
దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఆఫీసర్’ చిత్ర కథ తనదేనంటూ రచయిత జయకుమార్ తెలిపారు. సర్కార్3 సమయంలో జయకుమార్...వర్మతో కలిసి పని చేశారు. గతంలో ఇలాగే తన కథను కాపీ కొట్టారని జయకుమార్ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ‘ ఆఫీసర్’ కథ తనదే అంటూ, వర్మ కాపీ కొట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
జయకుమార్ తన ట్వీటర్ ఖాతాలో ‘నాగార్జున గారు.. మీరు సదరు డైరెక్టర్ గారికి బ్రేక్ ఇచ్చారు. కానీ ఆయన కొత్త వాళ్ల కెరీర్‌ను బ్రేక్ చేస్తున్నాడు. దయచేసి న్యాయం చేయండి’ అంటూ పోస్ట్ చేశారు. జయకుమార్ ఆఫీసర్ స్క్రిప్టును కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నాగార్జున గారు, @iamnagarjuna,
— P Jaya Kumar (@iampjayakumar) May 18, 2018
సదరు డైరెక్టర్ గారికి మీరు break ఇచ్చారు కానీ ఆయన కొత్త వాళ్ళ careers ని break చేస్తున్నాడు. దయచేసి న్యాయం చెయ్యండి.https://t.co/mAmLA0qZRo