Ramulamma
-
సాయుధ తెలంగాణకు ఓటు ఆయుధమై..
అది 1952 మార్చి 27... కాలినడకన కొందరు, ఎడ్ల బండ్లపై మరికొందరు సుదూరాన ఉన్న పోలింగ్ బూత్‌లకు ఒకరెనక ఒకరు వెళ్లి తమ ఓటుతో తొట్టతొలి ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకున్న రోజు. సుమారు 224 ఏళ్ల అసఫ్‌జాహీల రాచరికం, ఆపై నాలుగేళ్ల సైనిక పాలన అనంతరం హైదరాబాద్ రాష్ట్రంలో ఓటు వేసేందుకు జనం వస్తారో లేదోనన్న అధికారుల అనుమానాలను పటాపంచలు చేస్తూ తొలి ఎన్నికలోనే జనచైతన్యం ఓటెత్తింది. అప్పటివరకు తుపాకుల నీడలో అభద్రత, భయం నీడలో తలదాచుకున్న వారంతా ఊరూరా కదిలి మొత్తంగా 52,02,214 మంది ఓటు వేయడంతో అధికార యంత్రాంగం సంబురపడింది. నాటి ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లక్ష్మాపూర్‌కు చెందిన జరుపాటి రాములమ్మ (110) తొలి ఓటు వేసి తమకు స్వాతంత్య్రం రావడం నిజమేనని నమ్మినట్టు పేర్కొంది. మిశ్రమ ఫలితాలు... నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్యర్థులు విజయం సాధించగా సత్యాగ్రహ పోరాటాలు జరిగిన హైదరాబాద్, ఔరంగాబాద్, గుల్బర్గా డివిజన్లలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తంగా తెలుగు ప్రజలు ప్రభావం చూపే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలు, పీడీఎఫ్ 35 స్థానాల్లో, సోషలిçస్టు పార్టీ 11 చోట్ల, మరో 10 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. బీఆర్ అంబేడ్కర్ ఆధ్వరంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ (ఎస్సీఎఫ్) 5 చోట్ల గెలవగా అందులో తెలంగాణలోని ద్విసభ నియోజకవర్గాలైన జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్ స్థానాలను కైవసం చేసుకుంది. అంటే మొత్తంగా తెలుగు మాట్లాడే ప్రాంతాల్లోని ఓటర్లు 66 స్థానాల్లో కాంగ్రేసేతర అభ్యర్థులను గెలిపించారు. అప్పటి ఓటు.. ఇంకా గుర్తుంది నాకు ఓటు వచ్చే సరికి 40 ఏళ్లు . ఇప్పుడు 110 ఏళ్ల వరకు ఉంటాయనుకుంటా. అప్పుడు ఎండాకాలం. ఊరోళ్లమంతా నడుచుకుంటూ వెళ్లి ఓటు వేసినం. ఇంకా నాకు గుర్తుంది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఓటు తప్పకుండా వేస్తున్న. – జరుపాటి రాములమ్మ, లక్ష్మాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా తొలి సభలో అత్యధికం విద్యావంతులే.. హైదరాబాద్ తొలి శాసనసభకు ఉన్నత విద్యావంతులే అత్యధికంగా ఎన్నికైయ్యారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదివిన మాసూమాబేగం శాలీబండ స్థానం నుంచి ప్రముఖ కవి ముగ్ధూం మోహియొద్దీన్‌ను ఓడించారు. 1927లో ఉస్మానియాలో గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ జీఎస్ మెల్కొటే ముషీరాబాద్ నుంచి విజయం సాధించారు. చాదర్‌ఘాట్ నుంచి జస్టిస్ గోపాలరావు ఎక్బోటే, సోమాజిగూడ నుంచి మెహిది నవాజ్ జంగ్, వనపర్తి నుంచి సురవరం ప్రతాపరెడ్డి, షాద్‌నగర్ నుంచి బూర్గుల రామకృష్ణారావు, వికారాబాద్ నుంచి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, బేగంబజార్ నుంచి కాశీనాథ్ వైద్య గెలుపొందారు. ఓటు వేయకపోవడం చనిపోవడంతో సమానం.. నాకిప్పుడు 103 ఏళ్లు. తొలి ఎన్నికలప్పుడు మా ఊర్లో డప్పు చాటింపు వేసి ఓటు వేసేందుకు పిలుచుకొనిపోయిండ్రు. అప్పటి నుంచి ఓటు తప్పకుండా వేస్తున్న. ఓటు వేయకపోతే చనిపోవడంతో సమానమని నమ్ముత. వచ్చే ఎన్నికల్లోనూ ఓటు వేస్త. – మల్తుం బాలవ్వ, చిట్యాల, కామారెడ్డి అజ్ఞాతం నుంచి చట్ట సభకు.. తొలుత నిజాం, ఆపై భారత సైన్యంపై తుపాకులు ఎక్కుపెట్టిన కమ్యూనిస్టు పార్టీల నాయకులు అనేక మంది అజ్ఞాతం వీడిన అనంతరం అసెంబ్లీకి ఎన్నికయ్యారు. భువనగిరి అసెంబ్లీ నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన రావి నారాయణరెడ్డి జైలు నుంచే నామినేషన్ వేసి స్వయానా తన బావమరిది భూదాన్ రామచంద్రారెడ్డిపై విజయం సాధించారు. గత 70 ఏళ్లలో ఓటు తప్పలేదు.. నాకిప్పుడు 98 ఏళ్లు. రజాకార్ల బాధలు ప్రత్యక్షంగా చూసినం. వారిపై తిరగబడినం. స్వతంత్రం వచ్చినంక తొలి ఎన్నికలో ఓటు వేసేందుకు ఎడ్లబండిలో పోయినం. 1952 ఎన్నికల నుంచి ప్రతిసారీ ఓటు వేస్తూనే ఉన్న... – చల్లారం మధురవ్వ, తిమ్మాయపల్లి, సిద్దిపేట - శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి -
నీటిలో వణుకుతూ రాత్రంతా జాగారం
సూర్యాపేటరూరల్: ఓ మహిళ మూసీ వాగులో చిక్కుకుని రాత్రంగా నీటిలోనే జాగారం చేయాల్సి వచ్చింది. స్థానికులు గమనించి ఆమెను క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా కొల్లూరు గ్రామానికి చెందిన కట్ట రాములమ్మ (65)కాలినడకన గ్రామాలు తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉప్పల పహాడ్ గ్రామానికి వచ్చింది. శుక్రవారం భిక్షాటన చేసి టేకుమట్ల శివారులోని మూసీవాగులో కల్వర్టు ప్రాంతానికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ నీళ్లులేకపోవడంతో భోజనం చేసి నిద్రపోయింది. అయితే రత్నపురం మూసీ ప్రాజెక్టు అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా మూసీ వాగుకు నీటి తాకిడి పెరిగింది. దీంతో నిద్రలో ఉన్న ఆమె నీటిలో కొంతదూరం కొట్టుకుపోయింది. ఈ క్రమంలో ఆమెకు ఓ రాయి దొరకడంతో దాన్నిపట్టుకుని రాత్రంతా నీళ్లల్లో వణుకుతూ గడిపింది. కాపాడమని కేకలు వేస్తోన్న ఆమెను రాయినిగూడెం వాసులు గమనించి వెంటనే సూర్యాపేట రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సహాయంతో పడవలు వేసుకుని వెళ్లి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
విజయనగరం చౌడవాడ ఘటనపై సీఎం వైఎస్ జగన్ ఆరా
-
యువతిపై పెట్రోలు దాడి: ఘటనపై సీఎం జగన్ ఆరా
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడవాడ గ్రామంలో యువతి రాములమ్మపై ప్రియుడు పెట్రోలుపోసి నిప్పుపెట్టిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు తెలియజేశారు. గురువారం రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగిందని, బాధితులు ఫోన్‌ద్వారా ఫిర్యాదు చేయగానే వెంటనే పోలీసులు స్పందించి ఆమెను సమీప ఆస్పత్రిలో చేర్చారని తెలిపారు. ఈక్రమంలో మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాములమ్మను విశాఖపట్నం తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలబడాలని, అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించాలని మంత్రి బొత్స సత్యనారాయణను సీఎం ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి బొత్స సహా డిప్యూటీ సీఎం పుష్ఫశ్రీవాణి, అధికారులు బాధితురాలిని పరామర్శించారు. చదవండి: కాబోయే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు రమ్య హత్య ఘటన ఇప్పటికీ కలచి వేస్తోంది: సుచరిత -
రాములమ్మ రాజకీయం ముగిసినట్లేనా..?
సాక్షి, హైదరాబాద్ : మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్ఎంసీ, పట్టభద్రుల కోటాలో రెండుస్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. దుబ్బాక ఎన్నికకు ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసిపోగా.. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు మరింత దూకుడు పెంచారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ దుబ్బాకలో దుమ్మురేపుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార టీఆర్ఎస్ ఎత్తులు వేస్తుండగా.. మొదటిసారి గెలుపొందాలని బీజేపీ, పూర్వవైభవం కోసం కాంగ్రెస్ పార్టీ వ్యహరచన చేస్తున్నాయి. దీంతో దుబ్బాక పోరు అన్ని పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు బరిలోకి దింపి నియోజవర్గాన్ని చుట్టుముట్టాయి. టీఆర్ఎస్ నుంచి మంత్రి హరీష్‌రావు అన్నీ తానై చూసుకుంటుండగా.. బీజేపీ అభ్యర్థి రాఘునందన్‌రావుతో పాటు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నేతలంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. (ఈ ఎన్నిక కాంగ్రెస్‌కు చావోరేవో!) దుబ్బాకకు దూరంగా రాములమ్మ.. మరోవైపు గత వైభవం కోసం పోరాడుతన్న కాంగ్రెస్ పార్టీ సైతం తానేం తక్కువకాదన్నట్టూ రాష్ట్ర నాయకత్వాన్ని మొత్తం దుబ్బాకలో దింపింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంటే స్థానికంగా కీలకనేతైన ఫైర్ బ్రాండ్ విజయశాంతి కంటికి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నేతగా ఉన్న రాములమ్మ కీలకమైన పోరులో పార్టీకి దూరంగా ఉండటం వెనుక కారణం ఏంటని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్నటిగా ఖ్యాతిగఢించిన విజయశాంతి.. 2000లో తన రాజకీయ అరంగేట్రం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యహరించి.. టీఆర్ఎస్ నుంచి 2009లో మెదక్ ఎంపీగా విజయం సాధించారు. తెలంగాణ వాదాన్ని ఢిల్లీ గల్లీ వరకు వినిపించి.. ఉద్యమ నేతగా ఎదిగారు. అనంతర కాలంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉద్యమ నేపథ్యం, స్టార్‌నటి కావడంతో విజయశాంతి చేరిక తమకు కలిసొస్తుందని హస్తం నేతలు భావించారు. స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారు. టీడీపీతో పొత్తుకు వ్యతిరేకం.. ఈ క్రమంలోనే 2014లో మెదక్ ఎంపీగా పోటీచేసి ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఘోర పరాజయం మూటగట్టకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ పొత్తును ఆమెను తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై బహిరంగంగానే వ్యతిరేక స్వరం వినిపించారు. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు విజయశాంతి దూరంగా ఉంటున్నారు. గాంధీ భవన్‌వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటంలేదు. పార్టీలో తనకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని, ఏఐసీసీ కార్యదర్శి పదవి కావాలని అడిగిన తనను ఏమాత్రం పట్టించుకోవడంలేదని నేతల ముందు పలుమార్లు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకాల మరణం, ఉప ఎన్నికల సంభవించడం అన్నీ చకచక జరిగిపోయాయి. తీవ్ర మనస్థాపం.. అయితే ఉప ఎన్నికల బరిలో సొంత జిల్లా నేతైన విజయశాంతి బరిలో నిలపాలని రాష్ట్ర పార్టీ తొలుత నిర్ణయించింది. దీనికి ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు, బరిలో నిలవడం ఖాయమైనట్లు పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి. అయితే దీనికి స్థానిక నేతల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవ్వడంతో రాములమ్మ వెనక్కి తగ్గకతప్పలేదు. రెండు వరుస ఎన్నికల్లో ఓటమి చెందిన నేతను ఉప ఎన్నికల్లో నిలిపితే అధికార టీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధింస్తుందనే అభిప్రాయాన్ని అధిష్టానం వద్ద స్థానిక నేతలంతా బలంగా వినిపించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన విజయశాంతి పోటీ నుంచి తప్పుకుని కనీసం దుబ్బాక వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. ప్రచారానికి సైతం దూరంగా ఉంటున్నారు. టాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. ఇప్పట్లో ఎన్నికల లేనందున విజయశాంతి ఇక పూర్తిగా రాజకీయలకు దూరంగా ఉంటారని ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా ఇకపై సినిమాల్లో నటించేందుకు పూర్తి సమయం కేటాయిస్తారని సమాచారం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరూ మూవీలో విజయశాంతి కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఆ మూవీ అనంతరం ఆమెకు టాలీవుడ్లో వరస అవకాశాలు వస్తున్నాయి. దీంతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు రాములమ్మ సిద్ధమయ్యారని, ఇక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారని తెలంగాణ రాజకీయ వర్గల్లో చర్చసాగుతోంది. ఈ వార్తలకు విజయశాంతి ఏ విధంగా చెక్పెడతారనేది వేచి చూడాలి. -
ఒసేయ్ రాములమ్మా 2
విజయశాంతి లీడ్ రోల్లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒసేయ్ రాములమ్మా’. 1997లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకంటే అదే పేరుతో మరో సినిమా రానుంది. కౌండిన్య ఫిలిం ఫ్యాక్టరీ సమర్పణలో కనకదుర్గ ఫిలింస్ పతాకంపై అజయ్ కౌండిన్య స్వీయ దర్శకత్వంలో ‘ఒసేయ్ రాములమ్మా 2’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత అజయ్ కౌండిన్య మాట్లాడుతూ– ‘‘అద్భుతమైన కథ కథనంతో ‘ఒసేయ్ రాములమ్మా 2’ స్క్రిప్ట్ సిద్ధం అవుతోంది. నా కథకి ఈ టైటిల్ బాగా సరిపోతుంది. కథ, కథనం పర్ఫెక్ట్గా కుదరడంతో మంచి నటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకుంటున్నా. అతి త్వరలో షూటింగ్ మొదలుపెడతాం’’ అన్నారు. -
ఆస్పత్రిలో వద్దన్నారు..ఆటోలోనే ప్రసవించింది!
రాజమహేంద్రవరం: ఆమె పేరు రాములమ్మ(25). నిండు గర్భిణి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఈమె శనివారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి ఆటోలో వెళ్లింది. ఒంట్లో నలతగా ఉందని, కాన్పు వచ్చేలా ఉందని ఆస్పత్రి సిబ్బందికి చెప్పుకుంది. కానీ, వారు ఆమె మాటలను లక్ష్యపెట్టలేదు. 'ప్రసవానికి ఇంకా ఇరవై రోజుల సమయం ఉందిలే.. వెళ్లిపో..' అంటూ వెనక్కి పంపేశారు. ఇబ్బంది పడుతూనే తిరిగి ఆటో ఎక్కిన రాములమ్మ ఒక్కసారిగా కూలబడిపోయింది. ఆటోలోనే బిడ్డను ప్రసవించింది. ఆస్పత్రి ఆవరణలోనే ఇంత జరుగుతున్నా పట్టించుకోని సిబ్బందిపై అక్కడున్న జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మేలుకున్న సిబ్బంది.. తల్లితోపాటు శిశువును లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. -
ఓటు వేసిన పాపానికి కొంపలు కూలుస్తారా?
– కూరగాయల కొట్టు తొలగించారని మహిళ ఆత్మహత్యాయత్నం ధర్మవరం : టీడీపీకి ఓట్లు వేసిన పాపానికి మా కొంపలే కూలుస్తారా.. అంటూ ఓ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పట్టణంలోని పాండురంగ సర్కిల్లో ఆదివారం సాయంత్రం మున్సిపల్ అధికారులు, అధికార పార్టీ నేతలు జేసీబీతో కాలువలను శుభ్రం చేస్తున్నారు. రాములమ్మ అనే కూరగాయల కొట్టు నిర్వాహకురాలు కాలువకు అడ్డు లేకుండా దుకాణాన్ని వెనక్కి జరుపుకుంది. అయితే మున్సిపల్ అధికారులు, నాయకులు దుకాణం స్థలం మున్సిపాలిటీదేనని తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన రాములమ్మ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ‘మేము ఆలయ స్థలంలో ఉంటున్నాం.. మున్సిపల్ స్థలం కాదది.. ఈస్థలం మాకే చెందుతుంది.. అయినా మున్సిపల్ అధికారులు, అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా వచ్చి మా దుకాణాన్ని తొలగించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మున్సిపల్ అధికారులు, అధికారపార్టీ నేతలు వెనక్కి తగ్గి అక్కడి నుంచి జేసీబీని వెనక్కి పంపించారు. -
నల్లగొండ జిల్లాలో దొంగల ఘాతుకం
- గొలుసు కోసం వృద్ధురాలి హత్య తిప్పర్తి(నల్లగొండ జిల్లా) నల్లగొండ జిల్లా తప్పర్తి మండలం పెద్ద సూరారం గ్రామంలో ఘోరం జరిగింది. దొంగతనానికి వచ్చిన దుండగులు.. ఓ వృద్దురాలిని హత్యచేసి.. బంగారు గొలుసు దోచుకెళ్లారు. ఈ సంఘటన సోమవారం వేకువ జామున జరిగింది. రాములమ్మ(65) ఇంటి ముందు నిద్ర పోతుండగా.. గుర్తు తెలియని దుండగులు వచ్చి గొంతునులిమి ఆమెను హత్య చేశారు. మెడలో ఉన్న 3తులాల గొలుసును దోచుకెళ్లారు. ఉదయం ఇది గమనించిన కుటుంబ సభ్యులు తిప్పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీమ్‌ను రప్పించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
వైద్యం వికటించడం వల్లే మృతి చెందిందంటూ..
నల్లగొండ జిల్లా భువనగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ మహిళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. అయితే, వైద్యం వికటించడం వల్లే మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. బూధాన్ పోచంపల్లి మండలం కప్రాయిపల్లికి చెందిన బి.రాములమ్మ (35) అనారోగ్యంతో సోమవారం రాత్రి చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చింది. పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతి చెందగా... వైద్యం వికటించడం వల్లే మృతి చెందిందని, తమకు న్యాయం చేయాలని ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద డిమాండ్ చేస్తున్నారు. -
రాములమ్మ ఫ్రమ్ సిరిసిల్ల
బుల్లితార రాములమ్మ సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన దామెర శిరీషకు టీవీలో నటించే అవకాశం అప్రయత్నంగానే వచ్చింది. అక్క రజిత టీవీనటి. మరో అక్క సౌజన్య కూడా బుల్లితెర నటి. అయితే ‘ఎంబీఏ చేసి ఉద్యోగంలో స్థిరపడాలనుకున్నాను తప్ప నటిని కావాలనుకోలేదు. యాదృచ్ఛికంగా జరిగిపోయింది’ అంటారు శిరీష. ‘మాది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. నైన్త్ క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. టెన్త్ నుంచి హైదరాబాద్‌లోనే. బీకామ్ సెకండియర్‌లో ఉండగా ‘అడగక ఇచ్చిన మనసు’ ఆడిషన్స్కెళ్లాను. అక్కయ్యలిద్దరూ ఈ రంగంలో ఉండడంతో ఆ స్క్రీన్ టెస్టు అదీ ఎలాగుంటుందో చూడాలనే సరదాతోనే వెళ్లాను. అయితే సెలెక్ట్ అయిన తర్వాత సీరియస్‌గా కెరీర్ మీదనే దృష్టి పెట్టాను. రజితక్క... నటనలో మెలకువలు చెప్పింది’ అందామె. అమ్మానాన్నా అనుకోలేదు ‘అమ్మ దేవి గృహిణి. నాన్న పాపయ్య రిటైర్డ్ టీచర్. మమ్మల్ని నటులను చేయాలని మా పేరెంట్స్ ఎప్పుడూ అనుకోలేదు. కాని అక్కకు మాత్రం నటి కావాలనే కోరిక గట్టిగాఉండటంతో మేమంతా ఆ ఫీల్డ్‌లోకి వచ్చాం. అన్నయ్య మా సొంతూర్లోనే స్థిరపడ్డారు. ఇంట్లో చిన్నదాన్ని కావడంతో అమ్మకు ఇప్పటికీ నా మీద బెంగే. ఏదైనా షూటింగ్ లేటయ్యి టైమ్‌కి రాలేకపోతే ఫోన్ చేస్తూనే ఉంటుంది’. స్కూల్ నుంచి స్టుడియో వరకు ‘నాకు స్టేజ్ ఫియర్ అస్సలు లేదు. చిన్నప్పుడు స్కూల్లో ప్రతి ప్రోగ్రామ్‌లో డాన్స్ చేసేదాన్ని. టీచర్లు నా పేరు రాసేసుకుని తర్వాత చెప్పేవాళ్లు. అయితే అక్కడ డాన్సు చేయడానికి, ఇప్పుడు కెమెరా ముందు నటించడానికి చాలా తేడా ఉంటుంది. వేదిక మీద పెర్ఫామ్ చేసేటప్పుడు డాన్సుని ఎంజాయ్ చేస్తాం. కెమెరా ముందు సీన్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి’. సౌందర్య ప్రభావం ఎక్కువ! ‘నాకు ప్రభాస్, సౌందర్యల నటన బాగా ఇష్టం. సౌందర్య నటనను అధ్యయనం చేసినట్లు చూస్తాను. ఆ ప్రభావం నా మీద తప్పకుండా ఉంటుందనిపిస్తోంది. ఈ మూడేళ్లలో ఆరు సీరియల్స్‌లో నటించాను. ఇప్పుడు ‘రాములమ్మ’ సీరియల్ చేస్తున్నాను. లీడ్ రోల్స్ చేశాను. అవకాశం వస్తే పోలీస్, సీఐడీ పాత్రల్లో నటించాలని ఉంది’. టీవీ రంగం ఫ్యామిలీలాంటిది! ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’ సినిమాలో నటించాను. నాకెందుకో టీవీ రంగమే బాగుందనిపించింది. సినిమా ఇండస్ట్రీలాగ గ్లామరస్ పోకడలు ఉండవు. స్కిన్ షో చేయాల్సిన అవసరం ఉండదు. టీవీ రంగంలోకి వచ్చే వారికి ఒక్కమాట మాత్రం కచ్చితంగా చెప్పగలను... మనం కచ్చితంగా ఉంటే మనల్ని పక్కకు తోసేసేవాళ్లుండరు. నటించాలనే కోరిక ఉన్న చాలామంది పరిశ్రమ ఎలా ఉంటుందోననే భయంతో వెనుకడుగు వేస్తుంటారు. కానీ మన పాత్ర వరకు చూసుకుని ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకపోతే ఏ సమస్యా ఉండదు. అందుకు నేనే ఉదాహరణ’. జీవిత భాగస్వామి! ‘నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయి నా కుటుంబానికి గౌరవం ఇచ్చి నన్ను బాగా చూసుకునే వాడై ఉండాలని కోరిక. ఇండస్ట్రీలో వ్యక్తిని చేసుకోవాలనుకోవడం లేదు. ఉద్యోగం, వ్యాపారం చేసుకునే అబ్బాయి అయితే బావుణ్ణనుకుంటున్నాను. ఏదైనా మరో రెండేళ్ల తర్వాతే’. -
మెతుకు సీమలో లేడీ బాస్ ల బిగ్ ఫైట్!
మెతుకు సీమ మెదక్ అసెంబ్లీ స్థానానికి ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బిగ్ ఫైట్ జరగనుందా? ప్రస్తుత రాజకీయ సమీకరణాలను చూస్తే కాదనక తప్పదు. ఈ నియోజకవర్గంలో పలువురు ప్రధాన పార్టీ అభ్యర్థులు వారి వారి విజయంపై ధీమాగా ఉన్నా.. ఇద్దరు మహిళా నేతల మధ్యే ముఖ్య పోటీ జరుగనుంది. ఇందులో ఒకరు లేడీ అమితాబ్ విజయశాంతి అయితే..మరొకరు పద్మా దేవేందర్ రెడ్డి. వారు నిన్న మొన్నటి వరకూ టీఆర్ఎస్ లో ఉంటూ క్రియా శీలక రాజకీయాల్లో పాలు పంచుకున్న ఈ నేతలు.. ఇప్పుడు ప్రత్యర్థులగా మారి కత్తులు దూసుకుంటున్నారు. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు భుజాలు కలుపుకుంటూ తిరిగిన వారే వేరువేరు పార్టీల నుంచి బరిలో దిగడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎప్పట్నుంచో కేసీఆర్ పై గుర్రుగా ఉన్న విజయశాంతి.. కాంగ్రెస్ తెలంగాణ ప్రకటనతో ఊపిరి పీల్చుకుంది. ఇక ఒక నిమిషం కూడా వెనుకడగువేయని లేడీ బాస్ కాంగ్రెస్ లో చేరి టీఆర్ఎస్ తో పోరుకు సన్నద్ధమైంది. దీంతో టీఆర్ఎస్ కూడా వేగంగానే పావులు కదిపింది. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, మెదక్ జిల్లా ఇంఛార్జి పద్మా దేవేందర్ రెడ్డికి ఆ పార్టీ టికెట్ కేటాయించి విజయశాంతిపై రాజకీయ సమరానికి సై అంటూ సవాల్ విసిరింది. పద్మా దేవేందర్ రెడ్డి.. తొలిసారి 2004 లో టీఆర్ఎస్ తరుపున గెలుపొందారు. కాగా, 2009లో టీఆర్ఎస్ -టీడీపీలో పొత్తులో భాగంగా ఆమెకు టికెట్ రాలేదు. దీంతో ఆమె టీఆర్ఎస్ రెబల్ గా మారి పోటీకి దిగారు. ఆ పోరులో ఆమె 24 వేల ఓట్లు సాధించి తన ఇమేజ్ ను కాపాడుకున్నారు. ఆ తరువాత ఆమె టీఆర్ఎస్ లో నే కొనసాగారు. విజయశాంతిది కూడా దాదాపు ఇదే పరిస్థితి. బీజేపీని వీడి టీఆర్ఎస్ చలవతో మెదక్ ఎంపీగా గెలిచారు. అనంతరం రాములక్క కేసీఆర్ అన్నపై అలిగి పార్టీని వీడారు. ఇలా మొన్నటి వరకూ ఒకే పార్టీలో ఉంటూ మిఠాయిలు తినిపించుకుని ఉన్న వీరు ప్రత్యర్థులుగా మారడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కొన్ని చోట్ల టీఆర్ఎస్ శ్రేణులు ముందంజలో ఉండగా, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతుంది. ఇందులో పద్మా దేవేందర్ రెడ్డి స్థానిక అభ్యర్థి కావడం ప్రధానంగా కలిసొచ్చే అంశం. అంతే కాకుండా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఈ లోక్ సభ స్థానం నుంచే పోటీ చేయడం పద్మకు లాభిస్తుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కాగా, విజయశాంతి ఎంపీగా ఉన్న సమయంలో స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ చేసిన అభివృద్ధే గెలిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విజయశాంతి తాగునీటి సమస్యలకు నిధులు తీసుకురావడమే కాకుండా, అక్కన్నపేటకు కొత్తగా రైల్వే లైన్ లు తేవడంలో సఫలమైయ్యారు. ఇవే కాంగ్రెస్ గెలుపుకు దోహద పడగలవని కాంగ్రెస్ నేతలు ఘంటా పథంగా చెబుతున్నారు. కాగా, విజయశాంతికి స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత కూడా ఉండటంతో రాములమ్మ గెలుపుపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ను ఎదురించి కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలోకి దిగడం నిజంగానే విజయశాంతికి ఛాలెంజ్. ఇక ఈ పోరులో నెగ్గికొస్తే మాత్రం ఆమె స్థానికంగా తిరుగులేని నాయకురాలిగా వెలుగొందే అవకాశం ఉంది. ఒకవేళ ఓటమి పాలైనా అంతే వేగంగా ఫేడ్ అవుట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. -
రాములమ్మకు ఎవరు ఓటు వేయరు
మెదక్ ఎమ్మెల్యే స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయశాంతిపై ఆ స్థానం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన పద్మ దేవేందర్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున మెదక్ ఎంపీగా ఎన్నికై స్థానిక ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. బుధవారం మెదక్‌లో పద్మ దేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ను విమర్శించే అర్హత విజయశాంతికి లేదన్నారు. విజయశాంతి మెదక్ జిల్లా వాసి కాదని, ఆమెకు ఆ జిల్లాలో ఎవరు ఓటు వేయరని పద్మా దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆమె ఆ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే విజయశాంతి నిన్న టీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ టీఆర్ఎస్కు కొత్త అర్థాన్ని వివరించారు. టీఆర్ఎస్లో టీ అంటే తెరచాటు వ్యవహరాలు, ఆర్ అంటే రాత్రి పూట ఒప్పందాలు, ఎస్ అంటే సపరివార కుటుంబ పాలన అంటూ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల వరకు తమ పార్టీతో అంటకాగిన రాములమ్మ ఇప్పుడు తమ పార్టీపైన, పార్టీ అధ్యక్షుడుపైన తీవ్ర విమర్శలు చేస్తుండటంతో పద్మ దేవేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కేసీఆర్ పై పోటీ చేయి రాములమ్మ... ప్లీజ్!
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును మరింత ముమ్మరం చేసింది. మెదక్ లోక్‌సభ బరి నుంచి స్థానిక ఎంపీ విజయశాంతి (రాములమ్మ)ని ఎంపిక చేయాలని కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా నిర్ణయించింది. అందుకు సంబంధించి ఇప్పటికే విజయశాంతితో కాంగ్రెస్ అధిష్టానం సంప్రదింపులు జరిపింది. ఓ వేళ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అదే స్థానం నుంచి పోటీ చేస్తే విజయశాంతి అయితేనే సరైన అభ్యర్థి అని ఆ పార్టీ భావిస్తుంది. కేసీఆర్ చేతిలో ఓడిపోయిన పక్షంలో రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని ఇప్పటికే రాములమ్మకు కాంగ్రెస్ అధిష్టానం భరోసా ఇచ్చిందంటా. 2009 ఎన్నికలలో మెదక్ లోక్‌సభకు టీఆర్ఎస్ అభ్యర్థిగా రాములమ్మ ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత విజయశాంతి కారు దిగి హస్తం గూటికి చేరిన విషయం విదితమే. అయితే సికింద్రబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే, సినీనటి జయసుధా అదే స్థానం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్దంగా ఉన్నట్లు కాంగ్రెస్ అధిష్టానానికి వెల్లడించింది. దాంతో ఆమెను లోక్‌సభ అభ్యర్థిగా రంగంలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తుంది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఇప్పటికే కాంగ్రెస్ తరపున రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన అంజన్ కుమార్ యాదవ్ ఎన్నికైయ్యారు. ఆయన ముచ్చటగా మూడోసారి ఎంపీగా ఎన్నిక కావాలని తెగ ఆరాటపడుతున్నారు. ఆ తరుణంలో అంజన్న ఆశలకు జయసుధ గండికొట్టే పనిలో ఉన్నారు. అంజన్నను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు సమాచారం. -
ఉద్యమాలే ఊపిరి
మా సొంతూరు మోమిన్‌పేట మండలం రాళ్లగుడుపల్లి. నాన్న ర్యాగ అడివప్ప, అమ్మ రాములమ్మ. మాది పెద్ద జమీందారీ కుటుంబం. దాంతో చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెరిగా. బాల్యం మొత్తం ఎంతో వైభవంగా గడిచింది. మా ఊర్లో బడి లేకపోవడంతో ప్రత్యేకంగా టీచర్లు నియమించి చదువు చెప్పించారు. నాలుగోతరగతి వరకు ఇంటివద్దే సాగింది. ఆ తర్వాత పక్క ఊరు అనంతసాగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో, అక్కణ్నుంచి టేకులపల్లి యూపీ స్కూల్, మోమిన్‌పేట ఉన్నత పాఠశాలలో టెన్త్ వరకు చదువుకున్నా. సంగారెడ్డి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశా. వికారాబాద్ ఎస్ఏపీ కాలేజీలో డిగ్రీ చదివా. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఎంఫిల్ పూర్తిచేశా. బడి ఎగ్గొట్టి ఆటలాడేవాడిని నేను మొదట్నుంచీ టాప్ స్టూడెంట్‌నే. ఆటపాటలతో పాటు చదువుల్లోనూ అత్యుత్తమ ప్రతిభ చూపేవాడిని. క్లాస్ రూంలో నేను వేసే ప్రశ్నలకు టీచర్లు సమాధానం చెప్పలేక తల పట్టుకునేవారు. బడికి డుమ్మా కొడితే టీచర్లు ప్రశాంతంగా ఉండేవాళ్లంట. స్కూల్‌కు రెగ్యులర్‌గా వెళ్లే వాడిని కాదు. ఇంట్లో మాత్రం బడికి వెళ్తున్నాని చెప్పి.. దోస్తులతో పొలాలకు వెళ్లేవాడిని. అక్కడే పొలం పనులతో పాటు ఆటపాటల్లో మునిగిపోయేవాడిని. తిరిగి సాయంత్రం ఇంటికి చేరేవాడిని. స్కూల్లో నా హాజరు శాతం 40కి మించేది కాదు. అలా డుమ్మాలు కొట్టినప్పటికీ పరీక్షల్లో మాత్రం క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని. టెన్త్, ఇంటర్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకు నాది. డిగ్రీలో కాలేజీ టాపర్నే కాకుండా యూనివర్సిటీ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించా. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంలో యూనివర్సిటీ ఫస్టొచ్చా. ‘సర్దార్ పటేల్’ అని పిలిచేవారు చిన్నప్పటి నుంచీ ఏ విషయాన్నైనా సూటిగా చెప్పడం నాకు అలవాటు. ఎవర్నైనా ఎదిరించే మనస్తత్వం అలవడింది. దీంతో మా నారాయణ మాస్టారు నాకు సర్దార్ వల్లభాయ్‌పటేల్ అని పేరు పెట్టారు. బడిలో అందరూ అలాగే పిలిచేవాళ్లు. నా చురుకుదనం చూసి బడిలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది నన్ను బాగా అభిమానించేవారు. ఏదైనా శుభకార్యానికి మావాళ్లను పిలిచినప్పుడు నన్నూ వెంట తీసుకుని రమ్మనేవారు. నన్ను ఇతర పిల్లలకు పరిచయం చేస్తుంటే చాలా ఆనందం కలిగేది. చదువుకోసం అమ్మ నగల్ని అమ్మేశా నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడే నాన్న చనిపోయారు. ఆ తర్వాత పదోతరగతిలో ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. అమ్మా, నాన్న నా చిన్నతనంలో చనిపోవడం తీవ్రంగా కలచివేసింది. వాళ్ల మరణంతో నాకు కష్టాలు మొదలయ్యాయి. చిన్నమ్మలు, అన్నయ్యలు సరిగ్గా చూసుకునే వారు కాదు. దీంతో వసతిగృహంలో ఉండి చదువుకోవాల్సి వచ్చింది. ఫీజు పరిస్థితి లేకపోవడంతో అమ్మ బంగారు నగలు అమ్మి డబ్బులు కట్టాల్సి వచ్చింది. అలా మొదలైంది.. సంగారెడ్డిలోని జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో సంక్షేమ వసతిగృహంలో ఉంటూ కాలేజీకి వెళ్లేవాడిని. హాస్టల్లో సమస్యలపై మొదటిసారిగా విద్యార్థులతో కలిసి ఉన్నతాధికారుల వద్ద ఆందోళన చేశాం. ఆ తర్వాత మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టా. ఆ సమయంలో కలెక్టర్ సరిగ్గా స్పందించకపోవడంతో నేరుగా ఆయనతో గొడవకు దిగా. ఆ క్షణంలో నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది. పెద్ద గొడవే జరిగింది. తర్వాత సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. అలా ఉద్యమాల బాట పట్టాను. ఆ తర్వాత ఎస్ఏపీ కాలేజీలో డిగ్రీలో ఉన్నప్పుడు వికారాబాద్‌లోని సంక్షేమ వసతిగృహంలో సమస్యలపై ఆందోళన చేపట్టాం. దాదాపు మూడోందల మందితో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించాం. అధికారులను గదిలో పెట్టి తాళాలు వేయడంతో హాస్టళ్లను మూసేశారు. డైట్ చార్జీలు నిలిపివేశారు. ఆ తర్వాత ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. అప్పట్నుంచి సమస్యలపై ఆందోళనలు తీవ్రతరం చేశాం. ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఉద్యమంలోకి బీకాం పూర్తి చేసిన తర్వాత బ్యాంకు ఉద్యోగానికి అప్లై చేశా. కాల్‌లెటర్ వచ్చిన తర్వాత వెంటనే జాయినయ్యా. కానీ రెండ్రోజులు పనిచేసిన తర్వాత ఏదో లోటుగా అ నిపించింది. నేను చేయాల్సి పని ఇది కాదు.. సమాజానికి నేరుగా ఉపయోగపడే పని చేయాలనిపించింది. దీంతో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి ఉద్యమ బాట పట్టా. జాతీయ మీడియాలో హల్చల్.. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీ సంక్షేమానికి ప్రత్యేకించి శాఖలేదు. వారికి కూడా ప్రత్యేక వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలలు కల్పిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశించాం. దీంతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాం. 1978లో అనుకుంటా... ఆగస్ట్ నెలలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బీసీ హాస్టళ్లు కోసం దాదాపు రెండువేల మందితో అసెంబ్లీని ముట్టడించాం. బ్యాగుల్లో రాళ్లతో వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు. పోలీసులు ముట్టడిని అడ్డుకోవడంతో విద్యార్థులు రాళ్లు రువ్వారు. దీంతో చాలా పెద్ద గొడవ జరిగింది. అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో మా ఉద్యమానికి మంచి గుర్తింపు వచ్చింది. ప్రభుత్వం కూడా స్పందించింది. ముందుండి నడిపించా.. విద్యార్థుల సమస్యలపై జరిగిన ఉద్యమాలన్నీ ఉస్మానియా యూనివర్సిటీనుంచి మొదలయ్యేవి. వాటికి యూనివర్సిటీలోని సంఘాల నేతలు నాయకత్వం వహించేవారు. యూనివర్సిటీలోన్ని అన్ని సంఘాలు ఐక్య కార్యాచరణగా ఏర్పాటైతే, వాటన్నింటికీ నేను చైర్మన్‌గా వ్యవహరించేవాడిని. 1970 నుంచి 94వరకు అన్ని ఉద్యమ కమిటీలను నేనే ముందుండి నడిపించా. ఆ ఉద్యమాల ఫలితంగానే 1983లో రాష్ట్రవ్యాప్తంగా 44 ఆశ్రమ పాఠశాలలు మంజూరయ్యాయి. అప్పట్నుంచి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 40 ఆశ్రమ పాఠశాలలు ప్రాధాన్యతను బట్టి ప్రారంభిస్తూ వచ్చింది. చాలా సమస్యలు కూడా పరిష్కారమయ్యాయి. ఆ క్షణాన్ని మర్చిపోలేను.. విద్యార్థులకు ఉన్నత విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరోవైపు సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్నత విద్య ఉండటాన్ని గుర్తించి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఉద్యమం చేపట్టా. మొత్తానికి అనుకున్నది సాధించా. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రకటించారు. అప్పుడు లక్షలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తు కనిపించింది. ఆ క్షణాన్ని అస్సలు మర్చిపోలేను. స్థానిక సంస్థల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేవనెత్తా. అది కూడా సాకారమైంది. రాజకీయాల్లోకి రాను.. ప్రస్తుత రాజకీయాలన్నీ డబ్బుమయమయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు టికెట్లను సినిమా టిక్కెట్ల మాదిరిగా డబ్బులిచ్చి కొనుక్కుంటున్నారు. ఒకప్పుడు సామాజిక సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నవాళ్లే రాజకీయాల్లోకి వచ్చేవారు. నిజాయతీగా పనిచేసేవారు. ఇప్పటి నేతల్లో ఆ అంశాలు మచ్చుకు కూడా కనిపించడంలేదు. నాకు రాజకీయాలంటే నచ్చదు. చాలా రాజకీయ పార్టీలు అవకాశం ఇస్తామని చెప్పినా నేను పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు చేయలేని పనులు నేను ఉద్యమం చేసి సాధించా. ఇంతకంటే ఏం కావాలి.. చివరివర కూ ప్రజా సమస్యలపైనే ఉద్యమిస్తా. తీరిక దొరకక.. అప్పట్లో తీరిక సమయంలో సినిమాలు చూసేవాడిని. అల్లూరి సీతారామరాజు నా ఫేవరెట్ సినిమా. బొబ్బిలి పులి, దానవీర శూరకర్ణ సినిమాలు కూడా నచ్చాయి. పుస్తకాలు చదవడం ఇష్టమే. కానీ తీరిక లేక చదవలేకపోతున్నా. రోజుకు కనిష్టంగా రెండొందల మందిని కలుస్తా. వారి సమస్యలు ఆలకిస్తా. భార్య శబరిదేవి, గ్రూప్-1 అధికారిణి. కుమారుడు రుషి అరుణ్ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. కూతురు శ్వేతాదేవి. ప్రతిరోజు గంటపాటు యోగా చేస్తా. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు తీసుకురావాలనేది నా కల. దీంతో బీసీలు రాజకీయంగా అభివృద్ధి చెందుతారు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. త్వరలోనే బీసీ రిజర్వేషన్లు అమలవుతాయనే నమ్మకం ఉంది. యువత సంకల్పబలంతో ముందుకెళ్లాలి యువతపైనే దేశ అభివృద్ధి ఆధారపడిఉంది. యువతలో దేశభక్తిని, శ్రమ సంస్కృతిని పెంపొందించుకోవాలి. నిర్దేశించుకున్న లక్ష్యానికి సంకల్పబలం తోడైతే తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. ఇందుకోసం ప్రతి ఒక్కరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్లాలి. -
ఒక్కటైన ప్రేమజంట
పెద్దశంకరంపేట, న్యూస్‌లైన్: పెద్దశంకరంపేటలో ఆదివారం ప్రేమ వివాహం జరిగింది. ఆంధ్ర అబ్బాయితో తెలంగాణా ప్రాంతానికి చెందిన అమ్మాయి పెళ్లి జరగడంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వివాహం ప్రాధాన్యం సంతరించుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ ప్రాంతానికి చెందిన కుమ్మరి శేషు మండల పరిధిలోని చీలాపల్లి గ్రామానికి చెందిన ఆరేపల్లి లక్ష్మీ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇరువురు మేజర్లు కావడంతో విషయం కాస్తా పెద్దలకు చేరింది. అయితే కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపకపోవడంతో బంధువుల మధ్య పెళ్లి జరిగింది. క్రిష్ణా జిల్లా నందిగామ మండలం పెనుగంచిపోలు గ్రామానికి చెందిన రాములమ్మ, శ్రీనివాస్ అనే దంపతులు జీవనోపాధికి హైద్రాబాద్‌లోని గుడిమల్కాపూర్‌కు వచ్చి ఉంటున్నారు. అదే ప్రాంతానికి దళితులైన లచ్చమ్మ, మల్లయ్య దంపతులు సైతం ఉపాధి కోసం వెళ్లి ఉంటున్నారు. వీరి కుమార్తె ఆరేపల్లి లక్ష్మీ, రాములమ్మ, శ్రీనివాస్‌ల కొడుకు శేషును ఇష్టపడడంతో ఇరువురికి పేటలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో వివాహం జరిపించారు. ఈ కార్యక్రమంలో పేటకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు పున్నయ్య, రజకసం ఘం మండలాధ్యక్షుడు నారాయణ,లక్ష్మణ్, సాయిలు, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్కు పది సీట్లు మించిరావు