సూర్య, కార్తీలకు డైమండ్‌ బ్రాస్‌లెట్స్‌ గిఫ్టిచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ | Viruman Distributor Sakthivelan Gifted Diamond Bracelet To Suriya, Karthi | Sakshi
Sakshi News home page

Viruman: భారీ సక్సెస్‌, డైరెక్టర్‌కు డైమండ్‌ రింగ్‌, సూర్య, కార్తీలకు డైమండ్‌ బ్రాస్‌లెట్స్‌

Published Wed, Aug 17 2022 8:44 PM | Last Updated on Wed, Aug 17 2022 8:59 PM

Viruman Distributor Sakthivelan Gifted Diamond Bracelet To Suriya, Karthi - Sakshi

కార్తీ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం విరుమన్‌. ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై హీరో సూర్య నిర్మించాడు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని, ఎస్‌.కె.సెల్వకుమార్‌ ఛాయాగ్రహణం అందించారు. గ్రామీణ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 12న రిలీజై ఘన విజయం సాధించింది.

సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో సంబరాలు జరుపుకుంటున్న డిస్ట్రిబ్యూటర్స్‌ చిత్రయూనిట్‌కు ఖరీదైన కానుకలు అందించారు. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్‌ శక్తివేలన్‌ అన్నదమ్ములు సూర్య, కార్తీలతో పాటు 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈవో, విరుమన్‌ సహనిర్మాత రాజశేఖర్‌ పాండియన్‌కు డైమండ్‌ బ్రాస్‌లేట్స్‌ బహుకరించాడు. అలాగే దర్శకుడు ముత్తయ్యకు వజ్రపు ఉంగరాన్ని కానుకగా ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

చదవండి: ప్రముఖ నటుడు నాజర్‌కు గాయాలు !
జబర్దస్త్‌ కమెడియన్‌ ఇంట తీవ్ర విషాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement