ఆత్మహత్యే శరణ్యం: వర్మ సినిమా బాధితుడు | Nagarjuna Officer Decides To End His Life | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యే శరణ్యం: ‘ఆఫీసర్‌’ డిస్ట్రిబ్యూటర్‌

Jun 5 2018 10:03 AM | Updated on Jul 15 2019 9:21 PM

Nagarjuna Officer Decides To End His Life - Sakshi

ఆఫీసర్‌ చిత్ర ఓపెనింగ్‌ సమయంలో నాగార్జున, రామ్‌ గోపాల్‌ వర్మ

కింగ్‌ నాగార్జున, వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ఆఫీసర్‌. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి షో నుంచే నెగెటివ్‌ టాక్‌ రావటంతో భారీ డిజాస్టర్‌ కావటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన చిత్ర పంపిణీదారుడు సుబ్రమణ్యం తనకు ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. ఇండియా టుడే కథనం మేరకు ఆఫీసర్‌ షూటింగ్ సమయంలో దర‍్శక నిర్మాత రామ్‌ గోపాల్ వర్మ, సుబ్రమణ్యం అనే వ్యక్తి నుంచి కోటీ ముప్పై లక్షల ఫైనాన్స్‌ తీసుకున్నారు.

సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత కూడా ఆ మొత్తాన్ని సుబ్రమణ్యానికి తిరిగి చెల్లించపోగా కోర్టుకు వెళ్లాలంటూ సూచించారు. కోర్టులో సమస్య తేలడానికి చాలా సమయం పడుతుందన్న ఉద్దేశంతో తనకు ఇవ్వాల్సిన డబ్బుకు బదులుగా ఆఫీసర్‌ చిత్రం గోదావరి రైట్స్‌ను ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే వర్మ మాత్రం కేవలం గోదావరి జిల్లాల రైట్స్‌ వరకు ఇచ్చే ఆలోచన లేదన్న వర్మ, ఆంధ్ర రైట్స్ మొత్తం తీసుకోవాల్సిందిగా సూచించారు.

తనకు మరో ఆప్షన్‌ లేని పరిస్థితుల్లో సుబ్రమణ్యం మూడున్నర కోట్లు చెల్లించి మొత్తం ఆంధ్ర రైట్స్ సొంతం చేసుకున్నారు. కానీ సినిమా రిలీజ్‌ అయిన తరువాత డిజాస్టర్‌ టాక్‌ రావటంతో మినిమమ్‌ కలెక్షన్లు కూడా రావటం లేదు. భారీ నష్టాలు తప్పేలా లేవు. నాగార్జున సినిమా కనుక మంచి లాభాలు వస్తాయని భావించిన తనకు ఇప్పుడు ఆత్మహత్యే శరణ‍్యం అంటున్నారు సుబ్రమణ్యం. మరి ఈ వివాదంపై నాగార్జున, రామ్‌ గోపాల్‌ వర్మలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement