'మణిరత్నం చిత్రాన్ని విడుదల చేయొద్దు' | Film distributor complaints on director mani ratnam | Sakshi
Sakshi News home page

'మణిరత్నం చిత్రాన్ని విడుదల చేయొద్దు'

Published Thu, Apr 9 2015 8:58 AM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM

'మణిరత్నం చిత్రాన్ని విడుదల చేయొద్దు'

'మణిరత్నం చిత్రాన్ని విడుదల చేయొద్దు'

చెన్నై : దర్శకుడు మణిరత్నం తాజా చిత్రం ఓ కాదల్ కన్మణి. ఈ నెల 17న విడుదలకు ముస్తాబవుతోంది. ఇలాంటి పరిస్థితిలో మన్నన్ అనే డిస్ట్రిబ్యూటర్ మణిరత్నంపై తమిళ నిర్మాతల మండలిలోను, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సంఘాలలోను ఒక ఫిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ మణిరత్నం ఇంతకుముందు రూపొందించిన కడల్ చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులను తాను పొందానన్నారు.
 
 అయితే ఆ చిత్రం తనకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని తెలిపారు. ఆ చిత్రం కొనుగోలు కోసం చేసిన అప్పులకు వడ్డీ కూడా కట్టలేని స్థితిలో వున్నానన్నారు. పెద్ద నిర్మాణ సంస్థలు నిర్మించిన చిత్రాలకు ఏర్పడ్డ నష్టాలను మానవతావాదంతో ఇప్పుడు తిరిగి చెల్లిస్తున్నారన్నారు. అదే విధంగా కడల్ చిత్రానికి తనకు కలిగిన నష్టాన్ని భర్తీ చేసే వరకు మణిరత్నం తాజా చిత్రం ఓ కాదల్ కన్మణిని విడుదల చేయకుండా అడ్డుకోవాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement