం అందుకోలేకపోయాడు. దీంతో నిర్మాణానికి కొంత గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఓ మ్యూజికల్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నాడు. తను నేను ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా ఐశ్వర్యను హీరోయిన్గా పరిచయం చేస్తూ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు జయ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పేపర్ బాయ్ అనే టైటిల్ను ఫైనల్ చేశారు. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.