ఆఫీసర్ సినిమాలో నాగ్.. పక్కన దర్శకుడు వర్మ
శివ రిలీజైన 28 ఏళ్లకు క్రేజీ కాంబో రామ్ గోపాల్ వర్మ-నాగార్జున అక్కినేని నుంచి మరో చిత్రం రాబోతోంది. అదే ఆఫీసర్. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికీ డల్ ప్రమోషన్ల మూలంగా సినిమాపై బజ్ నెలకొనలేదు. పైగా అదే రోజు వేరే చిత్రాలు కూడా పోటీగా రిలీజ్ కాబోతున్నాయి. అందుకే ప్రమోషన్లకు వేగవంతం చేసే పనిలో పడ్డారు నిర్మాత కమ్ దర్శకుడు వర్మ. నాగ్ అభిమానులకు ఆహ్వానం పంపుతూ మే 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. మే 28న సాయంత్రం 7 గంటలకు ఎన్ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం ఉంటుందని, నాగ్ అభిమానులంతా ఆహ్వానితులేనని వర్మ ప్రకటించారు. నాగార్జున సరసన మైరా సరీన్ నటిస్తుండగా, బేజీ కావ్యా, ఫిరోజ్ అబ్బాసీ, షాయాజీ షిండే, అజయ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. జూన్ 1న ఆఫీసర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
We are having a pre release event of #Officer on 28th May 7 pm at N convention ..I invite all @iamnagarjuna ‘s fans to please come and take part in this celebration
— Ram Gopal Varma (@RGVzoomin) 24 May 2018
Film is releasing June 1st pic.twitter.com/HDBB46qf5l
Comments
Please login to add a commentAdd a comment