‘ఆఫీసర్‌’ గన్‌ సౌండ్‌...? | Gun Experience OFFICER Sound Released By Ram Gopal Varma | Sakshi
Sakshi News home page

Published Sat, May 26 2018 5:58 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Gun Experience OFFICER Sound Released By Ram Gopal Varma - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ఆఫీసర్‌. కింగ్‌ నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నాగార్జున, రామ్‌గోపాల్‌ వర్మ ఇన్నేళ్ల తరువాత కలిసి సినిమా చేయడమే దానికి కారణం. ప్రస్తుతం ఈ సినిమాపై బజ్‌ క్రియేట్‌ చేసేందుకు ఆర్జీవీ ప్రమోషన్‌ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

సినిమాకు సంబంధించిన పాటలు, ట్రైలర్‌లు విడుదల చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆర్జీవీ తన ట్విటర్‌ ఖాతా ద్వారా ఆఫీసర్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్‌ చేశారు. ‘గన్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఆఫీసర్‌ సౌండ్‌’ అంటూ విడుదల చేసిన ఈ వీడియోలో వర్మ మార్క్‌ స్పష్టంగా కనుబడుతోంది. మరి సినిమా విడుదలయ్యే వరకు వర్మ ఇంకేం చేస్తారో చూడాలి.  ఈ నెల 28న జరిగే ఆఫీసర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు డైరెక్టర్‌ సుకుమార్‌ ప్రత్యేక అతిథిగా రాబోతున్న విషయం తెలిసిందే. జూన్‌ 1న ‘ఆఫీసర్‌’ థియేటర్‌లో సందడి చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement