officer movie
-
ఆత్మహత్యే శరణ్యం: వర్మ సినిమా బాధితుడు
కింగ్ నాగార్జున, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఆఫీసర్. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి షో నుంచే నెగెటివ్ టాక్ రావటంతో భారీ డిజాస్టర్ కావటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన చిత్ర పంపిణీదారుడు సుబ్రమణ్యం తనకు ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. ఇండియా టుడే కథనం మేరకు ఆఫీసర్ షూటింగ్ సమయంలో దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ, సుబ్రమణ్యం అనే వ్యక్తి నుంచి కోటీ ముప్పై లక్షల ఫైనాన్స్ తీసుకున్నారు. సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత కూడా ఆ మొత్తాన్ని సుబ్రమణ్యానికి తిరిగి చెల్లించపోగా కోర్టుకు వెళ్లాలంటూ సూచించారు. కోర్టులో సమస్య తేలడానికి చాలా సమయం పడుతుందన్న ఉద్దేశంతో తనకు ఇవ్వాల్సిన డబ్బుకు బదులుగా ఆఫీసర్ చిత్రం గోదావరి రైట్స్‌ను ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే వర్మ మాత్రం కేవలం గోదావరి జిల్లాల రైట్స్ వరకు ఇచ్చే ఆలోచన లేదన్న వర్మ, ఆంధ్ర రైట్స్ మొత్తం తీసుకోవాల్సిందిగా సూచించారు. తనకు మరో ఆప్షన్ లేని పరిస్థితుల్లో సుబ్రమణ్యం మూడున్నర కోట్లు చెల్లించి మొత్తం ఆంధ్ర రైట్స్ సొంతం చేసుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తరువాత డిజాస్టర్ టాక్ రావటంతో మినిమమ్ కలెక్షన్లు కూడా రావటం లేదు. భారీ నష్టాలు తప్పేలా లేవు. నాగార్జున సినిమా కనుక మంచి లాభాలు వస్తాయని భావించిన తనకు ఇప్పుడు ఆత్మహత్యే శరణ్యం అంటున్నారు సుబ్రమణ్యం. మరి ఈ వివాదంపై నాగార్జున, రామ్ గోపాల్ వర్మలు ఎలా స్పందిస్తారో చూడాలి. -
‘ఆఫీసర్’ మూవీ రివ్యూ
చిత్రం: ఆఫీసర్ జోనర్: యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు: నాగార్జున అక్కినేని, మైరా సరీన్, బేబీ కావ్యా, ఫెరోజ్ అబ్బాసీ, అజయ్ తదితరులు సంగీతం: రవి శంకర్ బ్యానర్: ఆర్ కంపెనీ ప్రొడక్షన్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: రామ్ గోపాల్ వర్మ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, కింగ్ నాగార్జున దాదాపు పాతికేళ్ల తర్వాత మళ్లీ చేతులు కలిపారు. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కిన చిత్రమే ఆఫీసర్. కర్ణాటకకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ప్రసన్న జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వర్మ చెప్పుకొచ్చాడు. మరి వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ఈ కాప్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను మెప్పించగలిగిందా? వరుస పరాజయాలతో ఉన్న వర్మకు ఊరట లభించిందా? రివ్యూలోకి వెళ్లి చూద్దాం. కథ: నారాయణ్ పసారి(ఫెరోజ్ అబ్బాసీ) ముంబైలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. వరుస ఎన్కౌంటర్లతో ముంబైలో మాఫియా అనేది లేకుండా చేస్తుంటాడు. దీంతో ప్రజల్లో అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అయితే అదే సమయంలో నారాయణ ఓ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో చిక్కుకుంటాడు. ఈ కేసును దర్యాప్తు చేపట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన అధికారి శివాజీ రావు(నాగార్జున అక్కినేని) నేతృత్వంలో ఓ కమిటీని అధికారులు నియమిస్తారు. విచారణలో పసారికి అండర్ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నట్లు తేలుతుంది. దీంతో పసారిని అరెస్ట్ చేసి కోర్టు బోనులో నిలబెడతాడు శివాజీ. అయితే తన నెట్‌వర్క్‌ను ఉపయోగించి పసారి నిర్దోషిగా బయటపడతాడు. కేసు ఓడిపోవటం ఇష్టం లేని శివాజీ ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు ట్రాన్స్ఫర్ చేయించుకుని అక్కడే ఉండిపోతాడు. తనని అరెస్ట్ చేయించాడన్న పగతో పసారి.. శివాజీపై పగబడతాడు. అక్కడి నుంచి వీరిద్దరి మధ్య వార్ మొదలౌతుంది. తర్వాత జరిగే పరిణామాలు, మధ్యలో ఓ ట్విస్ట్, చివరకు యుద్ధంలో గెలుపు ఎవరిది? అన్నదే ఆఫీసర్ చిత్ర కథ. నటీనటులు: సీరియస్ పోలీసాఫీసర్ పాత్రలో నాగార్జున మెప్పించాడు. థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన ఇంటెన్సిటీని తన నటనలో చూపించాడు. ఈ వయసులో కూడా ఫిట్‌గా కనిపించాడు. శివాజీ పాత్రకు తన వంతు న్యాయం చేశాడు. ఇక హీరోయిన్ సైరా మరీన్‌ది చిన్న పాత్రే. నటనపరంగా ఫర్వాలేదనిపించింది. నెగటివ్ రోల్‌తో ఫెరోజ్ అబ్బాసీ మెప్పించాడు. అవినీతి అధికారిగా పసారీ పాత్రలో ఆకట్టుకున్నాడు. బేబీ కావ్య నటన బావుంది. అజయ్ తప్ప మిగతా పాత్రలన్నీ తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియనివే. విశ్లేషణ: ముందుగా ఈ కాంబోలో సినిమా అనౌన్స్ చేసినప్పుడు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆ అంచనాలపై ఒకరకమైన అనుమానాలు మొదలయ్యాయి. అయితే చాలా కాలం తర్వాత వర్మ చేసిన సీరియస్ ప్రయత్నమే ఆఫీసర్. గత చిత్రాలతో పోలిస్తే బెటర్‌గా అనిపిస్తుంది. సాధారణంగా పోలీస్-మాఫియా కథనాలతో సినిమాలు తీసే వర్మ.. తన వరకు డిపార్ట్మెంట్లో అధికారుల మధ్య ఘర్షణ, విచారణలాంటి కొత్త పాయింట్‌తో కథను రూపొందించుకున్నాడు. నాగార్జున-విలన్ పాత్రలను తీర్చి దిద్దిన తీరు, ఫస్టాఫ్‌లో డిఫరెంట్ స్టోరీ లైన్ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. కానీ, సెకండాఫ్‌లో వర్మ ఆ అంచనాలను కొనసాగించలేకపోయాడు. నెమ్మదిగా సాగే కథనం, పాటలు ప్రేక్షకులకు చికాకు పుట్టిస్తాయి. పోలీసాఫీసర్ అయిన విలన్.. మాఫియాతో చేతులు కలిపి హీరోపై పగ తీర్చుకోవాలని చేసే యత్నాలు సిల్లీగా అనిపిస్తాయి. మిగతా పాత్రలను కూడా దర్శకుడు చాలా బలహీనంగా తీర్చి దిద్దాడు. డైలాగులు కూడా మెప్పించలేకపోయాయి. సెకండ్ హాఫ్‌లో కథ మరీ నెమ్మదిగా సాగటం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. క్లైమాక్స్‌లో మాత్రం హీరోయిజం బాగుంది. సాంగ్స్‌తో మ్యూజిక్ డైరెక్టర్ రవి శంకర్ నిరాశపరచగా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో బిస్వాస్ ఆకట్టుకున్నాడు. చాలా సందర్భాల్లో సౌండ్ థ్రిల్ చేస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ ప్రయోగంలో వర్మను అభినందించొచ్చు. పాత్రల ఎంపిక, కెమెరా పనితనంలో ఆర్జీవీ మార్క్ కనిపిస్తుంది. అయితే పాత్రలు పరిచయం లేనివి కావటంతో ఒకానోక టైంలో డబ్బింగ్ సినిమా చూస్తున్నామా? అన్న ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు ఆకట్టుకునేలా లేవు. తాను అనుకున్న కథను సిన్సియర్‌గా తెరకెక్కించిన వర్మ.. థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన వేగాన్ని మాత్రం అందించలేకపోయాడు. లాజిక్‌లు మాట్లాడే వర్మ.. కొన్ని సన్నివేశాల్లో ఇంటలిజెన్సీకి అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా ఆలోచన చేయలేకపోయాడు. గంట 55 నిమిషాల నిడివిలో సినిమాటిక్ అనుభూతిని అందించలేకపోవటం గమనార్హం. పూర్తిస్థాయిలో సీరియస్‌గా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరించటం అనుమానమే. మొత్తానికి నాగ్ ఇచ్చిన అవకాశాన్ని దర్శకుడు వర్మ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేదనే చెప్పొచ్చు. ఫ్లస్ పాయింట్లు: హీరో-విలన్ పాత్రలు డిఫరెంట్ స్టోరీ లైన్ మైనస్ పాయింట్లు: క్యారెక్టర్లను బలంగా తీర్చిదిద్దలేకపోవటం ప్రొడక్షన్ విలువలు సెకండాఫ్‌లో నారేషన్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
‘ఆఫీసర్’ గన్ సౌండ్...?
సాక్షి, హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ఆఫీసర్. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నాగార్జున, రామ్‌గోపాల్ వర్మ ఇన్నేళ్ల తరువాత కలిసి సినిమా చేయడమే దానికి కారణం. ప్రస్తుతం ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు ఆర్జీవీ ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన పాటలు, ట్రైలర్లు విడుదల చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆర్జీవీ తన ట్విటర్ ఖాతా ద్వారా ఆఫీసర్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ‘గన్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ సౌండ్’ అంటూ విడుదల చేసిన ఈ వీడియోలో వర్మ మార్క్ స్పష్టంగా కనుబడుతోంది. మరి సినిమా విడుదలయ్యే వరకు వర్మ ఇంకేం చేస్తారో చూడాలి. ఈ నెల 28న జరిగే ఆఫీసర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డైరెక్టర్ సుకుమార్ ప్రత్యేక అతిథిగా రాబోతున్న విషయం తెలిసిందే. జూన్ 1న ‘ఆఫీసర్’ థియేటర్లో సందడి చేయనుంది. -
నాగ్ ఫ్యాన్స్‌కు వర్మ ఆహ్వానం
శివ రిలీజైన 28 ఏళ్లకు క్రేజీ కాంబో రామ్ గోపాల్ వర్మ-నాగార్జున అక్కినేని నుంచి మరో చిత్రం రాబోతోంది. అదే ఆఫీసర్. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికీ డల్ ప్రమోషన్ల మూలంగా సినిమాపై బజ్ నెలకొనలేదు. పైగా అదే రోజు వేరే చిత్రాలు కూడా పోటీగా రిలీజ్ కాబోతున్నాయి. అందుకే ప్రమోషన్లకు వేగవంతం చేసే పనిలో పడ్డారు నిర్మాత కమ్ దర్శకుడు వర్మ. నాగ్ అభిమానులకు ఆహ్వానం పంపుతూ మే 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. మే 28న సాయంత్రం 7 గంటలకు ఎన్ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం ఉంటుందని, నాగ్ అభిమానులంతా ఆహ్వానితులేనని వర్మ ప్రకటించారు. నాగార్జున సరసన మైరా సరీన్ నటిస్తుండగా, బేజీ కావ్యా, ఫిరోజ్ అబ్బాసీ, షాయాజీ షిండే, అజయ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. జూన్ 1న ఆఫీసర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. We are having a pre release event of #Officer on 28th May 7 pm at N convention ..I invite all @iamnagarjuna ‘s fans to please come and take part in this celebration Film is releasing June 1st pic.twitter.com/HDBB46qf5l — Ram Gopal Varma (@RGVzoomin) 24 May 2018 -
ఆఫీసర్ ‘నవ్వే నువ్వు నవ్వకపోతే’ తొలి పాట విడుదల
-
నా కెరీర్లోనే ఫస్ట్ టైమ్...: వర్మ
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నాగార్జున అక్కినేని కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆఫీసర్. ఈ చిత్రం నుంచి తొలి పాటను కాసేపటి క్రితం దర్శకుడు వర్మ ట్విటర్లో రిలీజ్ చేశారు. తన కెరీర్లోనే తొలిసారిగా ఓ చిన్నపాపపై తాను పాటను రూపొందించానని ఆయన చెబుతున్నారు. ‘నవ్వే నువ్వు నవ్వకపోతే.. అంటూ సాగే సాంగ్‌కు రమ్య బెహరా గాత్రం అందించారు. తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ ఆధారంగా సాగే ఈ పాటను సిరాశ్రీ రచించారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన వర్మకు సిరాశ్రీ థాంక్స్ చెప్పగా, తనదైన స్టైల్లో వర్మ రిప్లై కూడా ఇచ్చాడు. ఈ చిత్రానికి రవి శంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నాగార్జున, మైరా సరీన్, అజయ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఆఫీసర్ జూన్ 1న విడుదల కానుంది. -
‘నాగార్జున గారు న్యాయం చేయండి’
దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఆఫీసర్’ చిత్ర కథ తనదేనంటూ రచయిత జయకుమార్ తెలిపారు. సర్కార్3 సమయంలో జయకుమార్...వర్మతో కలిసి పని చేశారు. గతంలో ఇలాగే తన కథను కాపీ కొట్టారని జయకుమార్ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ‘ ఆఫీసర్’ కథ తనదే అంటూ, వర్మ కాపీ కొట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. జయకుమార్ తన ట్వీటర్ ఖాతాలో ‘నాగార్జున గారు.. మీరు సదరు డైరెక్టర్ గారికి బ్రేక్ ఇచ్చారు. కానీ ఆయన కొత్త వాళ్ల కెరీర్‌ను బ్రేక్ చేస్తున్నాడు. దయచేసి న్యాయం చేయండి’ అంటూ పోస్ట్ చేశారు. జయకుమార్ ఆఫీసర్ స్క్రిప్టును కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాగార్జున గారు, @iamnagarjuna, సదరు డైరెక్టర్ గారికి మీరు break ఇచ్చారు కానీ ఆయన కొత్త వాళ్ళ careers ని break చేస్తున్నాడు. దయచేసి న్యాయం చెయ్యండి.https://t.co/mAmLA0qZRo — P Jaya Kumar (@iampjayakumar) May 18, 2018 -
పవన్ ఫ్యాన్స్‌కు వార్నింగ్.. మళ్లీ కెలికాడు!
హైదరాబాద్: నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్లబాణాలు వదిలారు. అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన ‘ఆఫీసర్’సినిమా టీజర్‌కు డిస్‌లైక్స్ భారీగా రావడంపై వర్మ గడిచిన కొద్ది గంటలుగా వరుస ట్వీట్లు చేశారు. ఇంకా ఇంకా డిస్‌లైక్స్ కొట్టి పవన్ ఫ్యాన్స్ తమ సత్తా చూపించాలని, ఓ అభిమానిగా.. నాగార్జున, ఆఫీసర్ల తరఫున ఈ మేరకు పవన్ ఫ్యాన్స్‌కు, జనసేనకు వార్నింగ్ ఇస్తున్నట్లు వర్మ రాసుకొచ్చారు. ‘‘11 కోట్ల మంది తెలుగు ప్రజల్లో పవన్ అభిమానుల సంఖ్య 11 వేలేనా? ఓ అభిమానిగా నేనే షాకవుతున్నా. మా సినిమా టీజర్‌ను ఇంకా వేలమంది డిస్లైక్ చేసి.. అభిమానుల సంఖ్య ఇంత తక్కువ కాదని నిరూపించాలి. ఇది.. నాగార్జున-ఆఫీసర్ తరఫున పీకే ఫ్యాన్స్‌కు నా వార్నింగ్. జనసేన పార్టీ కూడా ఈ (11 వేల మందే అన్న) విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. లేకుంటే ఇదీ ప్రజారాజ్యం పార్టీలా డిజాస్టర్ అవుతుంది’’ అని వర్మ పేర్కొన్నారు. నాగార్జున-వర్మ కాంబినేషన్లో రూపొందిన ‘ఆఫీసర్’ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన రెండో టీజర్‌కు లైక్స్‌తో సమానంగా డిస్‌లైక్స్ రావడం గమనార్హం. కూడబలుక్కొనిమరీ పవన్ ఫ్యాన్స్ డిస్‌లైక్స్ కొడుతున్నారన్న వర్మ.. ఆమేరకు కొందరి పోస్టులను ఉటంకించారు. శ్రీరెడ్డి ఉదంతం, అనంతర పరిణామాల్లో పవన్.. ఘాటు హెచ్చరికలు, వరుస ట్వీట్ల తర్వాత గడిచిన కొద్దిరోజులుగా కవ్వింపు చర్యలేవీలేవు. వర్మ ట్వీట్లపై పవన్‌గానీ, జనసేనగానీ ఇప్పటిదాకా స్పందిచలేదు. As a fan,I am shocked and feel sad for @Pawankalyan that he has only 11 k fans ..That’s because @Iamnagarjuna ‘s #Officer teaser 2 has only 11 k dislikes 🙄😢🙄https://t.co/iXLjMzRTQh — Ram Gopal Varma (@RGVzoomin) 7 May 2018 . @iamnagarjuna ‘s #Officer ‘s warning to @PawanKalyan ‘s fans is to put more dislikes on #Officer .. As fans of Pk we request @janasenaparty to take this seriously as it might make the voters feel in nearly 11 crore people he has only 11 thousand fans https://t.co/iXLjMzRTQh pic.twitter.com/PYoaL2iKIy — Ram Gopal Varma (@RGVzoomin) 7 May 2018 If @PawanKalyan has only 11 thousand followers in a population of nearly 11 crores, #JanasenaParty should take serious steps for their party not to become a bigger disaster then #Prajarajyam ..I and @iamnagarjuna ‘s #Officer demand that as fans of P K pic.twitter.com/Cg78hc7cN7 — Ram Gopal Varma (@RGVzoomin) 7 May 2018 If @PawanKalyan has only 11 thousand followers in a population of nearly 11 crores, #JanasenaParty should take serious steps for their party not to become a bigger disaster then #Prajarajyam ..I and @iamnagarjuna ‘s #Officer demand this as P k fans https://t.co/Sctv90kgFu — Ram Gopal Varma (@RGVzoomin) 7 May 2018