నల్లగొండ జిల్లాలో దొంగల ఘాతుకం | Elderly woman murdered, gold jewellery stolen | Sakshi
Sakshi News home page

నల్లగొండ జిల్లాలో దొంగల ఘాతుకం

Apr 18 2016 10:34 AM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లా తప్పర్తి మండలం పెద్ద సూరారం గ్రామంలో ఘోరం జరిగింది.

- గొలుసు కోసం వృద్ధురాలి హత్య
తిప్పర్తి(నల్లగొండ జిల్లా)

నల్లగొండ జిల్లా తప్పర్తి మండలం పెద్ద సూరారం గ్రామంలో ఘోరం జరిగింది. దొంగతనానికి వచ్చిన దుండగులు.. ఓ వృద్దురాలిని హత్యచేసి.. బంగారు గొలుసు దోచుకెళ్లారు. ఈ సంఘటన సోమవారం వేకువ జామున జరిగింది. రాములమ్మ(65) ఇంటి ముందు నిద్ర పోతుండగా.. గుర్తు తెలియని దుండగులు వచ్చి గొంతునులిమి ఆమెను హత్య చేశారు. మెడలో ఉన్న 3తులాల గొలుసును దోచుకెళ్లారు. ఉదయం ఇది గమనించిన కుటుంబ సభ్యులు తిప్పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీమ్‌ను రప్పించారు. కేసు దర్యాప్తులో ఉంది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement