Film Director
-
‘సోషల్’ ఘోషలో స్నేహమే సమ్మోహనం
‘చరిత్రని మరచిపోని వాళ్ళు.. ఆ పొరపాట్లు కచ్చితంగా మళ్ళీ చేస్తారు’ అని ఎవరో పెద్దమనిషి అన్నాట్ట. గతం, వర్తమానం, భవిష్యత్తు అనేవి మన మనసు సృష్టించే భ్రమలే అనుకున్నా.. గతం గుర్తుంచుకోవడం మంచిదే. కొత్త భ్రమల్ని, అపోహల్ని సృష్టించుకోకుండా అది మనల్ని అదుపులో పెడుతుంది.ప్రతి సంవత్సరాంతంలో ఆ సంవత్సరం మనం ఏం సాధించాం, శోధించాం అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. కొత్త సంవత్సరం కేవలం ఓ తారీఖు మారటమే అని హేతువాదులన్నా.. అదేదో కొత్తప్రారంభం అనుకోవడం మనకో ఉత్సాహాన్నిస్తుంది. అందుకే కొత్త నిర్ణయాలు, సరికొత్త ఆశయాలు, ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతాం. వాటిలో ఎన్ని అమలు చేస్తాం? ఎన్ని సాధిస్తాం? అనేది మళ్లీ ఆ సంవత్సరాంతంలో బేరీజు వేసుకుంటాం. ఈ చక్రం కొంత సరదాగా ఉంటుంది. కొంత నిజంగా ఉపయోగపడుతుంది.నా వరకూ నాకు ‘2023’ ఒక విచిత్రమైన సంవత్సరం. 2018లో కోవిడ్‌కి ముందు ‘సమ్మోహనం’ థియేటర్లలో విడుదలై ఘనవిజయాన్ని అందుకున్న తర్వాత, కోవిడ్‌లో 2020లో ఓటీటీలో విడుదలైన ‘వి’, ఆ తర్వాత 2022లో థియేటర్లలో విడుదలైన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నన్ను కొంత గజిబిజికి గురి చేశాయి. ‘వి’ మిశ్రమ ఫలితాలు, ‘ఆ అమ్మాయి..’ వైఫల్యం నా కళా దృక్పథాన్ని గట్టిగా కుదిపాయి. అయితే ఆ సమయంలో సద్విమర్శకులు, శ్రేయోభిలాషులు కొన్ని విషయాలని గట్టిగా విమర్శిస్తూనే, కొన్ని విషయాలలో నాకు అండగా నిలిచి, నా అభిరుచిని బలపర్చారు. 2024లో మళ్లీ ఆత్మస్థైర్యంతో అడుగిడేలా చేశారు. నా 2023 అనుభవాలు 2024 లో నా నిర్ణయాలని గాఢంగా కానీ, ప్రొడక్టివ్ గా కానీ ప్రభావితం చేశాయి అనిపిస్తోంది.గతమైనా, వర్తమానమైనా, భవిష్యత్తైనా మనల్ని నిలబెట్టేది మన స్నేహితులు. నిష్కర్షగా, ద్వేషరహితంగా మన జీవితాన్ని మనకి ప్రతిబింబించగలిగే నిజమైన స్నేహితులు. అందుకే ఈ రోజుల్లో ఉన్న సామాజిక మాధ్యమాల్లో ఎగసిపడుతున్న అకారణ ద్వేషం, నెగిటివిటీ, సంచలనవాదం, పోటీతత్వం, వేలంవెర్రి సొంతడబ్బాల మధ్య నిజమైన స్నేహితుల్ని వెతుక్కోవడమే కొత్త సంవత్సరంలో మన నిర్ణయం, ఆశయం కావాలి. ఈ యూట్యూబ్ ట్రోల్స్, ఇన్‌స్టా రీల్స్, గొడవలు, అరుపులు, దైనందిన జీవితపు రణగొణధ్వని మధ్య నిజమైన నిష్కల్మషమైన స్నేహాన్ని వెతుక్కుని పట్టుకోవడం కష్టమే. ఉన్న స్నేహితుల్లో ఎవరు హితులో, ఎవరు శత్రువులో తెలుసుకుని, శత్రువుల్ని పాము కుబుసం విడిచినట్టు విడిచి కొత్త సంవత్సరంలో సరికొత్త సహచర్య సౌందర్యంలో ముందుకు వెళ్లడమే ఆశయం కావాలి. నిజానికి ప్రతి సంవత్సరం ఈ నిర్ణయాన్ని మళ్లీ మళ్లీ కొత్తగా తీసుకోవాలి. మన స్నేహసంపదని నలుగురికి పంచి, మన స్నేహిత సంపదని ప్రతి సంవత్సరం పెంచుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, లార్జర్ దాన్ లైఫ్, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాంటి నూతన ఆవిష్కారాలు, భావనలూ, ప్రచారాల నుండి మనల్ని మనం సంరక్షించుకోవాలంటే మంచి స్నేహితులే మనకి దిక్కు.2024లో ప్రతి సినిమాలో దాదాపు హీరో అంటే ఊచకోతకి మారుపేరయ్యాడు. నోట్లోంచి గొప్పగొప్ప ఉదాత్తమైన మానవత్వపు ఉపన్యాసాలిస్తూనే, రెండు చేతుల్తో వందలమందిని చంపుతున్నాడు. సున్నితమైన హాస్యం, ప్రేమ, సన్నిహితమైన సంభాషణలు, మానవ సంబంధాలు ట్రెండ్ కాదనే దుష్ప్రచారం మొదలై, బలం పుంజుకుంటోంది. ఈ సమయంలో ఈ కొత్త సంవత్సరంలో మనం ఆ ఒరవడికి కొంత అడ్డుకట్ట వేసి, మామూలు మనుషుల మానవత్వపు గుబాళింపు, తోటి మనిషి ఆనందాన్ని, అభ్యుదయాన్ని, కోరుకునే కొత్తరకం స్నేహితులని వెతుక్కుందాం. అలాంటి సరికొత్త కథానాయకుల్ని సృష్టిద్దాం, ఆదరిద్దాం. కొత్త సంవత్సరం కేవలం ఓ తారీఖు మారటమే అని హేతువాదులన్నా.. అదేదో కొత్తప్రారంభం అనుకోవడం మనకో ఉత్సాహాన్నిస్తుంది. అందుకే కొత్త నిర్ణయాలు, సరికొత్త ఆశయాలు, ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతాం. – ఇంద్రగంటి మోహన కృష్ణ, సినీ దర్శకుడు -
సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై దర్శకుడు సునీల్ కుమార్ రియాక్షన్
-
డైరెక్టర్‌పై కోపంతో సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు.. కేసు నమోదు!
బంజారాహిల్స్: అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడమే కాకుండా అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ దర్శకుడు, నిర్మాత షేక్ నాగుల్ షరీఫ్ పాన్ ఇండియా సినిమాను నిర్మించేందుకు సాగర్ సొసైటీలో కార్యాలయం తెరిచి నటీనటుల కోసం ఆడిషన్స్ సైతం మొదలు పెట్టారు. అంతే కాకుండా సినీ ప్రొడక్షన్లకు సంబంధించి ఇన్‌స్టా పేజ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాడు. ఈ పేజీ అడ్మిన్ బాధ్యతలను తన వద్ద పనిచేస్తున్న టి సృజన్‌కు అప్పగించాడు. కానీ సృజన్ ఇన్‌స్టా ద్వారా కొంత మందిని రకరకాలుగా వేధించడం మొదలు పెట్టాడు. (చదవండి: త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్ కౌర్ ఫైర్)విషయం తెలిసిన నాగుల్ అతన్ని విధుల్లో నుంచి తొలగించాడు. ఈ నెల 6న సృజన్ కార్యాలయానికి వచ్చి నాగుల్‌ను కలిసి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని కోరాడు. దీనికి నాగుల్ ఒప్పుకోలేదు. దీంతో సృజన్ సినీ ప్రొడక్షన్‌కు చెందిన ఇన్‌స్టా పేజీలో సినిమాకు సంబంధించిన విషయాలు తొలగించి అశ్లీల వీడియోలు, ఫొటోలను అప్లోడ్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆ చిత్రాలను కొంత మంది మహిళలకు పంపించాడు. విషయం తెలుసుకున్న షేక్ నాగుల్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘ఐతోలు’ బిడ్డె!
‘కల్కి 2898 ఏడీ’ అద్భుతమైన సైన్స్ విజువల్ సినిమాతో ప్రపంచ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్ర దర్శకుడు మన పాలమూరు బిడ్డే. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, రెబల్‌స్టార్ ప్రభాస్, కమల్‌హాసన్, దీపికా పదుకొణే, విజయ్ దేవరకొండ, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్ వంటి టాప్‌స్టార్లతో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలై.. భారీ హిట్‌గా దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా ఐతోలులో పండుగ వాతావరణం నెలకొంది. సాక్షి, నాగర్‌కర్నూల్/తాడూరు: దర్శకుడిగా మూడో సినిమానే హాలీవుడ్ తరహా చిత్రీకరణతో ప్రపంచవ్యాప్తంగా ప్రసంశలు అందుకుంటున్న నేపథ్యంలో అందరి దృష్టి నాగ్ అశి్వన్పై పడింది. దీంతో సినిమా డైరెక్టర్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లలో ఆసక్తి పెరుగుతోంది. తాడూరు మండలం ఐతోలు గ్రామానికి చెందిన నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. ఆయన తండ్రి డాక్టర్ సింగిరెడ్డి జయరాంరెడ్డి హైదరాబాద్‌లో యూరాలజిస్ట్‌గా, తల్లి జయంతిరెడ్డి గైనకాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. వృత్తిరీత్యా వారు హైదరాబాద్‌కు వెళ్లినా.. గ్రామంలో సొంతిల్లు, దగ్గరి బంధువులు చాలా మందే ఉన్నారు. కుటుంబ, ఇతర శుభకార్యాలు ఉన్నప్పుడు అందరూ ఐతోలుకు వచ్చి వెళుతుంటారు. ⇒ హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో చదువుకున్న నాగ్ అశ్విన్‌కు చిన్నప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నిర్మూలనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజంలో బ్యాచిలర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్ కోర్సు చేశాడు. సినిమాలకు దర్వకత్వం వహించాలనే లక్ష్యంగా ‘నేను మీకు తెలుసా?’ చిత్రానికి తొలిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన అశ్విన్.. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దగ్గర లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూనే.. ఆ చిత్రాల్లో చిన్నపాత్రలు సైతం వేశారు. అయితే 2013లో రచయిత, దర్శకుడిగా తీసిన ఇంగ్లిష్ లఘు చిత్రం ‘యాదోం కీ బరాత్’ కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్‌కు ఎంపికైంది. అనంతరం 2015లో ‘ఎవడే సుబ్రమణ్యం’ దర్శకుడిగా పరిచయమై సూపర్ హిట్‌తో తొలి చిత్రానికే నంది అవార్డు అందుకున్నారు. అదే ఏడాది వైజయంతి మూవీస్ అధినేత, నిర్మాణ అశ్వినిదత్ కుమార్తె ప్రియాంకను వివాహం చేసుకున్నారు. 2018లో అలనాటి హీరోయిన్ సావిత్రి బయోపిక్‌గా తీసిన ‘మహానటి’ సినిమా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు నిచ్చింది. ‘బయోపిక్’లో కొత్త ఒరవడి సృష్టించిన ఈ చిత్రం 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికైంది. వీటితో పాటు 2021లో వచ్చిన పిట్టకథలు వెబ్ సిరీస్‌లో ‘ఎక్స్‌లైఫ్’ సిగ్మెంట్‌కు దర్శకత్వం వహించారు. అలాగే అదేఏడాది తెలుగులో సూపర్ హిట్ అయిన జాతిరత్నాలు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఇండియాలోనే భారీ బడ్జెట్ రూ.600 కోట్లతో తీసిన పురాణ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం రికార్డులు కొల్లగొడుతోంది. స్వగ్రామంలో హర్షాతిరేకాలుదర్శకుడు నాగ్ అశి్వన్ తెరకెక్కించిన సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తుండటం, ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆయన స్వగ్రామం తా డూరు మండలం ఐతోలులో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంతో పాటు జిల్లాకేంద్రంలోనూ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ సంతోషాన్ని చాటుకుంటున్నారు. నాగ్ అశి్వన్ కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడినా సొంత ఊరిపైనున్న మమకారాన్ని వదులుకోలేదు. గ్రామంలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించి, నిర్వహణ బాధ్యతలను కూడా వారే చూసుకుంటుండటం గమనార్హం. ఏళ్ల నాటి కల నెరవేర్చుకున్నాడు.. మంచి దర్శకుడిగా ఎదగాలన్న తన ఏళ్ల నాటి కలను నాగ్ అశ్విన్ నెరవేర్చుకున్నాడు. కల్కి సినిమా పార్ట్–1 విజయవంతమై అందరి ప్రసంశలు అందుకుంది. భవిష్యత్‌లోనూ ఈ విజయాల పరంపర కొనసాగాలి. సినిమా గొప్ప విజయం సాధిస్తున్నందుకు సంతోషంగా ఉంది. – డాక్టర్ జయంతిరెడ్డి, నాగ్ అశ్విన్ తల్లిఇంకా గొప్ప విజయాలు సాధించాలి.. ఐతోలు గ్రామానికి చెందిన నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి సినిమా భారీ విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది. ఆయన విజయం మాకు అందరికీ గర్వకారణం. భవిష్యత్‌లోనూ గొప్ప సినిమాలు చేయాలని, దర్శకుడిగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. – హరికృష్ణ శర్మ, ఐతోలు, తాడూరు మండలం -
‘ఏజెంట్’ తర్వాత అఖిల్ టార్గెట్ ఏంటి..?
‘ఏజెంట్’ తర్వాత అఖిల్ కొత్త సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెల్లడి కాలేదు. అయితే అనిల్ అనే ఓ కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా చేయనున్నారని, ఈ సినిమాకు ‘ధీర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని ప్రచారం జరిగింది. తాజాగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో అఖిల్ ఓ సినిమా చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. శ్రీకాంత్ ఓ కథను రెడీ చేసి, అఖిల్‌కు వినిపించారట. ఈ స్క్రిప్ట్ అఖిల్‌కి నచ్చిందని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అఖిల్ – శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లోని సినిమా ఉంటుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘పెద కాపు 1’ ఈ నెలలోనే విడుదల కానుంది. ఒకవేళ అఖిల్‌తో సినిమా కన్ఫార్మ్ అయితే.. ‘పెద కాపు 1’ విడుదల తర్వాత ప్రకటన వస్తుందేమో? -
తెలుగు సినిమాల్లో ‘తెలంగాణ’ ఆయన కృషే.. అప్పట్లోనే ఆయన అలా..
తెలుగు సినిమా ఇప్పుడు సెకండ్ హాఫ్‌కు వచ్చింది. ఈ సెకండ్ హాఫ్ తెలంగాణ సినిమాది. తెలంగాణ హీరో, తెలంగాణ హీరోయిన్, తెలంగాణ పల్లె, తెలంగాణ పలుకుబడి.. తెలంగాణ సినిమా ఇప్పుడు తెలుగు సినిమా అయ్యింది. ఇకపై తెలంగాణ లేకుండా తెలుగు సినిమా మనజాలదు. ఈ కొమ్మరెమ్మల పూలు ఫలాలకు ఒకప్పుడు పాదు కట్టినది బి.నరసింగరావు.‘ఈ మట్టికి ఒక చరిత్ర ఉంది. ఈ మాటకు ఒక మిఠాస్ ఉంది. ఇక్కడి పేదకు ఒక గాథ ఉంది. ఇక్కడి ఆగ్రహానికి ఒక ఆయుధం ఉంది’ అని తెలుగు సినిమాలోకి తెలంగాణ జీవనాన్ని మొదటగా తీసుకువచ్చిన దర్శక నిర్మాత బి.నరసింగరావు. న్యూ సినిమా, ఆర్ట్ సినిమా, నియో రియలిస్టిక్ సినిమా, పారలెల్ సినిమా, ఆఫ్‌బీట్ సినిమా.. ఇలా రకరకాల పేర్లతో నవ సినిమా ఉద్యమం ప్రపంచమంతా వికసిస్తున్నప్పుడు ఆ ప్రభాతం వైపు చూపుడువేలు తిప్పి అటుగా దృష్టి ఇచ్చిన దార్శనికుడు బి.నరసింగరావు. ఆయన వల్ల తెలుగు సినిమా తల ఎత్తుకు తిరిగింది. ఆయనకి తెలంగాణ సినిమా తల వొంచి నమస్కరిస్తుంది. ప్రజలు వెలుతురులో ఉండాలనుకునేవాడు ఒక్కోసారి చీకటిలో దాక్కోక తప్పదు.బి. నరసింగరావు పరిస్థితి అలాగే ఉంది– 1975లో. ‘తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుంది’ అనుకునేవారు అడవుల్లోకి మళ్లారు. ‘కుంచెతో కలంతో కూడా ప్రజలను రాజ్యాధికారం వైపు నడిపించవచ్చు’ అని మరికొందరు జనం మధ్య ఉండిపోయారు. కళ అంటే ప్రజాకళ.. కళాకారుడికి ఉండవలసిన దృక్పథం అభ్యుదయ దృక్పథం.. రచన కూడా ఉద్యమమే.. నాలుగు వాక్యాల కవిత కూడా డైనమైటే.. అనుకునే కళాకారులు తయారవుతున్న సమయం అది. దీని కంటే ముందు ‘ఆర్ట్ లవర్స్’ పేరుతో ఒక సమూహాన్ని సిద్ధం చేసి సామన్యుల వద్దకు నాటకాన్ని విస్తృతంగా తీసుకెళుతున్న బి.నరసింగరావు 1974 నాటికి ప్రభుత్వానికి ‘వాంటెడ్’ అయ్యారు. ‘దొరికితే కాల్చేస్తారు. లేదా జైల్లో వేస్తారు’ అని తెలిసిపోయింది. బి.నరసింగరావు చేసిన నేరం? ప్రజల్ని చైతన్యపరచడం. ప్రజలు చైతన్యం కావడం పాలకులకు నచ్చదు. ‘పొత్తుల వ్యవసాయం’, ‘సమాధి’, ‘బీదలపాట్లు’, ‘కొత్తమనిషి’ వంటి నాటకాలు స్వయంగా రాసి, నటిస్తూ, ‘మీ పరిస్థితి ఇలా ఉంది.. మీరిలా చేయాలి’ అని ‘నూరి పోస్తున్న’ బి.నరసింగరావు కనుకనే ప్రభుత్వానికి ‘వాంటెడ్’ అయ్యారు. 1974–75. రెండేళ్లు. ‘అండర్‌గ్రౌండ్’. హైదరాబాద్‌లోనే అజ్ఞాత జీవితం. ఉదయం ఐదున్నరలోపు ఎవరినైనా కలిస్తే కలవాలి. రాత్రి తొమ్మిది తర్వాత మళ్లీ. సూర్యుడు తిరుగాడే సమయంలో తిరుగాడ్డానికి వీల్లేదు. పగలంతా గదిలో బందిఖానా అయి ఉన్న నరసింగరావులో ఎన్నో ఆలోచనలు. ‘నేను కళాకారుణ్ణి.. నా కళ జనం చూడాలి.. దానికి స్పందన నేను చూడాలి.. అడవిలోకో అండర్గ్రౌండ్లోకో వెళ్లేలా నా కళా జీవితం ఉండకూడదు.. నా కళ వెలుతురులో ఉండాలి’.. అనే నిర్ణయానికి వచ్చారు. 1976లో అండర్‌గ్రౌండ్ నుంచి బయటకొచ్చాక ఆయన పెట్టుకున్న మూడు ఆప్షన్లు.. భగత్ సింగ్ గురించి ఒపెరా మాదిరిగా రవీంద్ర భారతిలో ఆరు నెలలు వరుసగా నాటకం ఆడటం లేదా ‘రీడర్స్ డైజెస్ట్’ లాంటి మేగజీన్‌ను నడపడం లేదా సినిమా తీయడం. అసలు దొరల కుటుంబంలో బంగారు చెమ్చాతో పుట్టిన బి.నరసింగరావు సినిమాల్లో చూపినట్టుగా గుర్రం ఎక్కి తిరుగుతూ అమాయకులను భయభ్రాంతం చేస్తుండాలి గాని ఈ నాటకాలు, పాటలు, పదుగురితో కలసి చాయ్ సిగరెట్ల మధ్య సాహిత్యాన్ని చర్చించడాలు.. ఏమిటిలా.. ఎందుకిలా? ∙∙ ‘లెక్కలు వచ్చేవి కావు. ఎక్కాలు చెప్పలేకపోయేవాణ్ణి. మా నాన్న ఎంత పెద్ద పట్వారీ అయినా లెక్కల పంతులు ఎండలో ఒంటికాలి మీద నిలబెట్టేవాడు. పదో క్లాసు పాస్ అవడం కూడా కష్టమైంది. అందరూ చదివే చదువు వల్ల కాదనిపించింది. అందుకే ఆ తర్వాత ఫైన్ ఆర్ట్స్‌లో పెయింటింగ్, ఫొటోగ్రఫీ చదివాను’ అంటారు బి.నరసింగరావు. గజ్వేల్ (మెదక్)కు దగ్గరగా ఉన్న ప్రజ్ఞాపూర్ బి.నరసింగరావుది. కాని ఆ తర్వాతి జీవితం అంతా హైదరాబాద్‌లో ‘అల్వాల్’లో గడిచింది. ‘హైదరాబాద్‌లోని రీగల్ థియేటర్లో నా చిన్నప్పుడు చూసిన తొలి సినిమా ‘మేనరికం’ (1953). ఆ తర్వాత హిందీ ‘సువర్ణసుందరి’ చూశాను. హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కాలేజ్‌లో చదువుతున్నప్పుడు కాలేజ్‌కి వెళ్లనే లేదు. దాని పక్కనే ఉండే థియేటర్లలో ఉండేవాణ్ణి’ అంటారాయన. పుస్తకాల పిచ్చి కూడా అలాగే పట్టింది. ‘మా నాన్నగారి గదిలో చాలా పుస్తకాలు ఉండేవి. ఒకసారి వాటిని చదవడం మొదలెట్టి 40 రోజుల్లో 60 పుస్తకాలు చదివాను. ఆ తర్వాత కోఠి లైబ్రరీలో మకాం వేశాను. టెక్ట్స్‌బుక్స్ కన్నా ఈ పుస్తకాలు నాకు నచ్చాయి. అధికారం, దర్పం కన్నా గోడ మీద పడే ఉదయపు ఎండ నన్ను ఎక్కువ సంతోషపెట్టేది’ అని గుర్తు చేసుకున్నారాయన.సాహిత్యం, సినిమాలు, నాటకాలు, చిత్రలేఖనం.. ఇవన్నీ బి.నరసింగరావును చేర్చవలసిన చోటుకే చేర్చాయి– సినిమాకు– తన భూమికి– మాభూమికి. ∙∙ సందర్భవశాన మన దేశ దాదాపు తొలి నియో రియలిస్టిక్ సినిమా ‘దో బిఘా జమీన్’ (1953) భూమి సమస్యనే చర్చించింది. పేదవాడికి దక్కని భూమి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత న్యూవేవ్ సినిమా, న్యూ సినిమా మొదలయ్యిందే పేదల గురించి పీడకుల గురించి మాట్లాడటానికి. నిర్మాతల, నటీనటుల గుప్పిట్లో ఉండే కాలక్షేప సినిమాను దర్శకుడు పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని తెలియని ముఖాలతో, మామూలు మనుషులనే నటులుగా చేసి తక్కువ ఖర్చు, తక్కువ వనరులతో ప్రయోజన్మాతక సినిమాను చెప్పడమే న్యూ సినిమా. సత్యజిత్ రే వచ్చి ‘పథేర్ పాంచాలి’ (1955) తీసి ఆర్ట్ సినిమా అనే మాటను దేశానికి పరిచయం చేశాడు. అయితే ఒక ధోరణిగా ఆర్డ్/పారలెల్ ఫిల్మ్స్ రావాలంటే 1970లు రావాల్సి వచ్చింది. హిందీలో ఎం.ఎస్.సత్యు ‘గరం హవా’ (1973), శ్యాం బెనగళ్ ‘అంకుర్’ (1974) పారలెల్ సినిమాను తీసుకొచ్చాయి. మరోవైపు మలయాళంలో ఆదూర్ గోపాల్‌కృష్ణన్ వచ్చి ‘స్వయంవరం’ (1972) తీశాడు. కన్నడంలో మన తెలుగు పఠాభి ‘సంస్కార’ (1970) తీశాడు. కాని గమనించవలసిన విషయం ఏమిటంటే తెలుగులో పారలెల్ సినిమా ముగ్గురు బయటి దర్శకుల వల్ల వచ్చింది. మృణాల్‌సేన్ ‘ఒక ఊరి కథ’ (1977), శ్యామ్ బెనగళ్ ‘అనుగ్రహం’ (1977), గౌతమ్ ఘౌష్ ‘మాభూమి’ (1979). ఈ ‘మాభూమి’ బి. నరసింగరావు చెమటా, నెత్తురు, తెలంగాణ సినిమాకు ఆయన తెరవాలనుకున్న తొలివాకిలి. ∙∙ ‘నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ ప్రసాదరావు గారి అబ్బాయి రవీంద్రనాథ్ నా క్లాస్మేట్. వాడు కూడా ఎమర్జన్సీ టైమ్‌లో కోల్‌కతా వెళ్లి అండర్‌గ్రౌండ్‌లో ఉన్నాడు. తిరిగి వచ్చాక వాణ్ణి ప్రొడక్షన్లో పెట్టారు. మృణాల్‌సేన్ ‘ఒక ఊరి కథ’కు వాడు పని చేస్తుంటే నేను వెళ్లేవాణ్ణి. అప్పటికే నాకు సినిమా తీయాలని ఉంది. దర్శకత్వం చేయాలని ఉంది. కాని ఎలా తీయాలో తెలియదు. ఒక లక్ష రూపాయల్లో సినిమా తీయమని మృణాల్‌సేన్‌ను అడిగితే అంత తక్కువలో నేను చేయలేను.. కొత్త కుర్రాడొకడున్నాడు..అతన్ని ఉపయోగించుకో అని గౌతమ్ ఘోష్‌ను పంపారు. తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం నేపథ్యం ఉన్న కిషన్ చందర్ నవల ‘జబ్ ధర్తీ జాగే’ను తీసుకున్నాం. గౌతమ్ ఘోష్ దానికి రాసుకొచ్చిన స్క్రీన్‌ప్లే నాకు నచ్చలేదు. మళ్లీ కూచుని అందరం రాశాం. దర్శకత్వం ఎలా చేయాలో తెలుసుకుందామంటే గౌతం ఘోష్ నేర్పే మనిషి కాదు. అందుకని అతని వెంటే తిరుగుతూ అబ్సర్వ్ చేస్తూ సినిమా తీయడం తెలుసుకున్నాను’ అంటారు బి. నరసింగరావు. 1980లో తెలుగులో రిలీజైన రెండు సినిమాలు ‘శంకరాభరణం’, ‘మాభూమి’ సంచలనం సృష్టించాయి. కె. విశ్వనాథ్‌తో ప్రయోగం అంతో ఇంతో సేఫ్. కాని తెలంగాణ సినిమా కొత్తవాళ్లతో తీసి విడుదల చేయడం చాలా రిస్క్. ‘లక్ష అనుకున్న బడ్జెట్ ఐదున్నర లక్షలు అయ్యింది. ఆస్తి అమ్మాల్సి వచ్చింది. మొత్తం ఔట్‌డోర్‌లో తీయడం వల్ల ఎన్నో సమస్యలు. అందరూ పడి దెబ్బలు తగిలించుకునేవారే. రోజుకు ఒక అయొడిన్ సీసా అయిపోయేది’ అన్నారు బి.నరసింగరావు. కాని ఆ శ్రమ వృథా పోలేదు. ‘మాభూమి’ తెలంగాణ కథకు, సినిమాకు అరుగు కట్టింది. దాని మీద బంగారు నందిని కూచోబెట్టింది. హైదరాబాద్‌లో వంద రోజులు ఆడి అందరినీ చకితులను చేసింది. ఇదే సినిమాతో గద్దర్ని బి. నరసింగరావు యుద్ధనౌకను చేసి జనంలోకి వదిలారు. ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి’ పెద్ద హిట్. ∙∙ ‘రంగుల కల.. దర్శకుడిగా నా మొదటి సినిమా. మన దేశంలో మోడర్న్ పెయింటర్ మీద అప్పటికి ఒక్క సినిమా లేదు. జీవితంలో, కళలో ఒకేసారి దారి తెన్నూ వెతుక్కునే చిత్రకారుల కథ అది. కళ ప్రజల పక్షం ఉండాలి సరే. కళాకారుడు ఏ విధంగా బతకాలి. అతణ్ణి ఎక్స్‌ప్లాయిట్ చేసే వర్గాల కళారాధనలో బోలుతనం ఎంత.. ఇవన్నీ చర్చించాను. పస్తుల చిత్రకారుల 1980ల స్థితికి దర్పణం ఆ సినిమా’ అన్నారు బి. నరసింగరావు. ‘రంగుల కల’ (1983)లో బి. నరసింగరావు హీరో. హైదరాబాద్ నగరం ఇందులో ఒక పాత్రధారి. ఒక స్లమ్‌లో నివసించే చిత్రకారుడిగా ఆయన నటన ఆశ్చర్యం కలిగిస్తుంది. రూప హీరోయిన్. గద్దర్ పాడిన ‘భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న’ పాట రేడియోలో నిత్యం మోగిపోయింది. ∙∙ ‘సీనియర్ జర్నలిస్ట్ జి.కృష్ణగారు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి పిలిచారు. అప్పుడాయనొక మాట చెప్పారు– నరసింగరావు.. 1940ల్లో నేనొక దొరల గడీకి వెళ్లాను. అక్కడ ఒక దాసి నా కాళ్ల మీద నీళ్లు పోసి కడగడానికి వచ్చింది. నా కాళ్లు నేను కడుక్కోలేనా అన్నాను. ఇక్కడ ఎవరెవరో వచ్చి ఏమిటేమిటో కడిగించుకుంటారు మీరు కాళ్లకే ఇబ్బంది పడితే ఎలా అంది. అలా కడిగించుకునే మనుషులు ఎలాంటి వాళ్లు– అన్నారు. ఆ మాట నా మనసులో పడింది. మా నాన్న హయాంకు మా ఇంట్లో దాసీలు లేరు. నేను చూళ్లేదు. నేను నేరుగా మా అమ్మ దగ్గరకు వెళ్లి మనింట్లో దాసీలు ఉండేవారా అనంటే నిన్ను చిన్నప్పుడు చూసుకున్న లచ్చవ్వ దాసీయే కదా అంది. లచ్చవ్వ నా చిన్నప్పటికి ముసలిదైపోయింది. అంటే మా తాతల కాలంలో ఉండేవారన్న మాట. అక్కడి నుంచే దాసి సినిమా కథ పుట్టింది’ అన్నారు బి. నరసింగరావు. 1988లో వచ్చిన ‘దాసి’ తెలంగాణ సినిమా కీర్తిని, తద్వారా బి. నరసింగరావు కీర్తిని ప్రపంచానికి చాటింది. ఆరు జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రపంచంలోని అనేక సినిమా స్కూళ్లలో ఆ సినిమా సిలబస్. మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు ఆ సినిమా చూసి కదిలిపోయి బి. నరసింగరావుకు ఫ్యాన్‌గా మారారు. తనకు ఆత్మీయులను చేసుకున్నారు. ఏమిటి ‘దాసి’ గొప్పతనం? అది వేదనను సహజంగా చెప్పింది. మనుషులు క్రూరత్వాన్ని సాధారణ విషయంగా భావించేలా జీవిస్తుంటారు. ఎదుటివారిని హింసించడం వారి ఖర్మ వల్లే అనుకుంటారు. పశ్చాత్తాపం ఎరగని ఇలాంటి మనుషులు ఈనాడు ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తూనే ఉన్నారు. నటి అర్చన ఈ సినిమా మొత్తం ఒకటి రెండు చీరల్లో కనిపిస్తుంది. ఆమెతో దొర గడిపినా ఆమె హోదా ఏమీ మారదు. వంట గదిలో చాలా ఘోరమైన బొచ్చెలో తిండి పెడతారు. ఆమెకు కడుపు వస్తే అది వెలి కడుపు. దొరసానికి కడుపు రాకపోయినా పర్లేదు కాని దాసిదానికి రాకూడదు. ‘కడుపు తీయించు’ అని దొరసాని హుకుం జారీ చేస్తే గడిలోని ముసలి దాసి పచ్చి బొప్పాయి కాయని కత్తి పీట మీద రెండుగా కోస్తుంది. ప్రేక్షకులకు గుండె ఝల్లుమంటుంది. తీవ్రమైన హింస అతి మామూలుగా ఉంటుందని బి. నరసింగరావు చూపుతారు. నేటికీ ‘దాసి’ చూడకపోతే తెలుగువారు ఒక కాలాన్ని ఒక జీవన వేదనని తెలుసుకోనట్టే. అందుకే ముసోరి ట్రైనింగ్‌లో ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్‌లకు ఈ సినిమా చూపిస్తారు. ∙∙ బి. నరసింగరావుకు సినిమా ఆదాయ మార్గం కాదు. కాంబినేషన్ సెట్ చేసి అడ్వాన్సులు తీసుకోవడం కాదు. ఏరియా వారి కలెక్షన్లు కాదు. సినిమా అనేది బలమైన వ్యక్తీకరణ మాధ్యమం. ‘నా సినిమాలు చూశాక అవి చాలా రోజుల పాటు గుర్తుండిపోతాయి’ అంటారాయన. బి. నరసింగరావు తీసిన ‘మట్టి మనుషులు’ భవన నిర్మాణ కూలీల వ్యథాత్మక జీవితాన్ని చూపిస్తుంది. ఆ సినిమాలో కూలీల పై సాగే భౌతిక దోపిడి ఒక ఎత్తయితే వారిలో స్త్రీల పై సాగే లైంగిక దోపిడి మరో ఎత్తు. ‘మట్టి మనుషులు’ చూస్తే భవన నిర్మాణ కూలీల పట్ల సగటు మనిషి వైఖరి మారుతుంది. ఇదే కాదు హైదరాబాద్ నగరం మీద ‘ది సిటీ’, ఊరి జీవనం మీద ‘మా ఊరు’ డాక్యుమెంటరీలు తీసినా గాఢంగా ముద్రవేసే జీవన దృశ్యాలు. ‘మా ఊరు’ అయితే భావి తరాల కోసం దాచి పెట్టిన తాళపత్రగ్రంథం. ∙∙ బి. నరసింగరావు ఇప్పుడు డెబ్బయిల వయసు దాటారు. కాని నిత్యం సినిమా గురించో చిత్రకళ గురించో ఏదైనా కవిత్వం గురించో కథ గురించో పని చేస్తూనే ఉన్నారు. కొత్తగా వచ్చిన సెల్‌ఫోన్‌తో వేలకొలది ఫొటోలు తీస్తూ ప్రతి కొత్త సాంకేతిక పరికరం సాంస్కృతికంగా ఎలా ఉపయోగపడుతుందో చూస్తుంటారు. ఆయన తెలంగాణ సినిమాకు భూమిక ఏర్పరచకపోతే ఇవాళ ఊరూరా ప్రదర్శించిన ‘బలగం’ లాంటి సినిమాలు ఇప్పటికీ సాధ్యమయ్యేవి కావు. ‘తెలంగాణ ఏర్పడ్డాక సాంస్కృతికంగా చేయవలసింది చాలా ఉంది’ అంటారాయన. ‘అందుకై ప్రత్యేకంగా ఎవరితోనూ తలపడాలని నేను అనుకోను. కాని తలపడే సందర్భం వస్తే సిద్ధంగా ఉంటాను’ అన్నారాయన. ఆరగడుగుల పై చిలుకు ఎత్తుతో తన నివాసంలో ఆయన తెలంగాణ సినిమా భీష్మాచార్యుడిలా కనిపించారు. జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత యు.ఆర్.అనంతమూర్తి ‘దాసి’ చూసి పొంగిపోతూ ‘మై కంట్రీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ యూ’ అన్నారట. నిజమే. ఈ గొప్ప దర్శకుణ్ణి చూసి దేశం గర్విస్తూనే ఉంటుంది. ► ‘మట్టి మనుషులు’లో మొదటిసారి నీనా గుప్తాను పరిచయం చేశారు బి.నరసింగ రావు. ఆ సినిమాలో ఆమె భవన నిర్మాణ కూలీగా నటించింది. అందుకోసం రెండువారాలు హైదరాబాద్‌లో ఉండి తెలుగు కొద్దిగా నేర్చుకుంది. సినిమాలో ఆమె పాడే బిట్సాంగ్ ఉంది. అది ఆమే పాడింది. ► ‘దాసి’ కోసం నటి అర్చన స్నానం చేసే సీన్ తీయాల్సి ఉంది. ఒప్పుకోదేమో అనుకున్నారు. కాని అప్పటికే షూట్ జరుగుతున్న విధంలోని సీరియస్‌నెస్‌ను గమనించిన అర్చన ఆ సీన్ తీయడానికి అంగీకరించింది. కేవలం కెమెరామేన్ ఎ.కె.బీర్, తాను మాత్రమే లొకేషన్లో ఉండి మిగిలిన వారిని బయటకు పంపించి ఆ సీన్ తీశారు. ► ‘దాసి’లో దొర వేషం వేసిన భూపాల్ నిజ జీవితంలో శాంత స్వభావి. కాని దొర మనస్తత్వం ఏర్పడటానికి ఇంట్లో కూడా కటువుగా వ్యవహరించమని భూపాల్‌కు నరసింగరావు సూచించారు. షూటింగ్ మొదలయ్యాక భూపాల్ ఇంట్లో కూడా భార్యతో కఠినంగా వ్యవహరిస్తుండేసరికి ఆమె బెదిరిపోయి ఏం జరిగిందో తెలుసుకోవడానికి బి. నరసింగరావు దగ్గరకు వచ్చింది. అలా ఉండమని చెప్పింది తనే కనుక ఏం జవాబు చెప్పాలో తెలియక ఏదో సర్దిచెప్పి పంపించారు. ► బి.నరసింగరావు తెలుగు సినిమాకు పరిచయం చేసినవారిలో దర్శకుడు గౌతమ్ ఘోష్, నటుడు భూపాల్, ప్రసిద్ధ చిత్రకారుడు తోట వైకుంఠం, కవి దేవిప్రియ, నటుడు సాయి చంద్, గద్దర్, చిత్రకారుడు చంద్ర తదితరులు ఉన్నారు. తోట వైకుంఠం ‘రంగుల కల’ సినిమాలో కనిపిస్తారు. ‘రంగుల కల’లో గద్దర్ ‘భద్రం కొడుకో’ పాడుతుంటే కోరస్ సింగర్స్‌లో వంగపండు ఒకరిగా కనపడతారు. ► బి.నరసింగరావుకు సంగీతంలో గొప్ప ప్రవేశం ఉంది. ‘దాసి’కి ఆయన కూర్చిన నేపథ్య సంగీతం చూస్తే ఆ విషయం తెలుస్తుంది. శాస్త్రీయ సంగీతాన్ని తెలుగు సినిమాల్లో నేపథ్య సంగీతంగా బి.నరసింగరావు సమర్థంగా ఉపయోగించారు. ‘ది సిటీ’ డాక్యుమెంటరీ అందుకు ఉదాహరణ. ► ‘రంగుల కల’లో క్రేన్ ఉపయోగించి ఒక షాట్ తీయాల్సి వచ్చింది. కాని క్రేన్‌కు అద్దె ఎక్కువ. తక్కువ బడ్జెట్లో తీస్తున్న సినిమా కనుక కార్పొరేషన్ వారు వీధి దీపాలు మార్చడానికి ఉపయోగించే నిచ్చెన వాడి ఆ షాట్ తీశారు. ► బి.నరసింగరావు మంచి నటులు. ‘మా భూమి’లో ముఖ్యపాత్ర పోషించారు. రజాకార్లు తల మీద వాత పెట్టగా ఆ బాధ పట్టక జనం కోసం మాట్లాడే పాత్ర అది. ‘రంగుల కల’లో బి.నరసింగరావు హీరో. రూప హీరోయిన్. ఆ సినిమాలో ‘కౌగిలించుకోని’ హీరో హీరోయిన్లను చూపించడం ఒక వింత. ఎందుకంటే అప్పటికి హీరో హీరోయిన్ల గెంతులు శ్రుతి మించి ఉన్నాయి. - ఖదీర్ -
యంత్రాలు రీప్లేస్ చేస్తాయి!
‘‘మనందరం ఇప్పుడు ఏకతాటిపై నిలవక΄ోతే కచ్చితంగా మనల్ని యంత్రాలు రీప్లేస్ చేస్తాయి’’ అన్నారు సాగ్–ఆఫ్ట్రా (సీనియర్ యాక్టర్స్ గిల్డ్–అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్) అధ్యక్షురాలు ఫ్రాన్ డ్రెస్చెర్. కొన్ని వారాలుగా సమ్మె చేస్తున్న డబ్లు్యజీఏ (రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా)కి పూర్తి మద్దతు ప్రకటించారామె. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘నటీనటులు అణచివేతకు గురవుతున్నారు. వారికి తగిన గౌరవం దక్కడంలేదు. చిత్రపరిశ్రమలో ఏం జరుగుతుందనేది అందరికీ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో మిగతా అన్ని రంగాల్లోని కార్మికులకు అదే జరుగుతోంది. యజమానులు అత్యాశకు ΄ోతున్నారు. యంత్రాలను నడిపించే సహాయకులను (కార్మికులను ఉద్దేశించి) మర్చి΄ోతున్నారు. వారు చేస్తున్న సేవలను గుర్తించడంలేదు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. సీఈవోలకు ఏకంగా వందల మిలియన్ల డాలర్లలో అధిక వేతనాలు ఇవ్వడంవల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ బాధితులు ఎవరంటే మేమే (కార్మికులు). వ్యా΄ారంలో ఉన్నవాళ్లు మా పట్ల వ్యవహరిస్తున్న తీరు షాకింగ్‌గా ఉంది’’ అని ఘాటుగా స్పందించారు ఫ్రాన్ డ్రెస్చెర్. తగ్గేదే లే... ‘‘ఏఐ వల్ల ముప్పే’’ అంటూ సమ్మెలో భాగంగా నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏఐ న్యూస్ రీడర్స్ వచ్చిన నేపథ్యంలో ఏఐ వల్ల చిత్రపరిశ్రమలోనూ పెను మార్పు సంభవించే అవకాశం ఉందని హాలీవుడ్ కళాకారులు వా΄ోతున్నారు. అయితే ఏఐ వినియోగాన్ని తగ్గించాలన్న కళాకారుల డిమాండ్‌ని నిర్మాణ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అలాగే నటీనటుల వేతనాలు పెంపుకు కూడా నిర్మాతలు సుముఖత వ్యక్తపరచడంలేదన్నది హాలీవుడ్ టాక్. ఈ నేపథ్యంలో నటీనటులు కూడా తమ డిమాండ్లను ఆమోదించేవరకూ సమ్మె కొనసాగించే తీరాలనీ, తగ్గేదే లే అనే పట్టుదలతో ఉన్నారనీ సమాచారం. -
Jean Luc Godard: సినీ నవ్య పథగామికి సెలవ్!
‘‘సంగీతానికి బాబ్ డిలాన్ ఎంతో... సినిమాకు గొడార్డ్ అంత!’’ – నేటి మేటి హాలీవుడ్ దర్శకుడు క్వెంటిన్ టరంటినో అవును... గొడార్డ్ అంతటి సినీ దిగ్గజమే! వెండితెర విప్లవమైన ఫ్రెంచ్ న్యూవేవ్ సినిమా ఉద్యమాన్ని తెచ్చిన ఆరేడుగురు మిత్రబృందంలో అగ్రగామి. సినీ రూపకల్పన సూత్రాలను తిరగరాసిన అనేక చిత్రాలకు తన తొలి సినిమాతోనే బీజం వేసిన పెద్దమనిషి. విమర్శకుడిగా మొదలై దర్శకుడైన సినీ మేధావి. ఈ 91 ఏళ్ళ ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ సినీ దర్శక వరేణ్యుడు విషాదభరిత రీతిలో సెప్టెంబర్ 13న ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. ఆత్మహత్యకు సాయం తీసుకొని అంతిమ ప్రయాణం చేశారు. అవయవాలేవీ పనిచేయనివ్వని అనేక వ్యాధుల పాలైన ఆయనకు స్విట్జర్లాండ్‌లో చట్టబద్ధమైన ఆ రకమైన తుది వీడ్కోలు సాంత్వన చూపింది. అంతేకాదు... ఆ రకమైన ఆత్మహత్య సంగతి అధికారికంగా చెప్పాలనీ ముందే ఆయన మాట తీసు కున్నారు. అలా ఆఖరులోనూ గొడార్డ్ది నవ్య పంథాయే! 1930 డిసెంబర్లో పుట్టిన గొడార్డ్ 1950లో కొందరితో కలసి ‘గెజెట్ డ్యూసినిమా’ అనే సినిమా పత్రిక స్థాపించి, అనేక వ్యాసాలు రాశారు. 1952 నుంచి ఆ మిత్ర బృందంతో గొంతు కలిపి, న్యూవేవ్ సినిమాకు దన్నుగా విమర్శ వ్యాసాలు వెలువరించారు. మొదట లఘుచిత్రాలు, ఆనక 1959లో తొలి సినిమా తీశారు. దాన్ని ఖండఖండాలుగా కట్ చేయాల్సి వచ్చినప్పుడు, అవసరానికి ఆయన మొదలెట్టినదే ‘జంప్ కట్’ ఎడిటింగ్. ఇవాళ అదే ప్రపంచ సినిమాలో ఓ వ్యవస్థీకృత విధానమైంది. విమర్శకుడిగా మొదలై దర్శకుడైన ఈ సినీ మేధావి రూటే సెపరేటు. నటీనటులు సహజంగా ప్రవర్తిస్తుంటే, కెమేరా నిరంతరం కదులుతూ పోతుంటే, స్క్రిప్టు అక్కడికక్కడ స్పాట్లో మెరుగులు దిద్దుకుంటూ ఉంటే, ఎడిటింగ్‌లో మునుపెరుగని వేగం ఉంటే... అదీ గొడార్డ్ సినిమా. స్టయిలిష్‌గా సాగే తొలి చిత్రం ‘బ్రెత్లెస్’తోనే ఇటు విమర్శక లోకాన్నీ, అటు బాక్సాఫీస్ ప్రపంచాన్నీ కళ్ళప్పగించి చూసేలా చేసిన ఘనత ఆయనది. ఆ పైన ‘కంటెప్ట్’ లాంటి గొప్ప చిత్రాలు తీశారు. మలి చిత్రంలో నటించిన డ్యానిష్ మాడల్ అన్నా కరీనాను పెళ్ళాడి, ఆమెతో హిట్ సినిమాలు చేశారు. 1968లో ఫ్రాన్స్‌లో విద్యార్థుల, శ్రామికుల నిరసనకు సంఘీభావంగా నిలబడి కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను రద్దు చేయించారు. ఆ ఏడాదే ఓ మార్క్సిస్ట్ సినీ బృందాన్ని స్థాపించి, సామ్యవాదాన్ని అక్కున చేర్చుకోవడం మరో అధ్యాయం. 1960లలో విరామం లేకుండా వరుసగా సినిమాలు తీసిన గొడార్డ్ 1970లకు వచ్చేసరికి స్విట్జర్లాండ్‌లోని ఓ టీవీ స్టూడియోలో పనిచేస్తూ, కొత్త మీడియమ్ వీడియో వైపు దృష్టి మళ్ళించారు. 1980లలో సినీ రూపకల్పనకు తిరిగొచ్చి, ’94 వరకు అనేక చిత్రాలు తీశారు. దర్శకుడిగా గొడార్డ్లో మూడు దశలు. న్యూవేవ్ గొడార్డ్ (1960–67)గా మొదలైన ఆయన ర్యాడికల్ గొడార్డ్ (1968–72)గా పరిణామం చెంది, 1980ల అనంతరం వీటన్నిటికీ భిన్నమైన దర్శకుడిగా పర్యవసించారు. వస్తువుకూ– శిల్పానికీ, మనసుకూ – మెదడుకూ సమరస మేళవింపు ఆయన సినిమాలు. ఆయన రాజకీయాలు చూపెడతారు. కానీ ప్రబోధాలు చేయరు. సినిమానే శ్వాసించి, జీవించడంతో తెరపై అణువణువునా దర్శనమిస్తారు. ప్రతి సినిమాతో సినీ ప్రేమికుల మతి పోగొడతారు. సినిమాలో కవిత్వాన్నీ, తనదైన తాత్త్వికతనూ నింపేసిన ఆయన, నిర్ణీత పద్ధతిలోనే కథాకథనం సాగాలనే ధోరణినీ మార్చేశారు. స్థల కాలాదులను అటూ ఇటూ కలిపేసిన కథాంశాలతో సినిమాలు తీశారు. ‘కథకు ఆది మధ్యాంతాలు అవసరమే. కానీ, అదే వరుసలో ఉండాల్సిన పని లేద’ని నమ్మారు. దాదాపు 100కు పైగా సినిమాలు తీసినా, ఎప్పటికప్పుడు కొత్తదనం కోసమే పరితపించారు. ఆయన సినిమాల్లో రిలీజ్ కానివి, సగంలో ఆగినవి, నిషేధానికి గురైనవీ అనేకం. నాలుగేళ్ళ క్రితం 87 ఏళ్ళ వయసులో 2018లోనే గొడార్డ్ తాజా చిత్రం రిలీజైంది. కెరీర్లో ఒక దశ తర్వాత ఆలోచనాత్మకత నుంచి అర్థం కాని నైరూప్య నిగూఢత వైపు ఆయన కళాసృష్టి పయనించిందనే విమర్శ లేకపోలేదు. అయితేనేం నేటికీ పాత చలనచిత్ర ఛందోబంధాలను ఛట్ఫట్మనిపించిన వినిర్మాణ శైలి దర్శకుడంటే ముందు గొడార్డే గుర్తుకొస్తారు. అందుకే, 2011లో గొడార్డ్కు గౌరవ ‘ఆస్కార్’ అవార్డిస్తూ ‘సినిమా పట్ల మీ అవ్యాజమైన ప్రేమకు.. నిర్ణీత సూత్రాలపై మీ పోరాటానికి.. నవీన తరహా సినిమాకు మీరు వేసిన బాటకు..’ అంటూ సినీ ప్రపంచం సాహో అంది. రచయితల్లో జేమ్స్ జాయిస్, రంగస్థల ప్రయోక్తల్లో శామ్యూల్ బెకెట్లా సినిమాల్లో గొడార్డ్ కాలాని కన్నా ముందున్న మనిషి. సమకాలికులు అపార్థం చేసుకున్నా, భావి తరాలపై ప్రభావమున్న సృజనశీలి. నవీన మార్గం తొక్కి, ఇతరులు తమ ఆలోచననూ, ఆచరణనూ మార్చుకొనేలా చేసిన ఘనుడు. ఏ రోజు సీన్లు ఆ రోజు సెట్స్‌లో రాస్తూ, చేతిలో పట్టుకొనే చౌకరకం కెమెరాలతో, ఎదురెదురు అపార్ట్మెంట్లలో, తెలిసిన బంధుమిత్రులే నటీనటులుగా సినిమా తీస్తూ అద్భుతాలు సృష్టించిన జీనియస్. ఆయన ర్యాడికల్ శైలి ఎందరిలోనే సినీ సృజనకు ఉత్ప్రేరకం. ఆ ప్రభావం అనుపమానం. అది ఎంత గొప్పదంటే... ఆయన సినిమాలు చూస్తూ వచ్చిన హాలీవుడ్ కుర్రకారులో అసంఖ్యాకులు కెమేరా పట్టి, లోబడ్జెట్, స్వతంత్ర చిత్రాలు తీయసాగారు. ఆయన టెక్నిక్లే వారి యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీల రూపకల్పనకు తారకమంత్రమయ్యాయి. సంప్రదాయంపై తిరుగుబాటు చేసి, హాలీవుడ్‌నే ధిక్కరించిన ఓ దర్శకుడిని ఆ హాలీవుడ్డే అలా ఆరాధించడం వింతల్లో కెల్లా వింత. మరెవరికీ దక్కని ఘనత. హాలీవుడ్ దర్శకుడు క్వెంటిన్ టరంటినో పైనా ‘అమితంగా ప్రభావం చూపిన దర్శకుడు’ గొడార్డే! తన గురువు కాని గురువు తీసిన ‘బ్యాండ్ ఆఫ్ అవుట్‌సైడర్స్’ స్ఫూర్తితోనే టరంటినో తన స్వీయ సినీ నిర్మాణ సంస్థకు ‘ఎ బ్యాండ్ ఎపార్ట్’ అని పేరు పెట్టారు. అన్ని వ్యవస్థలనూ ప్రతిఘటించిన గొడార్డ్ తనకు తెలియకుండా తానే ఒక వ్యవస్థ కావడం ఓ విరోధాభాస. ఆయన తన సినిమాల్లో చెప్పిన అంశాలు ముఖ్యమైనవే. కానీ, చెప్పీచెప్పకుండా అంతర్లీనంగా అలా వదిలేసినవి మరీ ముఖ్యమైనవి. ‘ఫోటోగ్రఫీ సత్యం. సినిమా సెకనుకు 24 సార్లు తిరిగే సత్యం. ఎడిట్ చేసిన ప్రతిదీ అసత్యమే’ అనేవారాయన. ఆ సత్యాసత్యాల సంఘర్షణలే ఆయన చిత్రాలు. ఒక్కమాటలో సినిమాను తన సెల్యులాయిడ్ రచనగా మలుచుకున్న అరుదైన దర్శకుడు గొడార్డ్. (క్లిక్ చేయండి: బొమ్మలు చెక్కిన శిల్పం) బతికుండగానే ఆయనపై ఆయన శైలిలోనే ఒక సినిమా రావడం విశేషం. గొడార్డంటే ఫ్రెంచ్ న్యూవేవ్ అంటాం. కానీ, జాగ్రత్తగా గమనిస్తే 1960ల తర్వాత ప్రపంచం నలుమూలల్లో ప్రతి నవ్యధోరణిలో ఆయన దర్శనమిస్తారు. ఆయన శైలి, సంతకాలు మన బాలీవుడ్ సినిమాల్లోనూ కనిపిస్తాయి. సినిమా సరిహద్దుల్ని విస్తరించిన గొడార్డ్తో ప్రభావితుడైన దర్శకుడు మార్టిన్ స్కొర్సెసే అన్నట్టు ‘‘సినీ రంగంలో అతి గొప్ప ఆధునిక దృశ్యచిత్రకారుడు.’’ చిత్రకళకు ఒక పికాసో. సినిమాకు ఒక గొడార్డ్! రాబోయే తరాలకూ ఆయన, ఆయన సినిమా గుర్తుండిపోయేది అందుకే! (క్లిక్ చేయండి: నడిచే బహు భాషాకోవిదుడు) – రెంటాల జయదేవ -
విశ్వ భారతం
తపోదీక్షలో ఉన్న వ్యాసుడికి ఉన్నట్టుండి సృజన ఉప్పొంగుతుంది. మానవజాతి చరిత్రను కావ్యరూపంలో రాయ సంకల్పించి, తనకు లేఖకుడిగా కౌమార బాలుడైన పరీక్షిత్తును ఉండమంటాడు. పరీక్షిత్తుకు తన పూర్వీకులను అతి దగ్గరగా పరిచయం చేయడం వ్యాసుడి ప్రాథమికోద్దేశం. మనుషుల అతి సంక్లిష్టమైన స్వభావాలను చిత్రించడం ద్వారా మానవజాతికి తమ ఉనికి పట్ల ఒక జాగరూకతను కలిగించడం పరమ లక్ష్యం. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగింది సర్వనాశనమే. ఇంతటి మహోన్నత కార్యం కాబట్టే, సాక్షాత్తూ దేవుడే(గణేశుడు) స్వయంగా వ్యాసుడికి లేఖకుడిగా కుదురుకుంటాడు. ఇటీవల మరణించిన రంగస్థల దిగ్గజం పీటర్ బ్రూక్ దర్శకత్వం వహించిన ‘ద మహాభారత’, తానూ ఒక పాత్రగా ఉన్న భారతాన్ని వ్యాసుడు రాయడానికి పూనుకోవడంతో ప్రారంభమవుతుంది. మనకు మహాభారతం కొత్తది కాదు. మన సారస్వతం మహాభారతంతో ప్రభవించింది. మన రంగస్థలం మహాభారతంతో సంపన్నమైంది. మన చిత్రసీమ మహాభారతంతో పదునెక్కింది. ‘తత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా, ఆధ్యాత్మవిదులు వేదాంతంగా, నీతివిచక్షణులు నీతిశాస్త్రంగా, కవులు మహాకావ్యంగా, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహంగా, పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయంగా’ గౌరవించే ఇతిహాసం ఇది. ‘ఇందులో ఉన్నదే ప్రపంచంలో ఉన్నది. ఇందులో లేనిదేదీ ప్రపంచంలో లేదు.’ అందుకే బయట తలెత్తిన సమస్యకు మహాభారతంలో సమాధానం వెతకడానికి ప్రయత్నించాడు ఇంగ్లండ్‌కు చెందిన ‘పద్మశ్రీ’ పీటర్ బ్రూక్(1925–2022). వియత్నాంతో అమెరికా యుద్ధం జరిగిన తర్వాతి విధ్వంసం బ్రూక్‌కు మహాభారతం మీద ఆసక్తిని కలిగించింది. ప్రతి పాత్రా రక్తమాంసాలతో, తనవైన బలహీనతలతో ఉండి, యుద్ధ బీభత్సాన్ని అనివార్యం చేస్తుంది. ప్రతి మనిషీ సృష్టి విధ్వంసంలో ఏదో ఒక మేరకు పాత్రను పోషిస్తూనే ఉంటాడు; అందుకే అందరూ ఈ ప్రపంచానికి ఉమ్మడిగా బాధ్యులేనని పీటర్‌కు నమ్మకం కలిగింది. దాన్నే విశ్వ యవనిక మీద ఎలుగెత్తి చాటాడు. క్లాసిక్స్‌ను స్టేజీ మీదకు తేవడంలో రంగస్థలానికి ప్రమాణాలు నెలకొల్పిన పీటర్ బ్రూక్ ‘అవర్ గ్రేటెస్ట్ లివింగ్ థియేటర్ డైరెక్టర్’ అనిపించుకున్నాడు. భారతం కోసం ఫ్రెంచ్ రచయితలైన జాన్ క్లాడ్ కారియేరీ, మేరీ హెలెనా ఏస్తియన్‌తో జట్టు కట్టాడు. ఎందరో సంస్కృత పండితులను కలిశారు. ఎనిమిదేళ్ల శ్రమ తర్వాత పన్నెండు గంటల నాటకంగా భారతం రూపొందింది. 1985లో తొలి ప్రదర్శన జరిగింది. పదహారు దేశాలకు చెందిన నటీనటులతో నాలుగేళ్లపాటు వీరి బృందం అమెరికా నుంచి ఆఫ్రికా గ్రామాల వరకూ పర్యటించింది. ముంబయి నగరానికీ వచ్చింది. తెలుపు, నలుపు, గోధుమ వర్ణాల నటులతో ఇది నిజంగానే ప్రపంచ నాటకంగా మారిపోయింది. ‘లార్డ్ ఆఫ్ ద ఫ్లైస్’ లాంటి సినిమాతో సినీ దర్శకుడిగానూ ప్రసిద్ధుడైన బ్రూక్ తన నాటకం ఆధారంగానే 1989లో ఐదున్నర గంటల టెలివిజన్ సిరీస్‌గా ‘ద మహాభారత’ రూపొందించారు. ఆయన్ని అంచనా కట్టడానికి మనకు ఇప్పుడున్న సోర్సు ఇదే! ‘మ..హా..భా..ర..త్..’ అంటూ దూరదర్శన్ ద్వారా 94 వారాల ధారావాహికను ఇంటింటికీ పరిచయం చేసిన బీఆర్ చోప్రాకు ముందు, లేదా సమాంతరంగా బ్రూక్ అనుసృజన మొదలైంది. మొదటి సీన్ నుంచే మనకు అలవాటైన భారతాన్ని చూడటం లేదని అర్థమైపోతుంది. ద్రౌపది(మల్లికా సారాభాయి) లాంటి ఒకట్రెండు పాత్రలు తప్ప ఎవరూ భారతీయులు కాదు. సెట్టింగులు తక్కువ, ఆభరణాలు అత్యల్పం, కిరీటాలు లేవు, పరిచారికలు కనబడరు, జయజయ ధ్వానాలు శూన్యం, రాజకుమారులందరూ షేర్వానీలు తొడుక్కుంటారు. మహామహా యోధులు బారులు తీరిన చివరి యుద్ధ ప్రారంభ సూచికగా అర్జునుడు శంఖం ఊదినప్పుడు కనబడేది మహా అయితే రెండు తెల్ల గుర్రాలు మాత్రమే. ఒక భారీ విజువల్ ఫీస్ట్ దీన్నుంచి ఆశించలేం. కానీ పీటర్ బ్రూక్ గొప్పతనం ఎక్కడంటే, అవేవీ లేకుండానే ఆ ఉద్వేగాన్ని పలికించగలగడం. రంగస్థలం మీద ఒక ఖాళీ స్థలంలో నువ్వొక విశ్వాన్ని చూపగలవు; నటుడి చేతిలోని ఒక కర్ర, ఒక సీసా, లేదా ఖాళీ మద్య పాత్రతో ఎంతో చేయొచ్చునంటాడు బ్రూక్. ఆ స్ఫూర్తి ఇందులోనూ కనబడుతుంది. కథను వర్తమానంలో చూపడం కంటే జరిగిపోయినదాన్ని వ్యాసుడు నెరేటర్‌గా చెబుతుండటం వల్ల ఇందులో ఉన్నదేదీ ఇక లోపంగా కనబడదు. కృష్ణుడు నీలవర్ణంలో ఉండకపోవడం, భీష్ముడంతటివాడిని కూడా మనవలు పేరు పెట్టి పిలవడం భారతీయ పద్ధతికి దూరం. గన్నేశా, సత్యవత్తి లాంటి ఉచ్ఛారణలు భారతీయేతరుల పరిమితి. వీటికంటే కూడా భారత వారసత్వాన్ని దొంగిలిస్తున్నాడని పీటర్ నిందలు ఎదుర్కొన్నాడు. అయితే, భారతం ప్రపంచానికి చెందినదని తన ప్రయత్నాన్ని సమర్థించుకున్నాడు. మడుగులో నీళ్లు తాగడానికి అనుమతి ఇచ్చేముందు యక్షుడు అడిగే ప్రశ్న: ‘ఈ ప్రపంచానికి కారణం ఏమిటి?’ దానికి ధర్మరాజు సమాధానం: ‘ప్రేమ!’ ఇదే సర్వకాలావసరం. సాహిత్య ఆదాన ప్రదానాలకు కారణమయ్యే, అన్ని ప్రాంతాల వైవిధ్యమైన కథనాలను ప్రపంచం వినగలిగేట్టు చేసే సాంస్కృతిక దూతలు ఎప్పుడూ అవసరమే. మనుషులను అర్థం చేసుకోవడం ద్వారానే మనుషులు మారగలరు. -
అవధుల్లేని కళ
గోవిందుని అరవిందన్ సినిమాల్లోకి రాకముందు కార్టూనిస్టుగా పనిచేశారు. ఆయన కార్టూన్ స్ట్రిప్ ‘చెరియ మనుష్యారుమ్ వలియ లోకవుమ్’ (చిన్న మనుషులు పెద్ద ప్రపంచం) దశాబ్దానికి పైగా మలయాళ వారపత్రిక మాతభూమిలో వచ్చింది. దీన్ని ఆధారం చేసుకొనే తన మొదటి సినిమా ‘ఉత్తరాయణం’కు(1974) శ్రీకారం చుట్టారు. అప్పటికే నాటకరంగంలో కూడా చేస్తున్న కషి ఆయన్ని చిత్రసీమలోకి అడుగుపెట్టేలా పురిగొల్పింది. స్వాతంత్య్ర సమర కాలంలో ఒక సాధారణ యువకుడి ద్వైదీ భావాలనూ, వేర్వేరు పోరాట మార్గాలనూ, కొందరు మనుషుల అవకాశవాదాన్నీ అతిసహజంగా చిత్రించిన ఈ సినిమా మలయాళ పరిశ్రమలో కొత్తగాలిలా వీచింది. అప్పుడప్పుడే మలయాళ పరిశ్రమ ఉత్తరాదిన వీస్తున్న సమాంతర సినిమా పవనాలకు పరిచయం అవుతోంది. మున్ముందు జి.అరవిందన్‌గా సుప్రసిద్ధం కాబోతున్న గోవిందుని అరవిందన్(1935–1991) తర్వాతి సినిమాగా ‘కాంచనసీత’ ప్రారంభించారు. 1977లో వచ్చిన ఈ సినిమా చూస్తే గుప్పెడు మందితో, ఏ ఆర్భాటమూ హడావుడీ లేకుండా కూడా రామాయణాన్ని తెరకెక్కించవచ్చా అన్న సంభ్రమాశ్చర్యం కలుగుతుంది. తక్కువ మాటలు, శక్తిమంతమైన ప్రతీకలు, దశ్యబలంతో ఉత్తర రామాయణాన్ని ఒక వ్యక్తిగత కవితా అభివ్యక్తిగా మలిచారు. ఇంకా దీని విశేషం ఏమిటంటే– తారలనూ, అలవాటుగా చూస్తున్న నునుపైన తెలుపు శరీరాలనూ పక్కనపెట్టి రాముడితో దగ్గరి సంబంధం ఉందని చెప్పుకొనే ‘రామచెంచు’ తెగవాళ్లతోనే ప్రధాన పాత్రలను పోషింపజేయడం! దీనివల్ల ఛాందసవాదుల నుంచి దైవదూషణ స్థాయి వ్యతిరేకతనూ ఎదుర్కొన్నారు. కానీ వెనక్కి తగ్గ లేదు. సినిమా పట్ల ఆయన దక్పథం అంత బలమైనది. అందువల్లే మలయాళంలో సమాంతర సినిమాకు దారిచూపిన మొదటి వరుస చిత్రంగా కాంచనసీత చరిత్ర కెక్కింది. ఈ సినిమా షూటింగ్ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో జరగడంతో తెలుగువారికి కూడా దీంతో మరింత సంబంధం ఏర్పడింది. అరవిందన్ తర్వాతి సినిమా 1978లో వచ్చిన ‘థంపు’. అంటే సర్కస్ డేరా. దీన్ని బ్లాక్ అండ్ వైట్‌లో తీయాలని పూనుకోవడానికి బహుశా జీవితపు నలుపూ తెలుపుల్నీ అత్యంత గాఢంగా చూపాలని కావొచ్చు. ఒక ఊరికి సర్కస్ వాళ్లు రావడంతో మొదలై, కొన్ని రోజులు చుట్టుపక్కల వాళ్లని ఊరించి, ఊగించి, తిరిగి ఏ ఆదరణా లేని దశకు చేరుకుని కొత్త ఊరిని వెతుక్కుంటూ పోయేదాకా కథ సాగుతుంది. ఏ కళకైనా అవధులు ఉన్నాయనీ, ఆకర్షణ ఎల్లవేళలా నిలిచేది కాదనీ చాటినట్టుగా ఉంటుంది. ఒక గొప్ప కళాకారుడు మాత్రమే కళకు పరిమితులు ఉన్నాయని గుర్తించగలడు. జీవిత రంగం నుంచి అందరమూ ఎప్పుడో ఒకప్పుడు నిష్క్రమించాల్సిన వాళ్లమేనన్న కఠోర సత్యాన్ని కూడా ఇది గుర్తు చేయొచ్చు. దాదాపుగా డాక్యుమెంటరీలా సాగే ఈ సినిమా సర్కస్ చూస్తున్న ప్రతి ఒక్కరి, ప్రతి ఒక్క హావభావాలను పట్టుకుంటుంది. మనుషుల మీద ఎంతో ప్రేమ ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి సినిమాలు తీయగలరు. ఒక మనిషి మానసికంగా కుప్పగూలే పరిస్థితులు ఎలా వస్తాయన్నది చూపిన చిత్రం ‘పోక్కు వెయిల్’(సాయంసంధ్య–1981). చాలా నెమ్మదైన కథనం. కానీ ‘తీవ్రమైన నెమ్మదితనం’ అది. అందులోంచే ఉద్వేగాన్ని ఉచ్చస్థాయికి తీసుకెళ్తారు. సినిమా అనేది గిమ్మిక్కు కాదంటారు అరవిందన్. దీనితో ఏకీభావం ఉన్నవాళ్లకు ఇది గొప్ప అనుభవాన్ని ఇవ్వగలుగుతుంది. స్త్రీ పురుష సంబంధాలూ, ఆకర్షణల్లోని సంక్లిష్టతనూ, తదుపరి పర్యవసనాలూ, పశ్చాత్తాపాలనూ ఎంతో సున్నితంగా ఆవిష్కరించిన ‘చిదంబరం’(1985) ఆయన మాస్టర్‌పీస్. మొదటి సినిమా మినహా ఈ అన్నింటికీ మున్ముందు మలయాళంలో మరో ప్రసిద్ధ దర్శకుడిగా అవతరించనున్న షాజీ ఎన్.కరుణ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయడం గమనార్హం. 56 ఏళ్ల వయసులోనే అర్ధాంతరంగా కన్నుమూసిన అరవిందన్ ఉన్ని, కుమ్మట్టి, ఎస్తప్పన్, వస్తుహార లాంటి సినిమాలు తీయడంతోపాటు ఆరో ఓరల్, పిరవి లాంటి చిత్రాలకు సంగీత దర్శకత్వమూ వహించారు. ప్రతి సినిమాకూ ఎప్పటికప్పుడు నెరేటివ్ శైలిని మార్చుకుంటూ ప్రతిదాన్నీ ఒక కొత్త ప్రయోగంగా చేయడం ఆయన ప్రత్యేకత. ‘పాన్ ఇండియా’, ‘పాన్ వరల్డ్’ లాంటి మాటలు కేవలం వ్యాపార లెక్కలు. నిలిచిపోయే సినిమాలకు అవి కొలమానం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు దేశంలో సినిమా ప్రేమికులు అత్యంత ఆసక్తి ప్రదర్శిస్తున్న సినీ పరిశ్రమ ఏదైనా ఉందంటే, అది మలయాళ చిత్రసీమే. ఒక నిబద్ధతతో వచ్చిన చిత్రాల ఒరవడిని అద్దుకున్న జీవితపు వాస్తవికతా, కథను చూడబుద్ధేసేట్టుగా చెప్పడంలో కమర్షియల్ సినిమా సాధించిన ఒక వేగపు లయా... ఈ రెండింటినీ మేళవించుకొని ఇండియా మొత్తాన్నీ తమవైపు తిప్పుకొంటోంది. దాని వెనక అరవిందన్ లాంటి వారి స్ఫూర్తి విస్మరించలేనిది. ప్రతి ఏడాదీ ప్రపంచ సినిమా జీవులు ఎంతో ఆసక్తి కనబరిచే ప్రతిష్ఠాత్మక కాన్ ఫిలిం ఫెస్టివల్ ఫ్రాన్స్‌లో ముగిసింది. మే 17 నుంచి 28 వరకు జరిగిన 2022 సంవత్సరపు ఈ ఉత్సవం మిరుమిట్లు గొలిపే తారల మధ్య ఎంతో వైభవోపేతంగా జరిగింది. భారతదేశం తరఫున క్లాసిక్ విభాగంలో అక్కడ ప్రదర్శనకు నోచుకున్న సినిమాలు రెండే రెండు. ఒకటి, సత్యజిత్ రే ‘ప్రతిద్వంది’ కాగా, రెండవది జి. అరవిందన్ ‘థంప్’. (కొత్త వెర్షన్లో థంపును థంప్‌గా మార్చారు.) రెండు నిరాడంబర సినిమాలు ఆ ఆర్భాటపు పండుగలో ప్రదర్శన జరగడం విరోధాభాసే కావొచ్చుగానీ అదే జీవితపు తమాషా కూడా! -
డాక్యుమెంటరీ ఫిల్మ్: ఇది నా ఇల్లు
ఎవరినైనా కలిసినప్పుడు మంచీ చెడు మధ్యలో తప్పక వచ్చే ప్రశ్న ‘మీ ఇల్లెక్కడ?!’ ‘ఇదే ప్రశ్నను లద్దాఖ్‌లోని ఓ పెద్ద మనిషిని అడిగినప్పుడు అక్కడి చుట్టూ కొండలు, విశాల మైదానాలు చూపిస్తూ... ఈ ప్రకృతి ఒడే నా ఇల్లు అని పరిచయం చేస్తే... ఆ ప్రపంచంలో 45 రోజులు ఉండి తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఇది నా ఇల్లు’ అని వివరించారు దీపాకిరణ్. ప్రపంచ వ్యాప్తంగా 75 వేల మందికి పైగా స్టోరీ టెల్లర్స్‌ను చేరుకున్న దీపాకిరణ్ హైదరాబాద్ వాసి. స్టోరీ ఆర్ట్ ఫౌండేషన్ ఫౌండర్, ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్, ఆర్ట్–బేస్డ్ ఎడ్యుకేషనలిస్ట్. ఈ స్టోరీ టెల్లర్ ఇటీవల ‘దిస్ ఈజ్ మై హోమ్’ అనే డాక్యుమెంటరీ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ యేడాది ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎమ్ఐఎఫ్ఎఫ్) లో ప్రదర్శనకు వచ్చిన 800 ఎంట్రీలలో ‘దిస్ ఈజ్ మై హోమ్’ టాప్ టెన్ జాబితాలో నిలిచింది. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడినప్పుడు డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపకల్పన గురించి ఇలా పంచుకున్నారు. ‘‘సముద్రం నుండి 3,700 మీటర్ల ఎత్తులో లద్దాఖ్ పర్వతాలలోని మారుమూల గ్రామంలో ఒక యువ గ్రాఫిక్ డిజైనర్ జీవితాన్ని డాక్యుమెంటరీని రూపొందించాను. లెహ్–లదాఖ్‌లోని రెసిడెన్షియల్ కోర్సులో భాగంగా, వర్క్ నేర్చుకుంటూ తీసిన మొదటి డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇది. కథ కలిపిన పరిచయాలు కిందటేడాది ఆగస్టులో రెండు వర్క్‌షాప్స్ కోసం చేసిన ప్లాన్‌లో భాగంగా లదాఖ్‌కు వెళ్లాను. లైఫ్‌లో ఒక ఛేంజ్ కోసం చేసిన ప్రయాణం కూడా. నాతో పాటు వర్క్‌షాప్ కోసం వచ్చిన స్నేహితులున్నారు. లద్దాఖ్‌లో ఒక మారుమూల ప్రాంతం అది. విసిరేసినట్టుగా ఉన్నాయి అక్కడి ఇల్లు. ఒక చిన్న కాఫీ షాప్‌లో కూర్చుని, ఫ్రెండ్స్‌తో సరదాగా ఓ కథ చెబుతున్నాను. మమ్మల్నే గమనిస్తున్న ఓ యువకుడు మేము చెబుతున్న కథ వింటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు. మేమూ అతని గురించి తెలుసుకున్నాం. గ్రాఫిక్ డిజైనర్ అయిన తన పేరు వరుణ్. పట్టణాన్ని వదిలి లద్దాఖ్‌లో కుండలు తయారు చేసే పనిని నేర్చుకుంటున్నాడని తెలిసి చాలా ఆసక్తిగా అనిపించింది. వరుణ్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి ఎన్నో కుటుంబాలను కలిశాం. అలాగే, వరుణ్‌తో పాటు, వారి జీవన శైలిని ఒక కథగా తీసుకోవాలనిపించింది. అక్కడ నుంచి ప్రతీది ఒక ఆసక్తిగా మారిపోయింది. ఒక థీమ్ ప్లాన్ చేసి, వరుణ్‌తో మాట్లాడి డాక్యుమెంటరీ తీయడం ఆరంభించాను. దిస్ ఈజ్ మై హోమ్ వరుణ్ స్థానికులను కలిసి, ఒక్కో వ్యక్తిని కొన్ని ప్రశ్నలు అడగుతుండగా వారు ఇచ్చిన సమాధానాలను తీసుకున్నాను. ఒక వృద్ధుడిని కలిసి మాట్లాడినప్పుడు అతను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇల్లు చాలా చిన్నది. కానీ, వారి ముఖాల్లో కనిపించిన సంతోషాన్ని చూసి ‘పట్ణణాల్లో పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నా, ఈ సంతోషం ఎక్కడా కనిపించదు ఎందుకు?’ అని అడిగినప్పుడు... ‘గదులు ఉండటం ఇల్లు కాదు. అలా చూడండి, చుట్టూ కొండలు, చూసినంత మేర పచ్చదనం. ఇంత పెద్ద ఇల్లు ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది’ అన్నాడు. అతని మాటలు నాకు బాగా నచ్చాయి. ఒక కామిక్ స్ట్రిప్ కూడా నేను అంతకుముందే చూసి ఉన్నాను. అన్నీ కలిపి డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి ‘దిస్ ఈజ్ మై హోమ్’ టైటిల్ సరైనదనుకున్నాను. ఈ మూవీ చూసిన కొందరు డైరెక్టర్లు ‘మేమూ ఆ గ్రామంలో ఉన్నట్టు, అక్కడ వాళ్లను కలుసుకున్నట్టుగా ఉంది’ అని చెప్పారు. చాలా ఆనందంగా అనిపించింది. చాలా శక్తిమంతులు మంచుకొండల్లో అతి చల్లటి వాతావరణం లద్దాఖ్. అలాంటి చోట మాతోపాటు టౌన్‌కి బయల్దేరాలనుకున్న ఒక బామ్మ తెల్లవారు ఝామున నాలుగ్గంటలకే లేచి, చల్లటి నీళ్లతో తలస్నానం చేసి, రెడీ అయిపోయారు. నాకు ఆమె శక్తిని చూసి చాలా అద్భుతం అనిపించింది. మిగతావారూ అలాగే ఉన్నారు. కొత్తగా జీవించాలి.. నా రైటింగ్ బ్యాక్ గ్రౌండ్, స్టోరీ టెల్లింగ్.. నా డాక్యుమెంటరీ వర్క్‌కి బాగా పనికొచ్చాయి. ఎడిటింగ్ వర్క్, వాయిస్ ఓవర్ పూర్తయ్యాక ముందు వరుణ్‌కి పంపించాను. వాళ్ల కుటుంబం మొత్తం ఆ డాక్యుమెంటరీ చూసి, చాలా సంతోషించారు. ఆ తర్వాత ఫిల్మ్ కాంపిటిషన్‌కు పంపించాను. టాప్‌టెన్‌లో నిలిచింది. అంతటితో నా పని పూర్తవ్వలేదు. మరిన్ని కొత్త పనులవైపు చూశాను. ఇటీవలే ఒక సర్టిఫికెట్ లైఫ్ కోచ్‌గా జాయిన్ అయ్యాను. కరోనా సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి మానసిక శక్తిని అందించింది లద్దాఖ్‌లో తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్. అక్కడి స్థానికులతో సంభాషణ, ప్రయాణం ఏదీ అంత సులువు కాలేదు. ప్రతిది ఛాలెంజింగ్. అదే నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. అక్కడి మనుషులు, ప్రకృతి, నేర్చుకున్న కొత్త వర్క్ నుంచి.. మళ్లీ జీవించడం నేర్చుకున్నాను’’ అని వివరించారు ఈ స్టోరీ టెల్లర్ అండ్ డైరెక్టర్. దీపాకిరణ్ – నిర్మలారెడ్డి -
Satyajit Ray: నవ్యచిత్ర వైతాళికుడు
‘‘ఏమున్నది సార్ గీ సిన్మాల అంతా మా వూరు లెక్కనే వున్నది... మా బతుకులే వున్నయి...’’ సత్యజిత్ రే ‘పథేర్ పాంచాలి’ సినిమా చూసిన తర్వాత కరీంనగర్ జిల్లా ‘పోరండ్ల’ గ్రామ రైతు స్పందన ఇది. ఒక నిజాయతీ కలిగిన వాస్తవిక సినిమాకు ప్రపంచంలో ఎక్కడయినా ఇలాంటి స్పందనే వస్తుందన్నది నిజం. భారతీయ సినిమాకు కళాత్మకతనూ, మానవీయ స్పందనలనూ అందించిన దర్శకుడు రే. తన ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన ‘పథేర్ పాంచాలి’ నుంచి ‘ఆగంతుక్’ వరకు ముప్పై పూర్తి నిడివి సినిమాలు, అనేక డాక్యుమెంటరీ సినిమాలు తీశారు. ఈ రోజుల్లో లాగా ఎలాంటి ఆధునిక ప్రసార మాధ్యమాలూ, సామాజిక మాధ్య మాలూ లేని ఆ కాలంలో రే కు ప్రపంచ ఖ్యాతి లభించింది. 1921లో మే 2న జన్మించిన సత్యజిత్ రే తన జీవితంలోని అత్యధిక సమయం సినీ రంగంలోనే గడిపినప్పటికీ ఆయన... రచయితగా, చిత్రకారుడిగా, టైపోగ్రాఫర్గా, బాల సాహిత్య సృష్టి కర్తగా, సైన్స్ ఫిక్షన్ రచయితగా తనదైన ముద్రతో సృజన రంగంలో పని చేశారు. సినిమా రంగంలో కూడా దర్శకత్వంతో పాటు సంగీతం, సినిమా టోగ్రఫీ, స్క్రిప్ట్, మాటల రచన తానే నిర్వహించారు. మొదట రవిశంకర్ లాంటి వాళ్ళతో సంగీతం చేయించుకున్నా తర్వాత తానే తన సినిమాలన్నింటికీ సంగీతం సమకూర్చుకున్నారు. ఇంకా సన్నివేశాలకు సంబంధించి సంపూర్ణ స్కెచెస్ వేసుకొని, చిత్రీకరణ జరిపేవారు. సాహిత్యానికీ సినిమాకూ వారధిలా నిలిచి భారతీయ సినిమాను పరిపుష్టం చేశారు. టాగూర్, బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ్, తారాశంకర్ బంధోపాధ్యాయ్, ప్రేమ్ చంద్, నరేంద్రనాథ్ లాంటి మహా రచయితల రచనల్ని తెరపైకి ఎక్కించారు రే. అంతేకాదు, పలు సినిమాలకు తన స్వీయ రచనల్ని కూడా ఉపయోగించుకున్నారు. (చదవండి: ఆదర్శ కమ్యూనిస్టుకు జోహార్లు!) 1956లో ‘పథేర్ పాంచాలి’ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘బెస్ట్ హ్యూమన్ డాక్యుమెంట్’ అవా ర్డును గెలుచుకొని భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చింది. తర్వాత ‘దేవి’, ‘కాంచన్ జంగా’, ‘చారులత’, ‘తీన్ కన్య’ ‘ఘరె బైరె’, ‘ఆగంతుక్’ లాంటి అనేక విశ్వ విఖ్యాత సిని మాల్ని రూపొందించారు. బహుశా ఆయన సినిమాల్ని ప్రదర్శించని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ప్రపంచంలో లేవు. ఆయన అందుకోని అవార్డులూ లేవు. కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’, దాదా సాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. ఫ్రాన్స్ దేశానికి చెందిన ‘లెజియన్ ఆఫ్ ఆనర్’, అలాగే ‘ఆస్కార్ జీవిత సాఫల్య పురస్కారం’ లాంటి లెక్కలేనన్ని అంతర్జాతీయ పురస్కారాలూ అందుకున్నారు. భారతీయ సినిమాకు నవ్యచిత్ర వైతాళికుడిగా నిలిచిన సత్యజిత్ రే 1992 ఏప్రిల్ 23న కలకత్తాలోని బెల్లెవీ నర్సింగ్ హోమ్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన చరిత్ర చిత్రసీమకు మణిహారం. (చదవండి: ‘జై హింద్’ నినాదకర్త మనోడే!) – వారాల ఆనంద్ (మే 2న సత్యజిత్ రే జయంతి) -
కోడి రామకృష్ణ: ‘దిగులుతో మాకు కనపడకుండా ఏడ్చే వారు’
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో దర్శకునిగా తొలి అడుగు వేశారు. తరంగిణిలో రైలు చేత పాట పాడించారు. అమ్మోరులో గ్రాఫిక్స్‌ను పరిచయం చేశారు. అరుంధతిలో జేజమ్మను ప్రతిష్ఠించారు.. మానవ సంబంధాలు, దైవభక్తి, ఆధునిక గ్రాఫిక్స్... అన్నిటినీ తెలుగు వెండి తెర మీద ప్రదర్శించిన కోడి రామకృష్ణ... ఇంటి దగ్గర ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా స్నేహంగా ఉండేవారంటున్నారు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య.. కోడి నరసింహమూర్తి, చిట్టెమ్మ దంపతులకు పెద్ద కొడుకుగా నాన్న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టారు. నాన్నకు ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. పాలకొల్లు కాలేజీలో బికామ్ డిగ్రీ చదువుకునే రోజుల్లోనే నాటకాలు వేసేవారు. జై ఆంధ్ర ఉద్యమం సమయంలో స్పీచ్‌లు రాసి ఇచ్చేవారట, పెయింటింగ్స్, మంచి మంచి స్కెచ్‌లు కూడా వేసేవారట. నాటకాలు వేయటానికి కావలసిన డబ్బుల కోసం ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా బయటి వాళ్లకు పెయింటింగ్స్ వేసిన సందర్భాలున్నాయని నాన్న చెబుతుండేవారు. పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం అమ్మ వాళ్లది తెనాలి. తాత (ఎ. సుభాష్) గారు సినిమాలు నిర్మించాలనే ఆసక్తితో మద్రాసు వచ్చి, ‘భారత్ బంద్’ చిత్రం నిర్మించారు. అమ్మ పేరు పద్మ. నాన్నగారి ‘రంగుల పులి’ చిత్రంలో ఇష్టం లేకుండానే అమ్మ నటించింది. నాన్నగారు అమ్మను ఇష్టపడ్డారు. ఇద్దరూ వివాహం చేసుకుందామనుకు న్నారు. సన్నిహితులతా కలిసి అమ్మవాళ్ల నాన్నను ఒప్పించారు. నానమ్మకు ఇచ్చిన మాట ప్రకారం, చెల్లెలికి, తమ్ముళ్లకి వివాహం చేసిన తరవాతే 1983లో అమ్మను వివాహం చేసుకున్నారు. తాతగారు పోయాక నాన్నే ఇంటి బాధ్యత తీసుకు న్నారు. నాన్నకు మేం ఇద్దరు ఆడపిల్లలం. చెల్లి పేరు ప్రవల్లిక. నేను బిబిఏ, చెల్లి ఎంబిఏ చేశాం. నేను యానిమేషన్ కూడా చేశాను. నన్ను ‘దీపమ్మా’ అని, చెల్లిని ‘చిన్నీ’ అని పిలిచేవారు. ఇద్దరూ ఆడపిల్లలేనా అని ఎవరైనా అంటే నాన్నకు నచ్చేది కాదు. స్నేహితునిలా ఉండేవారు.. సినిమాలలో పూర్తిగా బిజీగా ఉండటంతో, ఏ మాత్రం అవకాశం వచ్చినా నాన్న మమ్మల్ని బయటకు తీసుకువెళ్లేవారు. ఒక్కోసారి షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాక, మమ్మల్ని కార్లో బీచ్‌కి తీసుకువెళ్లి, ఐస్‌క్రీమ్ కొనిపెట్టేవారు. ఉదయాన్నే షూటింగ్‌కి వెళ్లిపోయేవారు. ఎక్కడ ఉన్నా ఫోన్ చేసేవారు. చాలా స్నేహంగా ఉండేవారు. ఒక్క రోజు కూడా కోప్పడలేదు. నేను నాన్న దగ్గర అసిస్టెంట్‌గా ఉండాలి అని నాన్నతో అన్నప్పుడు, అమ్మ నా పెళ్లి చేసేయమంది. అప్పుడు కూడా నాకు నచ్చినట్లే చేయమన్నారు. ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు’ అని సలహా ఇచ్చేవారు. నాన్నకు ఏదీ షో చేయటం నచ్చదు. అలా ప్రదర్శించటం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయొద్దు అనేవారు. ఎవరో ఏదో అనుకుంటారనే ఆలోచనే ఉండేది కాదు. అమ్మ తన బంధువులకు ఎంతో సహాయం చేస్తుంటే, ఎన్నడూ అమ్మను ప్రశ్నించలేదు. కథ ఎలా ఉంది అని అడిగేవారు.. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకునేవారు. ఔట్‌డోర్ షూటింగ్స్‌కి ఇతర దేశాలకు మమ్మల్ని కూడా తీసుకువెళ్లేవారు. మేం సినిమా చూసి వచ్చాక మమ్మల్ని కథ ఎలా ఉందో చెప్పమనేవారు. ఇల్లు, షూటింగ్ అంతే. పుట్టినరోజుకి మాత్రమే పార్టీ చేసేవారు. ఇంటి భోజనమే ఇష్టపడేవారు. అది కూడా చాలా మితంగా తినేవారు. దాసరిగారితో అనుబంధం... నానమ్మ వాళ్లు నాన్న సినిమాలలోకి వెళ్తానంటే అభ్యంతరం చెప్పలేదు. మద్రాసులో దాసరి గారిని కలిస్తే, ఆయన డిగ్రీ పూర్తి చేసి రమ్మన్నారు. ఆ ప్రకారమే డిగ్రీ పూర్తి చేశాక, దాసరిగారు ఇచ్చిన టెలిగ్రామ్ చూసుకుని మద్రాసు వెళ్లారు. అలా నాన్న సినీ రంగ ప్రవేశం జరిగింది. దాసరిగారు కన్ను మూయటానికి నెల రోజుల ముందు నాన్నకు ఏమనిపించిందో కానీ, రోజూ ఆయన ఇంటికి వెళ్లేవారు. ఆయన పోయినప్పుడు తట్టుకోలేక పోయారు. ఎంత బాధలో ఉన్నా పని మాత్రం మానేసేవారు కాదు. నేను వచ్చేశాను... నా పెళ్లి కుదిరిన తరవాత, నేను అత్తవారింటికి వెళ్లిపోతానన్న దిగులుతో మాకు కనపడకుండా ఏడ్చే వారు. నాన్నను ఓదార్చవలసి వచ్చింది. మా పెళ్లయ్యాక కొంచెం ఆలస్యంగా పుట్టింది పాప. ‘ఆలస్యం చేసుకుంటున్నారెందుకు’ అని అమ్మ అంటున్నా కూడా నాన్న అననిచ్చేవారు కాదు. నాన్నకు బాగోలేదని తెలియగానే బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి వచ్చేశాం. నా డెలివరీ ముందు రోజు నేను వినాలని హనుమాన్ చాలీసా చదివారు. మరుసటి రోజు నాకు డెలివరీ అయ్యేవరకు మంచి నీళ్లు మాత్రమే తాగారట. పసిపాపను చూస్తూనే, మా అమ్మ నరసమ్మ మళ్లీ పుట్టింది అని పాపాయిని ‘చిట్టి నరసమ్మా!’ అని పిలిచారు. భక్తి ఎక్కువ.. నాన్నకు దేవుడి మీద విపరీతమైన భక్తి. దేవుడికి నాన్నకు మధ్య ఎవరు ఏం చెప్పినా వినరు. ఆరు గంటలకు షూటింగ్ అంటే మూడు గంటలకల్లా నిద్ర లేచి, పూజ చేసుకుని పావు గంట ముందే స్పాట్లో ఉండేవారు. ఆసుపత్రిలో ఉండి కూడా, స్నానం చేయించుకుని, పూజ చేసుకున్నాకే టిఫిన్ తినేవారు. వినాయక చవితి రోజున కథ చదువుతుండగా దగ్గు వస్తే, మళ్లీ మొదటి నుంచి చదివేవారు. పూజ అయ్యాక మాతోనే బ్రేక్‌ఫాస్ట్ చేసేవారు. దీపావళి రోజున అందరికీ శుభాకాంక్షలు చెప్పి, నా చేత 100 రూపాయలు ఇప్పించేవారు. ఎక్కడకు వెళ్తున్నా నన్ను ఎదురు రమ్మనేవారు. నా పెళ్లయ్యాక నాతో మాట్లాడటం కోసం మొబైల్ కొన్నారు. అప్పుడు కూడా నిర్మాత గురించే... వేళకు ఆహారం తీసుకోకపోవటం వల్ల నాన్న ఆరోగ్యం దెబ్బ తింది. 2012లో ఒక సినిమా ప్రారంభోత్సవం రోజే నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆపరేషన్ పూర్తయ్యి, స్పృహలోకి వచ్చిన వెంటనే, ‘నిర్మాత ఎలా ఉన్నారు’ అని అడిగారు. మాకు వింతగా అనిపించింది. 104 డిగ్రీల జ్వరంతో కూడా షూటింగ్ చేశారు. నాన్న అంత్యక్రియలు స్వయంగా నేనే చేశాను. కంటిన్యూ చేస్తున్నాను.. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సినిమా నిర్మాణం చేస్తున్నాను. ‘కోడి పిల్లలు’ అని వాట్సాప్ గ్రూప్ పెట్టాను. ఆ గ్రూపులో మేం నలుగురం, నాన్న దగ్గర అసిస్టెంట్స్‌గా పనిచేసినవారు, నాన్న అభిమానులు ఉన్నారు. -
ఆయన మాటలకు ఆకర్షితురాలైంది.. రూ.50తో పెళ్లి జరిగిపోయింది
రక్త సంబంధం, వీరాభిమన్యు, ఆరాధన, లక్ష్మీ నివాసం, విక్రమ్.. అన్నీ విజయకేతనం ఎగురవేసిన రజతోత్సవ చిత్రాలే... వీరమాచినేని ఇంటి పేరును విక్టరీగా మార్చిన చిత్రాలు.. ప్రజా నాట్య మండలి భావాలతో కమ్యూనిస్టు వివాహం చేసుకున్నారు... జీవితం మీద ఆశతో జీవించిన తండ్రి వీరమాచినేని (విక్టరీ) మధుసూదనరావు గురించి రెండో కుమార్తె వాణి చెబుతున్న విషయాలు... నాన్న కృష్ణాజిల్లా ఈడ్పుగల్లులో పుట్టారు. నాన్న వాళ్లు ఇద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లి. నాన్న ఎనిమిదో ఏటే తల్లిని పోగొట్టుకోవటంతో, మూడు సంవత్సరాల వయసున్న చెల్లిని ఎంతో బాధ్యతగా పెంచారు. నాన్నకు మేం ఇద్దరం ఆడపిల్లలం. అక్క వీణ, నేను వాణి. నా ఎనిమిదో యేట అమ్మ నాన్నలతో మేం చెన్నై వచ్చాం. ప్రకాశ్ స్టూడియోలో చిన్న జీతానికి చేరారు. నాన్నకి ఆర్థికంగా సహాయపడటం కోసం అమ్మ డబ్బింగ్ చెప్పేది. అక్క నేను కేసరి హైస్కూల్లో చదువు పూర్తయ్యాక, అక్క బి.ఎస్.సి, నేను ఎం.ఎస్.సి. చదివాం. నాన్న ప్రారంభించిన మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చూస్తున్నాను. చాలా కష్టజీవి నాన్న సోడా బండి తోసి, పొలంలో నాట్లు వేసి, కూలి పని చేసి డబ్బులు సంపాదిస్తూ వారలబ్బాయిగా చదువుకుంటూ, ఇంటర్మీడియెట్ స్టేట్ ఫస్ట్‌లో ప్యాసయ్యారు. నటన మీద శ్రద్ధతో సినీ పరిశ్రమలో ప్రవేశించారు. ఎనిమిదేళ్లు ప్రకాశ్ స్టూడియోలో కె. ఎస్. ప్రకాశరావు గారి దగ్గర అసిస్టెంట్‌గా చేశాక దర్శకులయ్యారు. తన సినిమాలకు దగ్గరుండి మరీ ఆత్రేయతో పాటలు రాయించుకున్నారు. ముందుగానే మ్యూజిక్ సిద్ధం చేసుకునేవారు. రికార్డయిన పాటలను ఇంట్లో వినిపించేవారు. అందరం పాడుకునేవాళ్లం. నాన్నకు ‘ప్రొడ్యూసర్స్ మ్యాన్’ అనీ, కోపిష్ఠి అనీ పరిశ్రమలో పేరుంది. సినిమా పూర్తయ్యే వరకు క్రమశిక్షణతో, యజ్ఞం చేస్తున్నట్లు మౌనంగా మునిలా ఉండేవారు. అప్పుడప్పుడు నాన్నతో షూటింగ్లకి వెళ్లేవాళ్లం. ఒక హిందీ సినిమా షూటింగ్‌కి వెళ్తూ, నన్ను కాశ్మీర్ తీసుకువెళ్లారు. సినీ నటి జి. వరలక్ష్మిగారికి నాన్న కమిట్మెంట్ నచ్చింది. నాన్నను ఆప్యాయం గా‘మధు’ అని పిలిచేవారు. నాన్న ఆవిడను ‘అమ్మ’ అనేవారు. ‘ఎ డైరెక్టర్ ఈజ్ జస్ట్ లైక్ ఎ గుడ్ రిక్రియేటర్ హిమ్సెల్ఫ్’ అన్నారు నాన్న గురించి ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్‌కపూర్. సొంత ఆస్తి వద్దనుకున్నారు.. నాన్న సినిమాలలో బాగా బిజీ అయ్యాక ఉదయాన్నే ఏడు గంటలకు షూటింగ్ ఉంటే, ఐదు గంటలకే రెడీ అయిపోయేవారు. నాన్నతో ఎక్కువ సమయం గడపలేకపోయాం. అమ్మ పంపే క్యారేజీ సెట్లో అందరితో కలిసి తినేవారు. మేం పెద్దవాళ్లం అయ్యాక మమ్మల్ని చూడాలనిపిస్తే ‘వాణిని పేపర్ తెమ్మను’ అనేవారు. అలా మమ్మల్ని చూసేవారు. పర్సనల్ ప్రోపర్టీ వద్దనుకున్నారు. కాని నాన్న సన్నిహితులు నాన్న చేత పొదుపు చేయించి, స్థలం కొనిపించారు. ఎకరం స్థలంలో దగ్గరుండి స్టూడియో కట్టించారు. నాన్న మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి, చాట్ల శ్రీరాములుగారిని ప్రిన్సిపాల్‌గా నియమించి ఆయనకు బ్లాంక్ చెక్ ఇచ్చారు. ఆయనంటే నాన్నకు అంత గౌరవం. ప్రజాసేవ అంటే ఇష్టం... ఒకసారి నాకు అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పుడు రాయలసీమ కరవు ప్రాంతాల వారికి సహాయం చేయటం కోసం సినిమా వారంతా జోలె పట్టారు. అందరితో పాటు అమ్మనాన్నలు బయలుదేరారు. ‘చంటిపిల్లకు అనారోగ్యంగా ఉంది కదా’ అని బంధువులంటే, ‘నా బిడ్డల్ని దేవుడు చూస్తాడు. అక్కడ వందల మంది ఆకలి బాధతో మరణిస్తున్నారు’ అన్నారట అమ్మ నాన్నలు. సమాజం పట్ల అంత బాధ్యతగా ఉండేవారు. నాకు చిన్నప్పుడు నాలుగు సంవత్సరాల వయసులో లివర్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నన్ను ఎత్తుకుని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు. అవసరాన్ని బట్టి ఎప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనేది నాన్న ఆలోచించేవారు. నేను సర్జరీ చేయించుకున్నప్పుడు నాన్న ఇంట్లోనే ఉండి, కంటికి రెప్పలా చూసుకున్నారు. నాన్నకు ఆడపిల్లలంటే సాఫ్ట్ కార్నర్. నాన్న ఇష్టాలు... నాన్నకి తెల్ల బట్టలంటే ఇష్టం. మల్లెపూలంటే మక్కువ. మల్లెపూల దండ చేతికి కట్టుకుని, ఆ సువాసనను ఆస్వాదిస్తూ, భోజనం చేసేవారు. శాకాహారమంటేనే ఇష్టం. రోటి పచ్చళ్లు బాగా తినేవారు. రోజూ పెరుగన్నంలో ఉసిరికాయ బద్దలు, మామిడికాయ బద్దలు ఉండవలసిందే. నాన్న కోసం జలాలు రకం మామిడికాయలతో ఆవకాయ పెట్టేది అమ్మ. చిన్న వంటకాన్ని సైతం బాగా ఆస్వాదించే వారు. జుట్టుకు రంగు వేయటం ఇష్టం లేదు. నాన్న ప్రారంభించిన మధు మూవీస్ బ్యానర్లో నన్ను పెళ్లికూతురు గెటప్‌లో మధుకలశం పట్టుకుని ఉన్న పొజిషన్లో చూపించారు నాన్న. నాన్న ఆశావాది నాన్నకి తీవ్రంగా అనారోగ్యం చేసినా, బతకాలనే కోరికే ఆయనను బతికించింది. పదకొండు సంవత్సరాలు ఆయనను కంటిపాపలా చూసుకున్నాను. ‘‘ఇప్పుడు నువ్వు నన్ను నీ కొడుకులా చూసుకుంటున్నావు. నాకు ఇంకా పదమూడేళ్లు జీవితం ఉంది’’ అన్నారు. కాని 2012లో తన 89వ ఏట కన్నుమూశారు. 2023లో నాన్నగారి శతజయంతి చేయాలనుకుంటున్నాం.పద్నాలుగేళ్ల్ల వయసులోనే, తాతతో కలిసి అమ్మ మీటింగ్స్‌కి వెళ్లేది. నాన్న 1940లో కమ్యూనిస్టు పార్టీ ప్రెసిడెంట్‌గా స్పీచ్ ఇస్తుంటే, ఆయన మాటలు విని ఆకర్షితురాలై, ఎలాగైనా నాన్ననే వివాహం చేసుకోవాలనుకుంది. స్కూల్ మాస్టర్‌గా పనిచేస్తున్న మా తాతయ్యతో అమ్మ, ‘ఉరై సుబ్బన్నా, నన్ను మధుసూదన్‌కి ఇచ్చి చేయకపోతే కుదరదు’ అందట. అలా యాభై రూపాయల ఖర్చుతో అమ్మనాన్నలకు కమ్యూనిస్టు పెళ్లి జరిగిపోయింది. అమ్మ ఆ రోజుల్లో ప్రజానాట్య మండలిలో బుర్రకథలు చెప్పేదట. సంభాషణ: వైజయంతి పురాణపండ -
పరువు హత్య: దర్శకుడిని దారుణంగా చంపిన తల్లిదండ్రులు
వెబ్‌డెస్క్: ఇరాన్‌కు చెందిన దర్శకుడు బాబక్ ఖోర్రామ్డిన్ దారుణ హత్యకు గురయ్యాడు. దేశంలో సంచలన సృష్టించిన ఈ పరువు హత్య కేసుకు సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఖోర్రామ్డిన్‌ను అతడి తల్లిదండ్రులే దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. నిందితులు కేవలం ఖోర్రామ్డిన్‌ని మాత్రమే కాక వారి కుమార్తె, అల్లుడిని కూడా ఏళ్ల క్రితమే ఇంతే దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. బిడ్డలను చంపినందుకు తాము ఏ మాత్రం బాధపడటం లేదనడం గమనార్హం. ఆ వివరాలు.. ఖోర్రామ్డిన్ దారుణ హత్య ఇరాన్లో సంచలనం సృష్టించింది. దర్శకుడి పొరుగింటి వారు తమ నివాసం ఎదురుగా ఉన్న చెత్తకుప్పలో కొన్ని మానవ శరీర భాగాలున్నాయని పోలీసులకు తెలపడంతో దర్శకుడి హత్య వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా రెండు తెగిపడిన చేతులు కనిపించాయి. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా అవి దర్శకుడు ఖోర్రామ్డిన్‌విగా గర్తించారు. ఇక దర్శకుడి హత్య గురించి తెలిసిన నాటి నుంచి అందరూ అతడి తల్లిదండ్రుల మీదనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఖోర్రామ్డిన్ తల్లిదండ్రులు ఇరాన్ ఖోర్రామ్దిన్( 74), అక్బర్ ఖోర్రామ్దిన్(81)లను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో వారు సంచలన విషయాలు వెల్లడించారు. తమ కొడుకుని తామే హత్య చేశామని తెలిపారు. చైర్‌కు కట్టేసి.. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి.. ఊపిరాడకుండ చేసి చంపేశామని.. ఆ తర్వాత అతడిని ముక్కలుముక్కలుగా నరికి రెండు సూట్‌కేసులలో పెట్టి.. డస్ట్‌బిన్‌లో పడేశామని వెల్లడించారు. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి.. ఖోర్రామ్డిన్ తండ్రి మాట్లాడుతూ.. ‘‘గత శుక్రవారం రాత్రి నా భార్య చికెన్ వండింది. దానిలో విషం కలిపాము. కానీ నా కుమారుడు భోజనం చేయలేదు. తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. దాంతో చికెన్ ఫ్రిజ్‌లో పెట్టాం. మరుసటి రోజు తింటాడని భావించాం. కానీ అలా జరగలేదు. దాంతో మరుసటి రోజు నా కుమారుడు బయటకు వెళ్లి వచ్చే వరకు ఆగాం. సాయంత్ర ఐదు గంటల సమయంలో ఇంటికి వచ్చిన నా కుమారుడిని చైర్‌కు కట్టేసి.. తన తలకు ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్ చుట్టి ఊపిరాడకుండా చేశాం. ఆ తర్వాత కత్తితో తనని పొడిచి చంపేశాం. ఆ తర్వాత తనను ముక్కలుగా నరికి రెండు సూట్‌కేస్‌లలో శరీర భాగాలను సర్ది.. బయట పడేశాం’’ అని తెలిపారు. విద్యార్థులతో సంబంధం పెట్టుకున్నాడు.. తమ కుమారుడు తన కోచింగ్ సెంటర్లోని విద్యార్థులతో సంబంధం పెట్టుకున్నాడని.. దాని వల్ల సమాజంలో తమ పరువు పోతుందనే ఉద్దేశంతోనే అతడిని హత్య చేశామని తెలిపారు. అంతేకాక కొన్నేళ్ల క్రితం తమ కుమార్తె, ఆమె భర్తను కూడా ఇలానే హత్య చేశామని వెల్లడించారు. కుమార్తె డ్రగ్స్‌కు అలవాటు పడిందని.. అల్లుడు తమను తిడుతూ.. శాపనార్థాలు పెట్టేవాడని.. అందుకే వారిద్దరిని అంతం చేశానని వెల్లడించారు. ఇక మేం చేసిన పనికి మాకేం బాధ కలగడం లేదు. నా బిడ్డలు తప్పుడు మార్గంలో పయణిస్తున్నారు. వారి వల్ల మా పరువు పోతుంది. అందుకే నా భార్య సాయంతో వాళ్లని చంపేశాం అన్నాడు. ఈ కేసు దేశంలో సంచలనం సృష్టిస్తోంది. మరణించిన ఖోర్రామ్డిన్ ‘క్రెవిస్’, ‘ఓత్ టు యషర్’ వంటి లఘు చిత్రాలతో సహా పలు ప్రాజెక్టులు తెరకెక్కించాడు. అతను 2009 లో టెహ్రాన్ విశ్వవిద్యాలయంలో సినిమా విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. విద్యార్థులకు బోధించడానికి 2010లో ఇరాన్‌కు మారాడు. చదవండి: ఇరాన్‌ను కుదిపేస్తున్న పరువు హత్య -
సినిమా తీస్తానని రూ.7 కోట్లు మోసం.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్!
ప్రముఖ మలయాళీ దర్శకుడు, యాడ్ ఫిలిమ్ మేకర్ వీఏ శ్రీకుమార్ మీనన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా చేస్తానని చెప్పి తన వద్ద నుంచి రూ.7 కోట్లు తీసుకుని మోసం చేశాడంటూ శ్రీవాసలం బిజినెస్ గ్రూప్‌కి చెందిన రాజేంద్రన్ పిళ్లై ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీకుమార్‌ని అరెస్ట్ చేసి గురువారం కోర్డులో హాజరుపరిచారు. అతనిపై సెక్షన్ 406, సెక్షన్ 420ల కింద యాక్షన్ తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే అంతకు ముందే శ్రీకుమార్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. దాన్ని కోర్టు తిరస్కరించింది. శ్రీకుమార్ అరెస్ట్ కావడం ఇది మొదటిసారి కాదు. ప్రముఖ నటి మంజు వారియర్‌ను బెదిరించి, పరువునష్టం కలిగించారన్న ఆరోపణలపై 2019లో శ్రీకుమార్ మీనన్ అరెస్ట్ అయ్యారు. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు మంజు వారియర్.. శ్రీకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఓడియన్‌లో హీరోయిన్గా చేసింది. అంతేకాదు.. అతనితో కలిసి పలు యాడ్లలో కూడా ఆమె నటించింది. -
‘శంకరాభరణం’కు వచ్చిన జాతీయ అవార్డులు ఎన్ని?
తెలుగు సినిమా అందించిన అత్యత్తమ దర్శకుల్లో కళాతపస్వి కె. విశ్వనాథ్ ఒకరు. ఎన్నో గొప్ప సినిమాలను, గొప్ప పాటలను, గొప్ప నిపుణులను తన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించారాయన. నేడు (ఫిబ్రవరి 19) విశ్వనాథ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ జర్నీపై స్పెషల్ క్విజ్. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1641344978.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1651344978.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత
బెంగళూరు : ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు దినేష్ గాంధీ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం కారణంగా బెంగుళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన దినేష్ శనివారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన దాదాపు పది సంవత్సరాలకు పైగా కన్నడ చిత్ర పరిశ్రమకు తన సేవలు అందించారు. దినేష్ వయస్సు 52 సంవత్సరాలు. ఈ రోజు బెంగుళూరులోని తన నివాసంలోనే కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో దినేష్ అంత్యక్రియలు జరగనున్నాయి. దినేష్ అకాల మరణం కన్న సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. దర్శకుడి మరణం పట్ల అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదవండి: మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు కాగా సుదీప్ కిచ్చా నటించిన ‘వీర మదకారి’ సినిమా దినేష్‌కు మంది పేరు తెచ్చిపెట్టింది. 2009లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 2012లో తెలుగులోనూ రౌడీ ఇన్స్పెక్టర్గా విడుదలైంది. అలాగే సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన చత్రపతి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే కొన్ని నెలల క్రితం దినేష్ గాంధీ తన కొడుకుతో కలిసి ఓ సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కానీ కోవిడ్ 19 కారణంగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఆలస్యం అయింది. ఈ చిత్రాన్ని సింహాద్రి ప్రొడక్షన్స్ పతాకపై రమేష్ కైషాప్ నిర్మించాల్సి ఉంది. చదవండి: ‘అసహ్యం.. అందుకే నామినేట్ చేశాను’ -
దర్శక నిర్మాత విజయరెడ్డి ఇక లేరు
ప్రఖ్యాత సినీ దర్శక, నిర్మాత బి. విజయరెడ్డి (84) శుక్రవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై, కేకే నగర్లో కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్న ఆయన అనారోగ్యం కారణంగా ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. చెన్నై, కన్నమ్మాపేటలోని శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పుట్టి పెరిగిన విజయరెడ్డి 1955లో నటనపై ఆసక్తితో అప్పటి మద్రాస్‌కు చేరుకున్నారు. దర్శకుడు విఠలాచార్య దృష్టిలో పడ్డారు. విఠలాచార్య దర్శకత్వం వహించిన ‘మన తుంబిడ హెన్ను అరే’ చిత్రానికి సహాయ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత పలు చిత్రాలకు పని చేసిన విజయరెడ్డి సినిమా రంగంలోని పలు శాఖల గురించి తెలుసుకోవడంతో పాటు ఆ తర్వాత సహాయ దర్శకుడిగా చేశారు. 1970లో ‘రంగా మహల్ రహస్య’ అనే కన్నడ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, విష్ణువర్థ¯Œ వంటి ప్రముఖ నటులతో ఈయన అత్యధిక చిత్రాలను తెరకెక్కించారు. ముఖ్యంగా రాజ్‌కుమార్ కథానాయకుడిగా ‘మయురా, హుళ్లి హాళినా మేవు’ వంటి చారిత్రక కథా చిత్రాలతో పాటు ‘శ్రీనివాసకల్యాణం, భక్త ప్రహ్లాద’ వంటి పౌరాణిక చిత్రాలను తెరకెక్కించిన ఘనత విజయరెడ్డిది. ఆయన కన్నడలోనే 40 చిత్రాలకుపైగా దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్‌కపూర్, జితేంద్ర, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో చిత్రాలను చేశారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘శ్రీమతి’. ఆ తర్వాత ‘ఏకలవ్య, మా ఇంటి వెలుగు, చలాకీ రాణి కిలాడీ రాజా, మావూరి మొనగాళ్లు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. విజయరెడ్డికి భార్య దమయంతి, కుమారులు త్రినాథ్ రెడ్డి, నాగిరెడ్డి, కుమార్తెలు నాగలక్ష్మి, శ్యామల రుషి ఉన్నారు. విజయరెడ్డి మృతికి దక్షిణ భారత వాణిజ్య మండలి అధ్యక్షులు కాట్రగడ్డ ప్రసాద్ తదితర చిత్రరంగ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. -
అలసట తెలీని వలస హీరోలు
ఆశ ఉసిగొల్పుతుంది.. కష్టంలో తనవాళ్లను చేరాలని! ఆ ఆశ అంతే వేగంగా వందల కిలోమీటర్ల గమ్యాన్ని నడిచేలా చేస్తుందా? ఎండ, చీకటి, ఆకలి, దప్పిక.. ఎన్ని అవాంతరాలు? అయినా ముందుకే పరిగెత్తిస్తోంది సొంత ఊరు ఆపేక్ష! ఆ సాహసాన్ని చూడాలనుకున్నాడు వినోద్ కాప్రి.. హిందీ సినిమా డైరెక్టర్, రైటర్, జర్నలిస్ట్ కూడా! కిందటి నెల.. ఏప్రిల్13న ట్విటర్లో ఒక పోస్ట్ చూశాడు వినోద్ కాప్రి. ఘజియాబాద్‌లోని లోనీలో 30, 40 మంది వలస కార్మికులు తిండి లేక, డబ్బుల్లేక ఇబ్బంది పడ్తున్నారు అని. వెంటనే తన స్నేహితులను కలిసి కొంత డబ్బు సేకరించి వాళ్లకు ఇచ్చాడు. మూణ్ణాలుగు రోజుల తర్వాత ఆ కార్మికుల దగ్గర్నుంచి ఫోన్ ‘మీరు ఇచ్చిన డబ్బులతో కొన్న సరుకులు అయిపోయాయి’ అని మొహమాటం ధ్వనిస్తూ. మరేం పర్లేదు అని భరోసానిస్తూ మళ్లీ సరకులు కొనిచ్చాడు వినోద్. వారం రోజులకు మళ్లీ ఫోన్. ‘మాటిమాటికీ మిమ్మల్ని అడగడం ఇబ్బందిగా ఉంది. అందుకే మా ఊరు సహార్సా వెళ్లడానికి మార్గం ఉంటే చెప్పండి’ అంటూ వేడుకోలు. ‘అయ్యో అంత పని చేయొద్దు. బస్సులు, రైళ్లు ఏం లేవు. ఆ ప్రయత్నం మానుకోండి. ప్రమాదం. మాకు తోచిన సహాయం చేస్తాం’ అని మాటిచ్చాడు. మాట ప్రకారం కొంత డబ్బు సేకరించి వాళ్లకు ఫోన్ చేశాడు వినోద్. అప్పటికే ఆ సమూహంలో ఏడుగురు ఇంటిబాట పట్టేశారు. మిగిలిన వాళ్లూ సిద్ధం అయ్యారు ‘ఇక్కడుంటే కన్నా దార్లో ప్రాణాలు పోయినా సరే’ అని అనుకుని. ఇరుగు పొరుగు దగ్గర సైకిళ్లు అడిగి తీసుకున్నారు ఇంటికి వెళ్లాక డబ్బు పంపిస్తామని బతిమాలుకొని. వాళ్ల సొంతూరు సహార్సా ఉన్నది బీహార్ రాష్ట్రంలో. ఘజియాబాద్ నుంచి 12 వందల కిలోమీటర్లు. ఆ దూరాన్ని తలచుకొని ఆందోళనపడ్డాడు వినోద్. వెంటనే తన టీమ్‌తో కలిసి కార్లో బయలుదేరాడు వాళ్లను అనుసరించడానికి. ఆ ప్రయాణం గురించి అతని మాటల్లోనే.. గంగను దాటే ప్రయత్నం చేసి... ‘మర్నాడు పొద్దున వాళ్లు మాకు సంభాల్ దగ్గర కనిపించారు పోలీసుల చేతుల్లో దెబ్బలు తింటూ. వచ్చిన దారినే వెనక్కి వెళ్లిపొండి అంటూ వాళ్లకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. వెనక్కి మళ్లకపోగా అక్కడినుంచి తమ ఊరికి అడ్డదార్లేమున్నాయా అని ఆలోచించండం మొదలుపెట్టారు. వాళ్లలో ఒకతను గూగుల్ ఎర్త్ యాప్‌లో కాలిబాట వెదకసాగాడు. అదేరోజు రాత్రి సైకిళ్లను తల మీద పెట్టుకొని గంగానది ఈదే దుస్సాహసమూ చేశారు. అది చూసి అక్కడున్న జాలరులతో సహా అందరం కలిసి వాళ్లను ఆపాం. సైకిల్ చైన్.. శనగపిండి గట్క సైకిళ్లతో వాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. అయిదారు కిలోమీటర్లు తొక్కగానే చైన్ పడిపోవడం, టైర్ పంక్చరవడం.. సైకిల్ రిపేర్ షాప్ కనపడే వరకు నడవడం వాటిని తోలుకుంటూ! శనగపిండి, బార్లీపిండితో కలిపి చేసిన గట్కా తెచ్చుకున్నారు. 24 గంటలుంది అంతే. రెండోరోజుకల్లా ఖాళీ కడుపు. దార్లో అక్కడక్కడా కనిపించిన చిన్న షాపుల్లో బ్రెడ్, బటర్, జామ్‌తోపాటు పళ్ల బండ్లు కనపడితే అరటిపళ్లు లాంటివి కొనిచ్చాం. దార్లో ఎక్కడా స్నానాలు చేయలేదు వాళ్లు. పోలీసుల కంట పడతామోనన్న భయంతో. రాత్రిళ్లు అయితే దోమలు, పురుగుపుట్రతో నరకాన్నే చూశారు. ట్రక్.. వేగం.. లక్నో చేరేటప్పటికి వాళ్లలో శక్తి సన్నగిల్లింది. నీరసపడిపోయారు. ఓ ట్రక్కు ఆపి, డ్రైవర్‌కు విషయం చెప్పాం. సైకిళ్లతో సహా అందరినీ ఎక్కించుకొని 30 కిలోమీటర్లు లిఫ్ట్ ఇచ్చాడు. తర్వాత మళ్లీ సైకిల్ ప్రయాణం. అదృష్టం బాగుండి మరో ట్రక్ డ్రైవర్ గోరఖ్‌పూర్ వరకు అంటే వంద కిలోమీటర్లు లిఫ్ట్ ఇచ్చాడు. ఈ సహాయం వాళ్ల బడలికను దూరం చేసింది.. మిగతా జర్నీని ఈజీ చేసింది. ఇన్ని ఇబ్బందులతో మొత్తానికి బీహార్ బార్డర్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడి నుంచి సహార్సా ఇంకా 350 కిలోమీటర్లు. ఆ చెక్ పోస్ట్ దగ్గర వీళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒక బస్సులో వాళ్లను సహార్సా పొలిమేరలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. బీహారు ప్రభుత్వం చేసిన మంచి పనేంటంటే వలసల గ్రామాల పొలిమేరల్లో ఐసోలేషన్ క్యాంపులను ఏర్పాటు చేసి.. ఏ ఊరి వాళ్లను ఆ ఊరి క్యాంపుల్లో పెట్టడం. ఘజియాబాద్ వలసకార్మికులను క్యాంప్‌లోకి పంపించే ముందు వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడనిచ్చారు కాసేపు భౌతిక దూరం పాటింపజేస్తూ. వాళ్లు క్వారంటైన్ లోకి వెళ్తుంటే ఒకరితో ఒకరం ప్రామిస్ చేసుకున్నాం ఫోన్లో టచ్‌లో ఉండాలి ఎప్పటికీ అని. మా టీమ్‌కు ఆ ఊళ్లో వాళ్లిచ్చిన ఆతిథ్యం, చూపించిన ఆప్యాయతను మాటల్లో చెప్పలేం. తిరిగి మేం వెళ్లిపోతుంటే కళ్లనిండా నీళ్లతో వీడ్కోలు పలికారు’ అంటూ ఆ విషయాలు, విశేషాలను పంచుకున్నారు వినోద్ కాప్రి. మంచితనమే కనిపించింది.. ఇలా వాళ్ల ప్రయాణం ఏడు రోజులు, ఏడు రాత్రులు సాగి సుఖాంతమైంది. కాని దోవంతా ఎంత టెన్షన్ పడ్డామో. హై వే మీద దూసుకెళ్తున్న ట్రక్కుల వేగం ధాటికి పక్కనే సైకిళ్ల మీద వీళ్లు షేక్ అయ్యేవారు. బ్యాలెన్స్ తప్పి ఎక్కడ పడిపోతారేమోనని భయమేసేది. వంద కిలోమీటర్ల వరకు లిఫ్ట్ దొరికినప్పుడు చూడాలి వాళ్ల సంతోషం. పట్టలేక ఏడ్చేశారు. లిఫ్ట్ ఇచ్చిన ట్రక్ డైవర్లదీ సాహసమే. పోలీసులు పట్టుకుంటే 20 వేల జరిమానాతోపాటు ట్రక్కూ సీజ్ అయ్యేది. నిజానికి ఆ దారెంట మాకందరూ మంచివాళ్లే తారసపడ్డారు. తోటివాళ్ల కష్టాన్ని అర్థంచేసుకొని తమకున్న దానిలోంచే ఇతరులకు పంచే పెద్ద మనసున్న వాళ్లు. సైకిల్ పంక్చర్ వేసిన వాళ్లు డబ్బులు తీసుకోలేదు. టీ కొట్టు అతను ఉచితంగా టీ ఇవ్వడమే కాక వాళ్ల కోసం సమోసాలు చేయించిచ్చాడు. ఈ ప్రయాణం ప్రపంచం పట్ల నా దృష్టి్టకోణాన్ని మరింత విశాలం చేసింది. నాలో సానుకూల దృక్పథాన్ని పెంచింది. -
శ్రీనివాస కల్యాణం
చక్కగా డిగ్రీ చదివిన అమ్మాయిని సినిమావాళ్లకిచ్చి చేస్తున్నారేమిటో..! చుట్టు పక్కలవాళ్ల గుసగుసలు. లోపల పెళ్లిచూపుల సీన్ మాత్రం వేరుగా ఉంది. ‘ఇంతాకన్నా ఆనందమేమి, ఓ రామ రామ’ అని రాగం తీస్తోంది అమ్మాయి. ఇకనేం.. అబ్బాయి అమ్మాయికి నచ్చేశాడు. పెళ్లయింది. పెళ్లయి అరవై ఏళ్లూ అయింది. ఈ అరవై ఏళ్లలో సింగీతంగారు.. ఎక్కువసార్లు పలికిన పేరు.. కల్యాణి. ఈ అరవై ఏళ్లలో కల్యాణి గారు.. చెప్పకోడానికి ఇష్టపడిన మాట.. ‘సింగీతం గారి భార్యని’ అరవై ఉగాదులు..! అరవై ఉషస్సులు..! ఎలా గడిచాయని ఇంటర్వ్యూలో అడిగాం. వాళ్లు చెప్పిన ప్రతి మాటా ఏడడుగుల బంధం విలువను చాటింది. రండి... శ్రీనివాస కల్యాణం చూతము రారండి ► ఈ నెల 20తో మీ పెళ్లయి 60 ఏళ్లవుతోంది. సుదీర్ఘ వైవాహిక జీవితం కాబట్టి ప్రత్యేకంగా జరుపుకోవడానికి ప్లాన్ చేస్తున్నారా? సింగీతం: మేమెప్పుడూ పెళ్లి రోజు అంటూ ఆర్భాటాలు చేయలేదు. పిల్లలు వచ్చి మా దంపతులకు నమస్కరించుకుని ఆశీర్వాదాలు తీసుకుంటారు. కల్యాణి: అయితే మా 50 సంవత్సరాల పెళ్లిరోజుని మాత్రం అందరినీ పిలిచి చేసుకున్నాం. మా చిన్నమ్మాయి లండన్‌లో ఉంటోంది. పోయిన నెల తను ఇక్కడే ఉంది. లండన్ వెళ్లిపోయే లోపు 60 ఏళ్ల పెళ్లి రోజుని ముందే సెలబ్రేట్ చేద్దామని ఫిబ్రవరి 25న చేసుకున్నాం. ఆ వేడుక తర్వాత మా ఆమ్మాయి లండన్ వెళ్లిపోయింది. మా పిల్లల అవకాశాన్ని బట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడే మేం వేడుక చేసుకుంటాం. మాకు అదే మంచి రోజు అనుకుంటాం. సింగీతం: వాళ్లకి ఎప్పుడు కుదిరితే అప్పుడే మా మ్యారేజ్ డే అన్నమాట (నవ్వుతూ). ► మీ పెళ్లి ఎలా ఖాయం అయింది? సింగీతం: నేను టీచర్‌గా కొంతకాలం పనిచేశాక అక్కడక్కడా పని చేస్తూ దర్శక–నిర్మాత కేవీ రెడ్డి గారి దగ్గర చేరాను. సినిమా ఇండస్ట్రీలోకి రాగానే పెళ్లి సంబంధం వచ్చింది. చూసుకోవటం, వెంటనే ఓకే అనుకోవటం.. అలా క్విక్‌గా జరిగిపోయింది. కల్యాణి: నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడే మా నాన్నగారు సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. మా నాన్నగారికి ముగ్గురం ఆడపిల్లలమే. నాది ‘ఆశ్లేషా నక్షత్రం’. జాతక రీత్యా నేను చేసుకోబోయే అబ్బాయికి వాళ్ల అమ్మ బతికి ఉండకూడదు. సింగీతం: ఆశ్లేషా నక్షత్రం వారికి తాను చేసుకోబోయే అబ్బాయికి తల్లి ఉంటే ప్రమాదం. అది ఆ జాతకం వారితో ఉన్న లిటికేషన్ అన్నమాట (నవ్వులు). కల్యాణి: అంతకుముందు నాకో సంబంధం వచ్చింది. అబ్బాయికి తల్లి ఉన్నారు. మా నాన్న నా జాతకం విషయం చెబితే వాళ్లు ఫర్వాలేదన్నారు. మంచి సంబంధం అయినప్పటికీ నాన్న ఒప్పుకోలేదు. ఆ సంబంధం గురించి ఆ నోటా ఈ నోటా వైజాగ్‌లో ఉన్న సింగీతంగారి బాబాయ్ వరకూ వెళ్లింది. ఆయన మా నాన్నగారితో ‘మా అన్నయ్యకి తెలిసిన సింగీతం రామచంద్రరావుగారి అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడట. మీకు అభ్యంతరం లేదంటే నేను మా అన్నయ్యకు లెటర్ రాస్తాను’ అన్నారు. సింగీతం: ఆ రోజుల్లో సినిమా వాళ్లకు పిల్లనివ్వాలంటే అంత తొందరగా ఒప్పుకునేవారు కాదు. కల్యాణి: ‘మావాడు సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నాడు. మీకు ఇష్టం ఉంటే మీ అమ్మాయి ఫోటో పంపగలరు’ అని మా నాన్నగారికి వీళ్ల నాన్నగారు ఉత్తరం రాశారు. మా నాన్న తన అభిప్రాయం చెప్పకుండా ‘అమ్మడూ.. నీ ఇష్టం’ అని ఆ లెటర్ నాకు ఇచ్చారు. నేను ఆలోచిస్తుంటే మా అమ్మమ్మగారు ‘వాళ్ల కుటుంబం గురించి నాకు తెలుసు. కంగారు పడకుండా ఒప్పుకో. ఆ అబ్బాయి డిగ్రీ, నువ్వు డిగ్రీ చదువుకున్నావు. అంతా మంచే జరుగుతుంది’ అన్నారు. నేను ‘సరే’ అన్నాను. కల్యాణి, సింగీతం ► 60 ఏళ్ల క్రితం పెళ్లంటే అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా పెద్దలు పెళ్లి ఖాయం చేసేవారు. అయితే మీ నాన్నగారు మీ అభిప్రాయాన్ని అడిగారంటే, ఆయన ఎంత గొప్పగా ఆలోచించారో అర్థమవుతోంది.. సింగీతం: మా మామగారు ఫార్వార్డ్ థింకింగ్. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఏది నిర్ణయించుకుంటే అదే ఫైనల్ అనుకునేవారు. మా పెళ్లికి అంతా ఓకే అనుకున్నారు కానీ, కట్నం ఎంత అడుగుతారో అనేది అందరి మనసులోనూ ఉంది. అది గ్రహించి మా నాన్నగారు ‘మా వంశంలో కట్న, కానుకల ప్రసక్తే లేదు. నో డిమాండ్స్, నథింగ్’ అన్నారు. ► ఈ సందర్భంగా కట్న, కానుకలు తీసుకునే వారి గురించి నాలుగు మాటలు? సింగీతం: కట్నం తీసుకోకూడదు, నేరం.. ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఏదో నాలుగు మాటలు చెప్పేస్తే సరిపోదు. దీనికి ఒకే ఒక్క సొల్యూషన్ ఏంటంటే ఆడవాళ్లు చదువుకోవాలి. స్త్రీలందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి. ఒకప్పుడు వాళ్ల అమ్మమ్మకు జరిగింది, తర్వాత వాళ్ల అమ్మకు జరిగింది.. ఇప్పుడు కూతురికి జరగకుండా చూసుకుంటే చాలు. మార్పు అదే వస్తుంది. ► అప్పట్లో పెళ్లి చూపుల్లో అమ్మాయిని పాడమనేవారు.. కల్యాణి: ‘ఇంతాకన్నా ఆనందమేమి, ఓ రామ రామ..’ అని పాడాను (నవ్వుతూ). ‘అబ్బాయి నచ్చాడని ఇంతకన్నా అమ్మాయి ఎలా చెబుతుంది’ అని పెద్దవాళ్లు అన్నారు. మా పెళ్లి కుదిరింది. కానీ అమ్మలక్కలు చక్కగా డిగ్రీ చదువుకున్న అమ్మాయిని సినిమా వాళ్లకి ఎందుకిస్తున్నారో అని గుసగుసలాడుకున్నారు. అప్పుడు వాళ్లు అలా అన్నారు. ‘సింగీతంగారి భార్యని’ అని నేను ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటాను. అప్పటికీ ఇప్పటికీ నాది ఒకటే మాట... ఆయన్ని పెళ్లి చేసుకున్నందుకు నేను ధన్యురాలిని. ► పెళ్లి చూపుల్లో ‘ఇంతాకన్నా ఆనందం ఏముంది..’ అని పాడినట్లుగానే మీ లైఫ్ ఆనందంగా సాగుతోందన్న మాట... కల్యాణి: రెండొందల శాతం నా లైఫ్ అలానే ఉంది. పెళ్లికి ముందు నేను పక్కింట్లో పేరంటానికి కూడా వెళ్లేదాన్ని కాదు. మేం మా పుట్టింట్లో అలా పెరిగాం. ఓ సారి చెల్లెలు మద్రాసులో మా ఇంటికి వచ్చింది. నేను అందరితో మాట్లాడటం చూసి ‘అదేంటే... అందరితో అంత బాగా మాట్లాడుతున్నావు! బావగారు నిన్ను భలే మార్చేశారే’ అంది. సింగీతం: కాలేజీ డేస్‌లోనే మోడ్రన్‌గా ఉండేవాణ్ణి. మోడ్రన్‌గా డ్రెస్ చేసుకోవడం మాత్రమే కాదు.. నా ఆలోచనలు కూడా అలానే ఉండేవి. నేను కేవీ రెడ్డిగారి దగ్గర పని చేసేటప్పుడు మద్రాసులో రెండు లైబ్రరీలు ఉండేవి. ఇద్దరం పుస్తకాలు తెచ్చుకుని, చదివేవాళ్లం. ‘నేను ఏది చెబితే అది ఫైనల్ కాదు, నీకు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. మీరు ఎంత చెబితే అంతే అనే తత్వం నుంచి నీకున్న హక్కుతో నువ్వు డిమాండ్ చెయ్’ అని పెళ్లయిన కొత్తలోనే తనకు చెప్పాను. ► ఇప్పుడు కూడా భార్యకి ఈక్వల్ రైట్స్ ఇవ్వడానికి చాలామంది భర్తలు ఇష్టపడటంలేదు. 60 ఏళ్ల క్రితం ‘ఈక్వల్ రైట్స్’ అన్నారంటే సూçపర్బ్. మేల్ డామినేషన్ అంటూ స్త్రీని చిన్నచూపు చూసేవారికి చిన్న సలహా ఏమైనా? సింగీతం: అప్పట్లో మగవాళ్లు ఆఫీసుకు వెళ్లి, తర్వాత క్లబ్‌లకు వెళ్లి, పేకాట ఆడి ఇలా ఎంతో ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఎవరైనా ఇంటికి వచ్చి మాట్లాడితే తప్ప ఆడవాళ్లకు వేరే ఏమీ ఉండేది కాదు. టీవి వచ్చాక కొంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది. అయితే మగవాడు ఇంటికి వచ్చినా కూడా ఆడవాళ్లు టీవి చూస్తూనే ఉంటారనే అర్థంతో కార్టూన్లు వేసేవారు. అవి వేసేది కూడా మగవాళ్లే. అన్నిరోజులూ మగవాళ్లు పేకాట ఆడినా ఒక్క కార్టూన్ రాలేదు. ఆడవాళ్ల మీద ‘తిరగబడే ఆడది’, ‘భయపడే మొగుడు’ లాంటి టైటిల్స్‌తో కార్టూన్లు వచ్చేవి. ఇదంతా మేల్ డామినేషన్. ఇది తరతరాలుగా వస్తోంది. ఈ పరిస్థితి పోవాలంటే ఎడ్యుకేషన్ ఆఫ్ ఉమెన్ ఒక్కటే పరిష్కారం. ప్రతి స్త్రీ తన హక్కుల కోసం డిమాండ్ చేయాలి. ఈ రోజుకీ ఇంట్లో అందరూ ఉన్నప్పుడు మగవాడు ఫస్ట్ అన్నట్లు చూస్తారు. 60 ఏళ్ల మా వైవాహిక జీవితం తర్వాత కూడా ఇప్పుడూ ఈమె కొన్ని విషయాల్లో ‘మేల్ ప్రయారిటీ’ ఇస్తుంది. అలా వద్దంటాను. స్త్రీ బతికినంతకాలం పురుషుడి మీద ఆధారపడాలనే ధోరణి మంచిది కాదు. ఆవిడకూ ఒక లైఫ్ ఉంటుంది. ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి. కల్యాణి: అప్పట్లో మా నాన్నగారు ఓ పత్రికకు నాతో కరస్పాండెంట్‌గా పని చేయించారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఏం జరుగుతుందో రాసి ఇచ్చేదాన్ని. అక్కడ లేడీస్ క్లబ్ మెంబర్‌గా ఉండేదాన్ని. అక్కడే పాఠాలు, టైప్ రైటింగ్ నేర్చుకున్నా. అలా మా నాన్న బాగా ఎంకరేజ్ చేసేవారు. పెళ్లయ్యాక ఈయన ఇంకా బాగా ఎంకరేజ్ చేశారు. ► మీరు డైరెక్షన్ చేసిన సినిమాల్లో కొన్నింటి కథా చర్చల్లో మీ ఆవిడ కూడా భాగం పంచుకున్నారట... ఆ విషయం గురించి? సింగీతం: ప్రతి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం ముందుగా ఆమెకు వినిపించేవాణ్ణి. ఆమెతో డిస్కస్ చేసేవాణ్ణి. ఓసారి ఆమెకు ఒక ఫిలిం ఫెస్టివల్లో చూసిన ఓ అర్జెంటీనా సినిమా నచ్చింది. ఆ మాట నాతో అంటే.. అయితే తెలుగుకి తగ్గట్టుగా ఆ కథ రాయమన్నాను. దాన్నే ‘సొమ్మొకడిది–సోకొకడిది’గా తెలుగులో తీశాను. కల్యాణి: ఏ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లినా సినిమా చూస్తూ టక టకా నోట్ చేసేదాన్ని. తర్వాత ఆయనతో డిస్కస్ చేసేదాన్ని. కుమార్తెలు సుధా కార్తీక్, శకుంతలా సతీష్‌తో.... ► మీ 60 ఏళ్ల వైవాహిక బంధం గురించి అందరికీ స్ఫూర్తిగా ఉండే ఓ కొన్ని పాయింట్లు చెప్పండి... కల్యాణి: ఎంత అన్యోన్యంగా ఉండే దంపతుల మధ్య అయినా వాదనలు లేకుండా ఉండవు. వాదించుకున్నా కూడా ఆ తర్వాత కలిసిపోవాలి. సమస్యలు ఉన్నా విడాకులవరకూ వెళ్లకూడదు. పెళ్లికి ముందు నాకు కొంచెం కోపం ఎక్కువ. పిల్లలు పుట్టాక ఆ కోపం ఇంకా పెరిగింది. వాళ్ల అల్లరి తట్టుకోలేకపోయేదాన్ని. దాంతో పిల్లలను తిట్టి, కొట్టేదాన్ని. అలాంటి సమయాల్లో ఆయనే ఎక్కువగా సర్దుకుపోయేవారు. నాకు కోపం వచ్చింది కదా అని ఆయన ఇంకా కోపం తెచ్చుకుని సమస్యని పెద్దది చేసేవారు కాదు. మా ఇద్దరి మధ్య మంచి అండర్సాండింగ్ ఉంది. సింగీతం: నాది ఆబ్సెంట్ మైండ్. అది నిజంగా పెద్ద సమస్యే అయినా తను సర్దుకుంది. నేను చిన్నçప్పటి నుంచీ నాస్తికుడిని. కానీ ఆమె పూజలు చేస్తుంది. నేను దేవుణ్ణి నమ్మను కదా అని తనని మానేయమనలేదు. తనకోసం నేను అష్టోత్తరాలు చదువుతాను. ఎందుకంటే ఆవిడ అభిప్రాయానికి విలువ ఇవ్వాలి కదా. నేను అష్టోత్తరాలు చదవడంవల్ల దేవుడు నన్ను ఇష్టపడతాడని కాదు... ఈమె ఇష్టపడుతుంది కదా (నవ్వుతూ). మనం ఎవరమూ పర్ఫెక్ట్ పీపుల్ కాదు. ప్రపంచంలో అందరం ‘ఇన్పర్ఫెక్ట్ పీపులే’. ఆ ఇన్పర్ఫెక్ట్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అందరం హ్యాపీగా ఉంటాం. ► ‘ఆదిత్య 369’ చిత్రంలో టైమ్ మెషీన్‌ని వెనక్కి తిప్పి ప్రేక్షకులందర్నీ వెనక్కి తీసుకెళ్లిపోయారు.. ఇప్పుడు టైమ్ మెషీన్ వెనక్కి వెళితే మీకు ఏమేం చేయాలని ఉంది? సింగీతం: ఏవీ లేవమ్మా.. నిన్నటికన్నా రేపు బెటర్ అంటాను. అప్పట్లో అన్నీ అద్భుతాలే అంటుంటారు. కానీ ఇవాళ కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ రోజు నేను చేయనివి ఎన్నో ఇప్పుడు ఇండస్ట్రీలో చేస్తున్నారు. వాళ్లను చూసి నేను అప్డేట్ అవుతుంటాను. ► ఫైనల్లీ.. మళ్లీ దర్శకత్వం ఎప్పుడు? సింగీతం: రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.. స్క్రిప్ట్ విషయంలో కల్యాణికి గతంలో చెప్పినట్లు పెద్దగా చెప్పడంలేదు. కాకపోతే ఇలా చేయబోతున్నానని తనకి చెబుతుంటాను. అన్నీ తనకి చెప్పే చేస్తుంటాను. ► చెప్పకుండా చేసినది ఏదైనా మీ జీవితంలో ఉందా? కల్యాణి: అలాంటిది ఏదీ లేదు (నవ్వులు). ► మీరు ‘శ్రీ కల్యాణం’ పుస్తకం రాయడానికి స్ఫూర్తి ఎవరు? కల్యాణి: నీ చిన్నప్పటి విషయాలు, నువ్వు నాన్నని పెళ్లి చేసుకున్న తర్వాత నీ అనుభవాలతో ఓ పుస్తకం రాయొచ్చు కదా? అని మా చిన్నమ్మాయి అంది. నా ఆటోబయోగ్రఫీ రాయడానికి ముఖ్య కారణం తనే. ఎలా ప్రారంభించాలా అనుకునేదాన్ని.. ‘నువ్వు అనుకున్నవన్నీ రఫ్‌గా రాస్తుండు. ఫైనల్ వెర్షన్ ఒకటి రాయొచ్చు’ అని ఆయన అన్నారు. ఓ డైరీలో రాసుకునేదాన్ని. రఫ్ రాయడానికే ఆర్నెల్లు పట్టింది. సింగీతం: మాకు పెళ్లైన కొత్తలో మాకు పెద్దగా వస్తువులు లేవు. రచయిత పింగళి నాగేంద్రగారు ఒక టేబుల్, నాలుగు కుర్చీలు బహుమతిగా ఇచ్చారు. ఆ టేబుల్ ఇప్పటికీ మా ఇంట్లోనే ఉంది. అది మాకు ప్రత్యేకం. దానిపై కాగితాలు పెట్టుకుని ఆ పుస్తకం రాసింది తను. అది నాకు సంతోషం. ► ఇప్పుడు మీ రోజువారి జీవితం ఎలా సాగుతోంది? సింగీతం: నేను ఉదయం 6:30 గంటలకు నిద్ర లేచి కాసేపు వాకింగ్, శ్వాసకి సంబంధించిన వ్యాయామం చేస్తాను. సాయంత్రం కూడా వాక్ చేస్తాను. ఆహారం అంతా టైమ్ టు టైమ్ జరిగిపోతుంది. రాత్రి కళ్లు మూసుకోగానే నిద్రపట్టేస్తుంది. పాపం తనకి నిద్రపట్టదు. కల్యాణి: నాకు రాత్రి 12 తర్వాత నిద్రపడుతుంది. అందుకని త్వరగా నిద్ర లేవలేను. నా 55వ సంవత్సరం నుంచే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. డాక్టర్ల సలహా మేరకు ఫిజియోథెరపీ చేయించుకున్నాను. డాక్టర్ చెప్పినట్లు కాసేపు చేతులు, కాళ్లకు సంబంధించిన ఎక్సర్సైజ్లు చేస్తాను. నాకు 83 ఏళ్లొచ్చినా ఇప్పటికీ మా ఇద్దరికీ చపాతీలు చేయడం, దోసెలు వేయడం చేస్తాను.. వంట చేయడానికి మనుషులు ఉన్నారనుకోండి. సింగీతం: మేం చెన్నైలో ఉంటున్నాం. నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు నా తమ్ముడు అసిస్టెంట్‌గా చేసేవాడు. తన అబ్బాయి పూర్ణ ప్రగ్యా, కోడలు, వాళ్ల పిల్లలు మా వద్దే ఉంటూ బాగా చూసుకుంటున్నారు. కల్యాణి: ఆ అమ్మాయి మా సొంత కోడలిలా మమ్మల్ని చూసుకుంటుంది. అందుకని మాకేం ఇబ్బంది లేదు. ► ‘నా జీవితంలో నేను ఎక్కువగా పలికిన పేరు కల్యాణి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.. సింగీతం: అవును. నేను ఎక్కువసార్లు పలికిన పేరు కల్యాణి. మాది చాలా సింపుల్ లైఫ్. నాకు డైరెక్షన్ తప్ప వేరే ఏదీ తెలియదు. షూటింగ్ కాగానే నేరుగా ఇంటికి వచ్చేవాణ్ణి. మాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఆరుగురు మాత్రమే ఉండేవారు. సినిమాలు, ఇల్లు, ఆ ఫ్రెండ్స్.. అంతే. – డి.జి. భవాని -
దర్శకుడు శ్రీవాస్ ఇంట్లో విషాదం
సాక్షి, రాజమండి: టాలీవుడ్ దర్శకుడు శ్రీవాస్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీవాస్ తల్లి ఓలేటి అమ్మాజి(68) శనివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తూర్పుగోదావరి జిల్లాలోని స్వగ్రామమైన పురుషోత్తపట్నంలో శనివారం మధ్యాహ్నం 12.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. అమ్మాజికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దర్శకుడు శ్రీవాస్ అమ్మాజికి రెండో సంతానం. శ్రీవాస్ తల్లి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. గోపీచంద్ హీరోగా నటించిన లక్ష్యం సినిమాతో శ్రీవాస్ దర్శకుడిగా పరిచయమయ్యారు. రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద, లౌక్యం, డిక్టేటర్, సాక్ష్యం సినిమాలను ఆయన తెరకెక్కించారు. దర్శకుడు వీరశంకర్ తండ్రి బైరిశెట్టి సత్యనారాయణ, హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు ఇటీవల మరణించారు. (ప్రముఖ దర్శకుడికి పితృవియోగం) -
ప్రముఖ దర్శకుడి ఇంట్లో విషాదం
సాక్షి, తణుకు: ప్రముఖ దర్శకుడు వీరశంకర్ తండ్రి బైరిశెట్టి సత్యనారాయణ(83) మంగళవారం ఉదయం కన్నుమూశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి సమీపంలో ఉన్న చివటం గ్రామంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా కేన్సర్‌తో ఆయన బాధ పడుతున్నారు. సత్యనారాయణకు ముగ్గురు కుమారులు వేణుగోపాలరావు, వెంకటేశ్వరావు, వీరశంకర్ ఉన్నారు. (టాలీవుడ్లో మరో విషాదం) తన తండ్రి గురించి వీరశంకర్ మాట్లాడుతూ.. ‘మాకు నిజాయితీని, కష్టపడే తత్వాన్ని నేర్పిన మనిషి. ఆఖరి రోజుల్లో కేన్సర్ కారణంగా బాధని అనుభవించడం మమ్మల్ని కలచివేసింది. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి మేము చేసే పోరాటానికి ఆయనే స్ఫూర్తి. నాన్న ఎప్పటికీ మాకొక మంచి జ్ఞాపకం’ అన్నారు. వీరశంకర్ తండ్రి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. శ్రీకాంత్ హీరోగా నటించిన ‘హల్ ఐ లవ్ యూ’ సినిమాతో వీరశంకర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. తెలుగుతో పాటు కన్నడ సినిమాలకు దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్‌తో గుడుంబా శంకర్ సినిమా తీశారు. ప్రేమకోసం, విజయరామరాజు, యువరాజ్యం, మన కుర్రాళ్లే తదితర సినిమాలను ఆయన తెరకెక్కించారు. (నటుడు శ్రీకాంత్‌కు పితృవియోగం) -
దర్శకుడిపై దినపత్రిక సీఈఓ అత్యాచారం
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు చెందిన జంషెద్ మెహమూద్ అనే దర్శకుడు తనపై ఓ ప్రముఖ వార్తా పత్రికకు చెందిన సీఈఓ అత్యాచారం చేశాడని చెప్పి సంచలనం క్రియేట్ చేశారు. తనపై ఓ ప్రముఖ సీఈఓ అత్యాచారానికి పాల్పడ్డాడని రెండు నెలల క్రితమే జంషెద్ ఆరోపించినా.. అప్పడు అతని పేరు బయటపెట్టలేదు. కానీ, ఇప్పుడు అతని పేరును ట్విటర్ ద్వారా బయటపెట్టాడు. డాన్ పత్రిక సీఈఓ హమీద్ హరూన్ 13 ఏళ్ళ క్రితం నన్ను అత్యాచారం చేశాడు. ధైర్యం ఉంటే ఈ వార్తను మీ పత్రికలో ప్రచురించండి. చదవండి: వారిది నా రక్తం.. పవన్ రక్తం కాదు: రేణూదేశాయ్ నేను మీటూ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. ఈ విషయం గురించి నేను నా స్నేహితులకు చెబితే అందరూ నవ్వారు. కానీ, ఆ దారుణ ఘటనను మర్చిపోవడానికి థెరపిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. కొన్ని నెలల పాటు పాకిస్థాన్‌కు దూరంగా ఉన్నాను. ఆ నీచుడు మా నాన్న చనిపోయినప్పుడు పరామర్శించడానికి కూడా వచ్చాడు. నా జీవితం నాశనం చేసిన విషయం మా నాన్నకు కూడా తెలుసని జంషెద్ మెహమూద్ ట్వీట్లో పేర్కొన్నాడు. చదవండి: మైనర్‌పై అత్యాచారం.. నిందితుడిని చంపిన అన్న Yes HAMEED HAROON Raped me. Im ready now. R u ready to print this @dawn_com ? — Jami raza (@azadjami1) December 28, 2019 -
గీతా గోవిందం దర్శకుడితో ‘మహేష్‌బాబు’ సినిమా
సింహాచలం(పెందుర్తి): గీత గోవిందం సినిమా తనని సినీ ప్రేక్షకులను ఎంతో దగ్గర చేసిందని దర్శకుడు పరశురామ్ అన్నారు. వరాహ లక్ష్మీ నృసింహస్వామిని బుధవారం ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. అంతరాలయంలో అష్టోత్తరం పూజ, గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. వేద ఆశీర్వచనాన్ని అర్చకులు అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదాన్ని ఏఈవో రామారావు అందించారు. ఈ సందర్భంగా పరశురామ్ విలేకరులతో మాట్లాడారు. ‘యువత’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యానని, ఆ తర్వాత ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీతగోవిందం సినిమాలకు దర్శకత్వం వహించానన్నారు. గీత గోవిందం సినిమా ప్రేక్షకులను బాగా దగ్గర చేసిందన్నారు. తన తదుపరి చిత్రం నాగచైతన్యతో ఉంటుందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందన్నారు. అలాగే మహేష్‌బాబుతో సినిమా ఉంటుందని, ఆ సినిమా కథ ఇప్పటికే సిద్ధమైందన్నారు. నర్సీపట్నం తన సొంత ఊరని పరశురామ్ తెలిపారు.