
ప్రొఫెసర్ జయశంకర్
తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం 1969 తొలి దశ ఉద్యమం నుంచి మొన్నటి మలిదశ ఉద్యమం వరకు ప్రొఫెసర్ జయశంకర్‌కు సరి సమానంగా పోరాటం చేసిన సోషలిస్ట్ నాయకుడు, కోదండరాం, గద్దర్, కూర రాజన్న లాంటి ఎందరో ఉద్యమ నాయకులకే గురువు ప్రొ.కేశవరావు జాదవ్. ఆయన 85వ జన్మదినాన్ని (27.01.2018) తెలంగాణ సమాజం విస్మరించడం దారుణం. ఇప్పుడున్న ఉద్య మ పితామహుల్లో ఈయన ఒకరు. యావత్తు తెలంగాణ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై జాదవ్‌ని గౌరవించవలసిన బాధ్యత ఉన్నది.
కానీ ప్రభుత్వం నుంచి ఈ సందర్భంగా ఒక చిన్న ప్రకటన కూడా రాకపోవడం బాధాకరం. ఉద్దేశపూర్వకంగా మరచిపోతే అది కుట్రపూరితమే. పొరపాటుగా ఆయన పుట్టినరోజును మరిచారంటే అజ్ఞానులే! మన పెద్దలను, ఉద్యమ దిగ్గజాలనే మరచిపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? 1969 తెలంగాణ ఉద్యమానికి ఆయన సజీవ సాక్ష్యం! మృదు భాషే కానీ అన్యాయాన్ని నిర్భయంగా నిలదీసే తత్వం ఆయనలో ఎల్ల ప్పుడూ కనిపించేది. సాదా సీదా జీవితం గడిపారు, ఇంకా గడుపుతున్నారు. సమైక్యవాదులను గౌరవిస్తూ, తెలంగాణ సాధనే జీవిత లక్ష్యంగా తమ జీవితాన్ని అంకితం చేసిన వారిని విస్మరించడం సబబేనా?
– సయ్యద్ రఫీ, చిత్ర దర్శకుడు