Film distributor
-
సూర్య, కార్తీలకు డైమండ్ బ్రాస్లెట్స్ గిఫ్టిచ్చిన డిస్ట్రిబ్యూటర్
కార్తీ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం విరుమన్. ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై హీరో సూర్య నిర్మించాడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, ఎస్.కె.సెల్వకుమార్ ఛాయాగ్రహణం అందించారు. గ్రామీణ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 12న రిలీజై ఘన విజయం సాధించింది. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో సంబరాలు జరుపుకుంటున్న డిస్ట్రిబ్యూటర్స్ చిత్రయూనిట్‌కు ఖరీదైన కానుకలు అందించారు. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ శక్తివేలన్ అన్నదమ్ములు సూర్య, కార్తీలతో పాటు 2డీ ఎంటర్టైన్మెంట్ సీఈవో, విరుమన్ సహనిర్మాత రాజశేఖర్ పాండియన్‌కు డైమండ్ బ్రాస్‌లేట్స్ బహుకరించాడు. అలాగే దర్శకుడు ముత్తయ్యకు వజ్రపు ఉంగరాన్ని కానుకగా ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. Success is best when shared! 🔥 To celebrate the victory of #Viruman here's presenting our #Viruman @karthi_offl, our co producer @rajsekarpandian and our producer @suriya_offl with a Diamond Bracelet and @dir_muthaiya with a Diamond ring! Now, running successfully! 🔥 pic.twitter.com/S6Is8e1B1p — Sakthivelan B (@sakthivelan_b) August 17, 2022 చదవండి: ప్రముఖ నటుడు నాజర్‌కు గాయాలు ! జబర్దస్త్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం -
కమలాకర్ రెడ్డి మృతి తీరని లోటు
‘‘పంపిణీదారుడు, నిర్మాత గుండాల కమలాకర్ రెడ్డి మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు’’ అని నిర్మాత చదలవాడ శ్రీనివాస్ అన్నారు. నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కమలాకర్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ఆయన సంతాప సభలో చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘20 ఏళ్ల క్రితం ‘అభయ్’ సినిమాతో కమలాకర్ రెడ్డి, జనార్దన్ నాకు పరిచయం. కమలాకర్ మన మధ్య లేకపోయినా అతని మంచి ఆశయాలు మనతోనే ఉంటాయి’’ అన్నారు. ‘‘300 యోధులు, 1000 బీసీ, బలాదూర్’ వంటి ఎన్నో మంచి చిత్రాలను పంపిణీ చేశారు కమలాకర్ రెడ్డిగారు. ముంబయ్‌లో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు కమలాకర్‌గారి కె.ఎఫ్.సి సంస్థను సంప్రదించేవి. జనార్దన్‌గారు కమలాకర్‌గారి కుటుంబానికి అండగా నిలవాలని కోరుతున్నా’’ అన్నారు నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్. ‘‘మంచి సినిమాలు చేస్తూ పంపిణీదారునిగా మంచి పేరున్న కమలాకర్ రెడ్డిగారు మన మధ్య లేకపోవడం బాధాకరమైన విషయం’’ అని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు, నిర్మాత ముత్యాల రామ్‌దాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు వి.ఎల్. శ్రీధర్, ‘ఈనాడు’ సినిమా నిర్మాత కుమార్ బాబు, ‘మాతృదేవోభవ’ దర్శకుడు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మహత్యే శరణ్యం: వర్మ సినిమా బాధితుడు
కింగ్ నాగార్జున, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఆఫీసర్. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి షో నుంచే నెగెటివ్ టాక్ రావటంతో భారీ డిజాస్టర్ కావటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన చిత్ర పంపిణీదారుడు సుబ్రమణ్యం తనకు ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. ఇండియా టుడే కథనం మేరకు ఆఫీసర్ షూటింగ్ సమయంలో దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ, సుబ్రమణ్యం అనే వ్యక్తి నుంచి కోటీ ముప్పై లక్షల ఫైనాన్స్ తీసుకున్నారు. సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత కూడా ఆ మొత్తాన్ని సుబ్రమణ్యానికి తిరిగి చెల్లించపోగా కోర్టుకు వెళ్లాలంటూ సూచించారు. కోర్టులో సమస్య తేలడానికి చాలా సమయం పడుతుందన్న ఉద్దేశంతో తనకు ఇవ్వాల్సిన డబ్బుకు బదులుగా ఆఫీసర్ చిత్రం గోదావరి రైట్స్‌ను ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే వర్మ మాత్రం కేవలం గోదావరి జిల్లాల రైట్స్ వరకు ఇచ్చే ఆలోచన లేదన్న వర్మ, ఆంధ్ర రైట్స్ మొత్తం తీసుకోవాల్సిందిగా సూచించారు. తనకు మరో ఆప్షన్ లేని పరిస్థితుల్లో సుబ్రమణ్యం మూడున్నర కోట్లు చెల్లించి మొత్తం ఆంధ్ర రైట్స్ సొంతం చేసుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తరువాత డిజాస్టర్ టాక్ రావటంతో మినిమమ్ కలెక్షన్లు కూడా రావటం లేదు. భారీ నష్టాలు తప్పేలా లేవు. నాగార్జున సినిమా కనుక మంచి లాభాలు వస్తాయని భావించిన తనకు ఇప్పుడు ఆత్మహత్యే శరణ్యం అంటున్నారు సుబ్రమణ్యం. మరి ఈ వివాదంపై నాగార్జున, రామ్ గోపాల్ వర్మలు ఎలా స్పందిస్తారో చూడాలి. -
ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కారుడ్రైవర్ దొరికాడు
బంజారాహిల్స్ : ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కళ్లుగప్పి లక్షలాది రూపాయలతో పరారైన కారు డ్రైవర్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు, బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఘటన వివరాలు వెల్లడించారు. గత నెల 20వ తేదీన పేట్బషీరాబాగ్లో నివసించే ఫిలిం డిస్ట్రిబ్యూటర్ వి.వాసుదేవరావు చౌదరి తన స్కోడా కారులో డ్రైవర్ గడ్డమీది సాయికుమార్(34)తో కలిసి కిక్-2 సినిమా హక్కుల కొనుగోలు కోసం రూ.21 లక్షలు తీసుకొని బంజారాహిల్స్‌లోని సాగర్‌సొసైటీలో ఉన్న ఎన్టీఆర్ ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చారు. అయితే కారులోనే డబ్బును ఉంచి వాసుదేవరావు కార్యాలయం లోపలికి వెళ్లి వచ్చేలోగా కారు సహా డబ్బుతో డ్రైవర్ సాయికుమార్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలింపు చేపట్టి మెదక్ జిల్లా ఆందోల్ మండలం జోగిపేట గ్రామంలోని తన స్వగృహంలో తలదాచుకున్న సాయికుమార్‌ను అరెస్టు చేశారు. దొంగిలించిన సొమ్ములో రూ.16.50 లక్షలు తన సోదరుడు తాళ్ల విఠల్‌గౌడ్‌కు ఇచ్చి మిగతా సొమ్ముతో తీర్థయాత్రలకు వెళ్లాడు. రూ.2.40 లక్షలను విందు వినోదాలకు ఖర్చు చేశాడు. నిందితుడి అదుపులోకి తీసుకున్న పోలీసులు కారుతో పాటు రూ.18.60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. -
కోర్టుకు ‘లింగా’
చెన్నై : లింగా వ్యవహారం ఆరోపణలు ఆందోళనలు దాటి కోర్టు గుమ్మం తొక్కింది. హత్యా చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని... ఈ నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆళ్వాతిరునగర్‌కు చెందిన ఆర్ సింగారవడివేలన్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ తాను రజినీకాంత్ నటించిన లింగా చిత్ర తిరుచ్చి, తంజావూర్ ఏరియాల విడుదల హక్కుల్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. లింగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్రం విజయం సాధించడం ఖాయం అని అలాకాని పక్షంలో నష్టం వాటిల్లిన బయ్యర్లకు పరిహారం చెల్లిస్తానని రజనీకాంత్ అన్నారని పేర్కొన్నారు. ఆయన మాటలు నమ్మి తాను రూ.7.13 కోట్లకు లింగా చిత్రాన్ని కొన్నానన్నారు. అయితే లింగా చిత్రం విడుదలై ఆశించిన విజయం సాధించకపోవడంతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారని పేర్కోన్నారు. దీంతో మరో వైపు నష్టపోయిన థియేటర్ల యాజమాన్యం పరిహారం చెల్లించాలంటూ డిస్ట్రిబ్యూటర్లను అడుగుతున్నారని వివరించారు. దాంతో ఆందోళనలు, నిరాహార దీక్షలు చేసి నిర్మాత, చిత్ర హీరోలపై ఒత్తిడి తీసుకురాగా చివరికి రజినీకాంత్ నష్టపరిహారంగా రూ.12.5 కోట్లు చెల్లించడానికి ముందుకొచ్చారని తెలిపారు. అయితే అందులో ఆరుకోట్లు మాత్రమే చెల్లించారని మిగిలింది అడిగితే కోర్టులో ఉన్న కేసును వాపస్ తీసుకున్న తరువాత ఇస్తామన్నారని అన్నారన్నారు. వారి మాట ప్రకారం కోర్టులో కేసును వాపస్ తీసుకున్నామని... అయినా మిగిలిన రూ. ఆరు కోట్లు చెల్లించకుండా మోసం చేశారని ఆరోపించారు. అంతే కాకుండా రజినీకాంత్ రెచ్చగొట్టడంతో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి థాను ఇతర నిర్మాతలందరకీ లేఖలు రాసి తనతో సంప్రదించిన తరువాతే సింగర వడివేలన్‌కు చిత్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇవ్వాలని చెబుతున్నారని పేర్కొన్నారు. కొంతమంది వాట్స్‌యాప్‌లో హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని ఈ విషయమై గత 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు చర్యలు చేపట్టలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు బుధవారం న్యాయమూర్తి పీఎన్ ప్రకాష్ సమక్షంలో విచారణకు వచ్చింది. పిటీషనర్ తరపున జి విజయకుమార్, ఎం సతీష్‌కుమార్ హాజరై వాదించారు. ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది రెండు వారాల పాటు కేసును వాయిదా వేయాలని కోరారు. న్యాయమూర్తి రెండు వారాలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
'మణిరత్నం చిత్రాన్ని విడుదల చేయొద్దు'
చెన్నై : దర్శకుడు మణిరత్నం తాజా చిత్రం ఓ కాదల్ కన్మణి. ఈ నెల 17న విడుదలకు ముస్తాబవుతోంది. ఇలాంటి పరిస్థితిలో మన్నన్ అనే డిస్ట్రిబ్యూటర్ మణిరత్నంపై తమిళ నిర్మాతల మండలిలోను, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సంఘాలలోను ఒక ఫిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ మణిరత్నం ఇంతకుముందు రూపొందించిన కడల్ చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులను తాను పొందానన్నారు. అయితే ఆ చిత్రం తనకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని తెలిపారు. ఆ చిత్రం కొనుగోలు కోసం చేసిన అప్పులకు వడ్డీ కూడా కట్టలేని స్థితిలో వున్నానన్నారు. పెద్ద నిర్మాణ సంస్థలు నిర్మించిన చిత్రాలకు ఏర్పడ్డ నష్టాలను మానవతావాదంతో ఇప్పుడు తిరిగి చెల్లిస్తున్నారన్నారు. అదే విధంగా కడల్ చిత్రానికి తనకు కలిగిన నష్టాన్ని భర్తీ చేసే వరకు మణిరత్నం తాజా చిత్రం ఓ కాదల్ కన్మణిని విడుదల చేయకుండా అడ్డుకోవాలని కోరారు.