కోర్టుకు హాజరైన దర్శకుడు జితేంద్ర | The director Jitendra attended to court | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన దర్శకుడు జితేంద్ర

Published Tue, Jul 1 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

కోర్టుకు హాజరైన దర్శకుడు జితేంద్ర

కోర్టుకు హాజరైన దర్శకుడు జితేంద్ర

ఎమ్మిగనూరు టౌన్: ‘యమహో యమ’ చిత్ర దర్శకుడు జితేంద్ర సోమవారం ఎమ్మిగనూరు కోర్టుకు హాజరయ్యారు. చిత్రం వాల్‌పోస్టర్‌లో హీరోయిన్ పార్వతి మిల్టన్ పొట్టి దుస్తులతో అశ్లీలంగా కనిపించడంపై ఎమ్మిగనూరుకు చెందిన మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్రప్రసాద్ గత ఏడాది చిత్ర దర్శకుడు జితేంద్ర, నిర్మాత విజయకుమార్‌గౌడ్, సమర్పకుడు సాధక్‌కుమార్, హీరోయిన్ పార్వతిమిల్టన్‌లపై స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్‌ఐ చంద్రబాబునాయుడు వీరందరిపై కేసు(క్రైమ్‌నెంబర్ 41/13) నమోదు చేశారు. కేసుకు సంబంధించి వాయిదా ఉండటంతో వీరంతా సోమవారం కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను జూనియర్ సివిల్ జడ్జి రవిశంకర్ ఆగస్ట్ 20వ తేదీకి వాయిదా వేశారు.
 
 ఆగస్టులో సెట్స్‌పైకి కొత్త చిత్రం
వచ్చే ఆగస్టు నెలలో కొత్త చిత్రం సెట్స్‌పైకి తీసుకురానున్నట్లు దర్శకుడు జితేంద్ర తెలిపారు. కోర్టు వాయిదా నిమిత్తం ఎమ్మిగనూరుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం తెరకెక్కుతుందన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు చెప్పారు. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement