తిరువొత్తియూరు: పెరంబలూరు వద్ద కంటైనర్ లారీ పక్కన వస్తున్న కారుపై పడడంతో సినిమా డెరైక్టర్ సహా ముగ్గురు మృతి చెందారు. చెన్నై విరుగంబాక్కంకు చెందిన కన్నా (45). సినిమా డెరైక్టర్ అయిన ఇతను నెజంతొట్టు సొల్లు తదితర చిత్రాలకు దర్శకత్వం చేస్తున్నాడు. ఇతను తన మిత్రుడు విరుగంబాక్కంకు చెందిన విజయకుమార్ (50)తో కలిసి రామనాథపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో కలుసుకుని తిరిగి శుక్రవారం రాత్రి చెన్నైకి కారులో బయలుదేరారు.
కారును సురేష్ అనే యువకుడు నడుపుతున్నాడు. పెరంబలూరు తిరుమంతురై టోల్‌గేట్ వద్ద కారు వస్తుండగా ఆ సమయంలో వేగంగా వస్తున్న కంటైనర్ లారీ టైర్ పేలిపోవడంతో అదుపు తప్పి కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న సినీ ైడె రెక్టర్ సహా ముగ్గురు మృతి చెందారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న మంగళమేడు పోలీసులు సంఘటన స్థలం చేరుకుని మృతి చెందిన ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ కడలూరుకు చెందిన కార్తికేయన్‌ను అరెస్టు చేశారు.
రోడ్డు ప్రమాదంలో సినీ డెరైక్టర్
Published Sun, May 24 2015 2:32 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement