డైరెక్టర్‌ శంకర్‌ కూతురు, కార్తీల సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ | Karthi, Aditi Shankar Wraps Viruman Shooting | Sakshi
Sakshi News home page

Hero Karthi: అన్నయ్య సూర్యకు థ్యాంక్స్‌

Published Sun, Dec 26 2021 11:13 AM | Last Updated on Sun, Dec 26 2021 11:13 AM

Karthi, Aditi Shankar Wraps Viruman Shooting - Sakshi

తన అన్నయ్య సూర్యకు థ్యాంక్స్‌ చెప్పారు నటుడు కార్తీ. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'విరుమాన్‌'. ఈ సినిమా ద్వారా దర్శకుడు శంకర్‌ కూతురు అదితి శంకర్‌ కథానాయికగా పరిచయం అవుతున్నారు. దీన్ని సూర్య తన 2డీ ఎంటర్‌టెన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న విరుమాన్‌ చిత్రం అక్టోబర్‌ 20వ తేదీన మదురైలో ప్రారంభమైంది. 60 రోజులపాటు ఏకధాటిగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా నటుడు కార్తీ మాట్లాడుతూ... మధురై పరిసర ప్రాంతాల్లో మంచి ప్రణాళికతో దర్శకుడు ముత్తయ్య చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారని పేర్కొన్నారు. ఇందులో తనకు జంటగా నటించిన అదితి శంకర్‌కు మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. మరోమారు సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజాతో కలిసి ఈ చిత్రానికి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. తనతో ఈ చిత్రాన్ని నిర్మించిన అన్నయ్య సూర్యకు థాంక్స్‌ అని కార్తీ పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement