తెలంగాణ దర్శకుల సంఘం ప్రారంభం
‘‘చిత్రపరిశ్రమలో తెలంగాణ కళాకారులు వివక్ష ఎదుర్కొంటున్నారు. దాన్ని ప్రశ్నిస్తూనే తెలంగాణ సంస్కృతిని నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలన్నదే మా ఆకాంక్ష. ఎలాగూ తెలంగాణ రాష్ర్టం ఏర్పడబోతోంది కాబట్టి ఈ సంఘం ఏర్పాటు చేశాం’’ అన్నారు ప్రేమ్‌రాజ్. అల్లాణి శ్రీధర్ అధ్యక్షుడిగా శనివారం తెలంగాణ దర్శకుల సంఘం ఏర్పాటైంది. ప్రేమ్‌రాజ్ ఉపాధ్యక్షుడు. ఈ సంఘం ఏర్పాటు గురించి ప్రేమ్‌రాజ్ మరిన్ని విషయాలు చెబుతూ -‘‘విజయవాడకు చెందిన ఓ వ్యక్తి తెలంగాణ కళా దర్శకుల సంఘం ప్రారంభించి, డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికొచ్చింది. అందుకే అధికారికంగా ఈ తెలంగాణ దర్శకుల సంఘాన్ని ఏర్పాటు చేశాం’’ అన్నారు. ప్రస్తుతం ఉన్న దర్శకుల సంఘానికి ఈ సంఘాన్ని పోటీగా భావించడంలేదని జితేందర్ చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, రవీందర్, చంద్రకాంత్‌రెడ్డి, శ్రీధర్ బీచ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.