‘అభినందన’ దర్శకుడు కన్నుమూత | abhinandana director dies | Sakshi
Sakshi News home page

‘అభినందన’ దర్శకుడు కన్నుమూత

Oct 23 2014 2:47 AM | Updated on Oct 2 2018 2:54 PM

‘అభినందన’ దర్శకుడు కన్నుమూత - Sakshi

‘అభినందన’ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ సినిమాటోగ్రాఫర్, సినీ దర్శకుడు అశోక్‌కుమార్ (70) మంగళవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు.

చెన్నై: ప్రముఖ సినిమాటోగ్రాఫర్, సినీ దర్శకుడు అశోక్‌కుమార్ (70) మంగళవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆరునెలలుగా హైదరాబాద్, చెన్నైలోని అనేక ఆస్పత్రులలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయినా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. చివరి క్షణాలు స్వగృహంలోని కుటుంబ సభ్యుల మధ్య గడపాలన్న ఆయన కోరిక మేరకు రెండు రోజుల క్రితం ఇంటికి తీసుకువచ్చారు. మంగళవారం రాత్రి 11.30కు ఆయన కన్నుమూశారు.

అశోక్‌కుమార్‌కు భార్య జ్యోతి, నలుగురు కుమారులు ఉన్నారు. బుధవారం సాయంత్రం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. 1944లో అలహాబాద్‌లో జన్మించిన అశోక్‌కుమార్ 1969లో జన్మభూమి అనే మలయాళ చిత్రానికి కెమెరామన్‌గా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో 125 సినిమాలకు పనిచేశారు. తెలుగులో అభినందన, నీరాజనం, సాయి మహిమలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అభినందన చిత్రానికి దర్శకునిగా నంది అవార్డును, తమిళ  చిత్రం నెంజెత్తై కిళ్లాదే చిత్రానికి కెమెరామెన్‌గా జాతీయ అవార్డును అందుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement