gauthamnanda
-
మ్యూజికల్ లవ్ స్టోరిగా 'పేపర్ బాయ్'
దర్శకుడిగా మంచి ఫాంలో ఉన్న సంపత్ నంది నిర్మాతగానూ ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు. రామ్ చరణ్ హీరోగా రచ్చ, రవితేజతో బెంగాల్ టైగర్ లాంటి సూపర్ హిట్స్ అందించిన ఈ మాస్ డైరెక్టర్, ప్రస్తుతం గోపిచంద్ హీరోగా గౌతమ్‌నంద సినిమా చేస్తున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తను నిర్మించబోయే సినిమా పనులు మొదలెట్టాడు సంపత్ నంది. గాలిపటం సినిమాతో నిర్మాతగా మారిన సంపత్ నంది ఆ సినిమాతో ఆశించిన విజయం అందుకోలేకపోయాడు. దీంతో నిర్మాణానికి కొంత గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఓ మ్యూజికల్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నాడు. తను నేను ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా ఐశ్వర్యను హీరోయిన్గా పరిచయం చేస్తూ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు జయ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పేపర్ బాయ్ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. -
మరోసారి విలన్‌గా మాస్ హీరో..!
హీరోగా ఎంట్రీ ఇచ్చి తరువాత సక్సెస్ కోసం విలన్‌గా మారిన మాస్ హీరో గోపిచంద్. విలన్‌గా మంచి విజయాలు సాధించిన గోపిచంద్ తరువాత హీరోగా కూడా సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్ సంపత్ నంది దర్శకత్వంలో గౌతమ్ నంద సినిమాలో నటిస్తున్నాడు గోపిచంద్. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో సందడి చేస్తోంది. గౌతమ్ నంద సినిమాలో గోపిచంద్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్‌లో స్టైలిష్ లుక్‌లో అలరిస్తున్న గోపి... రెండు పాత్రల్లో ఒకటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అన్న టాక్ వినిపిస్తోంది. విలన్‌గా ఘనవిజయాలు సాధించిన గోపిచంద్ చాలా కాలం తరువాత మరోసారి విలన్ రోల్లో నటిస్తుండం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. గోపిచంద్ సరసన హన్సిక, కేథరిన్లు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.