దర్శకుడు అజయ్ కౌండిన్య (ఫేస్‌బుక్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన భూత్ బంగళా సినిమా దర్శకుడు అజయ్ కౌండిన్యపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మల్కాజ్‌గిరి వసంతపురి కాలనీకి చెందిన శ్రీ లలితా మహిళా మండలి సమితి అధ్యక్షురాలు జిన్నెల సురేఖ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
జనవరి 26న ఫిలించాంబర్‌లో జరిగిన భూత్ బంగళా సినిమా ఫంక్షన్‌లో అజయ్ కౌండిన్య మహిళల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటమే కాకుండా 30న ఓ చానెల్ డిబేట్‌లో కూడా తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ నిరూపిస్తానని సవాల్ విసిరాడన్నారు. అమీర్‌పేట్‌లోని విద్యార్థులు, కొందరు పోలీస్ బాస్‌లు వ్యభిచారులేనని ఆయన చెప్పడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అతడిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment