Ajay Koundinya
-
ఒసేయ్ రాములమ్మా 2
విజయశాంతి లీడ్ రోల్లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒసేయ్ రాములమ్మా’. 1997లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకంటే అదే పేరుతో మరో సినిమా రానుంది. కౌండిన్య ఫిలిం ఫ్యాక్టరీ సమర్పణలో కనకదుర్గ ఫిలింస్ పతాకంపై అజయ్ కౌండిన్య స్వీయ దర్శకత్వంలో ‘ఒసేయ్ రాములమ్మా 2’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత అజయ్ కౌండిన్య మాట్లాడుతూ– ‘‘అద్భుతమైన కథ కథనంతో ‘ఒసేయ్ రాములమ్మా 2’ స్క్రిప్ట్ సిద్ధం అవుతోంది. నా కథకి ఈ టైటిల్ బాగా సరిపోతుంది. కథ, కథనం పర్ఫెక్ట్గా కుదరడంతో మంచి నటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకుంటున్నా. అతి త్వరలో షూటింగ్ మొదలుపెడతాం’’ అన్నారు. -
దర్శకుడు అజయ్ కౌండిన్యపై కేసు
సాక్షి, హైదరాబాద్ : మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన భూత్ బంగళా సినిమా దర్శకుడు అజయ్ కౌండిన్యపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మల్కాజ్గిరి వసంతపురి కాలనీకి చెందిన శ్రీ లలితా మహిళా మండలి సమితి అధ్యక్షురాలు జిన్నెల సురేఖ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జనవరి 26న ఫిలించాంబర్‌లో జరిగిన భూత్ బంగళా సినిమా ఫంక్షన్లో అజయ్ కౌండిన్య మహిళల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటమే కాకుండా 30న ఓ చానెల్ డిబేట్లో కూడా తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ నిరూపిస్తానని సవాల్ విసిరాడన్నారు. అమీర్‌పేట్‌లోని విద్యార్థులు, కొందరు పోలీస్ బాస్‌లు వ్యభిచారులేనని ఆయన చెప్పడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అతడిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.