దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఓ సినీ నిర్మాత మహిళలకు ఇచ్చిన కీచక సలహాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. డేనియల్ శ్రావణ్ అనే చిత్ర నిర్మాత ‘మహిళలు ప్రయాణించేటప్పుడు కండోమ్‌ను తీసుకెళ్లాలి. పురుషుల లైంగిక కోరికను అంగీకరించాలి’ అంటూ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో కీచక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో సంబంధిత పోస్టును అతను తొలగించాడు.
అతని పూర్తి పోస్టు ఇది.. ‘18 సంవత్సరాలు నిండిన మహిళలు ముఖ్యంగా భారతీయ మహిళలు లైంగిక విద్య పట్ల అవగాహన ఉండాలి. మహిళలు పురుషుల లైంగిక కోరికలను తిరస్కరించకూడదు. అప్పుడే ఇలాంటి చర్యలు జరగవు. 18 సంవత్సరాలు నిండిన యువత కండోమ్‌లను ఉపయోగించాలి. ఇదోక సాధారణ విషయం. వ్యక్తి తన లైంగిక కోరిక నెరవేరినప్పడు మహిళలను చంపాలని ప్రయత్నించడు. నిజానికి ప్రభుత్వం ఆత్యాచారం తర్వాత జరిగే మరణాలను తగ్గించడానికి ఓ పథకాన్ని రూపొందించాలి. సమాజం, ప్రభుత్వం నిర్భయ చట్టం, పెప్పర్ స్ప్రేలతో రేపిస్టులను భయపెడుతున్నాయి. పురుషులకు కేవలం తన లైంగిక వాంఛను తీర్చుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడతారు. దీన్ని మహిళ తిరస్కరించడంతో వారిలో ఒక చెడు ఆలోచన రేకెత్తి ఇలాంటి దారుణానికి దారితీస్తుంది .అంతేగానీ బాధితులను చంపాలనే ఆలోచన వారికి ఉండదు.అందుకే మహిళలు అత్యాచారాన్నిఅంగీకరించాలి‘ అని డేనియల్ పేర్కొన్నాడు.
ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో సెలబ్రిటీలతో సహా నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలాంటి పనికిమాలిన సలహాలను ఇచ్చే వారికి కూడా ప్రభుత్వం మరణ శిక్ష విధించాలి. వెధవ డానియల్’. ‘ఇదొక కౄరమైన ఆలోచన ముందు దీన్ని నీకు నువ్వు అమలు చేసుకో’. ‘ఇలాంటి సలహాలను పట్టించుకోకండి. ఇతనికి వైద్య సహాయం అవసరం.’ ఇలాంటి సలహాలను ఇచ్చే వారిని ఉరి తీయాలి. అప్పుడే ఇంకోసారి ఇలా వాగరు’...అంటూ డేనియల్‌పై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment