విజయశాంతి లీడ్ రోల్‌లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒసేయ్ రాములమ్మా’. 1997లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకంటే అదే పేరుతో మరో సినిమా రానుంది. కౌండిన్య ఫిలిం ఫ్యాక్టరీ సమర్పణలో కనకదుర్గ ఫిలింస్ పతాకంపై అజయ్ కౌండిన్య స్వీయ దర్శకత్వంలో ‘ఒసేయ్ రాములమ్మా 2’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత అజయ్ కౌండిన్య మాట్లాడుతూ– ‘‘అద్భుతమైన కథ కథనంతో ‘ఒసేయ్ రాములమ్మా 2’ స్క్రిప్ట్ సిద్ధం అవుతోంది. నా కథకి ఈ టైటిల్ బాగా సరిపోతుంది. కథ, కథనం పర్ఫెక్ట్‌గా కుదరడంతో మంచి నటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకుంటున్నా. అతి త్వరలో షూటింగ్ మొదలుపెడతాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment