సెన్సార్ బోర్డు సంస్కరణకు కమిటీ
శ్యామ్ బెనగల్ సారథ్యం
న్యూఢిల్లీ: కొద్ది కాలంగా విమర్శల పాలవుతున్న సెన్సార్ బోర్డును సంస్కరించేందుకు ప్రసిద్ధ సినిమా దర్శకుడు శ్యామ్ బెనగల్ నేతృత్వంలో ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా, సినీ విమర్శకురాలు భావన సోమయ, నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కౌన్సెల్ ఎండీ నైనా లత్ గుప్తా, సంయుక్త కార్యదర్శి(సినిమాలు) సంజయ్ మూర్తి, ప్రకటనా రంగంలో పనిచేసే పియూష్ పాండే కమిటీలో సభ్యులుగా ఉంటారు. కమిటీ పలు సూచనలతో రెండు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని ప్రభుత్వం తెలిపింది.
జేమ్స్ బాండ్ సిరీస్‌లో తాజా చిత్రం ‘స్పెక్టర్’లో పలు సీన్లను సెన్సార్‌లో తొలగించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే.