kanna
-
భూకబ్జా కేసులో కన్నారావు అరెస్టు
ఇబ్రహీంపట్నం రూరల్: భూకబ్జా వవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమారుడు తేజేశ్వర్రావు అలియాస్ కన్నారావును మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీసులు అరెస్టు చేశారు. మన్నెగూడలో రెండు ఎకరాల స్థలం సెటిల్మెంట్ వ్యవహారంలో మార్చి 3న కన్నారావుపై ఆదిబట్ల పోలీసులు కేసు (క్రైం నంబరు 123/2024) నమోదు చేశారు. మన్నెగూడకు చెందిన జక్కిడి సురేందర్‌రెడ్డి అవసరం నిమిత్తం చావ సురేష్ వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడు. ఇందుకోసం తన భూమిని ఏజీపీఏ చేశాడు. చావ సురేష్ సేల్‌డీడ్ చేసుకొని ఓఎస్ఆర్ కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఎలాగైనా భూమిని చావ సురేష్ కు దక్కకుండా చూడాలని జక్కిడి సురేందర్‌రెడ్డి అతని బంధువుల ద్వారా కన్నారావును ఆశ్రయించాడు. దీంతో రూ. 3 కోట్లు ఇస్తే సెటిల్ చేస్తానని కన్నారావు చెప్పడంతో రూ. 2.30 కోట్లను సురేందర్‌రెడ్డి కన్నారావుకు ఇచ్చాడు. రోజులు గడిచినా ఆయన ఎలాంటి పని చేయకపోవడం, ఓఎస్ఆర్ కంపెనీ యాజమాన్యం స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టి హద్దులు పెట్టుకోవడంతో ఇదేమిటని సురేందర్‌రెడ్డి కన్నారావును ప్రశ్నించాడు. దీంతో మార్చి 3న కన్నారావు మనుషులు వచ్చి ఆ భూమిని కబ్జా చేసి అందులోని సామగ్రి ధ్వంసం చేశారు. దీనిపై అదే రోజు ఆదిబట్ల పోలీసులకు ఓఎస్ఆర్ కంపెనీ యజమాని ఫిర్యాదు చేయడంతో కన్నారావుతోపాటు 38 మందిపై కేసులు నమోదయ్యాయి. వారిలో పది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌కు ప్రయత్నిస్తూ పట్టుబడి.. తనపై కేసు నమోదైనప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా బెంగళూరు, ఢిల్లీలో తలదాచుకున్న కన్నారావు.. తనపై కేసును తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను కోర్టు కోట్టేయడంతో బెయిల్ కోసం మరో పిటిషన్ వేశాడు. దాన్ని కూడా న్యాయస్థానం కొట్టేయడంతో హైదరాబాద్ మాదాపూర్‌లోని తన అడ్వకేట్‌ను కలవడానికి కన్నారావు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సోమవారం రాత్రి 12:30 గంటలకు బాలాపూర్‌లో ఆదిబట్ల పోలీసులకు కన్నారావు పట్టుబడ్డాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఆయన ఏ3గా ఉన్నాడు. కన్నారావుపై 307, 436, 447, 427, 148 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం ఇబ్రహీంపట్నం కోర్టుకు తరలించగా న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. నేనే ఫోన్ చేసి లొంగిపోయా: కన్నారావు ఇది ఒక భూ వివాద సమస్య. ఇందులో కొద్దిగా నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. ఈ సెక్షన్లకు ముందస్తు బెయిల్ లభించనందున ఆదిబట్ల ఎస్సై రాజు, సీఐ రాఘవేందర్‌రెడ్డికి ఫోన్ చేసి ఫలానా చోట ఉన్నానని చెప్పి సరెండర్ అయ్యాను. నాకు కచ్చితంగా బెయిల్ వస్తుంది. ఈ కేసును సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. -
చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్!
బిగ్ బాస్ 4 ఫేం మోనాల్ గజ్జర్ ఒకప్పుడు ఎవరికి తెలియదు. హీరోయిన్గా ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఒక్కసారిగా బిగ్‌బాస్ షోతో వచ్చేసింది. ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్గా బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన ఈ గుజరాతి భామ ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతోంది. దీనికి అభిజిత్, అఖిల్ సార్థక్‌తో ఒకేసారి లవ్ ట్రాక్ నడపడమే. అలా 98 రోజుల పాటు హౌజ్‌లో కొనసాగిన మోనాల్‌పై విమర్శలు వచ్చినప్పటికి బయటకు వచ్చాకా ఆమెకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. అంతేగాక దర్శక నిర్మాతల నుంచి ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఈ క్రమంలో ఆమెకు పలు సినిమాల్లో నటించే అవకాశం కొట్టెసింది. దీంతో పాటు స్టార్ మాలో వస్తున్న డ్యాన్స్ ప్లస్ రియాలిటీ షోకు మెంటర్‌గా చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా స్టేజ్‌పై కాలు కదుపుతోంది ఈ భామ. ఈ క్రమంలో నిన్న స్టార్ మా విడుదల చేసిన ప్రోమో ప్రస్తుతం నెట్టంట వైరల్ అవుతోంది. ఈ షోలో కన్నా మాస్టర్ టీమ్ రెండు వారాల క్రితం అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి మోనాల్ మెప్పు పొందిన సంగతి తెలిసిందే. ఈ టీం పర్ఫామెన్స్‌కు ఫిదా అయిన మోనాల్ కన్నా మాస్టర్‌ను తీసుకెళ్లి తన సీట్లో కూర్చోబెట్టింది. అలా తీసుకెళ్తోన్న సమయంలో ఓ రొమాంటిక్ సాంగ్ వేశారు షో నిర్వహకులు. ఆ తర్వాత కన్నా మాట్లాడుతూ మేడమ్ కోసం ఏదైనా చేస్తానని చెప్పడంతో తనకు ఇష్టమైన పట్టు వస్త్రాలు కూడా వేసుకువస్తావా అని ఓంకార్ అడగ్గా.. మేడమ్ చేప్తే తప్పకుండా వేసుకోస్తానంటూ సమాధానం ఇచ్చాడు. అన్నట్టుగానే ఈ వారం జరిగే ఎపిసోడ్‌కు కన్నా మాస్టర్ పట్టు వస్రాలతో దర్శనమిచ్చాడు. తన పర్ఫామెన్స్ తర్వాత మోనాల్‌ను స్టేజ్‌పైకి తీసుకువేళ్లి తనతో స్టేప్పులేశాడు. అనంతరం ఆమెకు గులాబి పువ్వు ఇచ్చి మోకాళ్లపై కుర్చోని మోనాల్ చేయిపై ముద్దు పెట్టాడు. అది చూసి కంటెస్టెంట్స్, షో మెంటర్స్‌తో పాటు యాంకర్ ఓంకార్ సైతం ఒక్కసారిగా షాకయ్యారు. చదవండి: మోనాల్‌తో వీడియో కాల్, అఖిల్ కామెంట్ వైరల్ మహేశ్‌తో స్పెషల్ సాంగ్: మోనాల్ క్లారిటీ! -
మోదీ నిర్ణయంపై ‘బాబు’ బడాయి
రావులపాలెం : నల్లధనం అరికట్టేందుకు రూ.500 రూ.వెయ్యి నోట్ల రద్దు చేస్తే అదంతా తాను రాసిన లేఖ వల్ల నే జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. అంత పలుకుబడి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలని హితవుపలికారు. రావులపాలెం వైఎస్సార్ పీపీ కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన కన్నబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఏ సంచలనం జరిగిన అది తన వల్లే జరిగిందని చెప్పుకునే నాయకుల్లో చంద్రబాబు ప్రథమ నాయకుడన్నారు. ముందుగా తెలిసే పెద్ద నోట్లపై చంద్రబాబు జాగ్రత్తపడి ప్రధాని లేఖ రాసారేమోనని అనుమానం కలుగుతుందన్నారు. నల్ల్లధనం అరికట్టే చర్యలకు వైఎస్సార్ సీపీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. నల్లధనంతో కుబేర్లుగా మారిపై గురిపెట్టే సమయంలో సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే జిల్లాలో వైఎస్సార్ సీపీ నిర్వహిస్తున్న గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి గ్రామగ్రామాన అపూర్వ ఆదరణ లభిస్తుందని కన్నబాబు అన్నారు. ఓటుకు నోటుకు కేసులో చంద్రబాబు ఒక ఓటుకు రూ.5 కోట్లు ఇచ్చేస్థాయికి రాజకీయాలు దిగజారడం చూసి భయపడి మోదీ ఈ నోట్లను రద్దు చేసి ఉంటారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలు ఇంటింటికీ తిరిగితే జనం నిలదీస్తారనే భయంతో మోటారు సైకిళ్ళపై పారిపోయే జన చైతన్య యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ఆయనకు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, ఎంపీపీ కోట చెల్లయ్య, కలవచర్ల సర్పంచ్ గానుగుల కృష్ణార్జున రావు, తదితరులు పూల మాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్?ర నాగిరెడ్డి, జిల్లా పారిశ్రామిక విభాగం కన్వీనర్ మంతెన రవిరాజు, ఎంపీటీసీలు జవ్వాది రవిబాబు, కొండేపూడి రామకృష్ణ, బొక్కా ప్రసాద్, మండల కన్వీనర్లు దొమ్మే టి అర్జునరావు, తమ్మన శ్రీను, నందం సూరిబాబు, కోనాల రాజు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సినీ డెరైక్టర్
తిరువొత్తియూరు: పెరంబలూరు వద్ద కంటైనర్ లారీ పక్కన వస్తున్న కారుపై పడడంతో సినిమా డెరైక్టర్ సహా ముగ్గురు మృతి చెందారు. చెన్నై విరుగంబాక్కంకు చెందిన కన్నా (45). సినిమా డెరైక్టర్ అయిన ఇతను నెజంతొట్టు సొల్లు తదితర చిత్రాలకు దర్శకత్వం చేస్తున్నాడు. ఇతను తన మిత్రుడు విరుగంబాక్కంకు చెందిన విజయకుమార్ (50)తో కలిసి రామనాథపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో కలుసుకుని తిరిగి శుక్రవారం రాత్రి చెన్నైకి కారులో బయలుదేరారు. కారును సురేష్ అనే యువకుడు నడుపుతున్నాడు. పెరంబలూరు తిరుమంతురై టోల్గేట్ వద్ద కారు వస్తుండగా ఆ సమయంలో వేగంగా వస్తున్న కంటైనర్ లారీ టైర్ పేలిపోవడంతో అదుపు తప్పి కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న సినీ ైడె రెక్టర్ సహా ముగ్గురు మృతి చెందారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న మంగళమేడు పోలీసులు సంఘటన స్థలం చేరుకుని మృతి చెందిన ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ కడలూరుకు చెందిన కార్తికేయన్‌ను అరెస్టు చేశారు. -
చివరి సీఎం ఎవరో ?
-
'ప్రభుత్వం ఏర్పాటు చర్చకు రాలేదు'
-
కన్నాకు ఫ్లెక్సీ కష్టాలు