‘అరి’కి ముందే మరో చిత్రం | Sakshi
Sakshi News home page

జయశంకర్‌ సమర్పణలో మరో చిత్రం.. మంత్రి కోమటి రెడ్డి చేతుల మీదుగా పోస్టర్‌ రిలీజ్‌

Published Wed, May 22 2024 10:43 AM

Suriya Purimetla Second Movie Poster Released By komatireddy Venkat Reddy

కొంతమంది దర్శకులు తక్కువ సినిమాలే చెసినా.. ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో జయశంకర్‌ ఒకరు. పేపర్‌ బాయ్‌ సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన జయశంకర్‌.. తొలి సినిమాతోనే హిట్‌ కొట్టాడు. సున్నితమైన ఎమోషన్స్‌ని ఆ చిత్రంలో ఎంతో అద్భుతంగా చూపించాడు. ఆ మూవీ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకొని ‘అరి’ అనే మరో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో సూర్య పురిమెట్ల ఓ ప్రధాన పాత్ర పోషించాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే ఈ మూవీ విడుదలకు ముందే.. సూర్య పురిమెట్ల మరో ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి జయశంకర్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. సుందర్‌ పాలుట్ల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ పోస్టర్‌ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్‌తో కాసేపు ముచ్చటించి.. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ పోస్టర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో అనిల్‌ కుమార్‌,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ , నిర్మాత తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, పవన్ వంటి  తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement