ఖయల్ రెగ్యులర్ చిత్రం కాదు | is not a Khayal regular film | Sakshi
Sakshi News home page

ఖయల్ రెగ్యులర్ చిత్రం కాదు

Published Sat, Jun 21 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

ఖయల్ రెగ్యులర్ చిత్రం కాదు

ఖయల్ రెగ్యులర్ చిత్రం కాదు

ఖయల్  రెగ్యులర్ కథా చిత్రం కాదంటున్నారు ఆ చిత్రదర్శకుడు ప్రభు సాలమన్. మైనా సృష్టికర్త అయిన ఈయన తదుపరి ప్రయోగాత్మక చిత్రం ఖయల్. ఈ చిత్రాన్ని ఈయన ఒక తపస్సులా చేస్తున్నారనవచ్చు. ఆ చిత్ర ఆవిష్కరణ గురించి చిన్న భేటీ...
 
ప్ర: కుంకీ వంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత ఖయల్ చిత్ర రూపకల్పనకు చాలా సమయం తీసుకున్నట్లున్నారే?
 జ:
మంచి చిత్రం చెయ్యాలంటే ఈ గ్యాప్ అవసరమే. మైనా చిత్రం తరువాత కుంకీ చిత్రానికి కొంత సమయం తీసుకున్నాను. ఎలాంటి కథను తయారు చేసుకోవాలన్న ఆలోచనకు అమాతం విరామం అవసరమైంది. మైనా చిత్ర ఆలోచనను పూర్తిగా మనసు నుంచి తుడిచేసి కుంకీ కథ సిద్ధం చేసుకోవడానికి ఆరు నెలలు పట్టింది. అలా మైనా, కుంకీ చిత్రాల విజయాలు నన్ను మరింత ఆలోచింపజేశారుు. గత విజయాలను కాపాడుకొంటూ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా వారిని సంతృప్తి పరిచేలా చిత్రం చేయాలంటే నూరు శాతం శ్రమించాల్సి ఉంటుంది. ఇందుకు తగిన సమయం అవసరం అవుతుంది.
 
ప్ర: ఖయల్ చిత్ర కథేంటి?
 జ:
ఇందులో ప్రేమ ఉంటుందని, ఉండదని చెప్పలేను. మొత్త మీద ఖయల్ రెగ్యులర్ చిత్రంలా మాత్రం ఉండ దు. ప్రేక్షకుల దశాబ్దం కాలంగా సాధారణ చిత్రాలను మరచిపోయారు. ప్రస్తుతం సినిమా వేరే దిశలో పయనిస్తోంది. మనకు సునామీ వచ్చి పదేళ్లరుుంది. అలాం టి సునామీ నేపథ్యంగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం ఖయల్. 56 ట్రాక్ సంగీతం చిత్రానికి పది రెట్లు బలాన్ని పెంచుతుంది.
 ప్ర: మైనా, కుంకీ, ఖయల్, తదుపరి ఎలాంటి కథాం శంతో కూడిన చిత్రాన్ని మీ నుంచి ఆశించవచ్చు?
 జ
: సింహం బ్యాగ్‌డ్రాప్‌లో ఒక చిత్రం చేయాలనే ఆలోచన ఉంది.
 
ప్ర: ఖయల్ చిత్రం హీరో, హీరోయిన్ల గురించి?
 జ:
యుక్త వయసు కొచ్చిన యువతి పాత్ర కోసం చాలా మందిని ఆడిషన్ వేశాం. అయినా సంతృప్తి కలగలేదు. చివరిగా వచ్చిన నటి ఆనంది. ఆమె ముఖంలో కనిపించే చైల్డిష్ రూపం నా కథలోని హీరోయిన్ పాత్రకు కచ్చితంగా సరిపోతుందనిపించింది.  అదేవిధంగా నటుడు చంద్రన్ హీరో పాత్రకు చక్కగా సరిపోయూరు.
 
ప్ర: ప్రముఖ హీరోయిన్లు సెట్ అవ్వరా?
 జ:
ప్రముఖ హీరోయిన్లను నా సమయానికి తగ్గట్టుగా ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. వారికి వరుసగా చిత్రాలుంటాయి. వాటికి ఆటంకం కల్పిం చడం నా అభిమతం కాదు. నిజంగా స్టార్ హీరోయిన్స్ నా కథకు అవసరమైతే అప్పుడు వారితోనే చిత్రం చేస్తా.
 ప్ర: ఖయల్ చిత్రం విడుదల ఎప్పుడు?
 జ:
ఆగస్ట్‌లో ఎదురు చూడవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement