మరోసారి విలన్గా మాస్ హీరో..! | gopichand to play negative character in gauthamnanda | Sakshi
Sakshi News home page

మరోసారి విలన్గా మాస్ హీరో..!

Published Tue, May 30 2017 2:38 PM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

మరోసారి విలన్గా మాస్ హీరో..!

మరోసారి విలన్గా మాస్ హీరో..!

హీరోగా ఎంట్రీ ఇచ్చి తరువాత సక్సెస్ కోసం విలన్గా మారిన మాస్ హీరో గోపిచంద్. విలన్గా మంచి విజయాలు సాధించిన గోపిచంద్ తరువాత హీరోగా కూడా సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్ సంపత్ నంది దర్శకత్వంలో గౌతమ్ నంద సినిమాలో నటిస్తున్నాడు గోపిచంద్. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో సందడి చేస్తోంది.

గౌతమ్ నంద సినిమాలో గోపిచంద్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్లో స్టైలిష్ లుక్లో అలరిస్తున్న గోపి... రెండు పాత్రల్లో ఒకటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అన్న టాక్ వినిపిస్తోంది. విలన్గా ఘనవిజయాలు సాధించిన గోపిచంద్ చాలా కాలం తరువాత మరోసారి విలన్ రోల్లో నటిస్తుండం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. గోపిచంద్ సరసన హన్సిక, కేథరిన్లు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement